manuvada Vijay
-
విజయ్ను వదలిపెట్టిన పోలీసులు
-
విజయ్ను వదలిపెట్టిన పోలీసులు
కొత్తగూడెం : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ సభలో నిరసన తెలిపిన ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్‌ని పోలీసులు ఎట్టకేలకు విడుదల చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం వద్ద అతడిని గురువారం పోలీసులు విడిచిపెట్టారు. మావోయిస్టులతో విజయ్ కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విజయ్ వద్ద హామీ పత్రం తీసుకున్నట్లు సమాచారం. కాగా విజయ్ స్వస్థలం కరీంనగర్ జిల్లా వేములవాడ. -
'విజయ్‌ని వెంటనే విడుదల చేయాలి'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌లో నిర్వహించిన సభలో నిరసన తెలిపిన ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. అరెస్ట్ చేసిన విద్యార్థి విజయ్‌ని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఓయూ విద్యార్థి విజయ్ అరెస్ట్ అప్రజాస్వామికమని పేర్కొన్నారు. నక్సలైట్ల అజెండానే అమలు చేస్తామని పేర్కొన్న కేసీఆర్.. ఎన్కౌంటర్, అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మాజీ ఎంపీ మల్లు రవి విమర్శించారు. కాగా, విజయ్ ప్రస్తుతం ఎక్కడున్నాడన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
విజయ్ ని కోర్టులో హాజరుపరచాలి: వరవరరావు
వరంగల్ కేసీఆర్ సభలో నిరసన తెలిపిన ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రజా సంఘాలు తెలిపాయి. విజయ్ తో పాటు అతని తల్లి దండ్రులు కూడా పోలీసులు పట్టుకెళ్లారని.. పేర్కొన్నారు. వెంటనే విజయ్, అతడి తల్లి దండ్రులను పోలీసులు కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు. కాగా.. విజయ్ కి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వాదిస్తున్నారు. మరో వైపు కేసీఆర్ సభలో నిరసన తెలిపి నందుకే పోలీసులు విజయ్ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్ ని వెంటనే కోర్టులో హాజరు పరచాలని విప్లవ రచయితలసంఘం నేత వరవరరావు డిమాండ్ చేశారు. కొత్తగూడెం పోలీసులు మనువాడ విజయ్ ని అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. అక్రమంగా తమ కస్టడీలో పెట్టుకున్న మనువాడ విజయ్ ని పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.