మాంసం నిషేధంపై మరో సెలబ్రిటీ..
ముంబైలో మాంసం నిషేధం నిర్ణయం పై బాలీవుడ్ సెలబ్రిటీలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా లాంటి స్టార్ హీరోయిన్స్ ఈ విషయం పై ట్విట్టర్లో స్పందించగా, మరో బాలీవుడ్ సెలబ్రిటీ రిషీ కపూర్ కూడా బ్యాన్పై ఘాటుగా స్పందించారు. 'జాగో ఇండియా జాగో, మతం పేరుతో దేశాన్ని ఎటు వైపు తీసుకెళుతున్నారు. రాధే మా, మాంసం పై నిషేధం ఏంటి గోల..?' అంటూ కామెంట్ చేశాడు.
ఇప్పటికే సోనమ్, సోనాక్షిలా కామెంట్స్ పై దుమారం రేగుతుండటంతో రిషీకపూర్ కామెంట్స్ ఆ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. గతంలో స్వామిజీలపై ఇలాంటి కామెంట్సే చేసిన రిషీకపూర్, ఈ సారి మాత్రం కాస్త ఆలస్యంగా స్పందించారు. 'ఆల్ ఈజ్ వెల్' సినిమా తరువాత యురోపియన్ టూర్‌కి వెళ్లిన కపూర్ తిరిగి ముంబై చేరుకోగానే ప్రస్తుత పరిస్థితులపై స్పందించారు.
Jaago India Jaago. Stop all this in the name of religion.All taking the nation for a ride. Kabhi Radhe baby Kabhi meat ban! Kya ho raha hai?
— rishi kapoor (@chintskap) September 9, 2015