బహుభాషా సమ్మేళనంలో మన కలాలు
మంగుళూరు యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, కర్నాటక సాహిత్య అకాడమీ కలిసి మార్చి 18, 2015న మంగుళూరులో నిర్వహిస్తున్న బహుభాషా రచయిత్రుల సదస్సులో తెలుగు నుంచి ముగ్గురు సాహితీకారులు పాల్గొననున్నారు. ఆ రోజు జరిగే కథా సదస్సులో కుప్పిలి పద్మ, విమర్శ సదస్సులో కాత్యాయనీ విద్మహే, కవిత్వ సదస్సులో షాజహానా పాల్గొంటారు. కన్నడ, తమిళ, తుళు, కొంకణి, మలయాళం తదితర భాషల రచయిత్రులతో వీరు వేదిక పంచుకోనున్నారు. తమ తమ విభాగాలలో లబ్ధప్రతిష్టులైన ఈ ముగ్గురూ తమ కృషిని, సమకాలీన స్త్రీ సాహిత్యాన్ని ఈ వేదిక నుంచి తెలియచేయనున్నారు.
కాత్యాయనీ విద్మహే
కుప్పిలి పద్మ
షాజహానా