మహిళను నరికి.. శవంతో వీడియో! | youth hacks woman to death and takes video with deadbody | Sakshi
Sakshi News home page

మహిళను నరికి.. శవంతో వీడియో!

Published Mon, May 29 2017 2:50 PM | Last Updated on Tue, Sep 5 2017 12:17 PM

మహిళను నరికి.. శవంతో వీడియో!

మహిళను నరికి.. శవంతో వీడియో!

పట్టపగలు అందరూ చూస్తుండానే 40 ఏళ్ల మహిళను ఓ యువకుడు నరికి చంపేశాడు. ఈ దారుణం పంజాబ్లోని ఖిలా రాయ్ పూర్ గ్రామంలో జరిగింది సరబ్జీత్ కౌర్ అనే బాధితురాలు ఇంటికి తిరిగి వెళ్తుండగా మణీందర్ సింగ్ అనే నిందితుడు గొడ్డలితో ఆమెను నరికేశాడు. పదే పదే మెడమీద, గుండెల మీద నరకడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆమె చనిపోయినట్లు ఖరారు చేసుకున్న తర్వాత.. తన ఫోన్ తీసుకుని రక్తపు మడుగులో పడి ఉన్న సరబ్జీత్ మృతదేహాన్ని వీడియో తీసుకున్నాడు. తర్వాత కెమెరాను తనవైపు తిప్పుకొని, ఏదో మాట్లాడాడు.  మహిళను చంపిన తర్వాత ఆమె మృతదేహం పక్కనే నిలబడి వీడియో తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత మణీందర్ సింగ్ నేరుగా పోలీసులకు ఫోన్ చేసి, తాను హత్య చేశానని చెప్పాడు. దాంతో వాళ్లు వచ్చి అతడిని అరెస్టు చేసినట్లు లూధియానా డీసీపీ ధ్రుమన్ నింబ్లే తెలిపారు. సరబ్జీత్ కుమార్తె లఖ్వీందర్ కౌర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన మరో మహిళతో మణీందర్ సింగ్కు వివాహేతర సంబంధం ఉన్న విషయం సరబ్జీత్కు తెలుసని అంటున్నారు. దాంతో ఆమె తనను ఆ విషయం గురించి పదే పదే బ్లాక్ మెయిల్ చేస్తోందని, అందుకే ఆమెను చంపేశానని మణీందర్ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement