memberships
-
తమ్ముళ్లు ఏరి?.. 21 లక్షలకు పడిపోయిన టీడీపీ సభ్యత్వం
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతోందని, పసుపు సైన్యం 70 లక్షలంటూ చంద్రబాబు, ఆ పార్టీ నేతలు కొట్టుకుంటున్న డప్పంతా ఉత్తిదే అని తేలిపోయింది. టీడీపీ గ్రాఫ్ పెరగకపోగా పాతాళంలోకి పడిపోతోందని తేటతెల్లమైంది. ఇందుకు ఆ పార్టీ సభ్యత్వ నమోదే తిరుగులేని రుజువు. పార్టీ సభ్యత్వం 21 లక్షలకు చేరుకుందని స్వయంగా చంద్రబాబే శుక్రవారం జరిగిన ఐ–టీడీపీ సదస్సులో ప్రకటించారు. దీన్నే గొప్పగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ గతంతో పోల్చుకుంటే సభ్యత్వం 70 శాతానికిపైగా పడిపోయింది. అందుకే ఎక్కడా ఈ మధ్య సభ్యత్వ నమోదు ఊసే వినపడడంలేదు. ఐ–టీడీసీ సదస్సులో చంద్రబాబు నోరు జారి అసలు సభ్యత్వాన్ని బయట పెట్టేశారు. దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత పసుపు సైన్యం తెలుగుదేశం పార్టీకి ఉందని గతంలో చంద్రబాబు పదే పదే చెప్పుకునేవారు. చదవండి: Fact Check: రైతులకు ఉచితంగా ఇస్తే తప్పా రామోజీ? అమెరికా సైన్యాన్ని మించి టీడీపీ సభ్యులు ఉన్నారని ఆయన తనయుడు లోకేశ్ గొప్పగా ప్రకటించుకున్నారు. ఇటీవల లోకేశ్ పాదయాత్రలో కూడా 70 లక్షల సైన్యం గురించి ప్రస్తావించారు. ఇప్పుడు అసలు సంఖ్యని చంద్రబాబే చెప్పడంతో ఇన్నాళ్లూ చెబుతున్నవన్నీ కాకమ్మ కబుర్లేనని తేలిపోయింది. ఎన్టీఆర్ శతజయంతి పేరు చెప్పినా పెరగలేదు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఈ ఏడాది సభ్యత్వాలు 70 లక్షలకు మించాలని ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు, వారి బంధువులు, మేధావులు, విద్యావంతులు, ఎన్నారైలు, వివిధ వర్గాల ప్రజలతో సభ్యత్వం చేయించాలని చంద్రబాబు క్యాడర్‌కు నిర్దేశించారు. నియోజకవర్గాలకు రేటింగ్ ఇస్తామని ఇన్‌ఛార్జిలను మభ్యపెట్టారు. చివరికి సభ్యత్వ నమోదులో వెనుకబడిన వారికి సీట్లు ఇవ్వబోమని భయపెట్టారు. అయినా ఉపయోగంలేకపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు, పార్టీ ఇన్చార్జిలు ఎంత కష్టపడినా వందల సంఖ్యలోనే సభ్యత్వం జరిగింది. కుప్పం, మంగళగిరిలోనూ అంతే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, లోకేశ్ ఇన్చార్జిగా ఉన్న మంగళగిరి నియోజకవర్గాల్లోనూ టీడీపీ సభ్యత్వం అంతంతమాత్రమేనని టీడీపీ నేతతే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సభ్యత్వ నమోదును మధ్యలోనే నిలిపివేశారు. చంద్రబాబుపై నమ్మకం లేకపోవడం, మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆశలు లేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా గడప గడపకు అందుతుండటం కూడా టీడీపీ సభ్యత్వ నమోదుపై తీవ్ర ప్రభావం చూపిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 2019 నుంచి పెరగని సభ్యత్వాలు 2019లో టీడీపీ అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచే ఆ పార్టీ సభ్యత్వం రాకెట్ వేగంతో పడిపోయింది. ప్రతి ఏడాది మహానాడుకు ముందు గ్రామస్థాయి నుంచి భారీగా సభ్యత్వ నమోదు చేసేవారు. నియోజకవర్గాలు, జిల్లాల వారీగా సభ్యుల సంఖ్యను ప్రకటించేవారు. చివరిగా మహానాడులో చంద్రబాబు సభ్యత్వ వివరాలను ఘనంగా వెల్లడించేవారు. కానీ అధికారం పోయినప్పటి నుంచి నాలుగేళ్లుగా సభ్యత్వాలు పాతాళానికి దిగజారిపోయాయి. దీంతో మహానాడులో సభ్యత్వాల టాపిక్‌నే లేపేశారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకోవడంతో టీడీపీ బలం పెరిగిపోయిందనే భ్రమలో ఈ సంవత్సరం మహానాడుకు ముందు సభ్యత్వ నమోదు ప్రారంభించారు. గతంలోలా ఉవ్వెత్తున సంఖ్య పెరిగిపోతుందని భావించారు. కానీ అది 21 లక్షలు కూడా దాటలేదు. ఈ సంఖ్యపైనా పార్టీ నేతల్లోనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా రాష్ట్రంలో సభ్యత్వాలు 15 లక్షలు కూడా ఉండవని టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మిగతావి ఐ–టీడీపీ, సీబీఎన్ ఆర్మీ వంటి టీడీపీ సోషల్ మీడియా విభాగాలు, ఎన్నారైల ద్వారా ఆన్లైన్లో వచి్చనట్లు చెబుతున్నారు. -
గంగస్థలం
అక్కడ ఆయన చెప్పిందే వేదం. ఆయన మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు. అలా ఎదురు చెప్తే వారిని మూడో కంటికి తెలియకుండా మట్టికరిపించేస్తాడు. ఇదేదో ఇటీవల వచ్చిన సినీమా కథలా ఉంది కదూ. అంత కాకున్నా... అలాంటి విధానమే ప్రస్తుతం మత్స్యకార సంఘాల్లోనూ నడుస్తోంది. వారికి నచ్చకపోతే సంఘంలో సభ్యత్వం ఉండదు. అది లేకుంటే ఎలాంటి ప్రభుత్వ పథకమూ లభించదు. మరి సభ్యత్వం పొందాలంటే వారిని ప్రసన్నం చేసుకోవాలి. వారి ఆదేశాలకు ఎదురు చెప్పకూడదు. లేదంటే అంతేమరి. బొబ్బిలికి చెందిన మత్స్యకారులైన వీరిపేర్లు ములముంతల తులసి, శ్రీను, గురువులు, పైడిరాజు, సురేష్, గోవింద, పైడిశెట్టి, శేఖర్‌బాబు, త్రినాథ. పదేళ్లనుంచి వీరికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడంలేదు. కారణం ఏమిటంటే వీరికి సంఘాల్లో సభ్యత్వం లేదు. వీరికి సభ్యత్వం ఇచ్చేందుకు స్థానిక సంఘ అధ్యక్షుడు ఒప్పుకోవడం లేదని వీరి ఆరోపణ. సభ్యత్వం కావాలంటే ఖర్చవుతుందనీ, అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందనీ సంఘ సమావేశంలోనే చెప్పడంతో లంచం ఎందుకివ్వాలని వీరు నిలదీయడంతో సభ్యత్వం ఇవ్వట్లేదంట. గతంలో జిల్లా స్థాయి అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటే సంఘాల్లో చేర్చుకోవాలంటూ సిఫార్సు లేఖ రాశారు. వీరు చూపిస్తున్నది ఆ లేఖే! దీనిని పట్టుకుని తిరగని ప్రాంతం లేదు. కలవని అధికారులు లేరు. అయినా వీరికి సభ్యత్వం ఇవ్వలేదు. సభ్యత్వం కావాలంటే రూ.70వేలు ఖర్చవుతుందని బొబ్బిలి సంఘ అధ్యక్షుడు చెప్పారు. ఆ డబ్బులు అధికారులకు ఇవ్వాలని చెప్పారంట. బొబ్బిలి : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ఏ విధమైన ప్రయోజనం కల్పించాలన్నా... అందరికీ అది అందడంలేదు. కారణం ప్రయోజనం పొందాలంటే సంఘంలో సభ్యత్వం ఉండాలి మరి. అలా సభ్యత్వం లేనివారు ఇప్పుడు వేరే కూలి పనిచేసుకుని గడపాల్సిన దస్థితి దాపురించింది. ఇదీ బొబ్బిలిలో సంఘం పరిస్థితి. ఎన్నాళ్ల నుంచో సంఘాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఉన్న స్థానిక అధ్యక్షుడు ఏం చెబితే అంతే అన్న స్థాయిలో మత్స్యకారుల పరిస్థితి ఉంది. సంఘాల్లో ఉంటే ఏటా సబ్సిడీ వలలు, సైకిళ్లు, మోటారు సైకిళ్లు, గూడ్స్ ఆటోలతో పాటు వివిధ సబ్సిడీ రుణాలు అందుతాయి. అవి అందాలంటే మత్స్యకార సంఘాల అధ్యక్షులను ప్రసన్నం చేసుకోవాలి. జిల్లాలో సుమారు 74 సంఘాలున్నాయి. అందులో ఉన్న సభ్యులు గాకుండా ఇతర ప్రాంతాల్లో సుమారు 10వేల మందికి పైగా ఉన్న మత్స్యకారులకు ఎలాంటి సంక్షేమ పథకమూ దక్కడం లేదు. ఎందుకంటే వీరికి సభ్యత్వం కల్పించడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభావితం చూపిస్తున్నారు. దీనివల్ల మత్స్యకార కుటుంబాలకు కనీసం ఆర్థిక సహకారం అందడం లేదు. ఆయా నాయకుల చేతుల్లోనే వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. పరిహారానికి ‘పచ్చ’రంగు మరో పక్క తీరప్రాంత మండలాలైన భోగాపురం, పూసపాటి రేగ మండలాల్లో ఉన్న మత్స్యకారులకు చేపల వేట నిషేధ రోజుల్లో ఇవ్వాల్సిన రూ.4 వేల భృతికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చరంగు పులుముతోంది. నిషేధ సమయాల్లో ఉన్న 450 బోట్లకు పసుపు రంగు వేయాలని వాటికి ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. దీంతో మత్స్య శాఖాధికారులు ప్రస్తుతం సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో పడవలకు పసుపు రంగు వేయని మత్స్య కారులను గుర్తిస్తారు. రంగు వేసిన వారి వివరాలతో పాటు పసుపు రంగేయని వారి వివరాలనూ నెట్లో అప్లోడ్ చేయనున్నారు. ఈ వివరాలను కైజాల యాప్‌లో అప్లోడ్ చేయాలనే ఉత్తర్వులున్నాయని మత్స్య శాఖాధికారులు చెబుతున్నారు. తీరప్రాంత మండలాల్లో సుమారు 30వేల మంది మత్స్య కారులున్నారు. వీరికి ఏప్రిల్ నుంచి వేట నిషేధ సమయంలో నెలకు రూ.4వేలు చొప్పున జూలై వరకూ జీవన భృతిగా ఇవ్వనున్నారు. ఈ భృతి అందాలంటే వారి పడవలకు పసుపు రంగేయాలి. రాజకీయాలు అటు సంఘాధ్యక్షుల పరిధిలోనూ ఇటు రాష్ట్ర ప్రభుత్వ తీరులోనూ నడుస్తుండబట్టే నిరుపేదలయిన గంగపుత్రులకు న్యాయం జరగడం లేదన్నది ఈ తీరును బట్టే తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్య కారులకు రాజకీయాలతో ప్రమేయం లేకుండా వారికి భృతినిచ్చి ఆదుకోవాలనీ, సంక్షేమ పథకాలను అమలు చేయాలనీ కోరుతున్నారు. అవి ప్రభుత్వ నిబంధనలే జిల్లాలో ఉన్న మత్స్యకారులు తమ బోట్లకు పసుపు రంగువేయాలి. అది ప్రభుత్వ నిబంధన. లేకపోతే అవ్వదు. రంగు వేయని మత్స్య కారుల వివరాలను కైజాలా యాప్‌లో పెట్టాలని ప్రభుత్వ ఆదేశం. సంఘాల్లో చేర్పించాలంటే డబ్బులు ఇవ్వనక్కర లేదు. అక్కడున్న సంఘాలకు దరఖాస్తు చేయాలి. లేదా మాకు రాస్తే మేం కమిషనర్‌కు లేఖ రాసి సంఘంలో చోటు కల్పించాలని కోరుతాం. – కె.కనక రాజు, డిప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖ, విజయనగరం -
టీడీపీలో ప్రాథమిక సభ్యత్వాలుండవు
విశాఖపట్టణం: టీడీపీ మహానాడులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ సంస్థాగత నియమావళిలో మార్పులు సూచిస్తూ కనకమేడల రవీంద్రబాబు ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. దీని ప్రకారం ప్రాధమిక, క్రియాశీలక సభ్యత్వాల ప్రక్రియలో మార్పులు చేశారు. ప్రాథమిక సభ్యత్వాల ప్రక్రియను రద్దు చేసి, ఇకపై క్రియాశీలక సభ్యత్వం మాత్రమే చేయాలని తీర్మానించారు. అంతేకాకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షులను ఎప్పుడైనా మార్చే అధికారం జాతీయ అధ్యక్షుడికి కట్టబెడుతూ ఏకగ్రీవంగా ఆమోదించారు.