నంద్యాలలో సినీ హీరో నిఖిల్
నంద్యాల రూరల్: అయ్యలూరు మెట్టవద్ద ఉన్న ఎస్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాల దశాబ్ది ఉత్సవాలకు హీరో నిఖిల్, హీరోయిన్ మన్నార్ చోప్రా అతిథులుగా హాజరయ్యారు. ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు కాలేజీయాజమాన్యం నిఖిల్, మున్నార్ చోప్రా చేతుల మీదుగా బహుమతులు అందించారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం ఇంజనీరింగ్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టకున్నాయి. చైర్మన్ వెంకటరామిరెడ్డి, ఎండీ దినేష్రెడ్డి, ప్రిన్సిపాల్స్ మల్లికార్జున రెడ్డి, డాక్టర్ ఎస్.నారపురెడ్డి, స్వరూపా రాణి తదితరులు దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు.