massive protests
-
నీట్ సమరం
► కదం తొక్కిన ప్రతిపక్షాలు ► డీఎంకే నేతృత్వంలో భారీ నిరసన ► ప్రభుత్వాన్ని సాగనంపుదామని ప్రతిజ్ఞ ► వైద్య కౌన్సెలింగ్ ప్రారంభం ► నేటినుంచి జనరల్ కోటా సీట్ల భర్తీ నీట్ మినహాయింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్రోహన్ని ఖండిస్తూ డీఎంకే నేతృత్వంలో గురువారం చెన్నైలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఎంఎంకేల నేతలు ఈ వేదిక మీద నుంచి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపుదామని ప్రతిజ్ఞ చేశారు. ఇక, నీట్ అమల్లోకి రావడంతో కౌన్సెలింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సాక్షి,చెన్నై : రాష్ట్రంలో నీట్ మినహాయింపు అంటూ కేంద్రంతో కలిసి పళని ప్రభుత్వం ఆడిన నాటకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నీట్ అమల్లోకి రావడంతో స్టేట్ సిలబస్ విద్యార్థులకు వైద్య కోర్సులు అందని ద్రాక్షగా మారిందనే ఆరోపణలు బయలుదేరాయి. తమిళ విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ద్రోహం, మోసాన్ని ఖండిస్తూ డీఎంకే నేతృత్వంలో చెన్నై చేపాక్కం అతిథి గృహాల వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనకు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కేఆర్ రామస్వామి, సీపీఎం నేత జి.రామకృష్ణన్, సీపీఐ నేత నల్లకన్ను, వీసీకే నేత తిరుమావళవన్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, మనిద నేయ మక్కల్ కట్చి(ఎంఎంకే)నేత జవహరుల్లాలతో పాటుగా ప్రజా, కార్మిక, వర్తక సంఘాల నేతలు, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు తరలివచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండిస్తూ, దుమ్మెత్తిపోస్తూ నినాదాల్ని హోరెత్తించారు. కౌన్సెలింగ్‌కు శ్రీకారం నీట్ అమలుతో గురువారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం అయింది. తొలిరోజు రిజర్వుడ్ కోటా సీట్లను భర్తీచేశారు. శుక్రవారం నుంచి జనరల్ కోటా సీట్ల భర్తీ సాగనుంది. నీట్ అమల్లోకి రావడంతో ఈసారి సీబీఎస్సీ విద్యార్థులకు 1,310 సీట్లను కేటాయించారు. ఇదివరకు కేవలం 30 సీట్లు కేటాయించే వాళ్లు. ప్రస్తుతం నీట్ పుణ్యమా అదనంగా 1,280 సీట్లు అప్పగించాల్సిన పరిస్థితి. ఈ సీట్లు గతంలో స్టేట్ సిలబస్ విద్యార్థులకు దక్కేవి. అయితే, ఇప్పుడు ఆ సీట్లు దూరం అయ్యాయి. ఈ ఏడాది స్టేట్ సిలబస్ విద్యార్థులకు 2,224 సీట్లను కేటాయించారు. ఒకటో ర్యాంక్ నుంచి 402 ర్యాంక్ వరకు జనరల్ కోటా సీట్ల భర్తీ శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు జరగనుంది. ఇందు కోసం ఓమందూరు ఎస్టేట్‌లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సెలవు రోజుల్లోనూ కౌన్సెలింగ్ జరగనుంది. ఇక, బ్యాంకులకు వరుస సెలవులు కావడంతో విద్యార్థులు నగదు రూపంలో ఫీజుల్ని చెల్లించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. సాగనంపుదాం ఈ నిరసనలో ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రసంగిస్తూ, తమిళనాడుకు పెను ముప్పు ఎదురు కాబోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ముప్పు నుంచి తమిళ ప్రజల్ని, రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు భారీఎత్తున పోరాటాల్ని సాగించాల్సిన అవసరం ఉందన్నారు. డీఎంకే కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు స్టాలిన్ ప్రసంగిస్తూ, ఈ పాలకుల అవివేకం విద్యార్థులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. తమ హయాంలో విద్యార్థులకు దోహదకారిగా ఉండే విధంగా విద్యావిధానాల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగామని వివరించారు. అయితే, ఇప్పుడున్న వాళ్లు రాష్ట్రాన్నే కేంద్రానికి తాకట్టు పెట్టారని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తప్పులు చేసింది కాకుండా, నిందల్ని తమమీదకు నెట్టే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. వ్యక్తిగత, రాజకీయ స్వలాభం కోసం పాకులాడుతున్న ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. దొడ్డి దారిలో గద్దెనెక్కాలన్న ఆశ తమకు లేదని, ప్రజా స్వామ్య పద్ధతిలోనే ప్రజలు, అన్ని వర్గాలతో కలిసి ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నారు. యువతరం మేల్కొనాలని , ఈ ప్రభుత్వాన్ని సాగనంపే విధంగా ముందుకు అడుగులు వేయాలని పిలుపు నిచ్చారు. -
ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!
10వేల మంది శరణార్థులను నియమించుకుంటాం స్టార్‌బక్స్ సీఈవో ప్రకటన ముస్లిం మెజారిటీ దేశాల నుంచి శరణార్థుల రాకను నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన ఉత్తర్వులను ఆ దేశ కార్పొరేట్ దిగ్గజాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో 75 దేశాల్లో 10వేలమంది శరణార్థులను తమ ఉద్యోగులుగా నియమించుకోవాలనుకుంటున్నామని స్టార్‌బక్స్ కంపెనీ సీఈవో హోవర్డ్ షుల్ట్జ్ ప్రకటించారు. అమెరికాకు రాకుండా శరణార్థులపై ట్రంప్ నాలుగు నెలల తాత్కాలిక నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. అలాగే సిరియాతోసహా ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి పర్యాటకుల రాకను ఆయన పూర్తిగా నిషేధించారు. ఉగ్రవాద దాడుల నుంచి అమెరికాను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయంపై ఇంటా, బయటా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ నిర్ణయం వల్ల ప్రభావం పడే కార్మికులకు అండగా ఉండేందుకు పూర్తిగా కృషి చేస్తామని షుల్ట్జ్ ఆదివారం తన కంపెనీ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. వివిధ దేశాల్లో అమెరికా ఆర్మీ అభ్యర్థన మేరకు భద్రతా దళాలకు దుబాసీలుగా, సహాయక సిబ్బందిగా సేవలు అందించిన వ్యక్తులకు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తానని ఆయన తెలిపారు. ఒబామా హెల్త్ కేర్ ప్రజాబీమా పథకాన్ని ట్రంప్ ఎత్తివేసిన నేపథ్యంలో కంపెనీ ఉద్యోగులకు తామే ఆరోగ్యబీమా అందిస్తామని షూల్ట్జ్ స్పష్టం చేశారు. షూల్ట్జ్ గతంలోనూ పలు అంశాలపై గట్టిగా గళమెత్తి పతాక శీర్షికలకు ఎక్కారు. దుకాణాలకు తుపాకులు తీసుకొని రావొద్దని, జాతుల మధ్య సంఘర్షణ గురించి చర్చించాలని ఆయన గతంలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా? ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి! వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా 'ట్రంప్‌తో భయమొద్దు.. మేమున్నాం' -
ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!
అమెరికాలోకి ముస్లింల రాకను నిషేధిస్తూ తాను జారీచేసిన ఆదేశాలపై దేశమంతటా ఆందోళనలు వెల్లువెత్తడంతో.. తన స్వరాన్ని కాస్తా మారుస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 'స్పష్టంగా చెప్పాలంటే.. ఇది ముస్లింలపై నిషేధం కాదు. మీడియా అసత్యాలను ప్రచారం చేస్తోంది. ఇది మతానికి సంబంధించిన అంశం కాదు. ఇది ఉగ్రవాదం, దేశ భద్రతకు సంబంధించిన అంశం' అని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. సిరియా నుంచి శరణార్థుల రాకను నిలిపేస్తూ, ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి ప్రజల రాక నిషేధిస్తూ ట్రంప్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్ తాజా ప్రకటనలో ఉన్న ప్రతి పదం, పంక్తి కూడా పచ్చి అబద్ధమేనని అమెరికా మీడియా తెగేసి చెప్పింది. ట్రంప్ ప్రకటనను ఏకీపారేస్తూ సీఎన్ఎన్ ఓ కథనం ప్రచురించింది. ఇది ముస్లింలపై నిషేధమే..: ఈ విషయాన్ని ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ రూడీ గిలియానీ అంగీకరించారు కూడా. 'మీకు నేను పూర్తి కథను చెప్తాను. ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటించేటప్పుడు ఇది ముస్లింలపై నిషేధమని చెప్పారు. ఆయన నాకు ఫోన్ చేసి.. కమిషన్‌ను ఏర్పాటుచేయండి. దీనిని చట్టబద్ధంగా అమలు చేసేందుకు నాకు మార్గాన్ని చూపండి అని కోరారు' అని రూడీ వెల్లడించారు. ఇది మతానికి సంబంధించిన అంశమే: క్రిష్టియన్ బ్రాడ్కాస్ట్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ ట్రంప్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. నిషేధించిన దేశాల నుంచి అమెరికాలోకి క్రైస్తవుల రాకను అనుమతిస్తామని, కానీ ముస్లింలను రానివ్వబోమని ఆయన తేల్చిచెప్పారు. ప్రస్తుతమున్న అమెరికా శరణార్థి పథకం ప్రకారం 'ముస్లింలను మాత్రమే రానిస్తున్నారు. క్తైస్తవులకు అసాధ్యంగా మారింది' అని ట్రంప్ అన్నారు. కానీ ఇది కూడా అబద్ధమే. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం 2016లో అమెరికాకు 37,521 మంది క్రైస్తవులు రాగా, 38,901 మంది ముస్లింలు వచ్చారు. ఇది ఉగ్రవాదానికి సంబంధించినది కాదు: ఇది ఉగ్రవాదానికి సంబంధించిన అంశమని ట్రంప్ చెప్తున్నారు. కానీ గడిచిన 15 ఏళ్లలో 7 లక్షల 84 వేలమంది శరణార్థులు అమెరికాలో స్థిరపడగా.. అందులో ముగ్గురు మాత్రమే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి అరెస్టు అయ్యారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 1975 నుంచి 2016 వరకు 32,52,493 మంది శరణార్థులు అమెరికాలో ఆశ్రయం పొందగా.. అందులో 20మంది మాత్రమే ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగం పంచుకున్నారు. ఆ 20 మందిలో ముగ్గురు మాత్రమే విజయవంతమై.. జరిపిన ఉగ్రవాద దాడిలో ముగ్గురు చనిపోయారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం కాదు: 1975 నుంచి 2016 వరకు అమెరికా గడ్డపై నిషేధానికి గురైన ఈ ఏడు దేశాల పౌరుల చేతిలో ఒక్క అమెరికన్ కూడా చనిపోలేదు. కానీ, ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థపై పోరాటంలో అమెరికాకు అత్యంత కీలక మిత్రదేశంగా ఉన్న ఇరాక్‌పై కూడా నిషేధం విధించారు. దీంతో ఆ దేశం ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికన్లను ఇరాక్‌లో అడుగుపెట్టనివ్వబోమని తెగేసి చెప్పింది. దీంతో ఇస్లామిక్ స్టేట్ పై అమెరికా తలపెట్టిన యుద్ధం గొప్ప ప్రమాదంలో పడింది. ఐఎస్ఐఎస్కు వ్యతిరేకంగా బలంగా పోరాడుతున్న ఇరాకీలను ఇలా ఏకాకులను చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని అమెరికా కౌంటర్ టెర్రరిజం మాజీ అధికారి డానియెల్ బెంజమిన్ విస్మయం వ్యక్తం చేశారు. స్పష్టంగా చెప్పాలంటే.. ఇది ముస్లింలపై నిషేధమే. మతానికి సంబంధించిన అంశమే. ఇది ఉగ్రవాదానికి, దేశ భద్రతకు సంబంధించిన అంశం కానేకాదని సీఎన్ఎన్ పేర్కొంది. -
రచ్చ రచ్చగా మారుతున్న సోలార్ స్కామ్