Mars tour
-
మార్స్ మెటీరియల్‌తో స్మార్ట్‌ఫోన్!
♦ రూ.651కే.. పదేళ్ల తరువాత డెలివరీ! ♦ రింగింగ్బెల్స్కు పేరడీ సైట్ న్యూఢిల్లీ: అత్యంత చవగ్గా రూ.251కే స్మార్ట్‌ఫోన్ ఇస్తామన్న రింగింగ్ బెల్స్ సంస్థను ఎద్దేవా చేస్తూ ఓ కొత్త వెబ్సైట్ వచ్చింది.పేరు ఫ్రీడమ్651.కామ్. అచ్చం ఫ్రీడమ్251.కామ్ సైట్‌లాగే తమది కూడా రూపొందించి అందులో ‘డజ్నాట్ రింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అని పేర్కొన్నారు. తమ ఫోన్ అంగారక గ్రహంపై దొరికే ముడిసరుకుతో తయారవుతుంది కాబట్టే రూ. 651కే ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు. 2025 నాటికి మనుషులు అంగారక గ్రహంపైకి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి.. అప్పుడు అక్కణ్నునంచి మెటీరియల్ తెప్పించుకుని ఫోన్లు తయారు చేస్తామని.. 2026 జూన్ 30న డెలివరీ చేస్తామని తెలిపారు. అంగారకుడిపై వెళ్లటానికి శివకాశిలోని స్టాండర్డ్ ఫైర్‌వర్క్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని.. రెండుకోట్ల రాకెట్లు కొని వాటి ద్వారా మనుషులను మార్స్ పైకి పంపుతామని, అందుకు రూ.651 కడితే సరిపోతుందన్నారు. ‘బయ్నవ్’ అని ఉండే చోట ‘డునాట్ బై’ అనే బటన్ ఉంచి, కస్టమర్ కేర్ నంబర్‌ను 0420-420420, 4200420 అని పేర్కొన్నారు. సంప్రదించాల్సిన చోట.. కస్టమర్ తాత వివరాలు, పొరుగింటి వివరాలు.. అడ్రస్ మార్స్పైనైనా ఇవ్వచ్చన్నారు. ఫామ్‌ను సబ్మిట్ చేయటానికి ప్రయత్నించవద్దని పేర్కొన్నారు. తమ గురించి పేర్కొన్న చోట ఇది కేవలం పేరడీ సైట్ అని చెప్పారు. -
తొలి దశ ఫైరింగ్ సఫలం.. మామ్ ఉపగ్రహ కక్ష్య పెంపు
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: అంగారక యాత్రకు బయల్దేరిన మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహం కక్ష్యను భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) విజయవంతంగా పెంచింది. ఇందుకోసం గురువారం వేకువజామున 1.17 గంటలకు చేపట్టిన ఫైరింగ్ విజయవంతమైంది. ఉపగ్రహంలో అమర్చిన 440 న్యూటన్ ద్రవ ఇంజన్‌ను 416 సెకంన్లపాటు మండించి కక్ష్య దూరాన్ని పెంచారు. 1,337 కిలోల బరువున్న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను ఈ నెల 5న 248.4 కి.మీ. పెరిజీ (భూమికి దగ్గరగా), 23,550 కి.మీ. అపోజీ (భూమికి దూరంగా)లో భూమధ్య రేఖకు 19.2 డిగ్రీల వాలులో భూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా 252 కి.మీ. పెరిజీ, 28,825 కి.మీ. అపోజీకి భూ దీర్ఘ వృత్తాకార కక్ష్యను పెంచినట్టు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రక్రియను బెంగళూరు సమీపంలోని పీన్యా వద్ద వున్న ఇస్ట్రాక్ సెంటర్ (ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం) నుంచి నిర్వహించారు. కక్ష్యలో ఉపగ్రహం క్షేమంగా ఉండటమే గాక సోలార్ ప్యానెళ్లు, మెయిన్ డిష్ ఆకృతిలోని యాంటెనాలు విజయవంతంగా విచ్చుకున్నాయి. ఇదేతరహాలో త్వరలో రెండోసారి కక్ష్య దూరాన్ని మరికొంత పెంచుతారు. ఇలా నవంబర్ 30 లోపు ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించి నాలుగుసార్లు భూ దీర్ఘ వృత్తాకార కక్ష్యను పెంచుతూ 300 కి.మీ. పెరిజీ, 2 లక్షల కి.మీ. అపోజీకి తీసుకెళ్లాక డిసెంబర్ 1 నాటికి అంగారకుడి కక్ష్య వైపు మిషన్ ప్రయాణిస్తుందని ఇస్రో ప్రకటించింది. మూత్రం పోయడం నుంచి బఠాణీ తినడం దాకా.. అంతరిక్ష శాస్త్రవేత్తల నమ్మకాల జాబితా ఇదీ.. చెన్నై: మూఢ నమ్మకాలు, విశ్వాసాలు.. వీరికి ఎవరూ అతీతులు కారు.. చివరికి అంతరిక్ష శాస్త్రవేత్తలు కూడా! వీరిలో కొందరివి నమ్మకాలైతే.. మరికొందరివి మూఢనమ్మకాలు.. ఎందుకంటే.. రష్యా వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేముందు ప్రయోగకేంద్రానికి తమను తీసుకొచ్చే బస్సు కుడివైపు వెనుక చక్రంపై మూత్రం పోస్తారట!! నాసా శాస్త్రవేత్తలు ప్రయోగ సమయంలో బఠాణీలు తింటారు. ఇక మన విషయానికొస్తే.. వెంకన్నపై మన శాస్త్రవేత్తలకు అపారవిశ్వాసం. అందుకే ప్రతి ప్రయోగ సమయంలోనూ తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకోవడం సంప్రదాయమైపోయింది. ఇక వ్యక్తిగత నమ్మకాల విషయానికొస్తే.. ఇస్రోలోని ఓ ప్రాజెక్ట్ డెరైక్టర్ ప్రయోగం రోజున తప్పనిసరిగా కొత్త షర్ట్ ధరించి వస్తారని ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఇస్రోకు సంస్థపరంగా ఇలాంటి విశ్వాసాలు లేవని చెబుతూనే.. పీఎస్ఎల్వీ శ్రేణిలో 13వ నంబర్ లేకపోవడాన్ని ఆయన ఎత్తి చూపారు. ‘పీఎస్ఎల్వీ-సీ12 పంపాక.. తర్వాత పంపాల్సింది సీ-13.. కానీ ఇస్రో ఆ సంఖ్యను వాడకుండా తర్వాత పీఎస్ఎల్వీ-సీ14ను ప్రయోగించింది’ అని ఆయన గుర్తు చేశారు. -
అంగారక యాత్ర.. ఆద్యంతం ఆసక్తికరం..
-
మార్స్.. మేమొస్తున్నాం..
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ25.. అంగారక యాత్రకు సర్వం సిద్ధం సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక అంగారక యాత్రకు సర్వం సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మార్స్ మిషన్‌కు ఆదివారం ఉదయం 6.08 నుంచి నిర్విఘ్నంగా కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. 44.5 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక, 1,337 కిలోలు బరువున్న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను మోసుకుంటూ మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు నౌక నింగికేసి దూసుకెళ్లనుంది. తద్వారా గ్రహాంతర ప్రయోగాలకు భారత్ శ్రీకారం చుట్టనుంది. సుమారు రూ.455 కోట్ల వ్యయంతో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. దీన్ని అక్టోబర్ 28నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారడంతో నవంబర్ 5కు వాయిదా వేశారు. అంగారకుడిపైకి వెళ్లాలంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. దాంతో రాకెట్ గమనాన్ని నిర్దేశించే రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం బెంగళూరు ఇస్ట్రాక్ సెంటర్లో 32 డీప్‌స్పేస్ నెట్వర్క్, అండమాన్ దీవుల్లోని మరో నెట్‌వర్క్‌తో పాటు నాసాకు చెందిన మాడ్రిడ్ (స్పెయిన్), కాన్బెర్రా (ఆస్ట్రేలియా), గోల్డ్‌స్టోన్ (అమెరికా)ల్లోని మూడు డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లతో పాటు మరో నాలుగు నెట్‌వర్క్‌ల సాయం కూడా తీసుకున్నారు. నాలుగో దశలో రాకెట్ గమనాన్ని తెలిపేందుకు దక్షిణ ఫసిపిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై తాత్కాలిక రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం భారత షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి అద్దెకు తీసుకున్న నలంద, యుమున నౌకలు ఆస్ట్రేలియా-దక్షిణ అమెరికా మధ్యలో నిర్దేశిత స్థలానికి చేరుకుని సిద్ధంగా ఉన్నాయి. నాలుగో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను ఆదివారం రాత్రి, రెండు దశల్లో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు. రాకెట్‌లోని అన్ని దశల్లో హీలియం, హైడ్రోజన్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిల్ వ్యవస్థలన్నింటినీ ప్రయోగానికి ఆరు గంటల ముందు జాగృతం చేయనున్నారు. 310 రోజుల ప్రక్రియ మార్స్ ఆర్బిటర్‌ను భూమికి దూరంగా భూ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండటంతో అత్యంత శక్తివంతమైన ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లను వినియోగిస్తున్నారు. రాకెట్‌కు తొలి దశలో ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో 75 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. 139 టన్నుల ఘన ఇంధనంతో 112.75 సెకండ్లలో 57.678 కిలోమీటర్ల ఎత్తులో మొదటి దశను పూర్తి చేస్తారు. 42 టన్నుల ద్రవ ఇంధనంతో 264.74 సెకన్లలో 132.311 కి.మీ. ఎత్తులో రెండో దశ, 7.5 టన్నుల ఘన ఇంధనంతో 583.6 సెకన్లలో 194.869 కి.మీ. ఎత్తులో మూడో దశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 2,619.72 సెకన్లకు 342.515 కి.మీ. ఎత్తులో నాలుగో దశను పూర్తి చేసేలా రూపకల్పన చేశారు. నాలుగో దశలో 2656.72 సెకన్లకు, భూ ధీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ఉపగ్రహాన్ని మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రవేశపెడుతుంది. అక్కడి నుంచి ఉపగ్రహంలోని ఇంధనం సాయంతో ఐదుసార్లు మండించి, దాన్ని అంగారకుడి వైపు మళ్లించే ప్రక్రియను చేపడతారు. అప్పటినుంచి దాదాపుగా 310 రోజుల తరవాత, అంటే 2014 సెప్టెంబర్ 28 నాటికి అంగారకుడి కక్ష్యలో 360‘80,000 కిలో మీటర్లు ఎత్తులో అంగారకుడి చుట్టూరా తిరుగుతూ పరిశోధనలను ప్రారంభిస్తుంది. తిరుమలలో ఇస్రో చైర్మన్ పూజలు సాక్షి, తిరుమల: మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంవోఎం) ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ సోమవారం వేకువజామున 2.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. ఎంవోఎం నమూనా ఉపగ్ర హం, దాన్ని మోసుకెళ్లే పీఎస్ఎల్వీ సీ25 నమూనా రాకెట్‌ను గర్భాలయ మూలమూర్తి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. తర్వాత వకుళామాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. సుదూర ప్రయోగమిది: రాధాకృష్ణన్ అరుణగ్రహంపై పరిశోధనల కోసం ఈ ప్రయోగం చేపట్టామని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. సుదూర ప్రయోగానికి షార్‌లో ఆదివారం కౌంట్‌డౌన్ ఆరంభమైందని, మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రయోగించనున్నామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ రెండో వారంలో జీఎస్ఎల్వీ-డీ5 సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు తెలిపారు. -
అరుణోదయ వేళాయె!
అంగారక యాత్ర.. ఆద్యంతం ఆసక్తికరం.. చందమామను దాటి గ్రహాంతరాలకు... భారత అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త అధ్యాయం.. ఉపగ్రహాలతో ఇస్రో ప్రయోగాల్లో మేలిమలుపు ఇంతకూ ఎందుకీ ప్రయోగాలు? సాధించేదేమిటి?.. అన్నేసి కోట్ల కిలోమీటర్ల ప్రయాణమెలా సాధ్యం? 15 అంతస్తుల నిర్మాణం నిట్టనిలువుగా పెకైగిరితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు మధ్యాహ్నం రెండింటికి టీవీ చూడండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మార్స్ ఆర్బిటర్ మిషన్ దాదాపు 144 అడుగుల ఎత్తై పీఎస్ఎల్వీ సీ-25 రాకెట్ ద్వారా నింగికెగురుతూ కన్పిస్తుంది. ఇంతకూ ఎందుకీ ప్రయోగం? దీని ద్వారా సాధించదలచిందేమిటి? ఈ ప్రశ్నలు ఎంత ఆసక్తికరమో, వీటికి జవాబులు కూడా అంతే ఆసక్తికరం. సౌరకుటుంబంలో భూమి తరవాత మనిషి నివసించేందుకు కొద్దో గొప్పో అవకాశాలున్న ఏకైక గ్రహమైన అంగారకుడిపై మన ఆసక్తి ఇప్పటిది కాదు. భూమితో అనేక సారూప్యతలుండటం దీనికి కారణం. భూమి నుంచి దాదాపు సగటున 22.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ అరుణ గ్రహంపైకి ఇస్రో ఈ ఏడాదే ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు కారణముంది. సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో అది ఈ ఏడాది భూమికి అతి దగ్గరగా రానుంది. నవంబరు-జనవరి మధ్యకాలంలో భూమికి కేవలం 5.4 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి వస్తుంది. రెండేళ్లకోసారి వచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఈ ప్రయోగం లక్ష్యం. అన్నీ సవ్యంగా సాగితే దాదాపు 300 రోజుల ప్రయాణం తరవాత, అంటే 2014 సెప్టెంబరు నెలాఖరుకల్లా అంగారకుడి కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రవేశిస్తుంది. లక్ష్యాలేమిటి? ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ మాటల్లో చెప్పాలంటే మన సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటడమే ప్రధాన లక్ష్యం. అమెరికా, రష్యా, చైనా, యూరప్ తదితరాలు ఇప్పటికే అంగారకుడిపై పరిశోధనలు చేపట్టిన నేపథ్యంలో మనకూ ఆ సామర్థ్యముందని నిరూపించేందుకు దీన్ని తలపెట్టారు. దీంతోపాటు అంగారకుడి వాతావరణంలో మీథేన్, నీటి ఉనికి గర్తింపు, కాలక్రమంలో అది నాశనమైన క్రమ నిర్ధారణ, ఉపరితల ఖనిజ సమ్మేళనాన్ని అంచనా వేయడం ఈ ప్రయోగపు శాస్త్రీయ లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. మూడు దశల్లో ప్రయాణం ఇంతటి సుదూర ప్రాంతాలకు ప్రయాణించగల ఉపగ్రహాలను, అందుకు అవసరమైన రాకెట్లను తయారు చేయడం, ప్రయోగించడం, వాటిని భూమి మీదినుంచే నియంత్రించడం ఆషామాషీ కాదు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అంగారక యాత్ర మొత్తం మూడు దశల్లో సాగుతుంది. ప్రయోగానంతరం భూమి చుట్టూ దాదాపు 5 సార్లు చక్కర్లు కొట్టిన తరువాత అంగారక కక్ష్య మార్గంలోకి ప్రవేశిస్తుందీ మార్స్ ఆర్బిటర్ మిషన్. ఈ చక్కర్లు కూడా దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో పద్ధతి ప్రకారం జరుగుతాయి. తొలి దశలో పెరిగీ (భూమికి అతి దగ్గరగా ఉండే దశ) దాదాపు 250 కి.మీ. ఉంటే.. అపొగీ(భూమికి అతి దూరంగా ఉండే దశ) దాదాపు 23,000 కిలోమీటర్లుంటుంది. తరవాతి 4 దశల్లో పెరిగీలో పెద్ద మార్పుండదు గానీ అపొగీ మాత్రం 40,000 నుంచి దాదాపు 2 లక్షల కి.మీ వరకు పెరుగుతుంది. ఈ దశల తరువాత ఉపగ్రహం అంగారక గ్రహ కక్ష్య మార్గంలోకి దూసుకెళ్తుంది. ఇక రెండోది హీలియో సెంట్రిక్ దశ. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు అంగారకుడుండే నిర్దిష్ట స్థానం ఆధారంగా ఈ దశ ప్రయాణం ఉంటుంది. ఇక అంగారక గ్రహ ప్రభావముండే ప్రాంతం (ఆ గ్రహం నుంచి 5.7 లక్షల కిలోమీటర్లు)లోకి ప్రవేశించడంతో మూడో దశ మొదలవుతుంది. వేగాన్ని తగ్గించుకుంటూ ఉపగ్రహం క్రమేపీ ఆ గ్రహ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. - సాక్షి, సైన్స్ బ్యూరో ఈ ఐదూ కీలకం.. మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహం మొత్తం బరువు దాదాపు 1,336 కిలోలు. దీంట్లో 860 కిలోలు ఇంధనం. మిగతా బరువులో దాదాపు 15 కిలోల బరువుతో 5 శాస్త్రీయ పరికరాలుంటాయి. అవి... 1. లైమన్ ఆల్ఫా ఫొటోమీటర్: నీరు నాశనమయ్యే క్రమంలో ఏర్పడే డ్యుటీరియం, హైడ్రోజన్ల నిష్పత్తిని అంచనా వేస్తుంది. గ్రహ వాతావరణ పై పొరల్లో ఈ నిష్పత్తిని గుర్తించడం ద్వారా అక్కడ నీరెలా నాశనమైందో అంచనా వేయొచ్చు. 2. మీథేన్ సెన్సర్: అరుణ గ్రహ వాతావరణంలోని మీథేన్‌ను గుర్తిస్తుంది. ఇది అత్యంత సూక్ష్మ స్థాయిలో, అంటే 100 కోట్లలో ఒక్క వంతుండే మీథేన్‌ను కూడా పసిగట్టగలదు. అంతేకాక అది రసాయన ప్రక్రియ ద్వారా పుట్టిందా, లేక ఒకప్పటి జీవరాశి నాశనమవడం ద్వారానా అన్నదీ నిర్ధారించుకోవచ్చు. 3. మార్స్ ఎక్సోస్ఫెరిక్ న్యూట్రల్ కాంపొజిషన్ అనలైజర్: అంగారక గ్రహ ఉపరితలానికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండే తటస్థ మూలకాల సమ్మేళనం ఏ విధంగా ఉందో విశ్లేషించేందుకు ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు. 4. మార్స్ కలర్ కెమెరా: ఎప్పటికప్పుడు మారిపోతూండే మార్స్ ఉపరితలాన్ని, వాతావరణాన్ని అర్థం చేసుకునేందుకు ఇది తీసే ఫొటోలు ఉపయోగపడతాయి. గ్రహ ఉపరితలం తాలూకు ఖనిజ నమ్మేళనాన్ని కూడా వాటి ద్వారా అర్థం చేసుకోవచ్చు. 5. థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్: పరారుణ కాంతి పరిధిలో అరుణ గ్రహం నుంచి వెలువడే ఉష్ణ ఉద్గారాలను గుర్తించేందుకు పనికొస్తుంది