mattress hit
-
బెడ్ కోసం పిల్ల ఏనుగు చేసిన హంగమా! వీడియో వైరల్
Elephant immediately tries to get the "sleeping" man off: జంతువులను ప్రేమగా చూసుకుంటూ ఉంటే అవి కూడా మన స్నేహితుల మాదిరిగా అయిపోతాయి. కొన్ని రోజులకు అవి జంతువులు అనే ఫీలింగ్ కూడా రాదు. మనం ఎలా అలవాటు చేస్తే అవి కూడా వాటికి తగ్గట్టుగా తమను మార్చుకుంటాయి. మన స్నేహితుల మాదిరి మనతో సరదాగా పోట్లాడతాయి కూడా. ఈ ఏనుకు కూడా అలానే తన సంరక్షకుడితో పొట్లాడుతోంది. వివరాల్లోకెళ్తే...ఇక్కడొక బేబి ఏనుగు బెడ్ పై సంరక్షకుడు సరదాగా కాసేపు పడుకుంటాడు. అక్కడ తన తల్లితో ఆహారం తింటున్న పిల్ల ఏనుగు ఈ ఘటనను చూసి వెంటనే వచ్చేస్తుంది. పైగా అడ్డుగా ఉన్న ఫెన్సింగ్ని కూడా దాటి మరీ వచ్చి తన సంరక్షకుడితో దెబ్బలాడుతోంది. అతను లేచి వెళ్లిపోయేంతవరకు వదలదు. చివరికి ఇద్దరు కలసి బెడ్ మీద పడుకుంటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని భారతీయ అటవీ అధికారి డాక్టర్ సామ్రాట్ గౌడ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. Hey! That's my bed..get up..😠 pic.twitter.com/WX4IaROsvp — Dr.Samrat Gowda IFS (@IfsSamrat) May 10, 2022 (చదవండి: ఏం ధైర్యం తల్లి! పదేపదే కాటేస్తున్న ఆ పాముని అలాగే పట్టుకుంది) -
ఈ బైకిస్టు గుండె ఆగినంతపనైంది
-
ఈ బైకిస్టు గుండె ఆగినంతపనైంది
ఆస్ట్రేలియా: గాల్లో ఎగిరొచ్చిన ఒక పెద్ద పరుపు రోడ్డుపై వేగంగా వెళుతోన్న ఓ బైకిస్టుకి షాకిచ్చింది. అదే సమయంలో అతడి ప్రాణాలు కాపాడింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ సంఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లోగల సొరంగ మార్గంలో ఆరన్ ఉడ్ అనే వ్యక్తి వేగంగా బైక్పై వెళుతున్నాడు. అదే సమయంలో అతడి ముందు పరుపులతో ఒక ట్రక్కు వెళుతోంది. అయితే, అనూహ్యంగా ఆ ట్రక్కులో నుంచి రెండు పరుపులు గాల్లోకి లేచాయి. అందులో ఒకదాన్ని ఆరన్ ఉడ్ తప్పించుకున్నా మరో పరుపు ఎగిరొచ్చి తన బైక్ ముందు పడిపోయింది. అప్పటికే అతడు ఫుల్ స్పీడ్లో ఉన్నాడు. దీంతో బైక్తోపాటు అది ఈడ్చుకొచ్చింది. అమాంతం బ్రేక్ వేయడంతో అతడు కొద్ది ఎత్తు గాల్లోకి లేచి తిరిగి ఆ పరుపుపైనే నిలదొక్కుకుని హమ్మయ్య అనుకున్నాడు. అతడి వెనుకాలే వచ్చిన వాహనదారులు అనంతరం దానిని తీసి పక్కకు పెట్టి ముందుకు కదిలారు. ఈ ప్రమాదంలో అతడి స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్కు 275 డాలర్ల ఫైన్ వేశారు. ఈ ప్రమాదంపై స్పందించిన ఆరన్ తాను గత 20 ఏళ్లుగా బైక్ నడుపుతున్నానని, ఇలాంటి సంఘటన ఎప్పుడూ ఎదుర్కోలేదని చెప్పాడు. అంతపెద్ద ప్రమాదంలో తాను బతికుండటం చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారని తెలిపాడు.