డీఆర్డీఏ పీడీని కలిసిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
అనంతపురం సప్తగిరి సర్కిల్ : డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లును ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామూనాయక్ ఆదివారం ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో ఉచిత శిక్షణ అందించేందుకు శిక్షకుల నియమించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. జిల్లాలో 10 వేల మందికి శిక్షణ అందించేందుకు లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. డీఆర్డీఏ సిబ్బంది ద్వారా శిక్షణ ఇచ్చేందుకు వారిని సంప్రదించామని ఈడీ తెలిపారు.