Market indices
-
ప్రపంచ పరిణామాలే దిక్సూచి!
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు ఈవారం అంతర్జాతీయ సంకేతాలను అందిపుచ్చుకుంటూ పరిమిత శ్రేణిలో సానుకూల ధోరణితో స్థిరీకరణ దిశగా సాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇక అమెరికా ఫెడ్ ఎఫ్ఓఎంసీ మినిట్స్, జాక్సన్ హోల్ ఆర్థిక సదస్సులో చైర్మన్ జెరోమ్ పావెల్ వాఖ్యలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ఈ వారం ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడ్ కదలికలు తదితర సాధారణ అంశాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుందంటున్నారు. ‘‘అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఈక్విటీ మార్కెట్లకు స్వల్పకాలంలో ప్రధాన అడ్డంకిగా మారాయి. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 24,700, ఆపై 25,850 స్థాయిలను పరీక్షించవచ్చు. ముఖ్యంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే మరోసారి 25,000 స్థాయిని అందుకునే అవకాశం లేకపోలేదు. దిగువ స్థాయిలో 24,300–24,200 పరిధిలో తక్షణ మద్దతు ఉంది’’ అని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు. గత వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. సెన్సెక్స్ సెన్సెక్స్ 731 పాయింట్లు, నిఫ్టీ 174 పాయింట్లు లాభపడ్డాయి. అమెరికా ఆర్థిక భయాలు తగ్గడం, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలతో వారాంతాపు రోజైన శుక్రవారం సూచీలు దాదాపు 2 శాతం ర్యాలీ చేశాయి. ఎఫ్ఓఎంసీ వివరాలపై కన్ను... అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జూలైలో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ వివరాలు (ఫెడ్ మినిట్స్) 21న (బుధవారం) విడుదల కానున్నాయి. ఆర్థిక వ్యవస్థ సహా మందగిస్తున్న ధరల నేపథ్యంలో 2024 ద్వితీయార్ధంలో రేట్ల తగ్గింపునకు సంకేతాలిచ్చిన ఫెడ్ రిజర్వ్ సమావేశ అంతర్గత నిర్ణయాలు, అవుట్‌లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలపై దృష్టి అమెరికా మిస్సోరి రాష్ట్రంలోని కాన్సాస్ సిటీలో ఫెడరల్ రిజర్వ్ జాక్సన్ హోలీ ఎకనమిక్ సింపోజియం (ఆర్థిక సదస్సు) 23న (శుక్రవారం) జరగనుంది. ఇందులో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసగించనున్నారు. ఆర్థిక మాంద్యం భయాలు సన్నగిల్లడంతో పాటు జూలై సీపీఐ ద్రవ్యోల్బణ డేటా అంచనాలకు అనుగుణంగా వెలువడింది. ఈ నేపథ్యంలో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలపై పావెల్ అభిప్రాయం కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు జపాన్ జూన్ మెషనరీ ఆర్డర్లు సోమవారం, యూరోజోన్ జూలైన ద్రవ్యోల్బణ డేటా మంగళవారం, జపాన్ జూలై వాణిజ్య లోటు గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. మరుసటి రోజు గురువారం దేశీయ హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసెస్ పీఎంఐ గణాంకాలు వెల్లడి కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం జపాన్ జూలై ద్రవ్యోల్బణ డేటా పాటు భారత ఆర్బీఐ ఆగస్టు 16తో ముగిసిన వారపు ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలపై మార్కెట్ వర్గాలు ఫోకస్ చేయనున్నాయి.రూ.21,201 కోట్ల అమ్మకాలుభారత మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్ట్ ప్రథమార్థంలో రూ.21,201 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. యెన్ ఆధారిత ట్రేడింగ్ భారీగా తగ్గడం, అమెరికాలో ఆర్థిక మాంద్య భయాలు, చైనా ఆర్థిక మందగమన ఆందోళనలు భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు ఇందుకు ప్రధాన కారణాలు. ఇదే సమయంలో (ఆగస్టు 1–17 మధ్య) డెట్ మార్కెట్లో రూ.9,112 కోట్ల పెట్టుడులు పెట్టారు. కాగా దేశీయంగా క్యూ1 ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు, పాలసీ సంస్కరణలు, ఆర్థిక వృద్ధిపై ఆశలతో ఎఫ్ఐఐలు జూలైలో రూ.32,365 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘‘వేల్యుయేషన్ పరంగా భారత ఈక్విటీ మార్కెట్ అంత్యంత ఖరీదైనగా మారడంతో ఎఫ్ఐఐలు ఇక్కడి విక్రయాలు జరిపి చౌకగా మార్కెట్లలో కొనుగోళ్లు చేపడుతున్నారు. అమెరికా మాంద్య భయాలు తగ్గి బుల్లిష్ వైఖరి నెలకొన్న నేపథ్యంలోనూ ఈ పరిస్థితి మారడం లేదు’’ జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. -
రూ.2.19 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై: ఒక రోజు నష్టాల ముగింపు తర్వాత స్టాక్ సూచీలకు లాభాలొచ్చాయి. దేశీయ ఆర్థిక గణాంకాలు, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇన్వెస్టర్లను మెప్పించాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి అనూహ్య రికవరీ కూడా కలిసొచ్చింది. ఇన్వెస్టర్లు ఒమిక్రాన్ వేరియంట్ భయాలను విస్మరిస్తూ కొనుగోళ్లకు కట్టుబడటంతో బుధవారం సెన్సెక్స్ 620 పాయింట్లు పెరిగి 57,685 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 184 పాయింట్లు లాభపడి 17,167 వద్ద నిలిచింది. కనిష్ట స్థాయిల వద్ద బ్యాంకింగ్, ఆర్థిక షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. నవంబర్ నెల వాహన విక్రయాల గణాంకాలు ఆశాజనకంగా ఉండడంతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. గడిచిన మూడు సెషన్లలో కరిగిపోయిన మెటల్ షేర్లు మెరిశాయి. రిలయన్స్ షేరు రెండున్నర శాతం రాణించి ఇంధన షేర్లను ముందుండి నడిపించింది. ఇటీవల అమ్మకాల ఒత్తిడికిలోనవుతున్న చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ నెలకొనడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు ఒకశాతానికి పైగా దూసుకెళ్లాయి. అయితే ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో ఎనిమిది మాత్రమే నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 781 పాయింట్లు, నిఫ్టీ 230 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,766 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.3,467 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్‌లో రూపాయి ఇంట్రాడే నష్టాలను పూడ్చుకొని 22 పైసలు బలపడి 74.91 వద్ద స్థిరపడింది. సూచీల భారీ ర్యాలీతో బీఎస్ఈ ఎక్సే్చంజీలో రూ.2.19 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.259 లక్షల కోట్లకు చేరింది. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా... అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 301 పాయింట్ల లాభంతో 57065 వద్ద, నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 17104 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో సెన్సెక్స్ 781 పాయింట్లు ఎగసి 57846 వద్ద, నిఫ్టీ 230 పాయింట్లు ర్యాలీ చేసి 17,213 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. మెప్పించిన స్థూల ఆర్థిక గణాంకాలు... అంచనాలను మించుతూ భారత్ జీడీపీ సెప్టెంబర్ క్వార్టర్లో 8.4% వృద్ధి చెందింది. 8 కీలక మౌలిక పరిశ్రమల గ్రూప్ వృద్ధి అక్టోబర్‌లో 7.5%గా నమోదైంది. వరుసగా ఐదో నెలలోనూ జీఎస్టీ రూ. లక్ష కోట్ల మార్కును అధిగమించించాయి. నవంబర్‌లో రూ.1.31 లక్షల కోట్లు వసూలయ్యాయి. గణాంకాలు మెప్పించడం మార్కెట్‌కు ఉత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. చదవండి: కళ్లుచెదిరే లాభం.. లక్షకు ఏకంగా రూ.80 లక్షలు! -
ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా?
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలోని 50 షేర్ల సూచీ నిఫ్టీ... గతేడాది మార్చిలో నమోదు చేసిన 9,119 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 23 శాతం కంటే ఎక్కువే నష్టపోయింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ వాతావరణమంతా నిస్తేజంగా మారింది. దేశీ మదుపుదారులంతా ఆందోళనతో ఉన్నారు. కాకపోతే కొంత మంది ఎనలిస్టులు మాత్రం ఈ సమయంలోనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లలో గందరగోళం మాత్రం పోలేదు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయొచ్చా? లేక మరింత పతనం జరిగే వరకు ఆగాలా? అన్న విషయంపై ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ‘వివేకం’ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు వెలువడ్డాయి. వాటినిప్పుడు పరిశీలిద్దాం.. చౌకగా లభిస్తాయి.. మనం పుస్తకాల్లో చదువుకున్న దాని ప్రకారం మార్కెట్ సూచీలు నూతన గరిష్ట స్థాయిల నుంచి 20 శాతం మించి పతనమైతే ఇంచుమించు మాంద్యంలోకి జారినట్లే. గత 13 ఏళ్ల స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు సూచీలు మరింత పతనమయ్యాయనేది పరిశీలించాం. మార్కెట్లో భయాందోళన పరిస్థితులు ఉన్నప్పుడు కొనుగోలు చేసి.. ఇంకా పెరుగుతుందని ఆశపడేంత పరిస్థితులున్న సమయంలో విక్రయించాలని ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ రిటైల్ ఇన్వెస్టర్లకు ఎప్పుడూ సలహా ఇస్తుంటారు. మన ఇన్వెస్టర్లు కూడా చాలా ధైర్యవంతులని సూచీలు 20 శాతం పైగా పతనమై భయాందోళనలు ఉన్నప్పుడు కొనుగోలు చేస్తారనుకుంటున్నాం. ఇలాంటి సమయాల్లో మంచి పనితీరు కనబర్చే చాలా షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తాయి. ఒక్కసారే నష్టపోయారు.. షేర్ల కదలికలు కంపెనీని, రంగాన్ని బట్టి రకరకాలుగా ఉండొచ్చు. అందుకని వ్యక్తిగత షేర్ల జోలికి పోకుండా గత 13 ఏళ్లలో ఇండెక్స్‌లు ఎలా కదిలాయో పరిశీలిస్తే పలు ఆసక్తికరమైన అంశాలు గమనించవచ్చు. 2003 నుంచి ఫిబ్రవరి 19, 2016 వరకు గమనిస్తే నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 20 శాతానికిపైగా నష్టపోయి 929 రోజులు ఉంది. (వివరంగా పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది). ఈ సమయంలో కొనుగోలు చేసి... దీర్ఘకాలం వేచి ఉన్న వారు మంచి లాభాలు పొందారు. 20 శాతం పైగా నష్టపోయిన తర్వాత కొని రెండేళ్లు వేచి చూసిన వారికి 53 శాతం, మూడేళ్లు ఉన్న వారికి 74 శాతం, 5 ఏళ్లు ఉన్న వారికి 138 శాతం లాభాలొచ్చాయి. ఇలా కొనుగోలు చేసినప్పుడు కేవలం లాభాలే కాదు! నష్టాలొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ దీర్ఘకాలం వేచి ఉండే కొద్దీ ఈ నష్టం వచ్చిన సందర్భాలు తగ్గడం విశేషం. ఇన్వెస్ట్ చేసి రెండేళ్లు వేచి చూసినా 39 సార్లు నష్టాలు వచ్చాయి. అదే మూడేళ్లలో వేచి ఉన్న సందర్భాల్లో 26 సార్లు, 5 ఏళ్లు వేచి ఉంటే ఒకేసారి మాత్రమే నష్టం వచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే... పెట్టుబడి పెట్టిన సమయంతో సంబంధం లేకుండా ఈ సమయంలో ప్రతీ ఇన్వెస్టరు కనీసం ఒకసారి లాభాలొచ్చే అవకాశాన్ని పొందారు. తక్కువ సమయంలో.. ఈ దీర్ఘకాలిక లెక్కలపై సందేహాలు వ్యక్తం చేసేవారి కోసం... విశ్లేషణ సమయాన్ని మరింత కుదించాం. ఇప్పుడు 2008 నుంచి జనవరి, 2016 వరకు నిఫ్టీ కదలికలను తీసుకొని పరిశీలిద్దాం. ఈ సమయంలో రెండు అతిపెద్ద బేర్ ర్యాలీలు, ఒక మోస్తరు మార్కెట్ రికవరీ జరిగింది. ఇలాంటి సమయంలో కూడా నిఫ్టీ 20 శాతానికిపైగా పతనమైనప్పుడు కొనుగోలు చేసి రెండేళ్లు ఉంటే 35 శాతం, మూడేళ్లు ఉంటే 41 శాతం, ఐదేళ్లుంటే 56 శాతం లాభం వచ్చింది. ఒక ఏడాది దాటి ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ భారం ఉండదు కాబట్టి వార్షిక సగటు రాబడి కింద చూస్తే వరుసగా 17.5 శాతం, 13.7 శాతం, 11.2 శాతం పొందినట్లు లెక్క. ఈ రాబడి ప్రస్తుతం బ్యాంకు అందిస్తున్న వడ్డీరేట్లు 7-8 శాతం కంటే చాలా ఎక్కువ. స్థూలంగా చూస్తే మనం సరైన షేరును ఎంచుకుంటే బుల్ మార్కెట్లో బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడులను పొందే అవకాశాలు చాలా ఎక్కువని చెప్పొచ్చు. ఇలా షేర్లను ఎంచుకోవడం కష్టం అనుకున్న వారికిప్పుడు మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిఫ్టీ, సెన్సెక్స్ వంటి ఇండెక్స్ ఫండ్లను అందిస్తున్నాయి. వీటిని ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌గా పిలుస్తారు. వీటి రాబడి ఇంచుమించు సూచీల కదలికలకు అనుగుణంగానే ఉంటుంది. వీటిల్లో రూ.1,000 చొప్పున కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయి. 2008 నుంచి సూచీలు 20 శాతం కంటే నష్టపోయిన సందర్భాల్లో సిప్ ఇన్వెస్ట్మెంట్స్ రాబడి వరుసగా రెండేళ్లకు 13.5%, మూడేళ్లకు 9.51%, ఐదేళ్లకు 10.41%గా ఉంది. అంటే ప్రతినెలా రూ.10,000 ఇన్వెస్ట్ చేసిన వారికి రెండేళ్లలో రూ. 2.75 లక్షలు, మూడేళ్లలో రూ. 4.16 లక్షలు, ఐదేళ్లలో రూ.7.82 లక్షలు చొప్పున లాభాలు పొందారు. - వి.వి.కె.ప్రసాద్ వివేకం, ఫైనాన్షియల్ సర్వీసెస్