maran
-
బెడ్ సీన్‌ను ఎన్నిసార్లు షూట్ చేశారు.. హీరోయిన్ ఘాటు రిప్లై
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీఫుల్ హీరోయిన్ మాళవిక మోహనన్. తమిళంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ 'పెట్టా', విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' సినిమాలతో అలరించింది. ఇటీవల ధనుష్ కలిసి నటించిన 'మారన్' ఓటీటీలో విడుదలైంది. కానీ అంతగా విజయం సాధించలేదు. ఈ మూవీలో పలు ఇంటిమేట్ సీన్లలో యాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాళవిక ఇటీవల 'క్వశ్చన్ అండ్ ఆన్సర్' సెషన్ నిర్వహించింది. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది మాళవిక. 'మారన్ సినిమాలోని బెడ్ సీన్ కోసం ఎన్నిసార్లు షూట్ చేశారు' అని అడిగిన ప్రశ్నకు మాళవిక స్పందిస్తూ 'నీ తలలో ఏదో పాడైనట్టుంది' అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. మాళవిక మోహనన్ ఇచ్చిన ఈ రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల విజయ్ దేవరకొండతో రొమాంటిక్ సినిమా చేయాలనుందని సోషల్ మీడియా వేదికగా మాళవిక చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆమె సిద్ధాంత్ చతుర్వేది, రాఘవ్ జుయాల్‌తో కలిసి 'యుధ్రా' సినిమాలో నటిస్తోంది. చదవండి: విజయ్ దేవరకొండతో రొమాంటిక్ మూవీ చేయాలనుంది: హీరోయిన్ -
మారన్ సోదరులకు కోర్టు సమన్లు
న్యూ ఢిల్లీ: మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్లతో పాటు కళానిధి మారన్ భార్య కావేరి కళానిధిలకు 2జీ కేసు విచారణ జరుపుతున్న ప్రత్యేక న్యాయస్థానం శనివారం సమన్లు జారీ చేసింది. ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ ఒప్పందంలో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిని జులై 11న న్యాయస్థానం ముందు హాజరుకావాల్సిందిగా కోర్టు ఆదేశించింది. వీరితో పాటు ఎస్‌ఏఎఫ్‌ఎల్, సన్‌డైరెక్ట్ సంస్థ లకు సమన్లు జారీ అయ్యాయి. ఈడీ నమోదు చేసిన చార్జ్‌షీట్‌ను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ సెల్ షేర్లను మలేసియాకు చెందిన మ్యాక్సిస్ సంస్థకు అమ్మేలా మారన్ సోదరులు ఒత్తిడి తీసుకొచ్చారని ఈడీ చార్జ్ షీట్ లో పేర్కొంది. -
మారన్ ఆస్తులు అటాచ్
కేంద్ర టెలికం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి, వారి కుటుంబసభ్యులకు సంబంధించిన 742 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ అటాచ్ చేసింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో బుధవారం వారి ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అటాచ్ చేసిన వాటిలో దయానిధి మారన్, ఇతరులకు చెందిన రూ. 7.47కోట్ల ఎఫ్డీలు, కళానిధి మారన్‌కు చెందిన రూ. 100 కోట్ల ఎఫ్డీలు, రూ. 2.78 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే, కళానిధి భార్య కావేరికి చెందిన రూ. 1.3 కోట్ల విలువైన ఎఫ్డీలు, రూ. 1.78 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా ఈడీ అటాచ్ చేసింది. -
స్పైస్‌జెట్‌లో మళ్లీ అజయ్ ప్రయాణం
వాటా విక్రయించి దిగిపోతున్న మారన్ డీల్ విలువ దాదాపు రూ.1,500 కోట్లు వచ్చే ఏడాదికి బ్రేక్ ఈవెన్ సాధించేలా ప్రణాళిక కొన్ని విమానాలు, ఉద్యోగాల్లో సైతం కోత పెట్టుబడుల కోసం విదేశీ ఇన్వెస్టర్లతో చర్చలు న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌లోకి మళ్లీ పాత ప్రమోటర్ అజయ్‌సింగ్ ప్రవేశించారు. దాదాపు రూ.1,500 కోట్ల పెట్టుబడితో ప్రస్తుతం కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ గ్రూపునకు ఉన్న వాటాలు మొత్తాన్ని కొనుగోలు చేయడానికి అజయ్ నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా డీల్ పూర్తి కావచ్చని సమాచారం. అయితే ఈ ఒప్పందానికింకా నియంత్రణ సంస్థలు అనుమతివ్వాల్సి ఉంది. తాను పెట్టుబడి పెట్టడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్లతో పెట్టుబడులు పెట్టించి, సంస్థకు కొత్త ఊపిర్లూదేందుకు అజయ్ సింగ్ అయిదేళ్ల ప్రణాళికను సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తోంది. స్పైస్‌జెట్ బోర్డు ఆమోదించిన పునరుద్ధరణ స్కీమ్ ప్రకారం ప్రస్తుత ప్రమోటర్ కళానిధి మారన్ కుటుంబం, కాల్ ఎయిర్వేస్ యాజమాన్య, నియంత్రణ బాధ్యతలన్నీ సింగ్‌కు బదిలీ అవుతాయి. మారన్ కుటుంబం తమకున్న మొత్తం ఈక్విటీ వాటాలను ఆయనకు బదలాయిస్తుంది. అయితే మున్ముందు తమ వద్దనున్న వారంట్లను వాటాలుగా మార్చుకుని, 10 శాతం వాటాలతో మైనారిటీ ఇన్వెస్టరుగా మాత్రం కొనసాగుతుంది. గతేడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాల ప్రకారం మారన్ కుటుంబానికి 53.48 శాతం వాటాలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక... యాజమాన్య బదలాయింపు, పునరుద్ధరణ ప్రణాళికను పౌర విమానయాన శాఖకు సమర్పించినట్లు అజయ్ సింగ్ తెలిపారు. కంపెనీ ఆర్థిక పరిస్థితిని, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపర్చేలా దీన్ని రూపొందించామన్నారు. బంబార్డియర్ క్యూ400 విమానాలను దశల వారీగా పక్కనపెట్టడం కూడా ఈ ప్లాన్‌లో భాగమే. దీనికి ఆమోదముద్ర లభించాక అమల్లోకి తెస్తారు. ప్రస్తుతం 41 బోయింగ్-14 బొంబార్డియర్ విమానాలతో కార్యకలాపాలు ఒక మోస్తరుగా నడుస్తున్నాయని.. క్రమంగా ఫ్లయిట్ సర్వీసులు పెంచడంపై దృష్టి పెడతామని సింగ్ చెప్పారు. స్పైస్‌జెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా లాభదాయకం కాని రూట్లతో పాటు కొన్ని ఉద్యోగాల్లో కూడా కోత విధించాల్సి రావచ్చని తెలిపారు. ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో 5,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ జేపీ మోర్గాన్‌తో కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 2005లో ఏర్పాటయ్యాక స్పైస్‌జెట్ యాజమాన్యం మారడం ఇది మూడోసారి. 2005లో ప్రవాస భారతీయుడు కన్సాగ్రా కుటుంబంతో కలిసి సింగ్ స్పైస్‌జెట్‌ను ఆరంభించాక అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ విల్బర్ రాస్ మెజారిటీ వాటాలు కొన్నారు. 2010లో ఆ వాటాలను మీడియా దిగ్గజం సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుటుంబానికి విక్రయించారు. మారన్ స్పైస్‌జెట్‌లో దాదాపు రూ. 1,300 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇందులో సగ భాగాన్ని కంపెనీ కొనుగోలు కోసం వెచ్చించారు. తాజాగా మారన్ కుటుంబం నిష్ర్కమిస్తుండటంతో.. వ్యవస్థాపక ప్రమోటర్ సింగ్ మరోసారి కంపెనీ పగ్గాలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో స్పైస్‌జెట్ నష్టాలు రూ. 246 కోట్లు. -
అళగిరికి చెక్
సాక్షి, చెన్నై: అళగిరిని పక్కన పెట్టేందుకు డీఎంకే సమాయత్తం అవుతున్నట్టుంది. ఇందుకు అన్నా అరివాళయం వెలువరించిన ఓ ప్రకటన బలం చేకూరుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో దక్షిణాది కింగ్ మేయర్ అళగిరి పేరు మిస్సింగ్ కావడం డీఎంకే వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాజ కీయ వారసత్వం కోసం డీఎంకేలో పెద్ద సమరమే జరుగుతోం ది. ఆయన తనయులు అళగిరి, స్టాలిన్ మధ్య చోటు చేసుకుం టూ వస్తున్న ఈ సమరం క్రమంగా ముదురుతోంది. వీరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు కరుణ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వడం లేదు. తన రాజకీయ వారసుడు స్టాలినే అంటూ కరుణానిధి ఇటీవల పరోక్ష వ్యాఖ్యలు చేయడం అళగిరి, ఆయన మద్దతుదారులకు మింగుడుపడటం లేదు. అసలే అగ్గి మీద బుగ్గిలా ఎగసి పడుతున్న అళగిరికి కేంద్రంలో మంత్రి పదవి దూరం కావడం పుండు మీద కారం చల్లినట్టు అయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి డీఎంకే వైదొలగిన నాటి నుంచి అళగిరి ఆగ్రహంతోనే ఉన్నారు. తగ్గిన ప్రాధాన్యత: తనతో మాట వరుసకైనా చెప్పకుండా కూటమి నుంచి వైదొలగడాన్ని అళగిరి తీవ్రంగా పరిగణించారు. దక్షిణాది జిల్లాల పార్టీ నిర్వాహక కార్యదర్శిగా ఉన్న తనకు ప్రాధాన్యత తగ్గుతోందన్న మనోవేదనలో పడ్డారు. అదే సమయంలో తనకు తెలియకుండానే దక్షిణాది జిల్లాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలకు పిలుపు నివ్వడం జీర్ణించుకోలేక పోయారు. దీంతో ధిక్కార సర్వాన్ని పెంచే పనిలో పడ్డారు. ఁ్ఙడీఎంకే ఏమైనా మఠమా..!, స్నేహం వేరు...పార్టీ వేరు..! తాను తలచుకుంటే పార్టీ చీలుద్దీ...!, మౌనంతో అన్నీ భరిస్తున్నా...!, ఏదో ఒక రోజు ఉప్పెనలా ఎగసి పడుతా...! ఇలా అనేక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు. కుటుంబ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. కొన్నాళ్లు అమెరికాలో ఉన్న అళగిరి రెండు నెలల క్రితం చెన్నైకు తిరిగి వచ్చారు. కరుణానిధిని కలుసుకుని తన ఆక్రోశాన్ని వెల్లగక్కే యత్నం చేశారు. అయితే, కరుణానిధి అనుమతి మాత్రం అళగిరికి దక్కలేదు. హాట్ టాపిక్: ఇష్టానుసారంగా నడచుకుంటూ పార్టీలో, మీడియాల్లో అళగిరి హాట్ టాపిక్‌గా మారారు. ఆరేడు నెలలకు పైగా అందరికీ దూరంగా ఉంటున్న అళగిరి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్ని, అత్యవసర, సర్వసభ్య సమావేశాలకు డుమ్మా కొట్టారు. దీన్ని డీఎంకే అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. అళగిరి తీరును ఆయన మార్గంలోనే ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది. పార్టీకి దూరంగా ఉన్న అళగిరిని ప్రశ్నించకుండా...! అలాగే వదలి పెట్టి, చివరకు చెక్ పెట్టే పంథాను అధిష్టానం అనుసరిస్తున్నట్టుంది. చిన్న కుమారుడు స్టాలిన్‌కు రానురాను కరుణానిధి పెద్ద పీట వేయడం చూస్తే, అళగిరికి ప్రాధాన్యత తగ్గినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా తాజాగా డీఎంకే అధిష్టానం విడుదల చేసిన ఓ ప్రకటనలో అళగిరి పేరు మిస్ కావడం గమనార్హం. మిస్సింగ్ : డీఎంకే సర్వ సభ్యసమావేశం తీర్మానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలకు డీఎంకే పిలుపు నిచ్చింది. ఏఏ నేత ఎక్కడ పాల్గొంటారోనన్న వివరాల్ని పార్టీ అధిష్టానం వివరించింది. చెన్నైలో అధినేత కరుణానిధి, సీనియర్ నేత దురై మురుగన్, కంచిలో స్టాలిన్, తూత్తుకుడిలో ఎంపీ కనిమొళి, పుదుకోట్టైలో పార్టీ పార్లమెంటరీ నేత టీ ఆర్ బాలు, తిరువ ణ్ణామలైలో తిరుచ్చి శివ, సేలంలో నటి ఖుష్బు, మదురైలో ఎంపి దయానిధి మారన్, ఇలా పార్టీలోని ముఖ్య నాయకులు, ఎంపీలు, మాజీలకు ఆయా జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలకు నేతృత్వం వహించే అవకాశం కల్పించారు. అయితే, అళగిరి పేరు మిస్ కావడం చర్చనీయాంశంగా మారింది. అళగిరి అడ్డా అరుున మదురైలో జరిగే సభకు దయానిధి మారన్ నేతృత్వం వహిస్తుండటంతో ఁచెక్*అన్నపదానికి బలం చేకూరుతోంది. అళగిరి పేరు మిస్ కావడం ఆయన మద్దతుదారుల్లో ఆక్రోశాన్ని రగుల్చుతోంది. మున్ముందు రోజుల్లో ఈ ప్రకటన కారణంగా అళగిరి వర్గంలో ఎలాంటి దుమారం రేగబోతుందో వేచిచూడాల్సిందే.