MGR University
-
అక్టోబర్‌లో తారస్థాయికి.. మళ్లీ సంపూర్ణ లాక్డౌన్!
తమిళనాడులో అక్టోబర్ నాటికి కరోనా వైరస్ వ్యాప్తి తారాస్థాయికి చేరుకుంటుందని ఎంజీఆర్ యూనివర్సిటీ జరిపిన సర్వేలో తేలింది. జూలై నాటికి బాధితుల సంఖ్య 2.7 లక్షలు దాటవచ్చని అంచనా వేసింది. సాక్షి, చెన్నై: కరోనా వైరస్ ధాటికి ప్రజలు వణికిపోతున్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే చెన్నై నగరం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. మార్చి 24వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌ను నెలరోజుల క్రితం స్వల్పంగా సడలించారు. చెన్నైలో ఇంకా లాక్డౌన్ కొనసాగుతూనే ఉంది. అయినా వైరస్ వ్యాప్తికి అంతేలేకుండా పోతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోవడమే గాని తగ్గుముఖం పట్టడం లేదు. వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తుందో లేదో ఎవరికీ అంతుబట్టడం లేదు. చెన్నైలో రోజుకు వెయ్యి మందికి పైగా బాధితులుగా మారిపోతున్నారు. ఒక్క చెన్నైలోనే 2.5 లక్షల ఇళ్లు ప్రభుత్వ పర్యవేక్షణ క్వారంటైన్లుగా ఉన్నాయని మంత్రి ఉదయకుమార్ మంగళవారం తెలిపారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా, ఆంక్షలు విధించినా ప్రజలు పాటించకపోవడంతో రాష్ట్రంలో వైరస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 62 వేలు దాటిపోయింది. ఇందులో 42 వేల మంది చెన్నైకి చెందిన వారు కావడం ఆందోళనకరంగా మారింది. చదవండి: 60 వేలు దాటిన కరోనా కేసులు.. మళ్లీ లాక్డౌన్ రాష్ట్రం మొత్తం మీద ఇప్పటివరకు 794 మంది ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలో ఉండేందుకే ప్రజలు భయపడుతూ సుమారు 10 లక్షల మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇతర జిల్లాల్లో సైతం పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. చెన్నై తరువాత మదురై, దిండుగల్లు, వేలూరు, కోయంబత్తూరు, సేలం, ఈరోడ్, కృష్ణగిరి, తిరుప్పూరు, తంజావూరు, తిరుచ్చిరాపల్లి, తిరునెల్వేలి, తూత్తుకూడి, నాగర్‌కోవిల్ జిల్లాల్లో వైరస్ కేసులు పెరిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా, జూలై 15వ తేదీ తరువాత రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2.7 లక్షలను దాటే ప్రమాదం పొంచి ఉందని ఎంజీఆర్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇందులో కేవలం చెన్నైలోనే 60 శాతం మంది వైరస్ బారిన పడుతారని సర్వే స్పష్టం చేసింది. చదవండి: మద్యం ప్రియులకు మరో శుభవార్త అలాగే జూన్ చివరి నాటికి చెన్నైలో 71వేలు, రాష్ట్రమొత్తం మీద 1.2 లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతాయని పేర్కొంది. జూలై 15వ తేదీ తరువాత 1.5 లక్షల మందికి వైరస్సోకే అవకాశం ఉంది. అలాగే జూలై 15వ తేదీనాటికి చెన్నైలో 1,600 మంది వైరస్‌తో మృత్యువాత పడే ప్రమాదం ఉంది. అక్టోబరు నాటికి వైరస్వ్యాప్తి తారస్థాయికి చేరుకోగలదని వర్సిటీ సర్వే అంచనావేసింది. విధిగా మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొంది. మళ్లీ సంపూర్ణ లాక్డౌన్..? రాష్ట్రంలో భయానకంగా మారిన వైరస్ కేసులకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం మళ్లీ సంపూర్ణ లాక్డౌన్ దిశగా ఆలోచిస్తోందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. చెన్నైలో కఠిన నిబంధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా పాజిటివ్ కేసులో జోరుకు కళ్లెం పడలేదు. లాక్డౌన్ ఐదో దఫా సడలింపు ఈనెల 30వ తేదీతో ముగుస్తుండగా తదుపరి చర్యలపై సీఎం ఎడపాడి పళనిస్వామి బుధవారం ఉదయం 10 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అవుతున్నారు. కలెక్టర్ల సూచనలను అనుసరించి జూలై 1వ తేదీ నుంచి రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదా తీవ్రత కలిగిన చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, మధురై..ఈ ఐదు జిల్లాలకు సంపూర్ణ లాక్‌డౌన్‌ను పరిమితం చేయవచ్చని అంచనా. చదవండి: కరోనా భయం.. మానవత్వాన్ని చంపేసింది -
ఆధ్యాత్మిక పాలన అందిస్తా
సాక్షి, చెన్నై: పార్టీ పేరు ప్రకటించి, పూర్తిస్థాయి రాజకీయ ఆరంగేట్రం చేయకముందే.. సూపర్ స్టార్ రజనీకాంత్ తన భవిష్యత్ రాజకీయ మార్గమెలా ఉండబోతోందో స్పష్టం చేశారు. జీవన విధానంలో ఆధ్యాత్మికతను నింపుకున్న రజనీ.. తన రాజకీయ మార్గం కూడా అదే దిశలో ఉండబోతోందని తేల్చి చెప్పారు. కుల, వర్గ వివక్ష లేని ఆధ్మాత్మిక పాలన అందిస్తానని స్పష్టం చేశారు. అదేసమయంలో సుపరిపాలన అందించేందుకు సాంకేతికత, సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుంటానన్నారు.అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్ స్థాయి తనది కాదని, తనే కాదు.. మరో వెయ్యేళ్లయినా ఆ స్థాయి నేత ఉద్భవించబోడన్న రజనీ.. ఎంజీఆర్ తరహాలో అద్భుత పాలన మాత్రం అందించగలనన్నారు. జయలలిత మరణం, కరుణానిధి అనారోగ్యంతో రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఆవరించిందని, దాన్ని తొలగించేందుకే తాను రాజకీయ రంగప్రవేశం చేస్తున్నానని వివరించారు. రాజకీయాలు మాట్లాడక తప్పడంలేదు! ఆధ్యాత్మిక పాలన అంటే ఏంటోనంటూ కొందరు హేళన చేస్తున్నారనీ, అలాంటి వారికి దాని సత్తా ఏంటో చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. చెన్నై పూందమల్లిలోని ఎంజీఆర్ విద్య, పరిశోధన కేంద్రం 30వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం జరిగాయి. ఆ వేడుకలకు హాజరైన రజనీ.. అక్కడ ఎంజీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ‘ఈ వేదికపై రాజకీయాలు మాట్లాడకూడదని అనుకున్నాను. కానీ మాట్లాడక తప్పడం లేదు’ అంటూ రజనీ తన ప్రసంగం ప్రారంభించారు. ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాలను అన్నాడీఎంకే ప్రభుత్వం వాడవాడల్లో ఘనంగా జరిపిందనీ, అయితే ఆయన చిత్ర రంగానికి చెందిన వాడయినప్పటికీ సినిమా వాళ్లతో కలసి వేడుకలు నిర్వహించనే లేదని రజనీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు రాజకీయాలు కొత్తేమీ కాదనీ, ఎంజీఆర్, కరుణానిధి, మూపనార్, చో రామస్వామి వంటి వారిని చూసి రాజకీయాలు నేర్చుకున్నాననీ, ఆ విద్యను ఎప్పుడు ఎలా ప్రయోగించాలో బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. సత్తా ఏమిటో చూపుతా.. ‘రాజకీయాల్లోకి సినిమా వాళ్లు ఎందుకని కొందరు ప్రశ్నించారు. రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించినప్పటినుంచి నాపై ఎన్నో విమర్శలు, ఆరోపణలు, హేళనలు చేస్తున్నారు. నా వయస్సు 67 ఏళ్లు. ఈ వయసులోనూ నటుడిగా నా పని నేను చేసుకుంటుంటే కొందరు నేతలు మాత్రం వారి పని వారు సక్రమంగా చేయడం లేదు. అందుకే నేను ప్రజాక్షేత్రంలోకి రావాల్సి వస్తోంది’ అని రజనీ తన ప్రసంగంలో చెప్పారు. రాజకీయమంటే ముళ్లు, పాములు, రాళ్లు రప్పలతో నిండినదని తనకు తెలుసునన్నారు. ‘నేను రాజకీయాల్లోకి వస్తానంటే అడ్డుకునేందుకు మీరెవ్వరు? తిట్ల రాజకీయాలు ఆపేస్తే మంచిది’ అని ఆయన కొందరిని పరోక్షంగా హెచ్చరించారు. ఆధ్యాత్మికతలో పరమాత్మ ఉందనీ, కుల, మత, జాతుల పరమైన పక్షపాతం లేకుండా నిజాయితీతో సేవ చేయాలన్న తపనే తన రాజకీయం అని రజనీ చెప్పారు. జయలలిత బతికున్నప్పుడు ఎందుకు రాజకీయ ప్రవేశం చేయలేదని ప్రశ్నిస్తున్నారనీ, అప్పట్లోనూ నేతలకు ముచ్చెమటలు పట్టించే సంకేతాలను తాను ఇచ్చిన విషయాన్ని వారు మరచిపోయినట్టు ఉన్నారని రజినీ అన్నారు. ఎంజీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాక అభిమానులతో మాట్లాడుతున్న రజనీ -
మోహన్‌బాబుకు డాక్టరేట్ ప్రదానం
కొరుక్కుపేట (చెన్నై): ప్రముఖ సినీ నటుడు, విద్యావేత్త ఎం.మోహన్‌బాబుకు చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఎంజీఆర్ వర్సిటీ 26వ స్నాతకోత్స వాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2,197 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. అలాగే విద్యారంగానికి విశిష్ట సేవలు అందించినందుకు గాను ఎం.మోహన్ బాబుకు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. తనకు సినీ జన్మనిచ్చిన రాష్ట్రం తమిళనాడని అన్నారు. దర్శక దిగ్గజం దివంగత దాసరి నారాయణరావు తనకు తొలిసారి అవకాశాన్ని ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఎంజీఆర్ పేరు మీదుగా ఉన్న విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంజీఆర్ వర్సిటీ వ్యవస్థాపక చాన్స్‌లర్ ఏసీ షణ్ముగం, డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఏసీఎస్ అరుణ్‌కుమార్‌తో పాటు మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న, కుమారుడు మనోజ్ పాల్గొన్నారు. -
డాక్టరేట్ అందుకున్న మోహన్ బాబు
సాక్షి, చెన్నై: విలక్షణ నటుడు, విద్యావేత్త మోహన్ బాబు చెన్నైలోని ఏంజీఆర్ యూనివర్సిటీ నుంచి బుధవారం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కూతురు మంచు లక్ష్మీ ట్విట్టర్లో తెలియజేశారు. ‘మేము ఈ సందర్భాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్సవ్వం. చెన్నైలో నాన్న ఏంజీఆర్ యూనివర్సటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.’ అని తమ్ముడు మంచు మనోజ్‌తో దిగిన ఫొటోతో పాటు మోహన్ బాబు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో ఉన్న మరో ఫోటోను లక్ష్మీ ట్వీట్ చేశారు. ఇది మోహన్ బాబు సినీ ప్రస్థానం లో మరో మైలు రాయి. మోహన్ బాబు కు ఇదివరకే అమెరికా లోని ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు సినిమా, విద్య రంగాల్లో కృషికి గాను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. 2007 లో ఆయనను భారత ప్రభుత్వం పద్మ శ్రీ తో గౌరవించింది. నటుడిగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న మోహన్ బాబు కు గత ఏడాది బ్రిటిష్ పార్లమెంట్ లో బ్రిటన్ లోని ప్రముఖ భారతీయ వార్తా పత్రిక అయిన 'ఏషియన్ లైట్' వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. ప్రస్తుతం ఆయన నటించి నిర్మిస్తున్న గాయత్రి అనే సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నారు. We definitely could not miss this for the world! Surprised Nana in Chennai as he received his honorary doctorate from MGR University ❤ pic.twitter.com/pMYDkX8WZm — Lakshmi Manchu (@LakshmiManchu) 4 October 2017 -
మోహన్‌బాబుకి ఎంజీఆర్ డాక్టరేట్
మోహన్‌బాబు... నటుడు మాత్రమే కాదు. కులమతాలకు అతీతంగా తమ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో 25 శాతం విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు. సమాజానికి, సినిమాలకు ఆయన చేస్తున్న సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2007లో ‘పద్మ శ్రీ’తో సత్కరించింది. అమెరికాలోని ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’తో పాటు పలు సంస్థలు ఆయన్ను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. తాజాగా ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. చెన్నైలో ప్రసిద్ధి చెందిన ‘ఎంజీఆర్ యూనివర్శిటీ’ వారు మోహన్‌బాబుకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 4న చెన్నైలో ఈ డాక్టరేట్ ప్రదానోత్సవం జరగనుంది. సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం మోహన్‌బాబు ‘గాయత్రి’లో నటిస్తున్నారు. -
మోహన్ బాబుకు మరో గౌరవం
ప్రముఖ నటుడు విద్యావేత్త అయిన మోహన్ బాబు కు ఏం.జి.ఆర్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. అక్టోబర్ 4 న డాక్టరేట్ ప్రధానోత్సవం చెన్నై లో జరగనుంది. ఇది మోహన్ బాబు సినీ ప్రస్థానం లో మరో మైలు రాయి. మోహన్ బాబు కు ఇదివరకే అమెరికా లోని ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు సినిమా, విద్య రంగాల్లో కృషికి గాను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. 2007 లో ఆయనను భారత ప్రభుత్వం పద్మ శ్రీ తో గౌరవించింది. నటుడిగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న మోహన్ బాబు కు గత ఏడాది బ్రిటిష్ పార్లమెంట్ లో బ్రిటన్ లోని ప్రముఖ భారతీయ వార్తా పత్రిక అయిన 'ఏషియన్ లైట్' వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. అదే కార్యక్రమంలో ఆయనకు 'ప్రనామ్' అనే అవార్డు తో సత్కరించి, ఆయన చిత్రాల లోని ఉత్తమ డైలాగులను ప్రచురించిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. మోహన్ బాబు 500 కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన సొంత బ్యానర్ అయిన 'శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్' పై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. తాజాగా ఆయన నటించి నిర్మిస్తున్న గాయత్రి అనే సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నారు. మోహన్ బాబు రాజ్య సభ ఎం.పి. గా కూడా పని చేసారు. ఆయన స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లో కె.జి. నుండి పి.జి. దాక 20,000 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. -
లక్షల్ని బస్తాలకెత్తుతున్నాడు!
ఉజ్వల్ కుమార్ యంగ్ అండ్ డైనమిక్. అందుకే అతడు 2011లో చెన్నైలోని ఎంజీఆర్ యూనివర్శిటీ నుంచి ఐటీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పట్టా అందుకుని బయటికి రాగానే ఉద్యోగం ఇస్తాం రమ్మని పెద్దపెద్ద కంపెనీలు అతడి వెంట పడ్డాయి. వాటన్నిటినీ కాదని ముజఫర్‌పూర్‌లోని తన ఇంటి దారి పట్టాడు ఉజ్వల్. అయితే ఉత్తర బీహార్‌లోని ఆ సొంత పట్టణం అతడికి ఏ విలువా ఇవ్వలేదు! చిన్న పొలం చెక్క కూడా లేనివాడు పట్టభద్రుడైతే ఏంటి? పీహెచ్.డీ చేస్తే ఏంటి అన్నది అక్కడివారి అభిప్రాయం. భూమి ఉన్నవాడే అక్కడ మనిషి. ఆ లెక్కన ఉజ్వల్ మనిషి కాదు. అతడికి సెంటు భూమి కూడా లేదు. మరి ఉజ్వల్ అక్కడికి ఎందుకు వెళ్లినట్లు? వ్యవసాయం చేయడానికి!! వ్యవసాయం తన ప్రాణం అన్నాడు. కౌలుకిస్తే పండించుకుంటానన్నాడు. ఊళ్లో భూములున్నవారు నమ్మలేదు. మోతుబరులకే కావట్లేదు, స్టూడెంటు కుర్రాడివి నీకేం చేతనౌతుందని చీవాట్లు పెట్టి పంపారు. అక్కణ్ణుంచి దగ్గర్లోనే ఉన్న సిరిసియా వెళ్లాడు ఉజ్వల్. అక్కడ భిక్షువులుంటారు. వారికొక పెద్ద ఆరామం ఉందని, ఆ ఆరామం పేరిట కొన్ని భూములు ఉన్నాయని తెలుసుకుని ఆరామం పెద్ద దగ్గరికి వెళ్లాడు. ‘రెండెకరాలు పొలం ఇప్పించండి. బంగారం పండించి ఇస్తాను’ అన్నాడు. ‘పండిన బంగారం నువ్వే ఉంచుకుని, పంటను మాత్రం మాకివ్వు చాలు’ అన్నారాయన. అలా ఉజ్వల్‌కుమార్ బి.టెక్ కాస్తా కౌలుదారుగా మారిపోయాడు. తను మారడమే కాదు, రెండేళ్లలో ఆ చుట్టుపక్కల నిరుద్యోగుల దశను కూడా మార్చాడు. ప్రస్తుతం ఆ యువరైతు నెలసరి ఆదాయం కనీసం 75 వేలు. గరిష్టంగా లక్ష! ఇంతకీ పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రెండ్స్ తలా ఇంత వేసుకున్నారు. వేసిన పంట ఏమిటి? ఒకటి కాదు, రెండు పంటలు. పసుపు కొమ్ములు, కంద. ఉపయోగించిన టెక్నాలజీ ఏమిటి? పెద్దగా ఏంలేదు. హైబ్రిడ్ విత్తనాలు, అధునాతన పద్ధతులు. స్థానికంగా ఇప్పుడతడు నిరుద్యోగ యువకులకు ‘వ్యవసాయ గురు’. ‘నచ్చిన పనే మనల్ని ఎప్పటికైనా నిలబెడుతుంది’ అంటాడు ఉజ్వల్. కానీ అతడిని చాలా త్వరగా నిలబెట్టినట్లుంది. ప్రస్తుతం డెబ్బైఎకరాలలో పంట పండిస్తున్నాడు ఉజ్వల్.