విజయవంతంగా మంగళ్ యాన్ ప్రయోగం: రాధాకృష్ణ
చెన్నై: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళ్యాన్ ప్రయోగం విజయవంతంగా సాగుతోందని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ మీడియాకు వెల్లడించారు. సెప్టెంబర్ 24 కల్లా అంగారక కక్ష్యలోకి మంగళయాన్ ప్రవేశిస్తుందని రాధాకృష్ణన్ తెలిపారు.
మంగళయాన్ ప్రయోగంలో ఇంకా 14% యాత్ర మాత్రమే మిగిలి ఉందని ఆయన తెలిపారు. గత ఏడాది నవంబర్ 5న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్ వీ బోర్డుపై నుంచి మార్స్ అర్బిటర్ ప్రయోగం ఇస్రో చేపట్టిన సంగతి తెలిసిందే. మార్స్ ఆర్బిటర్ ప్రయోగంపై మంగళవారం చెన్నైలో సమీక్ష నిర్వహించారు.