Maninder Singh
-
Nithari Killings: నిఠారి వరుస హత్యల కేసులో దోషులకు విముక్తి
ప్రయాగ్రాజ్/న్యూఢిల్లీ: 2006 నాటి నిఠారి వరుస హత్యల కేసులో నిందితులుగా మణీందర్ సింగ్ పంధేర్, పని మనిషి సురేంద్ర కోలీలకు అలహాబాద్ హైకోర్టు విముక్తి కల్పించింది. వారికి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. నోయిడాలోని ఓ బంగ్లా వెనుక 8 మంది చిన్నారుల ఎముకలు కనిపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఇద్దరూ కలిసి పలువురు బాలికలపై లైంగికదాడికి, దారుణ హత్యలకు పాల్పడటంతోపాటు నరమాంస భక్షకులుగా మారినట్లు కూడా ఆరోపణలొచ్చాయి. అత్యాచారం, హత్య నేరాలకు పాల్పడిన వీరిద్దరికీ ఘజియాబాద్లోని సీబీఐ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ పంధేర్, కోలీలు వేసిన పిటిషన్ను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్హెచ్ఏ రిజ్విల ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఎటువంటి సందేహాలకు తావు లేకుండా వీరిద్దరికీ వ్యతిరేకంగా కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు ధర్మాసనం పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు తాజా తీర్పుతో పంధేర్ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైందని ఆయన లాయర్ మనీషా భండారి చెప్పారు. అయితే, మరో కేసులో జీవిత ఖైదు శిక్షపడిన కోలీ మాత్రం జైలులోనే ఉంటాడని అన్నారు. తీర్పు ప్రతి అందాక తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.2007లో పంధేర్, కోలీలపై 19 కేసులు నమోదయ్యాయి. అయితే, సాక్ష్యాలు దొరకలేదంటూ మూడు కేసుల్లో మాత్రమే సీబీఐ అభియోగ పత్రాలు నమోదు చేయగలిగింది. మిగతా 16 కేసులకుగాను మూడు కేసుల నుంచి కోలీ బయటపడ్డాడు. ఒక కేసులో విధించిన మరణశిక్షను కోర్టు జీవిత ఖైదుగా మార్చింది. కోలీకి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చడాన్ని సవాల్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. తాజాగా అలహాబాద్ కోర్టు తీర్పుతో 12 కేసుల నుంచి అతడికి విముక్తి లభించింది. అదే సమయంలో, పంధేర్పై ఉన్న ఆరు కేసుల్లో, ఒకటి సీబీఐ వేసింది కాగా, మరో అయిదు బాధితుల కుటుంబాలవి. గతంలో సెషన్స్ కోర్టు అతడిపై ఉన్న మూడు కేసులను కొట్టివేసింది. మిగతా మూడింటిలో 2009లో ఒకటి, తాజాగా అలహాబాద్ కోర్టు తీర్పుతో రెండు కేసుల నుంచి పంధేర్ బయటపడినట్లయిందని అతడి లాయర్ చెప్పారు. కోలీ ఘజియాబాద్ కారాగారంలో, అతడి మాజీ యజమాని పంధేర్ నోయిడా జైల్లో ఉన్నారు. -
మహిళను నరికి.. శవంతో వీడియో!
పట్టపగలు అందరూ చూస్తుండానే 40 ఏళ్ల మహిళను ఓ యువకుడు నరికి చంపేశాడు. ఈ దారుణం పంజాబ్లోని ఖిలా రాయ్ పూర్ గ్రామంలో జరిగింది సరబ్జీత్ కౌర్ అనే బాధితురాలు ఇంటికి తిరిగి వెళ్తుండగా మణీందర్ సింగ్ అనే నిందితుడు గొడ్డలితో ఆమెను నరికేశాడు. పదే పదే మెడమీద, గుండెల మీద నరకడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆమె చనిపోయినట్లు ఖరారు చేసుకున్న తర్వాత.. తన ఫోన్ తీసుకుని రక్తపు మడుగులో పడి ఉన్న సరబ్జీత్ మృతదేహాన్ని వీడియో తీసుకున్నాడు. తర్వాత కెమెరాను తనవైపు తిప్పుకొని, ఏదో మాట్లాడాడు. మహిళను చంపిన తర్వాత ఆమె మృతదేహం పక్కనే నిలబడి వీడియో తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మణీందర్ సింగ్ నేరుగా పోలీసులకు ఫోన్ చేసి, తాను హత్య చేశానని చెప్పాడు. దాంతో వాళ్లు వచ్చి అతడిని అరెస్టు చేసినట్లు లూధియానా డీసీపీ ధ్రుమన్ నింబ్లే తెలిపారు. సరబ్జీత్ కుమార్తె లఖ్వీందర్ కౌర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన మరో మహిళతో మణీందర్ సింగ్కు వివాహేతర సంబంధం ఉన్న విషయం సరబ్జీత్కు తెలుసని అంటున్నారు. దాంతో ఆమె తనను ఆ విషయం గురించి పదే పదే బ్లాక్ మెయిల్ చేస్తోందని, అందుకే ఆమెను చంపేశానని మణీందర్ చెప్పాడు. -
'ఇది నంబర్ వన్ బౌలింగ్ కాదు'
పుణె: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భారత్ జట్టు ఘోర ఓటమి అనంతరం విమర్శల వర్షం కురుస్తోంది. ఒకవైపు ఎటువంటి అంచనాలు లేకుండా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా స్పిన్నర్ ఓకీఫ్ చెలరేగిపోతే, మన స్పిన్నర్లు పూర్తిస్థాయి ప్రదర్శన ఎందుకు చేయలేదనే దానిపై పలువురు విశ్లేషకులు మండిపడుతున్నారు. ఆ మ్యాచ్ లో భారత ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని అంటున్నాడు మాజీ దిగ్గజ స్పిన్నర్ మణిందర్ సింగ్. అశ్విన్ కేవలం సాధారణ బౌలింగ్ కే పరిమితమయ్యాడు తప్పా, ఎటువంటి కొత్త ప్రయోగాలు చేయడంలో విఫలమయ్యాడని పేర్కొన్నాడు. అశ్విన్ బౌలింగ్ బాగా చేయలేదనే విషయం క్లియర్ గా కనబడుతుందని మణిందర్ సింగ్ తెలిపాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఓకీఫ్ కేవలం బేసిక్స్ తోనే వికెట్లను సాధిస్తే, స్టార్ స్పిన్నర్ అయిన అశ్విన్ మాత్రం బంతిని సరైన ప్రదేశంలో సంధించడంలో విఫలమయ్యాడన్నాడు. మనకు మ్యాచ్ విన్నర్ అయిన అశ్విన్ పరిస్థితులకు తొందరగా అలవాటు పడి వికెట్లు తీయడానికి యత్నించాల్సి ఉండాల్సిందన్నాడు. ఇక్కడ అశ్విన్ కు కోచ్ అనిల్ కుంబ్లే ఏమైనా సలహా ఇచ్చే ఉంటే బాగుండేదన్నాడు. వరల్డ్ నంబర్ వన్ బౌలర్ అయిన అశ్విన్ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇది కాదని మణిందర్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్ లో వికెట్లు తీసే ఉత్సుకతతో మన స్పిన్నర్లు బౌలింగ్ చేయలేనట్లుగానే తనకు కనబడిందన్నాడు. రెండో ఇన్నింగ్స్ లో వికెట్ స్పిన్నర్లకు పూర్తిగా అనుకూలిస్తున్నప్పుడు సహనంతో కూడిన బౌలింగ్ ను మన స్పిన్నర్లు చేసి ఉంటే బాగుండేదన్నాడు. -
'ఆరు వారాలు అశ్లీల చిత్రాలను పరిశీలించండి'
న్యూఢిల్లీ: కండోమ్ ప్యాకెట్ల మీద, వాటికి సంబంధించిన ప్రకటనల్లో మహిళల అసభ్య ఫొటోలను ముద్రిస్తూ, అశ్లీలతతో కూడిన ప్రకటనలు గుప్పిస్తు ప్రజలను చెడుతోవ పట్టిస్తున్నారని పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతుండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా భావించింది. ఈ విషయంలో కండోమ్ తయారీ కంపెనీలకు, ప్రకటనకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఆయా ప్రకటనల్లో అశ్లీలతపై పరిశీలన చేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఏఎస్ జీ) మనీందర్ సింగ్ ను ఆదేశించింది. వీటిని నియంత్రించేందుకు మీ దగ్గర ఏవైనా ప్రణాళికలు ఉన్నాయా? అని ఏఎస్ జీని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం.. ఆ మేరకు సూచనలు ఇవ్వాలని కోరింది. 'ఆరు వారాలు ఆ ప్రకటనలను నిశితంగా పరిశీలించి అభిప్రాయం చెప్పండి' అని ఏఎస్ జీని సుప్రీం కోరినట్లు పలు జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే ఏఎస్ జీ మనీందర్ సింగ్ కార్యాలయం మాత్రం దీనిపై స్పందించేందుకు విముఖత ప్రదర్శించింది. మంగళవారం సుప్రీం కోర్టు నుంచి ఉత్తర్వులు అందాయని మాత్రం తెలిపింది. మనీందర్ సింగ్ ప్రభుత్వ పరంగా మూడో అత్యున్నత న్యాయాధికారి కావడంతో కాండోమ్ ప్రకటనలపై ఆయన ఎలాంటి సూచనలు చేస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తినెలకొంది.