ట్రైనీ ఐపీఎస్ మృతిపై అనుమానాలు
శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారి పోలీసు అకాడమీలో మరణించడం సంచలనం కలిగిస్తోంది. అకాడమీలోని స్విమ్మింగ్ పూల్‌లో అర్ధరాత్రి పడి చనిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది ప్రమాదమేనా.. మరేమైనా జరిగిందా.. అసలు పోలీసు అకాడమీలో ఏం జరిగిందనే విషయాలన్నీ సస్పెన్స్‌గానే ఉన్నాయి.
హిమచల్ ప్రదేశ్‌కు చెందిన మనోముత్తు మానవ్ 2013లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అదే సంవత్సరం శిక్షణ కోసం హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో చేరారు. అకాడమీలోని స్విమింగ్‌పుల్‌లో పడి గాయపడడంతో సహచరులు బంజారాహిల్స్‌లోని కేర్ అసుప్రతికి తీసుకొస్తుండగా మర్గమధ్యలోనే మృతి చెందారు. మృతదేహన్ని కేర్ లోని మార్చురీలో భద్రపరిచి హిమాచల్ ప్రదేశ్‌లోని అతని కుటుంబానికి సమాచారం అందించారు. వాళ్లు ఆస్పత్రికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. అయితే, ఐపీఏస్ అధికారి మృతిపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలు అకాడమీలో ఏం జరిగింది ? నిజంగానే స్విమ్మింగ్ పూల్‌లో ప్రమదవశాత్తు పడి మృతి చెందాడా ? లేక ఆత్మహత్య చేసుకున్నాడా ఇంకేమైనా జరిగిందా? మరో రెండు నెలల్లో దేశానికి సేవలు అందించాల్సిన ఐపీఎస్ మృతి చెందడంపై పలువురు ఉన్నతాధికారులు విచారం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శిక్షణ పొందుతున్న ఐపీఎస్‌లలో కొంతమంది ఈసారి ఐఏఎస్‌కు ఎంపిక కావడంతో వారంతా అకాడమీలోవిందు ఇచ్చారు. ఈ విందులో మద్యం సేవించడం అనేది వివాదస్పదమవుతోంది.