maximum punishment
-
డిన్నర్‌కు పిలిచి నమ్మకద్రోహం చేశాడు!
న్యూఢిల్లీ: అమెరికా మహిళపై అత్యాచారం కేసులో ‘పీప్లి లైవ్’ సినిమా కో-డైరెక్టర్ మహమూద్ ఫారుఖీకి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. కొలంబియా యూనివర్సిటీకి చెందిన 35 ఏళ్ల మహిళను ఫారుఖీ రేప్ చేసినట్టు అభియోగాలు రుజువయ్యాయి. దీంతో ఢిల్లీ కోర్టు గురువారం ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ఒక స్నేహితుడి తరహాలో విదేశీ మహిళను డిన్నర్‌కు పిలిచిన ఫారుఖీ.. ఆ తర్వాత నమ్మకద్రోహానికి పాల్పడ్డాడని, ఆమెపై అత్యాచారం జరిపిన ఆయనకు జీవితఖైదు విధించాలని ప్రాసిక్యూషన్ లాయర్ కోర్టును కోరారు. గత మంగళవారం ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్ల వాదనలు విన్న అడిషనల్ సెషన్స్ జడ్జి సంజీవ్ జైన్.. దోషికి శిక్ష విధింపును గురువారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చిలో ఆమెపై ఢిల్లీలో ఫారుఖీ అత్యాచారానికి పాల్పడ్డాడు. కొలంబియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ అయిన బాధితురాలు.. రీసెర్చ్ పనిమీద తాను ఫారుఖీని కలిశానని, ఆ తర్వాత 2015 మార్చి 28న తన ఇంటికి డిన్నర్ కోసం అని పిలిచి.. తనపై అత్యాచారం అతను జరిపాడని పోలీసులకు తెలిపింది. ఈ కేసులో తాను అమాయకుడినని ఫారుఖీ వాదించాడు. అయితే, గత నెల ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. రైతు ఆత్మహత్యలపై తెరకెక్కిన సెటైరికల్ మూవీ ‘పీప్లిలైవ్’కు ఫారుఖీ సహా దర్శకుడిగా వ్యవహరించగా.. ఆయన భార్య అనూష రిజ్వీ ఈ సినిమాకు దర్శకురాలు. -
దర్శకురాలి భర్తకి జీవితఖైదు!
న్యూఢిల్లీ: అమెరికా మహిళపై అత్యాచారం కేసులో ‘పీప్లి లైవ్’ సినిమా సహా దర్శకుడు మహమూద్ ఫారుఖీకి జీవితఖైదు విధించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. ఈ కేసులో ట్రయల్ కోర్టు ఫారుఖీని ఇప్పటికే దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. నిందితుడికి ఈ నెల 4న శిక్ష విధించనున్నట్టు అడిషనల్ సెషన్స్ జడ్జి సంజీవ్ జైన్ తెలిపారు. దోషిగా తేలిన ఫారుఖీకి శిక్ష విధింపుపై మంగళవారం కోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్లు తమ వాదనలు వినిపించారు. ఢిల్లీ పోలీసుల తరఫున ప్రాసిక్యూషన్ లాయర్ వాదనలు వినిపిస్తూ దోషికి గరిష్ట శిక్ష అయిన జీవితఖైదు విధించాలని జడ్జిని కోరారు. గత ఏడాది మార్చిలో దేశ రాజధాని ఢిల్లీలో ఈ లైంగిక దాడి ఘటన జరిగింది. తనపై ఫారుఖీ అత్యాచారం జరిపినట్టు కొలంబియా యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ స్కాలర్ అయిన 35 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రీసెర్చ్ పనిమీద తాను ఫారుఖీని కలిశానని, ఆ తర్వాత 2015 మార్చి 28న తన ఇంటికి డిన్నర్ కోసం అని పిలిచి.. తనపై అత్యాచారం జరిపాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ కేసులో తాను అమాయకుడినని ఫారుఖీ పేర్కొన్నాడు. గత నెల ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. రైతు ఆత్మహత్యలపై తెరకెక్కిన సెటైరికల్ మూవీ ‘పీప్లిలైవ్’కు ఫారుఖీ సహ దర్శకుడిగా వ్యవహరించగా.. ఆయన భార్య అనూష రిజ్వీ ఈ సినిమాకు దర్శకురాలు.