Maths teacher
-
మ్యాథ్స్ మహారాణి
గణితం అంటేనే ఆమడదూరం పరిగెత్తేవాళ్లు మనలో చాలా మందే ఉన్నారు. మొదట్లో గణితంపై పెద్దగా ఆసక్తి చూపని ఓ అమ్మాయి ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరంగా గణితాన్ని విడమరిచి చెప్పే లెక్కల టీచర్‌గా చరిత్ర సృష్టించారు. ఇటీవల జరిగిన ప్రఖ్యాత గణిత పాఠాల పోటీ ‘బిగ్ ఇంటర్నెట్ మ్యాథ్–ఆఫ్’లో ఘనా దేశానికి చెందిన 35 ఏళ్ల ఏంజెలా తబిరి 16 మందిని వెనక్కునెట్టి ప్రపంచవిజేతగా జయకేతనం ఎగరేసింది. ఈ పోటీలో నెగ్గిన తొలి ఆఫ్రికన్‌గా, అందులోనూ తొలి ఆఫ్రికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. సమస్యల పరిష్కారంపై ఉన్న మక్కువే తనను మ్యాథ్స్ వైపు నడిపించించిందని తబిరి చెబుతున్నారు. తన విజయం మరింత మంది ఆఫ్రికన్ మహిళలు గణితాన్ని అభ్యసించేందుకు ప్రేరణగా నిలుస్తుందని నమ్ముతున్నారు. ఘనా మ్యాథ్స్ క్వీన్ డాక్టర్ తబిరి ఆఫ్రికన్ ఇనిస్టిట్యూట్ ఫర్ మ్యాథమేటికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో అణు బీజగణితం బోధించడంలో నిపుణురాలిగా పేరు సాధించారు. ఇంతటి ఘనత సాధించిన ఘనా దేశస్తురాలి గణితపర్వం ఒక ప్రణాళికాబద్ధంగా మొదలుకాలేదు. ఘనాలో పారిశ్రామికరంగానికి కేంద్ర స్థానంగా ఉన్న రాజధాని నగరం అక్రా సమీపంలోని టెమా నౌకాపట్టణంలోని అషైమాన్ మురికివాడలో ఆమె పెరిగారు. నలుగురు తోబుట్టువులతో ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. ఇది సంతోషాన్నిచ్చినా చదువుకోవడానికి మాత్రం ఇబ్బంది ఉండేది. స్థానిక యూత్ కమ్యూనిటీ సెంటర్లో చదువుకునేవారు. తన ఇద్దరు సోదరీమణుల్లాగే యూనివర్సిటీలో బిజినెస్ అడ్మిని్రస్టేషన్ చేయాలనుకుంది. అందుకు సరిపడా విద్యా గ్రేడ్స్ లేకపోవడంతో బదులుగా గణితం, ఆర్థిక శా్రస్తాన్ని ఎంచుకుంది. అదే ఆమెకు కలిసొచ్చింది. గణిత సూత్రాలు ఆమెను విశేషంగా ఆకట్టుకున్నాయి. చివరకు గణితాన్నే తన కెరీర్‌గా ఎంచకున్నారు. 2015లో స్కాట్లాండ్లోని గ్లాస్గో విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసేందుకు స్కాలర్షిప్ సైతం సంపాదించారు. 1950వ దశకంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో పనిచేసిన నల్లజాతి అమెరికన్ మహిళా గణిత శాస్త్రవేత్తల జీవితగాథలున్న ‘హిడెన్ ఫిగర్స్’సినిమా చూశాక ఎంతో స్ఫూర్తిపొందానని ఆమె తెలిపారు. ‘‘ప్రపంచ వేదికపై నల్లజాతి మహిళల కథ నాకెంతో స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా కేథరిన్ జాన్సన్ నుంచి ఎంతో ప్రేరణ పొందా. ఇది నా జీవితంలో కీలక మలుపు’’అని ఆమె అన్నారు. మహిళల్లో గణిత అధ్యయనాన్ని పెంచేందుకు.. గణితంలో డాక్టరేట్ అందుకున్న తబిరి లాభాపేక్షలేని సంస్థ ‘ఫెమ్ ఆఫ్రికా మ్యాథ్స్’నడిపిస్తున్నారు. అత్యంత వెనుకబడిన వర్గాల్లోని ఆఫ్రికన్ బాలికలు, మహిళల గణిత కలలను సాకారం చేసుకోవడానికి తబిరి తన పూర్తి మద్దతు పలికారు. హైసూ్కల్ విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మహిళా గణిత శాస్త్రవేత్తలతో ఇంటర్వ్యూలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడామె సేవలు ఘనా, సెనెగల్, కామెరూన్, రువాండా దేశాలకూ విస్తరించాయి. ఘనాలోని ఉన్నత లేదా మాధ్యమిక పాఠశాల బాలికలకు మార్గదర్శకం చేసే ‘గాళ్స్ ఇన్ మ్యాథమెటికల్ సైన్సెస్’ ప్రోగ్రామ్‌కు తబిరి అకడమిక్ మేనేజర్ వ్యవహరిస్తున్నారు. ‘‘హైసూ్కల్లో గణితం చదివే బాలికలు, బాలుర సంఖ్య దాదాపు సమానంగా ఉందని, విశ్వవిద్యాలయ స్థాయిలో అది తగ్గిపోతోంది. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తున్నా’’అని ఆమె అన్నారు. ఆధునిక క్వాంటమ్ మెకానిక్స్ 100వ వార్షికోత్సవం సందర్భంగా 2025ను ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించాలనే ప్రతిపాదనలకు మెక్సికో మద్దతుతో ఘనా తరపున నాయకత్వం వహిస్తున్నారు. నిజ జీవిత సమస్యల పరిష్కారానికి.. ‘‘పిల్లలు తమ పాఠశాల పాఠాలను ఊరకే నేర్చుకోకుండా ఉన్నత లక్ష్యాల సాధనకు పనిముట్టుగా వాడుకోవాలి’’అని తబిరి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసు్కలైన ఆఫ్రికా జనాభా 2040 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామిక శక్తిగా అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అలాంటి పాఠశాల విద్యార్థులకు క్వాంటమ్ సైన్స్‌ను పరిచయం చేయడంలో తొలి అడుగుగా ‘క్వాంటమ్ రోడ్ షో’ను నిర్వహించాలని ఆమె భావిస్తున్నారు. యునెస్కోతో కలిసి పనిచేస్తున్న తబిరి వివిధ ఆఫ్రికా దేశాలకు చెందిన సుమారు 40 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు జూలైలో ఎయిమ్స్–ఘనాలో వారం రోజుల పాటు ‘క్వాంటమ్ హ్యాకథాన్’ను నిర్వహించనున్నారు. తాము ఎదుర్కొంటున్న సవాళ్లను, నిజ జీవిత సమస్యలను పరిష్కరించడానికి క్వాంటమ్ నైపుణ్యాలను ఉపయోగించాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు. తబిరి విజయం కేవలం ఆమె వ్యక్తిగత విజయం కాదు. ఆఫ్రికన్ భవిష్యత్ తరాల గణిత శాస్త్రవేత్తలకు, ముఖ్యంగా ఆఫ్రికన్ మహిళలకు ఆశాదీపంగా మారింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
లెక్కలు చెప్పేదాన్ని!
సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు కథానాయిక రాధికా ఆప్టే. వెబ్ సిరీస్‌లతో డిజిటల్ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. రాధికా సక్సెస్ఫుల్ జర్నీ ఇప్పుడు హాలీవుడ్ వరకూ వెళ్లింది. అక్కడ ఆమె ఒక సినిమా సైన్ చేశారు. కథానాయికగా ఈ రేంజ్లో సక్సెస్ అయిన మీరు ఒకవేళ నటి కాకపోయి ఉంటే ఏం చేసేవారు? అనే ప్రశ్న రాధికా ముందు ఉంచితే – ‘‘మ్యాథమేటిక్స్ అంటే చిన్నతనం నుంచి చాలా ఇష్టం. ఈ సబ్జెక్ట్‌ని చాలా స్పెషల్‌గా చదివేదాన్ని. అలాగే వైల్డ్‌లైఫ్ అన్నా ఇష్టమే. ఒకవేళ నేను యాక్టర్ కాకపోయి ఉంటే బహుశా మ్యాథ్స్ టీచర్‌గా లెక్కలు చెబుతూ ఉండేదాన్నేమో. ఒకవేళ అది కూడా కుదరకపోతే వైల్డ్‌లైఫ్ రంగంలో ఉద్యోగం చేసేదాన్నేమో. ఎవరికి తెలుసు? ప్రస్తుతం అయితే నటిగా సినిమా పరిశ్రమలో మంచిస్పేస్లోనే ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
ఒకరిపై ప్రేమ అనేది ఆకర్షణతో మొదలవుతుంది..
హరియాణా : గణిత శాస్త్రం.. ఈ పేరు వింటేనే కొంతమంది స్టూడెంట్స్ బెంబేలెత్తిపోతారు. లెక్కల మాస్టారు తరగతి గదిలోకి ప్రవేశిస్తేనే బోర్‌గా ఫీలవుతారు. ఎప్పుడెప్పుడు మ్యాథ్స్ క్లాస్ అయిపోతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ మన లెక్కల మాస్టారు చెప్పే క్లాసులు విద్యార్థులు మాత్రం అస్సలు మిస్సవ్వరు. ఇంకా కాసేపు చెబితే బాగుండు అనేలా క్లాసులు వింటారు. అయితే ఈ మాస్టారు చెప్పే లెక్కలు కొంచెం తేడా. గణితానికి ప్రేమను జోడించి ప్రేమ లెక్కలు చెబుతూ వివాదస్పందంగా నిలిచారు హరియాణా ప్రభుత్వ మహిళా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ చరణ్ సింగ్. స్నేహం, ఆకర్షణ, క్రష్‌ల మధ్య తేడాను గణిత రూపంలో వివరిస్తున్న వీడియో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది. ఆయన చెప్పిన ప్రేమ లెక్కలు.. ఫ్రెండ్షిప్ : సాన్నిహిత్యం నుంచి ఆకర్షణను తీసివేస్తే వచ్చేదే స్నేహం (క్లోజ్‌నెస్- అట్రాక్షన్ = ఫ్రెండ్షిప్). భార్యభర్తలు వృద్ధాప్యంలో స్నేహితులుగా ఉంటారు. వృద్ధాప్యంలో శారీరక ఆకర్షణ తగ్గిపోయి స్నేహితులుగా మారుతారు. లవ్ : సాన్నిహిత్యం, ఆకర్షణల కలయికనే ప్రేమ. (క్లోజ్‌నెస్ + అట్రాక్షన్) . రొమాంటిక్ లవ్ : స్నేహం, సాన్నిహిత్యం, ఆకర్షణల కలయికనే రొమాంటిక్ లవ్ ( రోమాంటిక్ లవ్ = ఫ్రెండ్షిప్ + క్లోజ్‌నెస్ + అట్రాక్షన్). ఏ సంబంధం అయినా ఆకర్షణ, స్నేహం, సాన్నిహిత్యంపైనే ఆధారపడి ఉంటుంది. ‘ఒకరిపై ప్రేమ అనేది ఆకర్షణతో మొదలవుతుంది. వారిమధ్య సాన్నిహిత్యం కొరవడితే వైరం ఏర్పడుతుంది. దీంతో విడిపోతారు. ఇలాంటి ప్రేమ ఎక్కువగా విదేశాలలో ఉంటుంది. కొన్ని దేశాల్లో వాహనాలు, ఇళ్లను మార్చినట్లుగా ఈజీగా జీవిత భాగస్వామిని మారుస్తారు. దానికి గల కారణం సాన్నిహిత్యం లేకపోవడం. కానీ భారతదేశంలో అలాకాదు. వారిలో ఆకర్షణ, సాన్నిహిత్యం తగ్గిపోయినా వారి పిల్లల కోసం కలిసి ఉంటారు’ అని చరణ్ సింగ్ వివరించారు. ఇక క్రష్ గురించి చెబుతూ.. ఆకర్షణ నుంచి సాన్నిహిత్యాన్ని తీసివేస్తే వచ్చేదే క్రష్ అని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రష్ అనేది ఎప్పడో ఒకసారి పుడుతుందని స్టూడెంట్స్‌కు వివరించారు. ఇక ప్రొఫెసర్ చెప్పే ప్రేమ లెక్కలను విద్యార్థులు నవ్వుతూ శ్రద్దగా విన్నారు. వారికి ఉన్న సందేహాలను కూడా తీర్చుకున్నారు. ఏ ఒక్క విద్యార్థి కూడా అతనిపై ఫిర్యాదు చేయలేదు. సామాజిక కార్యకర్త ఒకరు చరణ్ సింగ్‌పై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే చరణ్ సింగ్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారో లేదో తెలియరాలేదు. -
ఆ టీచర్ లేకుంటే క్లాస్రూమ్ రక్తపు మడుగే..
న్యూయార్క్ : అమెరికాలో సంచలనం సృష్టించిన కాల్పుల సమయంలో ఓ భారతీయ సంతతి మహిళా ఉపాధ్యాయురాలు పెద్ద మొత్తంలో ధైర్యసాహసాలు ప్రదర్శించింది. వేగంగా స్పందించి పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలు కాపాడింది. ఆమె ఏ మాత్రం ఆలస్యం చేసినా క్షణాల్లో ఆ తరగతి గది మరో రక్తపు మడుగులా మారి చిన్నారులు విగతజీవులయ్యేవారు. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని హైస్కూల్లో అదే స్కూల్లో గతంలో చదివిన ఓ యువకుడు ఉన్మాదిగా మారి కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 17మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, కాల్పులు జరిగే సమయంలో భారతీయ సంతతి మ్యాథ్స్ టీచర్ శాంతి విశ్వనాథన్ ఆల్జీబ్రాను బోధిస్తున్నారు. కాల్పుల శబ్దం విన్నవెంటనే ఆమె అప్రమత్తమయ్యారు. వేగంగా వెళ్లి తలుపులు మూశారు. అలాగే, ఉన్మాదిని చూసి విద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా కిటికీలను కూడా మూసేశారు. ఆ వెంటనే వారందరిని నేలపై పడుకోవాలని చెప్పారు. అనంతరం కొద్ది సేపటి తర్వాత పోలీసు అధికారులు వచ్చి తలుపు తీయమన్నా సరే ఆమె తీయలేదు. తాను పోలీసునని చెప్పుకొని తలుపులు తీయించేందుకు ఉన్మాదినే ట్రిక్స్ ఉపయోగించి ఓపెన్ చేయించే ప్రయత్నం చేస్తున్నాడని భావించి పోలీసులను కూడా అడ్డుకున్నారు. దీంతో కిటికీలు ఓపెన్ చేసి పోలీసులని నిర్దారించుకొని పిల్లలను బయటకు పంపించింది. 'ఆమె చాలా వేగంగా స్పందించారు. తన తెలివి తేటలన్నీ ఉపయోగించి చాలామంది పిల్లలను కాపాడారు. పోలీసులు వెళ్లి తలుపు కొట్టినా కూడా సాయుధుడే అని అనుమానించి తలుపు తెరవలేదు. వీలయితే తలుపులు బద్దలు కొట్టుకోండని చెప్పారు. నిజంగా ఆమె సాహసం అద్భుతం' అని డాన్ జార్బో అనే ఓ విద్యార్థి తల్లి చెప్పినట్లు సన్ సెన్షియల్ తెలిపింది. -
ఉపాధ్యాయుడి వికృత చేష్టలు
బస్వంతనగర్ (కరీంనగర్) : ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని బాధితురాలి బంధువులు చితకబాదారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలో గురువారం చోటుచేసుకుంది. మండలంలోని ఈసాల తక్కల్లపల్లె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి ఓ విద్యార్థినితో గణిత ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు తెలపడంతో వారు సదరు వ్యక్తిని చితక్కొట్టారు. -
మొదటి లైక్
జోక్స్ విమల: విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాక ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. మొదటి లైక్ ఎవరు కొట్టారో తెలుసా? అమల: ఎవరు? విమల: నా భర్త ముగ్గురు! మ్యాథ్స్ టీచరు ఒక అబ్బాయిని అడుగుతోంది. నీ దగ్గర ఉన్న 12 చాక్లెట్లలో ఐదు ప్రియకి, మూడు సుమతికి, రెండు మాధవికి ఇస్తే నీ మిగులు ఎంత? విద్యార్థి: ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ! ఒక అమాయకుడు ఒక వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌కు ఫోన్ చేసి హైదరాబాదు నుంచి బెంగుళూరుకి ఎంత జర్నీ ఉంటుంది అని అడిగాడు. రిసెప్షనిస్ట్: వన్ సెకెండ్ సార్ అమాయకుడు: ఓకే, థాంక్స్ మేడమ్, అని ఫోన్ పెట్టేశాడు. గోడే ఆధారం రాజు: మీ ఇంట్లో మీ అమ్మగారు-మీ ఆవిడ గొడవపడుతుంటారు కదా? నువ్వు ఎవరి పక్కన నిలబడతావు? గిరి: గోడపక్కన -
విశాఖలో లెక్కల మాస్టారి తిక్కవేషాలు
విశాఖపట్నం: చిన్నారులపై కీచకల పరంపర కొనసాగుతోంది. విద్య నేర్పాల్సిన గురువులే దారితప్పి ప్రవర్తిస్తున్నారు. కీచక టీచర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా విశాఖ జిల్లాలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని లెక్కల మాస్టారు వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఊర్వశి జంక్షన్‌లోని న్యూటన్ స్కూల్లో చోటుచేసుకుంది. విద్యార్థిని కీచక మాస్టర్ వేధింపులు భరించలేక చివరికి మాస్టర్ గారి తిక్కవేశాల గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, స్థానికుల సహాయంతో కీచక టీచర్‌కు దేహశుద్ధి చేశారు. విద్యార్ధులపై వేధింపులకు గురిచేసిన టీచర్‌పై చర్య ఎందుకు తీసుకోలేదంటూ పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. అయినా స్కూలు యాజమాన్యం పట్టించుకోవటం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు.