ఊపిరాడక ప్రాణాలు పోయాయనుకున్నా: మమతా
కోల్ కతా: ఊపిరాడక ప్రాణాలు పోయాయనుకున్నానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మమతా బెనర్జీ బస చేసిన హోటల్ గదిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం ఘటన నుంచి బయట పెడిన విషయాన్ని తలుచుకుంటూ.. గది అంతా పొగతో నిండిపోయింది. నాకు ఏమి కనిపించలేదు అని అన్నారు. అదృష్ఠవశాత్తు హోటల్ గది తలుపులకు తాళం వేయకపోవడంతో బయటపడ్డానని మమతా అన్నారు.
ఎక్కువ మొత్తంలో గ్యాస్ పీల్చుకున్నానని.. దాదాపు చనిపోయాననే ఫీలింగ్ కలిగిందని మమతా తెలిపారు. రాత్రంతా ఊపిరి సంబంధమైన సమస్యతో బాధపడ్డానని మమతా అన్నారు. మల్దా పట్టణంలో మమతా బెనర్జీ బస చేసిన ఓ ప్రైవేట్ హోటల్ లోని ఏసీకి నిప్పంటుకోవడంతో గది నిండా ఎత్తున పొగ దట్టంగా అలుముకున్నాయి.