manasu palike mouna geetham
-
సుజన చచ్చిపోతుందా?!
సీరియల్కి ప్రాణం పోసే ఒక పాత్ర ఉన్నట్టుండి మాయమైపోతే చాలా వెలితి ఫీలవుతారు ప్రేక్షకులు. తమ ఇంట్లోని ఒక మనిషే దూరమైపోయినట్టుగా బాధపడిపోతారు. అందుకేనేమో, దర్శకులు అప్పుడప్పుడూ ఒక్కో ముఖ్యమైన పాత్రని చంపేస్తుంటారు. ‘మనసు పలికే మౌనగీతం’లో అలానే జరగబోతోంది. హీరోయిన్ ఇషిత తరువాత అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అయిన సుజన చచ్చిపోనుంది. అహంకారంతో భర్తను వదిలేసుకుని, అతడు మరో స్త్రీకి భర్తయిన తర్వాత సాధించాలని చూస్తుంది సుగుణ. దానికోసం రకరకాల పన్నాగాలు పన్నుతుంది. ఈ మధ్యనే తన దుష్టబుద్ధి కారణంగా పిల్లలకు కూడా దూరమైపోయింది. అయితే ఆమె పాత్ర అక్కడితో అయిపోలేదు. ముందు ముందు ఆమె పాత్ర మరింత కీలకంగా మారబోతోంది. ఆ తర్వాత ప్రాణమూ కోల్పోనుంది. ఇది సీరియల్కి దెబ్బ కాకపోయినా, ఆ పాత్రను ప్రేమించే అభిమానులకు మాత్రం పెద్ద లోటే. సుజన పాత్రను అద్భుతంగా పోషింది అనిత. అహంకారానికి నిలువెత్తు రూపంలో కనిపించే ఆమె పాత్ర అర్ధంతరంగా ముగిసిపోవడానికి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి! -
రాహుల్ని ఇషిత క్షమిస్తుందా?!
డబ్బింగ్ సీరియల్ అయినా కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు పట్టం కడతారనడానికి పెద్ద సాక్ష్యం... ‘మనసు పలికే మౌన గీతం’. అనుకోకుండా పరిచయమైన ఓ పాపకు దగ్గరై, తన కోసం ఆమె తండ్రి రాహుల్ని వివాహం చేసుకుంటుంది ఇషిత. ఆ తర్వాత అతడిని ప్రేమిస్తుంది. అతడి ప్రేమనూ సంపాదించుకుంటుంది. అయితే రాహుల్ మొదటి భార్య సుజన కారణంగా అడుగడుగునా ఇబ్బంది పడుతూ ఉంటుంది. చివరికి ఏ పాప కోసం రెండో పెళ్లివాడికి భార్యయ్యిందో, అదే పాపను సుజనకు ఇచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా భర్త చేసిన పొరపాటు వల్ల. దాంతో ఆమె పడుతోన్న వేదనను చూసి ప్రేక్షకుల కళ్లు తడుస్తున్నాయి. ఏదో ఒకటి చేసి పాపను దక్కించుకుంటుందని ఎదురు చూస్తున్నారు. కానీ అలా జరగదు. పాప ఇషితకు దూరమై పోతుంది. కథలో రాబోతోన్న పెద్ద మలుపు అదే. మరి ఆ పరిస్థితికి కారణమైన భర్తని ఇషిత క్షమిస్తుందా? పాపను ఎప్పటికైనా మళ్లీ కలుస్తుందా? ఇప్పుడే చెప్పేస్తే ఏం బావుంటుంది! మీరే చూడండి.