మార్కెట్లు ఫ్లాట్‌- ప్రభుత్వ బ్యాంక్స్‌ స్పీడ్‌ | Market ends flat- PSU Banks jumps | Sakshi

మార్కెట్లు ఫ్లాట్‌- ప్రభుత్వ బ్యాంక్స్‌ స్పీడ్‌

Dec 3 2020 4:01 PM | Updated on Dec 3 2020 4:08 PM

Market ends flat- PSU Banks jumps - Sakshi

ముంబై, సాక్షి: స్వల్ప ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ముగిశాయి. సెన్సెక్స్‌ స్వల్పంగా 15 పాయింట్లు బలపడి 44,633 వద్ద నిలిచింది. నిఫ్టీ మరింత అధికంగా 20 పాయింట్లు పుంజుకుని 13,134 వద్ద స్థిరపడింది. యూకే ప్రభుత్వం ఫైజర్‌ వ్యాక్సిన్‌ను అనుమతించడం, క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో జీడీపీ పుంజుకోనుందన్న అంచనాలతో మార్కెట్లు తొలుత దూకుడు చూపాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 44,953 వద్ద గరిష్టాన్ని తాకింది. వెరసి 45,000 పాయింట్ల మైలురాయికి చేరువైంది. ఈ బాటలో నిఫ్టీ సైతం 13,217 పాయింట్ల వరకూ ఎగసింది. ఇవి సరికొత్త గరిష్టాలుకావడం విశేషం!

ఎస్‌బీఐ కార్డ్స్ జోరు
ఆన్‌లైన్‌ సేవలలో అంతరాయం కారణంగా డిజిటల్‌, క్రెడిట్‌ కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేయమని ఆర్‌బీఐ ఆదేశించడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 2 శాతం నీరసించింది. అయితే ఎస్‌బీఐ కార్డ్స్‌ షేరు 5.5 శాతం జంప్‌చేసింది. కాగా.. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వ రంగ బ్యాంక్స్‌ దాదాపు 5 శాతం జంప్‌చేశాయి. మెటల్‌, మీడియా‌, ఆటో సైతం 3-1.7 శాతం మధ్య ఎగశాయి. మరోవైపు ఐటీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, హిందాల్కో, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, యూపీఎల్‌, కోల్‌ ఇండియా, టాటా స్టీల్ 7.3-2.6 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఆటో, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌, అల్ట్రాటెక్‌ 2-0.8 శాతం మధ్య డీలా పడ్డాయి. చదవండి: (టాటా కెమికల్స్‌- ఆర్‌క్యాపిటల్‌ జోరు)

బీవోబీ జూమ్
డెరివేటివ్‌ కౌంటర్లలో బీవోబీ, టాటా కెమ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, పీఎన్‌బీ, సెయిల్‌, పిరమల్‌, భారత్‌ ఫోర్జ్‌, పీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ 8-4.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క ఐసీఐసీఐ లంబార్డ్‌, బాష్‌, అదానీ ఎంటర్‌, బాలకృష్ణ, ఎంఆర్‌ఎఫ్‌ 3-1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8-0.7 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,987 లాభపడగా.. 929 మాత్రమే నష్టాలతో ముగిశాయి. చదవండి: (పసిడి, వెండి ధరల మెరుపులు)

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 357 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. అయితే డీఐఐలు రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement