medalists
-
పారాలింపిక్స్ పతకధారులకు ఏపీ సీఎం అభినందనలు
అమరావతి: టోక్యో పారా ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లు భవీనాబెన్(మహిళల టేబుల్ టెన్నిస్‌లో రజతం), నిషద్ కూమార్(పురుషుల హై జంప్‌లో రజతం), వినోద్ కూమార్(పురుషుల డిస్కస్ త్రోలో కాంస్యం)లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. వీరు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమన్నారు. ఈ ముగ్గురు భరతమాత ముద్దు బిడ్డల ధైర్య సాహసాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, వీరు సాధించిన పతకాలు దేశం యావత్తుకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. చదవండి: Viral Video: పతకం గెలిచిన ఆనందంలో చిందేసిన భారత అథ్లెట్.. -
మెడల్స్ మెడలో పడ్డాక అలా ఎందుకు చేస్తారో తెలుసా..?
టోక్యో: ఒలింపిక్స్‌లో విజేతలు పతకాలు తమ మెడలో పడ్డాక వాటిని కొరుకుతూ, చిరునవ్వులు చిందిస్తూ కెమెరాలకు పోజులిస్తుంటారు. ముఖ్యంగా గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులైతే తప్పనిసరిగా ఈ పోజ్‌లో కనపడతారు. స్విమ్మింగ్ రికార్డు బ్రేకర్ మైఖేల్ ఫెల్ప్స్ నుంచి జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ సిమోన్ బైల్స్... ఇలా స్వర్ణ పతక విజేతలంతా ఈ విధంగా తమ మెడల్స్‌ను కొరికినవారే. వాటిని ఎందుకు కొరుకుతారనే అనుమానం అభిమానులకు కలగక మానదు. అయితే, విజేతలు ఇలా చేయడానికి గల కొన్ని కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అసలైన దానిని తాము సాధించామని చెప్పడానికి గాను చాలా కాలంగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని సమాచారం. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఒలింపిక్ హిస్టోరియన్స్ అధ్యక్షుడు డేవిడ్ వాలెషిన్స్కీ చెప్పిన దాని ప్రకారం.. పతకాలు సాధించిన క్రీడాకారులు తమంతట తాముగా ఇటువంటి పోజులివ్వరని, ఫొటో గ్రాఫర్ల కోరిక మేరకే క్రీడాకారులు తమ మెడల్స్‌ను కొరుకుతూ చిరునవ్వులు చిందిస్తారని అభిప్రాయపడ్డారు. ఇలా మెడల్స్ కొరకడంపై టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించారు. గోల్డ్ మెడల్ గెలుచుకున్న అథ్లెట్ మెడల్ ను కొరుకుతున్నట్లుగా ఉన్న ఫోటోను షేర్ చేసి..'ఇవి తినే మెడల్స్ కావని అధికారికంగా ప్రకటిస్తున్నాం. ఈ మెడల్స్ జపాన్ ప్రజలు విరాళంగా ఇచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైకిల్ చేసి తయారు చేశాం. అందుకే వాటిని కొరకవద్దని చెబుతున్నాం. అయినా వాటిని కొరకాలనుకుంటే నాలుకతో టేస్ట్ చేసి చూడండి.'అంటూ ట్వీట్ చేశారు. దీనికి #UnitedByEmotion అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. -
లగ్జరీ గిఫ్ట్‌లు ఇచ్చిన 24 గంటల్లోనే..
మాస్కో: రియో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన రష్యా క్రీడాకారులు లగ్జరీ గిఫ్ట్‌లు అందుకున్న అనంతరం వాటిని అమ్మకానికి పెట్టడం వివాదాస్పదంగా మారింది. రియోలో పతకాల్ని సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టిన క్రీడాకారులకు అటు ప్రభుత్వం పాటు, పలు సంస్థలు బంఫర్ ఆఫర్లు ప్రకటించాయి. దీనిలో భాగంగా వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం పతక విజేతలకు భారీ స్థాయిలో నగదును రూపంలో నజరానా ఇవ్వడంతో పాటు బీఎండబ్యూ కార్లను కూడా అందజేసింది. అయితే ప్రధానంగా కార్లను అందుకున్న 24 గంటల్లోనే అత్యధిక స్థాయిలో అమ్మకాల ప్రకటనలు ఆన్ లైన్లో దర్శనిమిచ్చాయి. తమ కార్లను అమ్మకానికి సిద్ధంగా ఉంచుతూ పతక విజేతలు ఇచ్చిన ఫోజులు రష్యా ప్రభుత్వంలో ఆందోళన పెంచాయి. క్రీడాకారులకు బహుమతులుగా ఇచ్చిన గిఫ్ట్‌లను ఇలా అమ్ముకోవడాన్ని ప్రభుత్వ పెద్దలు తప్పుబట్టారు. అయితే ఇలా అమ్ముకోవడం తప్పేముందని రష్యా క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కార్లను ఉన్నవారు గిఫ్ట్‌లుగా అందిన కార్లను విక్రయించకపోతే ఏం చేస్తారని 2014 వింటర్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మాక్సిమ్ ట్రాంకోవ్ ప్రశ్నించాడు. తనకు లైసెన్స్ ను పొందడానికి తగిన వయసు లేకపోవడంతో కారును అమ్ముకోవడం ఒక్కటే మార్గమని 17 జిమ్నాస్ట్ సెదా తుఖాల్యాన్ స్పష్టం చేసింది. ఒక బీఎండబ్యూ కారుకు డ్రైవర్ ను పెట్టుకునే స్థోమతకు తనకు లేదని ఆమె పేర్కొంది. ఇలా ఒలింపిక్ మెడలిస్ట్‌లకు లభించిన గిఫ్ట్‌లను అమ్ముకోవడాన్ని నెటిజన్లు సైతం సమర్ధిస్తున్నారు. ఆ గిఫ్ట్ లను ఉంచుకోవాలా?లేదా అనేది ఆయా క్రీడాకారులకు సంబంధించిన హక్కుగా వారు అభిప్రాయపడుతున్నారు.