matrimonal sites
-
మ్యాట్రి 'మనీ' స్కాం: అలాంటి వీడియోలతో బెదిరింపులు, బీ కేర్‌ఫుల్!
పెళ్లిళ్ల పేరయ్యల కాలం దాదాపు కనుమరుగైపోయింది. ఇపుడంతా మ్యాట్రీ మోనీ వెబ్సైట్ల హవానే నడుస్తోంది. ప్రాథమికంగా అన్ని వివరాలను ఆన్లైన్లోనే తెలుసుకుని అపుడు రంగంలోకి దిగుతున్న పరిస్థితినిమనం చూస్తున్నాం. అమ్మాయిల తల్లిదండ్రులైనా, అబ్బాయిల తల్లిదండ్రులైనా చాలావరకు ‘మ్యాట్రీ మోనీ’ పై ఆధారపడుతున్నారు. ఇక్కడే కేటుగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. పదండి!మోసాలకు కాదేదీ అనర్హం అన్నట్టు.. ప్రతీ విషయాన్ని తమ కనుగుణంగా మలుచు కుంటున్నారు కేడీగాళ్లు. ఆఖరికి మ్యాట్రీమోనీ సైట్లను కూడా వదలడం లేదు. మ్యాట్రిమోని సైట్ల కేంద్రంగా పెరిగిపోతున్న మోసాలు అంటూ దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక వీడియోను షేర్ చేశారు. మ్యాట్రి 'మనీ' మోసాలతో తస్మాత్ జాగ్రత్త! అంటూ ఒక పోస్ట్ పెట్టారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో పరిచయమైన యువతి, యువకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన సజ్జనార్ ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వీడియో కాల్స్ చేయమన్నా, న్యూడ్ ఫోటోలు అడిగిన కచ్చితంగా అనుమానించాల్సి ఉందనీ, ఒకటి పది సార్లు ఆలోచించాలని తెలిపారు. అలాగే మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సజ్జనార్ ట్వీట్ చేశారు.ఈ వీడియోలో ఒక యువతి తన స్నేహితురాలి అనుభవాన్ని గురించి వివరించారు. ఈ వివరాల ప్రకారం మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు స్కాం రాయుళ్లు. ఆ తరువాత పెళ్లి పేరుతో మాయమాటలు చెబుతారు. మభ్యపెట్టి మెల్లిగా వీడియో కాల్స్ చేస్తారు. ఆ తరువాత ఈ వీడియో సాయంతో న్యూడ్ వీడియోలను తయారు చేస్తారు. ఆపై ఈ వీడియోలు చూపించి బెదిరింపులకు పాల్పడతారు. అడిగిన సొమ్ము ముట్టచెప్పక పోతే..న్యూడ్ వీడియోలను బయట పెడతామంటూ బెదిరిస్తారు. దీంతో ఈ వ్యవహారం బయటకి వస్తే పరువు పోతుందని భయంతో వణికిపోతారు బాధితులు. అడిగినంత ముట్జచెప్పి కష్టాల్లో పడుతున్నారు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరిన్ని సమస్యలు తప్పవనే భయంతో ఫిర్యాదులకు జంకుతున్నారు. మ్యాట్రి 'మనీ' మోసాలతో తస్మాత్ జాగ్రత్త!!మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్న కేటుగాళ్ళు.పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి న్యూడ్ వీడియో కాల్స్.న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్.. అడిగిన డబ్బు ఇవ్వాలని బెదిరింపులు.మ్యాట్రిమోని… pic.twitter.com/wS48rAVmTp— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 13, 2025 ఇలాంటి స్కాంలపై అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇలాంటి బెదిరింపులకు భయపడ కూడదు. సంబంధిత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. లేదంటే సైబర్ క్రైం విభాగాన్ని గానీ వెంటనే సంప్రదించాలి. ఇలా చేయడం వల్ల మరింత బాధితులు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడిన వారమవుతాం. అలాకాకుండా పరువు పోతుందని భయపడితే, కేటుగాళ్లు పన్నిన ఉచ్చులోకి మరింత లోతుగా చిక్కుకుంటామనే సంగతి గుర్తుంచు కోవాలి. -
పెళ్లి అనుకుంటే లొల్లి
బనశంకరి: పెళ్లి సంబంధాల వెబ్సైట్లో పరిచయమైన యువతి మాయలో పడిన ఓ యువకుడు సుమారు రూ. 10 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు దక్షిణ పరిధిలో చోటుచేసుకుంది. హనుమగిరి నివాసి అజయ్‌కుమార్ బాధితుడు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న అజయ్‌కుమార్ గత నెల 29వ తేదీన వెబ్సైట్లో వధువు కావాలని తన ఫొటో వివరాలను అప్లోడ్ చేశాడు. తరువాత ఉత్తర భారతదేశానికి చెందిన యువతి అతనికి మెసేజ్ పంపించగా ఇద్దరూ ఫోన్ నంబర్లను మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. భారీగా వసూళ్లు మీరంటే ఇష్టమని, మిమ్మల్ని చూడడానికి వస్తానని యువతి చెప్పింది. దీంతో యువకుడు ఆమె బ్యాంకు అకౌంట్‌కు కొంత డబ్బు జమచేశాడు. అప్పటినుంచి యువతి పలు కారణాలు చెబుతూ అతన్నుంచి నగదు పిండుకోసాగింది. మొత్తం రూ.9.95 లక్షలు ఆమె ఖాతాలోకి జమచేశాడు. తరువాత యువతి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని అడ్రస్ లేకుండా పోయింది. మోసపోయానని గుర్తించిన యువకుడు బెంగళూరు దక్షిణ సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. (చదవండి: ఐటీసీటీలో అతిపెద్ద సమస్య... అక్రమ సంబంధాలతో 981 జంటలు) -
మూడుముళ్లంటూ టీచర్‌కు మస్కా
బనశంకరి: ఓ ప్రైవేటు ఉపాధ్యాయురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.7.6 లక్షలు వంచనకు పాల్పడ్డాడో మోసగాడు. బెంగళూరులోని సర్జాపుర రోడ్డు కృతిక గోయల్ (30) బాధితురాలు. పెళ్లి చేసుకోవడానికి తగిన వరుడు కావాలని కృతిక.. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో ప్రొఫైల్‌ను పెట్టింది. అది చూసి ఒక యువకుడు ఆమెను సంప్రదించాడు, తాను మంచి ఉద్యోగం చేస్తున్నానని చెప్పి స్నేహం చేశాడు. అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తన తండ్రి ఆనారోగ్యం బారినపడ్డారని రూ.7.60 లక్షలు పంపాలని, వెంటనే డబ్బు వెనక్కి ఇస్తానని ఆ యువకుడు కథ చెప్పాడు. అతని మాటలు నమ్మిన కృతిక ఆ డబ్బు పంపింది. ఆ తరువాత యువకుడు అడ్రస్ లేకపోవడంతో టోపీ వేశాడని తెలుసుకున్న బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బహుమానం వచ్చిందని రూ.5.37 లక్షలు.. బహుమానం కోసం ఆశ పడి ఓ అభాగ్యుడు రూ. 5.37 లక్షలను కోల్పోయాడు. ఈ సంఘట మైసూరు జిల్లాలోని సరగూరు తాలూకా కోడగి గ్రామంలో జరిగింది. రాము అనే వ్యక్తి ఇంటికి న్యాప్‌టోల్ అనే కంపెనీ నుంచి పార్శిల్ వచ్చింది. అందులో ఒక కూపన్ ఉంది, మీకు రూ. 7.50 లక్షల లాటరీ తగిలిందని, ఆ డబ్బులు పంపాలంటే బ్యాంకు చార్జ్, జీఎస్టీ, టిడిఎస్, కమీషన్ ఇవ్వాలని రాసి ఉంది. దానిని నమ్మిన రాము తన భార్య, స్నేహితుల వద్ద రూ. 5.37 లక్షలను తీసుకొచ్చి కంపెనీ చెప్పిన ఖాతాలోకి జమ చేశాడు. బహుమానం కోసం ఫోన్ చేయగా, ఇంకా కొన్ని రుసుములు చెల్లించాలని, లేదంటే కానుక రద్దవుతుందని బెదిరించడంతో మోసపోయానని గ్రహించిన రాము సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: విడాకుల కోసం వచ్చి మళ్లీ ఒకటయ్యారు.. మధ్యలో ఏం జరిగిందంటే!) -
వరుడు కావాలి.. రూ.5 లక్షలు పోగొట్టుకున్నాడు
సాక్షి, హైదరాబాద్: విదేశీ వరులుగా మాట్రిమోనియల్ సైట్స్‌లో రిజిస్టర్ చేసుకోవడం.. యువతులు, రెండో పెళ్లి చేసుకునే మహిళల్ని ఆకర్షించడం.. వారిని టార్గెట్‌గా చేసుకుని గిఫ్ట్‌ల పేరుతో గాలం వేయడం.. కస్టమ్స్ అధికారులుగా కాల్ చేసి అందినకాడికి దండుకోవడం.. సిటీలో ఇలాంటి కేసులు తరచుగా చూస్తున్నాం. అయితే ఈసారి సీన్ రివర్స్ అయింది. విదేశీ వధువుగా రిజిస్టర్ చేసుకున్న ఓ మహిళ వల్లో పడిన నగర వాసి రూ.5 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు సోమవారం సిటీ సైబర్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏసీపీ కథనం ప్రకారం.. ⇔ నగరంలోని బర్కత్‌పురా ప్రాంతానికి ఓ వ్యక్తి ఉన్నత విద్యనభ్యసించారు. వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన కొన్నాళ్ల క్రితం సంగం.కామ్ అనే మాట్రిమోనియల్ సైట్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈయనకు ఇటీవల రీటాగా చెప్పుకున్న, ఆ పేరుతో రిజిస్టర్ చేసుకున్న యువతితో ఈ సైట్ ద్వారా పరిచయమైంది. ⇔ తాను అమెరికాలో డాక్టర్‌గా పని చేస్తున్నానంటూ ఆమె చాటింగ్‌లో చెప్పింది. ఇలా వీరి పరిచయం పెరిగిన తర్వాత సదరు రీటా నగర వాసి దగ్గర పెళ్లి ప్రస్తావన కూడా తెచ్చింది. హఠాత్తుగా ఓ రోజు మన పరిచయానికి గుర్తుగా కొన్ని గిఫ్ట్‌లు పంపిస్తున్నానంటూ సందేశం పంపింది. ఆపై రెండు రోజులకు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులుగా చెప్పుకుంటూ కొందరు నగర వాసికి కాల్ చేశారు. ⇔ అమెరికా నుంచి మీ పేరుతో ఓ పార్శిల్ వచ్చిందని చెప్పారు. అందులో ఖరీదైన గిఫ్ట్‌లతో పాటు కొన్ని డాలర్లు సైతం ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటిని హైదరాబాద్‌కు పంపాలంటే కస్టమ్స్ క్లియరెన్స్ తప్పనిసరని చెప్పారు. దానికోసం కొన్ని ట్యాక్సులు కట్టాల్సి ఉంటుందంటూ దఫదఫాలుగా బాధితుడి వద్ద నుంచి రూ.5 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించారు. ⇔ చివరికి తాను మోసపోయాననే విషయం గుర్తించిన బాధితుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. రీటాగా చెప్పుకున్న మహిళ +11తో మొదలయ్యే నంబర్‌తో వాట్సాప్ చాటింగ్ చేసింది. బాధితుడు డబ్బు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలన్నీ ఢిల్లీలో, సోనియా శర్మ పేరుతో ఉన్నాయి. వీటి ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బయటపడుతున్న సాదత్‌ఖాన్ లీలలు
వితంతువులు, విడాకులు పొందిన సంపన్న స్త్రీలే టార్గెట్ ఖాకీలను కలుస్తున్న బాధితులు బనశంకరి: మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా మహిళలను పరిచయం చేసుకుని వివాహం చేసుకుంటానని నమ్మించి లక్షల రూపాయల దోచుకుని పోలీసులకు పట్టుబడిన వంచకుడు సాదత్‌ఖాన్ లీలలు బయటపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు వితంతువులు, విడాకులు పొందిన శ్రీమంత మహిళలను మాయమాటలతో బురిడీ కొట్టించినట్లు పోలీసుల విచారణ లో వెలుగుచూసింది. సాదత్‌ఖాన్ అరెస్టైన విషయం తెలియగానే పలువురు బాధిత మహిళలు బాగలూరు పోలీసులను కలిసి న్యాయం చేయాలని కోరుతున్నారు. వారి స్వస్థలాల్లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని బాధితులకు సలహా ఇస్తున్నట్లు బెంగళూరు ఈశాన్యవిభాగం డీసీపీ పీఎస్.హర్ష తెలిపారు. హాసన్‌కు చెందిన సాదత్‌ఖాన్ (28) అనే మోసకారి తాను సంపన్నుడిని, సీఈవోని అంటూ ప్రొఫైల్స్ తయారుచేసుకుని మహిళలను మాయమాటలతో వంచిస్తూ ఒక కేసులో మంగళవారం దొరికిపోవడం తెలిసిందే. వితంతువులు, విడాకులు తీసుకున్న, డబ్బున్న మహిళలను గుర్తించి పెళ్లిచేసుకుంటానని నమ్మించేవాడు. వారి నుంచి డబ్బు గుంజేవాడు. అనేకమందితో శారీరకంగా కూడా వాంఛలు తీర్చుకున్నాడు. ఒక మహిళతో మాట్లాడడానికి ఒక సిమ్‌నే వాడేవాడు. మహిళల నుంచి కాజేసిన లక్షలాది నగదుతో విమానాల్లో సంచరిస్తూ విలాస జీవితం గడిపేవాడు. ఇతడు విలాసాల కోసం రూ.50 లక్షల వరకు ఖర్చుచేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఇతని వద్ద పైసా కూడా లభించలేదని డీసీపీ హర్ష తెలిపారు. ఇంతవరకు సుమారు వందమందికి పైగా మహిళలను వంచనకు పాల్పడినట్లు వెలుగులోకి రాగా వారిసంఖ్య ఇంకా పెరుగవచ్చని చెబుతున్నారు. హిందీలో అనర్గళంగా మాట్లాడే ఇతడు ఎక్కువగా రాష్ట్రంలో స్థిరపడిన ఉత్తరాది మహిళలకే వలవేసినట్లు సమాచారం.