ఉగ్రవాదులపై ఆంక్షలు విధించాలన్న వినతిని రహస్య వీటోతో తిరస్కరించారని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిపై భారత్ మండిపడింది.
ఐరాసపై భారత్ మండిపాటు
న్యూయార్క్: ఉగ్రవాదులపై ఆంక్షలు విధించాలన్న వినతిని రహస్య వీటోతో తిరస్కరించారని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిపై భారత్ మండిపడింది. 15 సభ్య దేశాల్లో ఎవరు ఎందుకు వ్యతిరేకించారో స్పష్టంచేయాలని భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మండలిలో జరిగిన చర్చలో డిమాండ్ చేశారు. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌పై నిషేధం విధించాలన్న భారత తీర్మానాన్ని చైనా అడ్డుకున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.