Mayuram
-
మయూరం..వయ్యారం!
బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద సోమవారం ఉదయం ఓ మయూరం వయ్యారంగా నడుస్తూ కనువిందు చేసింది. రోడ్డు పైకి వచ్చిన ఆ నెమలి... సెంట్రల్ మీడియన్‌లో ఆకలి తీర్చుకొని తుర్రుమంది. వాకర్లు ఈ దృశ్యాలను సెల్ఫోన్లలో బంధించేందుకు పోటీ పడ్డారు. – ఫొటోలు... దయాకర్ తూనుగుంట్ల -
మాయిరే.. మయూరే!
జంట కంఠాల ఒంటరి మయూరం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా..! ఎవరూ నేర్పకుండానే వయ్యారి నడకలు అబ్బిన నెమలికి.. ఈ విద్య కూడా వచ్చేమోనని అనుకోకండి. మాదాపూర్ నుంచి హైటెక్స్ వెళ్లే దారిలో బండలమాటున తిరగాడుతున్న నెమళ్లు ఇదిగో ఇలా కెమెరాకు చిక్కాయి. జంట మయూరాలు భలేగా ఉన్నాయి కదూ. వీటికి అల్లంత దూరాన మరో మయూరం ఇలా ఠీవీగా నిల్చుని దర్జాగా సిటీ చూస్తోంది.