ప్రతిభ సరే.. భవిత చెప్పరే..?
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ నియామకాలకు మెరిట్ జాబితా విడుదలైనా పూర్తి ఫలితం కోసం అభ్యర్థుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 5వ తేదీన ఎంపిక జాబితా పెడతామని ప్రకటించినా ఇంకా పలు సం దేహాలు వెంటాడుతూనే ఉన్నాయి. జిల్లాలో ఎస్జీటీ, భాషాపండిత్, పీఈటీ పోస్టులకు మాత్రమే ఫలితాలు ప్రకటించారు. అర్హత జా బితాను అందుబాటులో ఉంచారు. జాబితా ప్రకటించిన వివిధ కేటగిరి పోస్టుల అభ్యర్థులు 2,626 మందిలో కొంతమంది పేర్లు గానీ, ర్యాంకులు గానీ ప్రకటించకుండా కేవలం కోర్టు కేసు అంటూ పొందుపరిచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ పోస్టుల పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ ఈ నెల 5లోగా కోర్టు నుంచి పూర్తి సమాచారం అందకుంటే పరిస్థితి ఏమిటన్నదే అనుమానాలకు తావిస్తోంది. దీ నికి సంబంధించి జిల్లా ఎంపిక చైర్మన్ కలెక్టర్కు వివరాలు బుధవారం అందాయి.
డీఎస్సీ నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టుల సంఖ్యకు భర్తీ ప్రక్రి య చేపడుతున్నప్పటికీ వాటి ప్రదేశాలు మారుతున్నాయి. ఇప్పటికే బదిలీలు, పదోన్నతులు ఇతర కారణాలతో ఖాళీ పడిన ప్రదేశాలను వెంటనే తమ కార్యాలయానికి పంపాలంటూ మండల విద్యాశాఖాధికారులకు డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రకటించిన ఖాళీలు మాత్రం అ లాగే ఉన్నా ప్రాంతాలు మాత్రం మారుతున్నాయి. మరో వైపు జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల నుంచి ఖాళీల వివరాలను ప్రత్యేకంగా క్రోడీకరిస్తున్నారు.