MasterCards
-
Ajay Banga ప్రపంచబ్యాంకు నూతన అధ్యక్షుడు: బైడెన్ ప్రతిపాదన
వాషింగ్టన్: ప్రపంచబ్యాంకు అధ్యక్షుడుగా భారత సంతతికి చెందిన, మాస్టర్‌కార్డ్ మాజీ సీఈఓ అజయ్ బంగా నామినేట్ అయ్యారు. ప్రస్తుత చీఫ్ డేవిడ్ మాల్పాస్ ముందస్తుగా పదవీ విరమణ చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో మాస్టర్‌కార్డ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ బంగాను ప్రపంచబ్యాంకుకు నాయకత్వం వహించేందుకు నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ గురువారం తెలిపారు. అమెరికా ప్రపంచ బ్యాంక్ అతిపెద్ద వాటాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. "వాతావరణ మార్పులతో సహా మన కాలంలోని అత్యంత అత్యవసర సవాళ్లను పరిష్కారానికి సంబంధించి పబ్లిక్-ప్రైవేట్ వనరులను సమీకరణలో బంగాకు అపారమైన అనుభవం ఉందని బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. క్లిష్ట సమయంలో ఉన్న ప్రపంచ బ్యాంకును లీడ్ చేసేందుకు అజయ్ ప్రత్యేక అర్హతలున్నాయని ఆయన ప్రశంసించారు. వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్ ఎంపిక కోసం అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మార్చి 29 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. మహిళా అభ్యర్థులకు ఎక్కువ ప్రోత్సాహనిస్తున్నట్టు బ్యాంక్ పేర్కొంది. దీనికితోడు మరొక ప్రధాన వాటాదారు అయిన జర్మనీ 77 ఏళ్ల చరిత్రలో బ్యాంక్‌కు ఎన్నడూ మహిళ నాయకత్వం వహించనందున ఉద్యోగం మహిళకే చెందాలని పేర్కొంది. అజయ్ బంగా 1959 నవంబర్ 10 న పూణేలోని ఖడ్కీ కంటోన్మెంట్లో జన్మించారు. అజయ్ బంగా. ఢిల్లీ యూనివర్శిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఆనర్స్) డిగ్రీ, అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి మేనేజ్మెంట్లో పీజీపీ పట్టా పొందాడు.భారత ప్రభుత్వం 2016లో బంగాకు పద్మశ్రీ పౌర గౌరవాన్ని అందించింది. అజయ్ బంగా ప్రస్తుతం ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. అతను గతంలో మాస్టర్ కార్డ్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సేవలందించారు.12 సంవత్సరాల తరువాత డిసెంబర్ 2021లో మాస్టర్ కార్డ్ కు పదవీ విరమణ చేసారు. కాగా పదవీకాలం ముగిసేందుకు మరో ఏడాది సమయం ఉండగానే ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ రాజీనామా చేయబోతున్నట్లు ఈనెల (ఫిబ్రవరి) ప్రకటించారు.జూన్ నుంచి బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. -
ఇకపై బ్యాంకుల్లో క్రిప్టో కరెన్సీపై ట్రాన్సాక్షన్లు, మాస్టర్ కార్డ్ గ్రీన్ సిగ్నల్
Mastercard Allow Cryptocurrency Purchases: క్రిప్టోకరెన్సీ పెరిగిందంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. పడిందంటే పాతాళం అంచుల దాకా పడిపోతుంది. మళ్లీ అంతలోనే రాకెట్లా ఆకాశానికి రివ్వున దూసుకెళ్లిపోతుంది. అంత బజ్ క్రియేట్ చేస్తున్న ఈ క్రిప్టో కరెన్సీలపై పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. అయితే వారిలో మరింత జోష్‌ను నింపేందుకు ప్రముఖ ఫైనాన్షియల్ దిగ్గజం మాస్టర్ కార్డ్ బ్యాంకుల్లో డెబిట్ కార్డ్, క్రిడెట్ కార్డ్‌ల నుంచి క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. మాస్టర్ కార్డ్ అనేది బ్యాంకులకు, వినియోగదారులకు మధ్య వారధిగా నిలుస్తోంది. మాస్టర్ కార్డ్ అందిస్తున్న కార్డ్‌ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగదారులు బ్యాంకుల్లో ఆర్ధిక లావాదేవీల్ని నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా మాస్టర్ కార్డ్ క్రిప్టో కరెన్సీ లావాదేవీలు నిర్వహించే సంస్థ 'బక్ట్' తో ఒప్పొందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా బ్యాంకుల్లో మాస్టర్ కార్డ్ ద్వారా క్రిప్టో కరెన్సీలపై లావాదేవీలు నిర్వహించేందుకు వీలు కల్పించింది. ఆయా బ్యాంకుల నుంచి బక్ట్లో క్రిప్టో కరెన్సీలపై లావాదేవీలు నిర్వహించినందుకు మాస్టర్ కార్డ్ రివార్డ్ పాయింట్లను అందించనుంది. ప్రాధమికంగా మాస్టర్ కార్డ్ గ్లోబల్ పేమెంట్స్ నెట్వర్క్ కు చెందిన బ్యాంకుల్లో మాత్రమే క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై క్రిప్టో లావాదేవీల్ని నిర్వహిస్తే రివార్డ్ పాయింట్లను అందిస్తున్నట్లు మాస్టర్‌కార్డ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షెర్రీ హేమండ్ సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు వినియోగదారులకు క్రిప్టో లావాదేవీలు మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. వినియోగదారులు, బ్యాంకులు, ఫిన్‌టెక్, వ్యాపారులు ఇలా ఎవరైనా బక్ట్ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానం అవ్వడం ద్వారా క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేయడం, అమ్మే వెసలుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇండియాలో మాస్టర్ కార్డ్‌లపై నిషేధం ఈఏడాది జూలై 14న ఆర్బీఐ స్థానిక డేటా నిల్వ నిబంధనలను పాటించనందుకు కొత్త క్రెడిట్, డెబిట్,ప్రీపెయిడ్ కార్డులను జారీ చేయకుండా మాస్టర్ కార్డ్‌పై నిషేదం విధించింది. జూలై 22, 2021 నుండి అమల్లోకి వచ్చేలా మాస్టర్ కార్డ్ కొత్త దేశీయ కస్టమర్లను తన కార్డ్ నెట్‌వర్క్‌కు జోడించకుండా సెంట్రల్ బ్యాంక్ నిషేధించింది. డేటా స్థానికీకరణ నియమాల ప్రకారం, కంపెనీ భారతీయ వినియోగదారుల డేటాను దేశంలోనే ఉంచాల్సిన అవసరం ఉందని వివరించింది. చదవండి: అదృష్టం అంటే వీళ్లదే..వెయ్యి పెట్టుబడితో 3.45 లక్షలు సంపాదించారు -
ఫార్చూన్ 50 వ్యాపారవేత్తల్లో.. ఇద్దరు భారతీయులు
న్యూయార్క్: ఈ ఏడాదికి సంబంధించి ఫార్చూన్ మ్యాగజైన్ టాప్ 50 వ్యాపారవేత్తల్లో ఇద్దరు ప్రవాస భారతీయులు చోటు దక్కించుకున్నారు. మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్ బంగా, వర్క్‌డే సహ-సీఈవో అనిల్ భూశ్రీ ఇందులో ఉన్నారు. బంగా 15వ స్థానాన్ని, భూశ్రీ 37వ స్థానాన్ని దక్కించుకున్నారు. క్యాష్‌లెస్, మొబైల్ లావాదేవీలు పెరుగుతుండటం మాస్టర్‌కార్డ్ వ్యాపారం పెరగడానికి దోహదపడుతున్నాయని, ప్రస్తుతం 735 డాలర్లుగా ఉన్న షేరు ధర 1,000 డాలర్లకు కూడా ఎగిసే అవకాశం ఉందని ఫార్చూన్ పేర్కొంది. ఇక, భూశ్రీ సహ-సీఈవోగా వ్యవహరిస్తున్న వర్క్‌డే సంస్థ క్లౌడ్ ఆధారిత ఆర్థిక సేవలు, మానవ వనరులకు సంబంధించిన సాఫ్ట్వేర్ సర్వీసులు అందిస్తోంది. 2013లో వర్క్‌డే అమ్మకాలు భారీగా పెరగడంతో పాటు షేరు ధర .. పోటీ సంస్థ ఒరాకిల్ను మించి ఎగిసింది. అంచనాలకు భిన్నంగా వ్యవహరిస్తూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న వారికి ఈ జాబితాలో చోటు దక్కింది. ఎలక్ట్రిక్ కార్లు తయారుచేసే టెస్లా మోటార్స్ సీఈవో ఎలాన్ మస్క్ ..ఫార్చూన్ 50 జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా నిల్చారు. విప్లవాత్మకమైన చర్యలతో ఆటోమొబైల్, ఇంధన రంగాల్లో ఇతర సంస్థలకు మస్క్ సవాల్ విసురుతున్నారని ఫార్చూన్ పేర్కొంది. ఇన్వెస్ట్మెంట్ గురు, బెర్క్‌షైర్ హాథ్‌వే చైర్మన్ వారెన్ బఫెట్ రన్నరప్‌గా నిల్చారు. మరోవైపు, వాషింగ్టన్ పోస్ట్ పత్రికను కొనుగోలు చేయడం తదితర సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆరో స్థానంలో ఉన్నారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ 8వ స్థానం దక్కించుకున్నారు. వివిధ విభాగాలకు సంబంధించి బెస్ట్ పురస్కారాలను కూడా ఫార్చూన్ ప్రకటించింది. దీని ప్రకారం బెస్ట్ న్యూ ఓనర్‌గా బెజోస్ నిలవగా, బెస్ట్ టర్న్‌ఎరౌండ్ సంస్థగా నెట్‌ఫ్లిక్స్ నిల్చింది. ఉత్తమ బిజినెస్ స్కూల్‌గా హార్వర్డ్, అత్యధిక పర్యాటకులు సందర్శించే బెస్ట్ సిటీగా బ్యాంకాక్ ఉన్నాయి.