math
-
గంగారాం మఠం పిటిషన్ కొట్టివేసిన ఐడీటీ కోర్టు
సాక్షి, తిరుపతి: గంగారాం మఠం పిటిషన్‌ను ఐడీటీ కోర్డు సోమవారం కొట్టివేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. 1998 నుంచి జరుగుతున్న కేసులో తుది తీర్పు వెల్లడించింది. టైటిట్ డిడ్ ప్రకారం ఎస్వీ, వేదిక్, వెటర్నరీ యూనివర్సిటీ, పద్మావతి గెస్ట్‌హౌస్‌తో సహా ఆస్తులు టీటీడీ ఆధీనంలో ఉండనున్నాయి. -
తికమక పెట్టిన గణితం ‘90’ వస్తే ఐఐటీ సీటు!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విద్యార్థులను ఈసారి గణితం ఎక్కువగా తికమక పెట్టింది. రసాయన శాస్త్రం నుంచి మంచి స్కోర్ చేయవచ్చని, ఫిజిక్స్‌తో మధ్యస్తంగా మార్కులు తెచ్చుకునే వీలుందని విద్యారంగ నిపుణులు తెలిపారు. ప్రశ్నల తీరును పరిశీలిస్తే 85 నుంచి 90 మార్కులు జనరల్‌కు కటాఫ్ ఉంటుందని, ఈడబ్ల్యూఎస్‌కు 68–72, ఓబీసీకి 68–75, ఎస్సీఎస్టీకి 50 మార్కులు కటాఫ్‌గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఖరగ్‌పూర్ ఐఐటీ నేతృత్వంలో ఆదివారం ఉదయం, సాయంత్రం రెండు షిప్టులు, రెండు పేపర్లుగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరిగింది. డైరెక్ట్ ప్రశ్నలతో ఊరట 11, 12 సత్సమానమైన క్లాసుల నుంచే కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలొచ్చాయి. ఎన్సీఈఆర్టీ విధానం ప్రకారం డైరెక్ట్ (ఎలాంటి మెలిక లేకుండా) ప్రశ్నలు రావడం విద్యార్థులకు ఊరట కలిగించింది. భౌతిక రసాయన శాస్త్రంలో టైట్రేషన్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, థర్మోడైనమిక్ ప్రశ్నలు, ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి జంతువులు, బయోమాలిక్యులస్, ఆక్సిజన్ కంటెయినింగ్ కాంపౌండ్స్ నుంచి ప్రశ్నలొచ్చాయి. భౌతికశాస్త్రంలో 11వ తరగతికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్, రొటేషన్ అండ్ మోడ్రన్ ఫిజిక్స్ నుంచి మధ్యస్తంగా ప్రశ్నలున్నాయి. మ్యాథమెటిక్స్ విద్యార్థులకు తలనొప్పి తెప్పించిందని గణిత శాస్త్ర అధ్యాపకులు విశ్లేషిస్తున్నారు. కొన్ని తేలికైన ప్రశ్నలే ఇచ్చినా, మేట్రిసిస్, డిటర్మినెంట్స్, ఫంక్షన్స్, కంటిన్యుటీ అండ్ డిఫరెన్ష్యబులిటీ, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్తో పాటు పలు చాప్టర్ల నుంచి ప్రశ్నలిచ్చారు. కొన్ని చాప్టర్ల నుంచి ఇచ్చిన ప్రశ్నలు గందరగోళపరిచేలా ఉన్నాయని విద్యా రంగ నిపుణులు తెలిపారు. -
మఠాన్నే మడతెట్టేయాలని..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : నగరంలోని కొత్త వెంకోజిపాలెంలో ఉన్న సాధు మఠం భూములపై కొన్నేళ్లుగా పెద్దల కన్నుపడింది. నగరంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో హైవేకు ఆనుకుని కీలక ప్రాంతంలో ఉన్న ఈ మఠంపై పట్టు సాధించడానికి ధార్మికవేత్తలు మొదలు టీడీపీ, బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఆధ్యాత్మిక సేవ తప్ప రాజకీయంగా, ఆర్ధికంగా పెద్దగా ప్రాబల్యం లేని మఠం స్వాములపై ప్రలోభాల వల విసిరారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఆధ్యాత్మిక వేత్త సాధు మఠం స్వాములను కలిసి.. ‘ఇంత విలువైన స్థలాలను ఖాళీగా ఉంచేస్తే ఎలా.. చుట్టూ ప్రహరీ కట్టి వాణిజ్య సముదాయం నిర్మిస్తే ఆదాయం వస్తుంది. మా పీఠం, మీ మఠం కలిసి అలా వాణిజ్య అవసరాలకు కొంత స్థలం వినియోగిద్దాం’.. అని సూచించారు. మఠం స్వాములు స్పందిస్తూ ‘వద్దు స్వామీ.. గురుపరంపరలో భాగంగా వచ్చిన భూములను ఆథ్యాత్మిక అవసరాల కోసమే వినియోగిస్తామని’ చెప్పి ఆయనకో నమస్కారం పెట్టేశారు. కొన్నాళ్ల కిందట జిల్లా తెలుగుదేశం పార్టీ కీలక ప్రజాప్రతినిధి సతీమణి.. సాధు మఠం స్వాములను పిలిపించుకున్నారు. ‘ఏడెకరాలకు పైగా స్థలముంది కదా.. అందులో రెండు ఎకరాలను మా ట్రస్ట్‌కు ఇవ్వండి.. మేం కూడా సర్వీస్ చేస్తాం. రాజకీయంగా, ఆర్ధికంగా మీకు అండగా ఉంటాం.. ఇక మీ జోలికి ఎవ్రూ రారు’.. అని ఓ ప్రతిపాదన చేశారు. దానికి కూడా స్వాములు అంగీకరించలేదు. ఓ దండం పెట్టి బయటకొచ్చేశారు. ఇక ఇటీవల బీజేపీ ప్రతినిధి, పార్టీ నేతలు కలిసి.. ‘మీపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయి కదా.. మేం అండగా ఉంటాం.. ఓ కమిటీ వేయండి.. అందులో మమ్మల్ని సభ్యులుగా చేయండి.. మీ జోలికి ఎవరైనా వస్తే మేం చూసుకుంటాం’.. అని సలహా ఇచ్చారు. మఠంలో రాజకీయ జోక్యం వద్దంటూ స్వాములు దీన్ని కూడా తిరస్కరించారు. ఇలా చాలామంది అడిగారు.. కాదంటే ఊరకున్నారు.. దాంతో ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్టైలే వేరు. తన ఇలాకాలో విలువైన స్థలం సాధువులపరమైతే ఎలా.. తనకేమీ ఉపయోగం లేకుంటే ఎందుకు.. అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా సామాజికవర్గ కోణంలో స్థానికులను రెచ్చగొట్టారు. ఇందుకు తన అనుచరుడు కాళ్ల శంకర్‌ను పావుగా వాడుకున్నారు. శ్మశానానికి దారి పేరిట వివాదం రేపారు. అధికారులు జోక్యం చేసుకుని సరిదిద్దలేని ప్రత్యేక పరిస్థితి సృష్టించారు. మరోవైపు దేవాదాయ శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి మఠం ప్రాంగణంలోని దేవాలయాలు సాధువులపరం కాకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. వెలగపూడి ఓకే అంటేనే.. భూములను సాధు మఠానికి అప్పగించే సమయంలో దాతలు ఆ భూముల్లో దేవాలయాలు నిర్మించి ప్రజలకు జ్ఞానతత్వాన్ని అందించాలని ఆకాంక్షించారు. ఆ మేరకు అక్కడ దేవాలయాలు నిర్మించి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆశ్రమ నిర్వహణకు వినియోగిస్తున్నారు. కానీ కొన్నేళ్ల కిందట మఠం ప్రాంగణంలోని ఆలయాలను దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడంతో మఠం ప్రతినిధులు ఎండోమెంట్ ట్రిబ్యునల్‌కు వెళ్లారు. సాధుమఠంలో దేవాదాయ శాఖ జోక్యం వద్దని ట్రిబ్యునల్ స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పుపై దేవాదాయ అధికారులు హైకోర్టుకు వెళ్లారు. అక్కడా మఠానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పు అమలుకాకపోవడంతో స్వాములు కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉంది. కాగా 2017లో దేవాదాయ శాఖ అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ మఠాన్ని సందర్శించారు. ఆశ్రమ నిర్వహణను పరిశీలించి ఆలయాల ఆదాయం మఠానికే చెందాలని భావించారు. ఆ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 66 విడుదల చేశారు. కానీ నేటికీ ఆ జీవో అమలు కాలేదు. దీనిపై ఇప్పటికీ మఠం ప్రతినిధులు, పీఠాధిపతి స్వామి పూర్ణానంద సరస్వతి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో అమరావతి వెళ్లి దేవాదాయశాఖ ఉన్నతాధికారులను కలిస్తే.. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నుంచి ఎన్వోసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తెచ్చుకోండి.. అని వారు సూచించడంతో బిత్తరపోవడం స్వాముల వంతైంది. భూములు కొట్టేయాలనే వెలగపూడి కుట్ర –పీఠాధిపతి స్వామి పూర్ణానంద ఆరోపణ అమాయకులైన స్థానికులను రెచ్చగొట్టి మఠం భూములు కొట్టేయాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కుట్ర పన్నారని సాధుమఠం పీఠాధిపతి స్వామి పూర్ణానంద ఆరోపించారు. అందుకు ఆయన సామదానభేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఆ భూములపై తమకు ఎటువంటి ఆపేక్ష లేదని, గురుపరంపర పరిరక్షణలో భాగంగానే పోరాడుతున్నామని వివరించారు. జిల్లా అధికారులు వెలగపూడిని చూసి భయపడిపోతున్నారని, చివరికి ఆయనపై ఫిర్యాదు చేసిన తమనే దోషులుగా చూపించే యత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని మఠం భూములు పరిరక్షించాలని స్వామి పూర్ణానంద కోరారు. వివాదమేమిటో పరిశీలిస్తాం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సాధుమఠం భూముల వివాదమేమిటో క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఆ వివాదమేమిటో సోమవారం సాక్షి కథనం చూసే వరకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. నిబంధనల మేరకు ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు. -
సేవాగణితుడు
లెక్కలు అంటే ఎప్పుడూ చిక్కులు, చిక్కుముడులు విప్పడమే కాదు... ఆ సంఖ్యల వెనకున్న సత్యాలను తెలుసుకుంటే కోట్ల విలువ చేసే ధన సంపద, విజ్ఞాన సంపదను సాధించవచ్చు అని నిరూపించారొకరు. ఆయనే కనబడే, వినబడే ప్రతి అంశంలోనూ గణితాన్ని చూడగల మానవతావాది జేమ్స్ హెచ్.సిమన్స్. ఆయన కనిపెట్టిన జీవితపు ఈక్వేషన్స్ ఏంటో చూద్దాం. 12.5 బిలియన్ డాలర్ల ఆస్తి. కేవలం... సిమన్స్ గణితాన్ని నమ్మితే వచ్చినది కాదు. గణితం సిమన్స్‌ని నమ్మింది కాబట్టి చేకూరినది. 76 ఏళ్ల సిమన్స్ పుట్టి పెరిగింది బోస్టన్‌లో. పద్నాలుగేళ్ల వయస్సులో ఉన్నప్పుడు క్రిస్మస్ సెలవుల్లో స్టోర్ కీపర్‌గా చేరిన సిమన్స్, తన మతిమరుపు కారణంగా నెల తిరక్కుండానే ఆ ఉద్యోగం నుండి ఫ్లోర్ కీపర్‌గా డిమోట్ అయ్యారు. సెలవులు పూర్తయిన తర్వాత ఆ ఉద్యోగం వదిలేసిన సిమన్స్... గణితంపై పట్టు సాధించాలనే కోరికతో ఎమ్ఐటీలో చేరారు. కాలం, అంతరిక్షాలపై గురుత్వాకర్షణ చూపించే ప్రభావం మీద ఆయన పరిశోధన చేశారు. ఐన్‌స్టైన్ చేపట్టిన అతి క్లిష్టమైన సబ్జెక్ట్ అది. కొన్నాళ్లు ఎన్.ఎస్.ఎ.లో కోడ్ బ్రేకర్‌గా దేశానికి సేవ అందించిన తరువాత తిరిగి ఎమ్.ఐ.టి.లో చేరారు... కాకపోతే ఈసారి ప్రొఫెసర్‌గా. అక్కడ రెండేళ్లు పని చేశాక స్టోనీ బ్రాక్ యూనివర్సిటీలో మ్యాథ్స్ డిపార్ట్మెంట్ హెడ్‌గా పనిచేశారు. ఇవి ఎంతో కొంత తృప్తిని ఇచ్చినా, ఆయనకు ఏదో వెలితిగా ఉండేది. గణిత పరిజ్ఞానంతో ఏదైనా కొత్తగా చెయ్యాలనే తపనతో ఆయన రిమెనిసెన్స్ టెక్నాలజీస్ అనే సంస్థని ప్రారంభించారు. ఇది ఒక ఫండ్ మ్యానేజ్మెంట్ కంపెనీ. స్టోనీ బ్రాక్ యూనివర్సిటీలో ఒక చిన్న జాగాలో మొదలైంది ఈ కంపెనీ. వేరే కంపెనీల తాలూకు ఫండ్స్‌ని మ్యానేజ్ చేయడం ఆ కంపెనీ పని. ఏ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే లాభం వస్తుంది అనే విషయం మీద సలహాలు ఇచ్చి, వారికి వచ్చే లాభం నుండి 5 శాతం ఫీజ్గా తీసుకుంటారు. ఇందులో ఆయన కొత్తగా చేసింది, మార్కెట్ సిద్ధాంతాలకు గణితాన్ని ఆపాదించడమే. స్టాక్‌మార్కెట్ స్థితిగతుల్ని ఒక మ్యాథ్స్ ఈక్వేషన్‌గా మార్చేవారు. ఇందుకోసం ఎందరో గణిత శాస్త్రజ్ఞులను నియమించి వారికి ఉపాధి కూడా కల్పించారు. ఇది అనుకున్నంత సులువుకాదు. ఎందుకంటే మార్కెట్ అనేది రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది. అందుకు తగ్గట్టు గణితాన్ని కొత్త పుంతలు తొక్కించాలి. మ్యాథ్స్ అందం ఏంటంటే... సమస్యని ఫార్ములేట్ చేయడం కష్టమే కానీ ఒకసారి ఫార్ములా రూపొందించాక సమాధనాలు రాబట్టడం ఎంతో సులువు. అందుకే ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు వారి సలహాల కోసం ఎగబడతారు. వారి లాభాల నుండి 5 శాతం ఫీజు తీసుకున్న రిమెనిసెన్స్ టెక్నాలజీస్ సంపదే 12 బిలియన్ ఉంటే... వారి సలహాలు తీసుకున్న కంపెనీలు ఇంకెంత లాభపడుంటాయో ఊహించవచ్చు. ఇది కేవలం ఒక అంశం మీద పట్టు ఉన్నవాళ్లకు సాధ్యమయ్యేది కాదు. పట్టుతో పాటు మ్యాథ్స్ అంటే పిచ్చి ఉన్నవారికే సాధ్యం. సిమన్స్ ఈ కోవ కిందికి వస్తారు. ఆయన జీవితాన్ని గణిత సమస్యలా చూస్తారు. కష్టసుఖాలను ప్లస్సు, మైనస్సుల్లా చూసే ఆయన జీవితంలో ఎన్ని మలుపులు! మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చారు. కొన్ని రాజకీయాల వల్ల ఎం.ఐ.టి.లో ఎంతో మంచి హోదాని వదులుకుని బయటకు వచ్చేయాల్సి వచ్చింది. అందివచ్చిన ఇద్దరు కొడుకులూ కళ్లముందే ప్రాణాలు వదిలారు. ఇలాంటివి ఆయన జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి. కానీ సమస్యలన్నీ జీవితపు లెక్కలో ‘స్టెప్స్’ అనుకున్నారే తప్ప బాధపడి నీరుగారలేదు. అలా అని సిమన్స్ భావోద్వేగాలు లేని బండరాయి, మనుషులంటే లెక్క చేయని మొద్దుమనిషి కాదు. లేదంటే తన ఆస్తిని తిరిగి అమెరికా ప్రజలకోసం వాడేవారు కాదు కదా! తనకు ఇంత అనుభవాన్ని, ఐశ్వరాన్ని ఇచ్చిన గణితానికి తిరిగి ఏదైనా చెయ్యాలనే ఆలోచనతో ఎమ్ఎఫ్ఏ (మ్యాథ్స్ ఫర్ అమెరికా) అనే సేవాసంస్థని స్థాపించారు సిమన్స్. అందులో భాగంగా ప్రతి అమెరికన్ విద్యార్థికీ గణితం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కోటి డాలర్లకు పైగా వెచ్చించి అధ్యాపకులకు గణితంలో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి అమెరికన్ విద్యార్థికీ ‘సరైన’ విద్య అందాలని తలపెట్టిన కార్యక్రమం ఇది. అంతేకాదు తన ఆస్తిలో ఎంతో భాగం, సైన్స్, మ్యాథ్స్ మెడిసిన్ తదితర విభాగాలలో లోతైన పరిశోధనల పైనే ఖర్చవుతుంది. ఈ విధంగా ఆయన వైజ్ఞానిక సేవ చేయడమేకాక ఆటిజమ్ని రూపు మాపేందుకు కూడా వైద్య విభాగంలో పరిశోధనలు జరిపిస్తున్నారు. గణితం, సేవ... ఈ రెండూ ఆయనకు రెండు కళ్ళ లాంటివి. ‘‘నేను అంత చురుకైన వాడిని కాదు. మ్యాథ్ ఒలంపియాడ్లను సులువుగా చేధించలేను. కాని నాకు చూడడం ఇష్టం, శోధించడం ఇష్టం, తెలుసుకోవడం ఇష్టం. అదే నన్ను నడిపిస్తోంది’’ అని సంబరంతో చెబుతారు. ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తున్నప్పుడు... ఈజ్ ఈక్వల్ టు సింబల్‌కి అటు, ఇటుగా సంఖ్యలు మారుతున్నప్పుడు... ఆయన కళ్ళు ఉత్సుకతతో చూస్తాయి, తరువాత ఏమవుతుందా... అని! LHR = RHSఅని నిరూపించే వరకు విరామం లేదు ఆయనకు! - జాయ్