Megacity
-
మెగా సిటీగా తిరుపతి
- మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తిరుపతి గాంధీరోడ్డు: తిరుపతిని మెగాసిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో ఉన్న కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో ఆదివారం డివిడెండ్ పంపిణీ కార్యక్రమం పులుగోరు మురళి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోవు తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూడా టీడీపీని గెలిపించే విధంగా అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి రైల్వేస్టేషన్ ఇంటర్నేషనల్ రైల్వేస్టేషన్ అవ్వాలంటే పక్కనే ఉన్న టీటీడీ స్థలాన్ని కేటాయించాలన్నారు. నూతన టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేస్టేషన్ అభివృద్ధికి సహకరించాలన్నారు. కో-ఆపరేటివ్ బ్యాంక్ అభివృద్ధి బాటలో నడుస్తోందని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి బ్యాంక్‌కు రుణాలు వచ్చేలా సహకరిస్తామన్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడ మాట్లాడుతూ రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న టీటీడీ స్థలాన్ని రైల్వేస్టేషన్ నిర్మాణానికి కేటాయిస్తామన్నారు. అవసరమయితే సత్రాలను కూడా రైల్వేస్టేషన్ అభివృద్ధికి ఇస్తామని తెలిపారు. నగరం అభివృద్ధి చెందుతుందంటే ఏ ఫైల్ మీద అయినా సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ 53 వేల మందికి 1 కోటి 20 లక్షల రూపాయల డివిడెండ్ ఫండ్ మంజూరైయిందన్నారు. ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ కో-ఆపరేటివ్ బ్యాంక్ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడేవారని కంట తడిపెడుతూ అలాంటి మనిషి మన మధ్య లేరని పేర్కొన్నారు. అనంతరం డివిడెండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు, టౌన్‌బ్యాంక్ డెరైక్టర్లు, మెంబర్లు పాల్గొన్నారు. -
తిరుపతి అభివృద్ధికి శ్రీవారే దిక్కు
తాగునీరు, చెరువుల అభివృద్ధికి టీటీడీ నిధులు మఠం భూముల్లో ఆక్రమణలన్నీ తొలగిస్తాం రెండేళ్లలో బాలాజీ రిజర్వాయర్ పూర్తిచేస్తాం రూ.250 కోట్లతో తిరుపతిలో మౌలిక వసతులు కల్పిస్తాం త్వరలో అసంపూర్తిగా ఉన్న7,500 ఇళ్లను పూర్తి చేస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి తిరుపతిలో ఆకస్మిక తనిఖీలు తిరుపతి రూరల్: తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేసేందుకు శ్రీవారి నిధులను వినియోగించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తాగునీరు, చెరువుల అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించాలని ఈవో, అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. తిరుపతిలో శుక్రవారం ఆయన పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేశారు. అవిలాలలోని అర్బన్ హౌసింగ్ కాలనీలో అసంపూర్తిగా ఉన్న భవనాలను ఆయన స్వయంగా పరిశీలించారు. కాలనీవాసులను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అవిలాల చెరువులో యథేచ్ఛగా ఆక్రమణలు సాగుతున్నాయని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అసంపూర్తిగా ఉన్న భవనాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చే యడంతో, పురపాలక శాఖ మంత్రి నారాయణ, అధికారులతో కలిసి ఆయన వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన దామినేడు వద్ద బైపాస్ రోడ్డుపైనే విలేకరులతో మాట్లాడారు. తిరుపతిలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు రూ.25 కోట్లను టీటీడీ ఇవ్వాలని ఈవోను ఆదేశించినట్లు చెప్పారు. తిరుపతితో పాటు, చుట్టునపక్కల ఉన్న చెరువులను అభివృద్ధి చేసే బాధ్యతను టీటీడీకి అప్పగించనున్నట్లు వివరించారు. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, నిత్యం గోవింద నామస్మరణ వినిపించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. రానున్న రెండేళ్లలో బాలాజీ రిజర్వాయర్ని పూర్తిచేసి తిరుపతి, తిరుమల వాసుల దాహార్తిని పూర్తిగా తీరుస్తామన్నారు. అందుకోసం ప్రస్తుతం ఉన్న పైపులైన్‌ను మరింత బలోపేతం చేసెందుకు తక్షణమే రూ.10 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పనులకు తిరుమల కొండపైన రాయాల్టీ ట్యాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతి అర్బన్ హాసింగ్లో అసంపూర్తిగా ఉన్న 7,500 ఇళ్లను పూర్తిచేసి, మౌలిక వసతులు కల్పించే ందుకు రూ.250 కోట్లను విడుదల చేయనున్నట్లు వివరించారు. భద్రత చర్యల్లో భాగంగా నగరంలో రూ.10 కోట్లతో 600 నుంచి 700 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. సెంటు భూమి కూడా వదలం ‘‘తిరుపతిలో భూకబ్జాలు పెరుగుతున్నాయి. విలువైన భూముల అన్యాక్రాంతమయ్యాయి. మఠం భూముల్లో ఇష్టారాజ్యంగా అనాధికార భ వ నాలు నిర్మిస్తున్నారు. ఒక్క సెంటు భూమిని కూడా వదలం. అన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అవిలాల చెరువు పక్కన హథిరాంజీ మఠం భూముల్లో అనధికారికంగా నిర్మించిన భవనాలను ఆయన దూరంగా ఉండి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, ఎమ్మెల్యే సుగుణమ్మ, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, డీఐజీ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మెగాసిటీ కోసం..మరో అడుగు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నగరం చుట్టూ పది కి.మీ.ల పరిధిలోని అటవీ భూములను డీ-నోటిఫై చేసి.. సేకరించాలని నిర్ణయిం చింది. అటవీ భూములను గుర్తించి.. డీ-నోటిఫై చేసేందుకు జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఓ కమిటీని నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేయడానికి అవసరమైన మేరకు ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు. ప్రైవేటు భూములను సేకరించడం ఆర్థికంగా సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చింది. ఈ నేపథ్యంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లోని అటవీ భూములను డీ-నోటిఫై చేసి.. వాటిని సేకరించాలని ప్రభుత్వం భావించింది. ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు నేతృత్వంలో అటవీ, రెవెన్యూ, పురపాలకశాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో సెప్టెంబర్ 29న సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు తిరుపతి చుట్టూ పది కి.మీ.ల పరిధిలోని అటవీ భూములు గుర్తించి.. కనీసం పది వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. ఇందుకు జాయింట్ కలెక్టర్ భరత్‌నారాయణ గుప్తా అధ్యక్షులుగా తూర్పు విభాగం డీఎఫ్‌వో శ్రీనివాసులురెడ్డి మెంబర్ కన్వీనర్‌గా, తుడా వీసీ వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డి.సాంబశివరావు, వైల్డ్ లైఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రవికుమార్ సభ్యులుగా ఓ కమిటీని ఏర్పాటుచేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీ తిరుపతి చుట్టూ పది కమీల పరిధిలోని అటవీ భూములను పరిశీలిస్తుంది. శేషాచలం అడవులను బయోస్పియర్(జీవావరణం)గా కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. బయోస్పియర్ పరిధిలోని భూములను డీ-నోటిఫై చేయడానికి కేంద్ర పర్యావరణశాఖ అనుమతించదు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఒక్క ఎకరం భూమిని కూడా సేకరించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ఇతర అటవీ భూములను డీ-నోటిఫై చేయడానికి మార్గం ఉంటుంది. కానీ.. డీ-నోటిఫై చేసిన భూమి మేరకు ప్రభుత్వ భూమిని అటవీశాఖకు అప్పగించాలి. డీ-నోటిఫై చేసిన భూమి పరిధిలో ఉన్న వృక్ష సంపదకు పరిహారాన్ని చెల్లించడంతోపాటు.. అటవీ శాఖకు అప్పగించిన భూమిలో అడవుల పెంపకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది.