Market fluctuations
-
ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయిలు నమోదు తర్వాత అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఈ వారంలో ఒడిదుడుకులకు లోనవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దిశానిర్ధేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సమగ్ర బడ్జెట్‌పై అంచనాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘స్టాక్ మార్కెట్లో ఓవర్‌బాట్ పరిస్థితుల కారణంగా గరిష్ట స్థాయిల వద్ద కొంత లాభాల స్వీకరణ జరగొచ్చు. అధిక వాల్యుయేషన్లు, స్థూల ఆర్థిక డేటా విడుదల నేపథ్యంలో కొంత అస్థిరత చోటు చేసుకునే వీలుంది. ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు స్తబ్ధుగా ట్రేడవుతున్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 23800 వద్ద కీలక మద్దతు ఉంది. ఎగువున 24,200 వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంది’’ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ సాంకేతిక నిపుణుడు నాగరాజ్ శెట్టి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు, ద్రవ్యోల్బణ సంబంధిత ఆందోళలను అధిగమిస్తూ గతవారం స్టాక్ సూచీలు 2% ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1,823 పాయింట్లు, నిఫ్టీ 510 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. స్థూల ఆర్థిక గణాంకాలు జూన్ జీఎస్టీ వసూళ్లు, ఆటో కంపెనీలు జూన్ వాహన విక్రయ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. ఇదే రోజు జూన్ తయారీ రంగ పీఎంఐ వెల్లడి కానుంది. సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం వెల్లడి అవుతాయి. జూన్ 28తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, జూన్ 21తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్బీఐ శుక్రవారం(జూన్ 5న) విడుదల చేస్తుంది. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. ప్రపంచ పరిణామాలు చైనా, జపాన్ జూన్ తయారీతో పాటు యూరోజోన్ జూన్ వినియోగదారుల విశ్వాస, తయారీ గణాంకాలు సోమవారం(నేడు) విడుదల అవుతాయి. యూరోజోన్ జూన్ ద్రవ్యోల్బణం, మే నిరుద్యోగ గణాంకాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ మినిట్స్ బుధవారం (జూలై 3న), బ్రిటన్‌లో (గురువారం) జూలై4న సార్వత్రి ఎన్నికలు జరగునున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం జపాన్ ఏప్రిల్ గృహ వినియోగ వ్యయ డేటా, యూరోజోన్ జూన్ రిటైల్ అమ్మకాలు, అమెరికా జూన్ నిరుద్యోగ గణాంకాలు విడుదల కానున్నాయి. జూన్‌లో రూ.26,565 కోట్ల కొనుగోళ్లు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు జూన్‌లో రూ.26,565 కోట్ల కొనుగోళ్లు జరిపారు. రాజకీయ స్థిరత్వం, స్టాక్ మార్కెట్ అనూహ్యంగా పుంజుకోవడం ఇందుకు కారణాలుగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇదే ఏడాది మార్చిలో అత్యధికంగా రూ.35,098 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘జేపీ మోర్గాన్ గ్లోబల్ బాండ్ ఇండెక్సులో భారత ప్రభుత్వ బాండ్లలను చేర్చడంతో దేశీయంగా కూడా పెట్టుబడులు భారీగా పెరగొచ్చు. అమెరికా అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండే అవకాశం ఉంది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత మార్కెట్ మరింత ఆకర్షణగా కనిపిస్తుంది’’ స్వస్తిక ఇన్వెస్ట్మెంట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు ప్రవేశ్ గౌర్ తెలిపారు. ఎఫ్ఐఐలు మే నెలలో రూ. 25,586 కోట్లు, ఏప్రిల్‌లో రూ.8,671 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించగా, జనవరిలో రూ. 25,744 కోట్లతో అమ్మకాలు జరిపారు. ఫిబ్రవరిలో మాత్రం రూ.1,539 కోట్ల స్వల్ప ఇన్‌ఫ్లోలు వచ్చాయి. -
తీవ్ర ఒడిదుడుకుల్లో చమురు మార్కెట్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అవి స్థిరపడ్డాకే దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఈ విషయం గురించి ఎటువంటి చర్చలూ జరపలేదని చెప్పారు. ముడి చమురు రేట్లు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించే అవకాశాలపై స్పందిస్తూ మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అంతర్జాతీయంగా రెండు ప్రాంతాల్లో (రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–పాలస్తీనా) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని సవాళ్లేమైనా తలెత్తినా .. లేదా ఆటంకాలేమైనా ఎదురైనా దాని ప్రభావాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. కానీ అలాంటిదేమీ జరగకూడదని కోరుకుందాం. తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్న పరిస్థితుల్లో ఇంధన లభ్యత, అందుబాటు ధరలో అది అందేలా చూడటం ప్రాథమిక బాధ్యత. జాగ్రత్తగా దీన్నుంచి బైటపడే ప్రయత్నం చేస్తున్నాం‘ అని పురి వివరించారు. మరోవైపు, చమురు దిగుమతులకు సంబంధించి రష్యాకు చెల్లింపుల విషయంలో ఎలాంటి సమస్యా లేదని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. -
మార్కెట్లు ఫ్లాట్- ప్రభుత్వ బ్యాంక్స్ స్పీడ్
ముంబై, సాక్షి: స్వల్ప ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్)గా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 15 పాయింట్లు బలపడి 44,633 వద్ద నిలిచింది. నిఫ్టీ మరింత అధికంగా 20 పాయింట్లు పుంజుకుని 13,134 వద్ద స్థిరపడింది. యూకే ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్‌ను అనుమతించడం, క్యూ3(అక్టోబర్- డిసెంబర్)లో జీడీపీ పుంజుకోనుందన్న అంచనాలతో మార్కెట్లు తొలుత దూకుడు చూపాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రారంభంలోనే సెన్సెక్స్ 44,953 వద్ద గరిష్టాన్ని తాకింది. వెరసి 45,000 పాయింట్ల మైలురాయికి చేరువైంది. ఈ బాటలో నిఫ్టీ సైతం 13,217 పాయింట్ల వరకూ ఎగసింది. ఇవి సరికొత్త గరిష్టాలుకావడం విశేషం! ఎస్బీఐ కార్డ్స్ జోరు ఆన్లైన్ సేవలలో అంతరాయం కారణంగా డిజిటల్, క్రెడిట్ కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేయమని ఆర్బీఐ ఆదేశించడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 2 శాతం నీరసించింది. అయితే ఎస్బీఐ కార్డ్స్ షేరు 5.5 శాతం జంప్‌చేసింది. కాగా.. ఎన్ఎస్ఈలో ప్రభుత్వ రంగ బ్యాంక్స్ దాదాపు 5 శాతం జంప్‌చేశాయి. మెటల్, మీడియా, ఆటో సైతం 3-1.7 శాతం మధ్య ఎగశాయి. మరోవైపు ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్ 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, హిందాల్కో, ఎస్బీఐ, బజాజ్ ఫిన్, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, కోల్ ఇండియా, టాటా స్టీల్ 7.3-2.6 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ, ఎయిర్టెల్, యాక్సిస్, అల్ట్రాటెక్ 2-0.8 శాతం మధ్య డీలా పడ్డాయి. చదవండి: (టాటా కెమికల్స్- ఆర్‌క్యాపిటల్ జోరు) బీవోబీ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో బీవోబీ, టాటా కెమ్, ఇన్ఫ్రాటెల్, పీఎన్బీ, సెయిల్, పిరమల్, భారత్ ఫోర్జ్, పీఎఫ్సీ, ఎల్అండ్టీ ఫైనాన్స్ 8-4.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క ఐసీఐసీఐ లంబార్డ్, బాష్, అదానీ ఎంటర్, బాలకృష్ణ, ఎంఆర్ఎఫ్ 3-1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8-0.7 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,987 లాభపడగా.. 929 మాత్రమే నష్టాలతో ముగిశాయి. చదవండి: (పసిడి, వెండి ధరల మెరుపులు) ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 357 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే డీఐఐలు రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
బ్యాంక్స్ వీక్- మెటల్, రియల్టీ జోరు
ముంబై, సాక్షి: జీడీపీ జోష్‌తో ముందురోజు హైజంప్ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు రోజంతా ఆటుపోట్ల మధ్య కదిలాయి. చివరికి అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 35 పాయింట్లు క్షీణించి 44,621 వద్ద నిలిచింది. నిఫ్టీ నామమాత్రంగా 5 పాయింట్లు బలపడి 13,114 వద్ద స్థిరపడింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో మంగళవారం మార్కెట్లు దూకుడు చూపిన విషయం విదితమే. దీంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్ 44,730 వద్ద గరిష్టాన్ని తాకగా.. 44,170 దిగువన కనిష్టానికి చేరింది. నిఫ్టీ సైతం 13,129-12,984 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. గెయిల్ లాభాల్లో ఎన్ఎస్ఈలో రియల్టీ, మెటల్, ఆటో, ఐటీ రంగాలు 3-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంక్స్ 0.5-1.2 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, టైటన్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, టాటా స్టీల్, ఐవోసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 5-2.6 శాతం మధ్య ఎగశాయి. అయితే కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీ సిమెంట్, ఐసీఐసీఐ, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, ఎస్బీఐ 3.4-0.6 శాతం మధ్య నష్టపోయాయి. అదానీ అప్ డెరివేటివ్ కౌంటర్లలో అదానీ ఎంటర్, టాటా కెమ్, నాల్కో, ఇన్ఫ్రాటెల్, ఎన్ఎండీసీ, పిడిలైట్, ఎస్కార్ట్స్, డీఎల్ఎఫ్ 7.2-3.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క కెనరా బ్యాంక్, సన్ టీవీ, టీవీఎస్ మోటార్, మదర్సన్, అపోలో హాస్పిటల్స్, యూబీఎల్, ఎంజీఎల్, ఎల్అండ్టీ ఫైనాన్స్ 4-1.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5-0.7 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,728 లాభపడగా.. 1,196 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
చివర్లో రికవరీ- మార్కెట్లు అక్కడక్కడే
నష్టాలతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరి గంటలో సాధించిన రికవరీతో ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ నామమాత్రంగా 12 పాయింట్లు క్షీణించి 38,129 వద్ద నిలవగా.. నిఫ్టీ 21 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,194 వద్ద స్థిరపడింది. అమెరికా నుంచి ఆసియా వరకూ మార్కెట్లు బలహీనపడటంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ఆసక్తి చూపారు. దీంతో 37,949 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 37,748 వరకూ నీరసించింది. చివర్లో 38,236 వరకూ పుంజుకుంది. ఇక నిఫ్టీ సైతం తొలుత 11,090 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకగా.. తదుపరి 11,225 వరకూ ఎగసింది. మీడియా, ఆటో, ఫార్మా డీలా ఎన్ఎస్ఈలో ఐటీ(1.4 శాతం) మాత్రమే లాభపడగా.. బ్యాంకింగ్, రియల్టీ, మీడియా, ఆటో, ఫార్మా 1.8-0.8 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, హిందాల్కో, యాక్సిస్, ఎస్బీఐ, గెయిల్, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ, ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్ 5-2.3 శాతం మధ్య నష్టపోయాయి. ఇతర బ్లూచిప్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, ఆర్ఐఎల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఇండస్ఇండ్, ఇన్ఫోసిస్, విప్రొ 4.7-1.3 శాతం మధ్య ఎగశాయి. రిలయన్స్ రిటైల్‌లో అమెజాన్ వాటా కొనుగోలు చేయనుందన్న అంచనాలతో ఆర్ఐఎల్ రూ. 2163 వద్ద సరికొత్త గరిష్టాన్ని చేరింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 14 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి దేశీయంగా లిస్టెడ్ కంపెనీల చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఫైనాన్స్ వీక్ డెరివేటివ్ కౌంటర్లలో చోళమండలం, ఎంఅండ్ఎం ఫైనాన్స్, పెట్రోనెట్, ఉజ్జీవన్, బయోకాన్, ఎస్కార్ట్స్ 4.6-3.6 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఐడీఎఫ్సీ ఫస్ట్, నిట్ టెక్, ఆర్బీఎల్ బ్యాంక్, జీఎంఆర్, మారికో, అంబుజా సిమెంట్ 4.4-1.6 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-0.25 శాతం మధ్య డీలాపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1583 నష్టపోగా.. 1070 లాభపడ్డాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1740 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 932 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం సైతం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1666 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1139 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
నేడు మార్కెట్ల ఫ్లాట్ ఓపెనింగ్- ఆపై?
నేడు (22న) దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 20 పాయింట్లు బలపడి 11,195 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్ 11,175 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్‌లో కోవిడ్-19 మరింత వేగంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వం ట్రిలియన్ డాలర్లతో మరో ప్యాకేజీ ప్రకటించవచ్చన్న అంచనాలు మంగళవారం యూఎస్ మార్కెట్లకు బలాన్నిచ్చాయి. దీంతో మార్కెట్లు 0.2-0.8 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత సానుకూలంగా ప్రారంభంకావచ్చని, తదుపరి ఆటుపోట్లు చవిచూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా నాలుగు రోజులపాటు మార్కెట్లు లాభాల బాటలో సాగడంతో కొంతమేర లాభాల స్వీకరణకు వీలున్నదని అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్ హోప్ ప్రపంచదేశాలకు సమస్యలు సృష్టిస్తున్న కోవిడ్-19 కట్టడికి త్వరలో వ్యాక్సిన్ వెలువడగలదన్న అంచనాలతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. సమయం గడిచేకొద్దీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మంగళవారం సెన్సెక్స్ 511 పాయింట్లు జంప్‌చేసింది. 38,000 పాయింట్ల సమీపంలో 37,930 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 37,990 వరకూఎగసింది. ఇక నిఫ్టీ 11,180 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 140 పాయింట్లు జమ చేసుకుని 11,162 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే గరిష్టాలవద్దే మార్కెట్లు నిలవడం గమనార్హం! నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,124 పాయింట్ల వద్ద, తదుపరి 11,085 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 11,190 పాయింట్ల వద్ద, ఆపై 11,218 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,633 పాయింట్ల వద్ద, తదుపరి 22,483 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,897 పాయింట్ల వద్ద, తదుపరి 23,011 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఎఫ్‌పీఐలు భళా.. నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2266 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 727 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1710 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1522 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
నిర్మాణాలు అంతే.. కొనుగోళ్లూ అంతంతే!
సాక్షి, హైదరాబాద్: రాజకీయ అనిశ్చితి, మార్కెట్ ఒడిదుడుకులు, రుణాల మంజూరు విషయంలో కనికరించని బ్యాంకులు, ఆశించిన స్థాయిలో పెరగని వేతనాలు, భారీగా పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలతో 2013లో హైదరాబాద్ నిర్మాణ రంగం దారుణంగా పడిపోయింది. ఏడాది ప్రారంభంలో అమ్మకాలతో కాస్త పర్వాలేదనుకున్న స్థిరాస్తి వ్యాపారం ఆరేడు నెలల నుంచి పీకల్లోతు కష్టాల్లో పడింది. మందగమనం అయినా సరే మొక్కవోని పట్టుదలతో పలు సంస్థలు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించి కొనుగోలుదారులకు నమ్మకాన్ని కల్గించాయి. మొత్తం మీద 2013లో బేజారైన హైదరాబాద్ రియల్టీ 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఊపందుకుంటుందని బిల్డర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2013 ప్రారంభంలో చాలా మంది బిల్డర్లు, డెవలపర్లు అధిక విస్తీర్ణం గల ఫ్లాట్లకు శ్రీకారం చుట్టారు. ఆర్థికమాంద్యం, రాజకీయ అనిశ్చితి కారణంగా మార్కెట్ కుప్పకూలడంతో అటు నిర్మాణాల్ని చేపట్టలేక, ఇటు కట్టిన ఇళ్లను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. వంద ఫ్లాట్లు గల నిర్మాణంలో పది అమ్మినా ఇరవై అమ్మినా నిర్మాణం మొత్తం పూర్తిచేస్తేనే కొనుగోలుదారులకు అందివ్వగలరు. అందుకే అమ్మకాలతో సంబంధం లేకుండా 2013లో పలు నిర్మాణ సంస్థలు పనులను చేపట్టాయి. ఒకానొక దశలో ప్రాజెక్టుల్లో నుంచి ఎంత నష్టంతో బయటపడతాం అనే స్థాయికి బిల్డర్లు చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఇళ్లను కొనేవారిలో రెండు రకాలున్నారు. స్థానికులు, ఇతర ప్రాంతాలకు చెందినవారు. వీరి నిష్పత్తి 40:60 శాతంగా ఉంది. నిర్మాణం చివరి దశలో ఉన్నవాటిలో అమ్మకాలు పర్వాలేదు. అదే ఆరంభదశలో ఉన్న ప్రాజెక్టుల వైపు కొనుగోలుదారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఒక ప్రాంతంలో నివాస సముదాయాలకు గిరాకీ పెరగాలంటే ముందుగా ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. రోడ్లు, విద్యుత్తు, మంచినీరు వంటి సౌకర్యాలుండాలి. విద్యాలయాలు, ఆసుపత్రులు రావాలి. ఆ తర్వాత వినోద కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఏడాదికాలంగా నేర్చుకున్న పాఠాలతో ఏయే ప్రాంతాల్లో ఏయే తరహా నిర్మాణాల్ని ఆరంభించాలో బిల్డర్లకు మంచి అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా అందుబాటులోకి వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డు, శరవేగంగా నిర్మాణం పనులు పూర్తి చేసుకుంటున్న మెట్రో రైల్ ప్రాజెక్టులతో చాలామందికి ఈ స్పష్టత వచ్చింది. బహుళ అంతస్తులు, ఆకాశహర్మ్యాలకు కేవలం మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమయ్యాయి. గతంలో అనుమతులు తీసుకున్న సంస్థలే విడతల వారీగా నిర్మాణాల్ని చేపడుతున్నాయి. 2013లో పూర్తయిన ఫ్లాట్ల సంఖ్య తక్కువే అని చెప్పొచ్చు. అధికశాతం గృహప్రవేశం జరగడానికి 2014లోనే అవకాశముంది. నాలుగేళ్ల క్రితం వరకు పెద్దగా అభివృద్ధి చెందని ఆదిభట్ల, బండ్లగూడ, పోచారం, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాలు 2013లో శరవేగంగా అభివృద్ధి చెందాయి. ఇందుకు కారణం ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్, ఐటీఐఆర్ ప్రాజెక్టులతో ఈ ప్రాంతాల్లో రియల్ వ్యాపారం జోరందుకుంది. ప్రత్యేకించి ఆదిభట్ల ప్రాంతాల్లో ముదుపుదారులు అధికదృష్టి సారిస్తున్నారు. ఇక్కడ టీసీఎస్ నలభై లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాల్ని చేపడుతోంది. 2014 ఫిబ్రవరికి ఇది పూర్తయ్యే అవకాశముంది. కాగ్నిజెంట్ పది లక్షల చదరపు అడుగుల్లో కట్టడాల్ని కడుతోంది. దీని కారణంగా ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థలాల ధరలకు అనూహ్యంగా రెక్కలొచ్చాయి. 2014 జాక్‌పాట్ ఇయర్.. వచ్చే రెండు మూడేళ్లలో మెట్రో రైల్, ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్)లు పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఆయా ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగా జరుగుతుండటంతో రియల్టర్లలో కొత్త ఉత్సాహం మొదలైంది. ఐటీఐఆర్‌తో ఆదిభట్ల, వుహేశ్వరం, ఉప్పల్, పోచారం, గచ్చిబౌలి కారిడార్లలో అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. ఆయూ ప్రాంతాల్లో రియుల్ వెంచర్లు, భారీ ప్రాజెక్టులు వెలుస్తున్నారుు. గతంలో ఫ్లాట్‌ను కొనుగోలు చేసేముందు అక్కడి మౌలిక వసతుల గురించి చెప్పే బిల్డర్లు నేడు ఆ పరిస్థితిని దాటిపోయారు. మెట్రో, ఓఆర్ఆర్, ఐటీఐఆర్ ప్రాజెక్టుల భవిష్యత్తు చిత్రాన్ని చూపిస్తున్నారు. వీటి చుట్టూ ఐటీ సంస్థలు, అంతర్జాతీయు స్థారుు ఆసుపత్రులు, విద్యాలయాలు కూడా కొలువుదీరుతుండటంతో 2014 నిర్మాణ రంగానికి జాక్‌పాట్ ఇయర్ వంటిదనే చెప్పాలి. ఎన్నికల తర్వాతే ఊపు.. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాతే హైదరాబాద్‌లో రియల్ వ్యాపారం మళ్లీ పుంజుకుంటుంది. అప్పుడు ఇళ్ల రేట్లు 20-25 శాతం పెరుగుతాయి. కూకట్పల్లి-శంషాబాద్ ప్రాంతాల్లో ఏకంగా 40-60 శాతం రేట్లు పెరిగే అవకాశం ఉంది. చ.అ. ధర రూ.3,500లుగా ఉన్నది రూ. 5 వేలకు పైగానే పలుకుతుంది. నార్సింగి-రాజేంద్రనగర్ ప్రాంతాల్లో వెయ్యి రూపాయలు పెరగొచ్చు. కాబట్టి హైదరాబాద్‌లో ఇళ్లు కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం. కొన్ని నిర్మాణ సంస్థలు ప్రత్యేక రాయితీలను కూడా కల్పిస్తున్నాయని వాటిని వినియోగించుకోవాలి. - ఎస్. రాంరెడ్డి, క్రెడాయ్ ఏపీ ప్రెసిడెంట్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సీఎండీ.