Masood ajar
-
భారీ కుట్రకు పాక్ పన్నాగం.. మసూద్ విడుదల!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌పై ఉగ్రకుట్రకు పాల్పడేందుకు పాకిస్తాన్ వ్యూహాలు రచిస్తోంది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదాకు కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్‌ను భారీ దెబ్బతీయాలని ఆదేశం పావులు కదుపుతోన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజాద్‌ను జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్లు భారత ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దుల్లోని పంజాబ్, రాజస్తాన్, సియోల్‌కోట ప్రాంతాల్లో భారత బలగాలను అప్రమత్తం చేయాలని ఐబీ హెచ్చరించింది. భారత్‌పై ప్రతీకార చర్యలకు ఎప్పటి నుంచో కాలుదువ్వుతున్న పాక్.. అజార్‌ను విడుదల చేసి ప్రత్యేక వ్యూహాలు రచించినట్లు ఐబీ అనుమానం వ్యక్త చేస్తోంది. భారత్‌పై దాడికి పాల్పడేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు దిశానిర్థేశం చేయడానికి రెండురోజుల క్రితం మసూద్‌ను రహస్యంగా విడుదల చేశారని ఐబీ పేర్కొంది. కాగా అజాద్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా ఇటీవల అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలు పాక్‌పై ఒత్తిడి చేయడంతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నామని అంతర్జాతీయ సమాజం ముందు నటిస్తూనే పాక్ ఇలాంటి వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. కశ్మీర్ అంశం అనంతరం రెండు దేశాల మధ్య వాతావరణం యుద్ధ రీతిలో మాటల తూటాలు పేలిన విషయం తెలిసిందే. పాక్ మాటలకు భారత్ కూడా అదేరీతిలో ధీటైన సమాధానమే ఇచ్చింది. పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఓ అడుగుముందుకేసి కశ్మీర్‌కు తాము అండగా ఉంటామని, అవసరమైతే భారత్‌తో యుద్ధానికి కూడా సిద్ధంగా ఉంటామని గెంతులేశారు. భారత్‌పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరొందిన అజార్‌ను భారత్‌పై యుద్ధానికి ఉసిగొల్పేందుకు జైలు నుంచి విడుదల చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. భారత నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ, రక్షణ సిబ్బంది సరిహద్దులో భద్రతను మరింత పెంచింది. బలగాలను అప్రమత్తం చేసింది. -
కశ్మీర్‌పై ఉగ్రదాడికి కుట్ర..!
శ్రీనగర్: కశ్మీర్లో ఈద్ పండుగ సంబరాలపై లేదా స్వాతంత్య్ర దినోత్సవాలపై భారీ దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నుతున్నారనీ, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఏడుగురు ఉగ్రవాదుల బృందం భారత్‌లోకి ప్రవేశించిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. భారత ప్రభుత్వంపై నిందను మోపేందుకు మసీదుల్లో ప్రార్థనలపై ఈ దాడులు జరగొచ్చని తెలిపాయి. ప్రపంచ ఉగ్రవాదిగా ముద్రపడ్డ మసూర్ అజార్ ఈ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చీఫ్‌గా ఉన్నాడు. ఉగ్రవాద దాడి జరిపి వీలైనంత ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) జైషే మహ్మద్‌కు సూచించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ కేంద్రం సరిగ్గా వారం క్రితం సంచలన, చారిత్రక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. మరోవైపు ఆదివారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేస్తూ, కశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందనీ, సైనిక బలగంతో స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేయలేరని పేర్కొనడం గమనార్హం. అంతర్జాతీయంగా పాక్‌కు ముస్లిం దేశాలు సహా ఏ ఒక్కరూ మద్దతు తెలపకపోవడంతో, తాజాగా ఉగ్రవాద దాడికి దిగి, భారత్‌కు చెడ్డపేరు తీసుకురావాలని అనుకుంటోందని నిఘా వర్గాలు తెలిపాయి. బనిహల్, పిర్ పంజాల్ పర్వతాల దక్షిణ భాగం నుంచి ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారనీ, రాజౌరీ లేదా పూంచ్ జిల్లాల్లోకి వాళ్లు చొరబడి ఉంటారని చెప్పాయి. వ్యాపారులకు వెయ్యి కోట్ల నష్టం.. శ్రీనగర్‌లో ఆంక్షల కారణంగా వారం రోజుల్లో వ్యాపారులు రూ. వెయ్యి కోట్లు నష్టపోయుంటారని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఆంక్షల కారణంగా ప్రజలెవ్వరూ బటయకు రాకపోవడంతో రోజుకు రూ. 175 కోట్ల నష్టం వచ్చిందని కశ్మీర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యుడొకరు చెప్పారు. పండుగ నేపథ్యంలో ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. బ్యాంకులు, ఏటీఎంలు, కొన్ని మార్కెట్లు ఆదివారం తెరిచే ఉన్నాయి. -
మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించేదెప్పుడు?
ఐరాస తీరుపై భారత్ ఆగ్రహం న్యూయార్క్: జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించడంతో భద్రతామండలి అనుసరిస్తున్న తీరును భారత్ గర్హించింది. ఐక్యరాజ్యసమితిలో సోమవారం జరిగిన సదస్సులో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడారు. మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ ప్రతిపాదనకు చైనా మోకాలడ్డిందని..దీనిపై మండలి 9 నెలలు సమయం తీసుకుందన్నారు. కాగా, భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వ ప్రతిపాదనను పాకిస్తాన్ వ్యతిరేకించింది. -
ఉగ్రవాదుల ఆంక్షలపై ‘రహస్య వీటో’!
ఐరాసపై భారత్ మండిపాటు న్యూయార్క్: ఉగ్రవాదులపై ఆంక్షలు విధించాలన్న వినతిని రహస్య వీటోతో తిరస్కరించారని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిపై భారత్ మండిపడింది. 15 సభ్య దేశాల్లో ఎవరు ఎందుకు వ్యతిరేకించారో స్పష్టంచేయాలని భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మండలిలో జరిగిన చర్చలో డిమాండ్ చేశారు. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌పై నిషేధం విధించాలన్న భారత తీర్మానాన్ని చైనా అడ్డుకున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.