మందకృష్ణమాదిగ అగ్రకులాలకు తొత్తు:దయానంద్
హిమాయత్‌నగర్: వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మందకృష్ణమాదిగ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులను అయోమయానికి గురిచేస్తున్నారని మాలమహాసభ రాష్ట్ర అధ్యక్షుడు దయానంద్ అన్నారు. అగ్రకులాలకు తొత్తుగా మారిన సాంఘిక ద్రోహిగా అభివర్ణించారు. బుధవారం హిమాయత్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ తన స్వీయ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకే వర్గీకరణ పేరుతో దళితులను బజారు కీడుస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీలో పోరు జరుగతుంన్నా మాల ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోడం దారుణమన్నారు. ఈ నెల 10,11 తేదీల్లో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద వర్గీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన మాలల ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సురేష్, శివకుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.