Mi Notebook Pro
-
Mi Notebook Pro X 15 : అదిరే ఫీచర్లతో వచ్చేస్తోంది
షియోమి నుంచి మరో అదిరిపోయే నోట్‌బుక్ వచ్చింది. గతేడాది విడుదలైన సక్సెస్ఫుల్ నోట్‌బుక్ సిరీస్ 15ని మరింతగా అప్డేట్ చేసి ప్రో ఎక్స్‌గా కొత్త వెర్షన్‌ని రిలీజ్‌కి ఎంఐ సిద్ధమైంది. ఫాస్ట్ ఛార్జింగ్ నోట్‌బుక్ ప్రో ఎక్స 15లో అందరినీ ఎక్కుగా ఆకట్టుకునే ఫీచర్లు రెండున్నాయి. అందులో ఒకటి ఛార్జింగ్ స్పీడ్. ఈ నోట్‌బుక్‌తో పాటు 130 వాట్స్ ఛార్జర్‌ని అందించింది. దీంతో కేవలం ఇరవై ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ కెపాసిటీ 80Whrగా ఉంది. ఒక్కసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 11.50 గంటల పాటు పని చేస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే నోట్‌బుక్ ప్రో ఎక్స్ 15లో 15.6 ఇంచ్ డిస్ప్లే ఉంది. నేటి ట్రెండ్‌కి తగ్గట్టు 3.5 కే ఓఎల్ఈడీ టెక్నాలజీని డిస్ప్లేకి జత చేశారు. అయితే పిక్సెల్ డెన్సిటీ విషయంలో ఎంఐ కాంప్రమైజ్ అయ్యింది. కేవలం 221 పీపీఐనే అందించింది. ఇతర ఫీచర్లు విండోస్ 10పై పని చేసే ఎంఐ నోట్‌బుక్ ప్రో ఎక్స్ 15లో గేమింగ్ కోసం నివిడియా జీఈఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 టీఐ గ్రాఫిక్ కార్డుని ఉపయోగించారు. ఇక ప్రాసెసర్‌కి సంబంధించి 11 జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5-11300H ని వాడారు. 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందించారు. డీటీఎస్ టెక్నాలజీతో కూడిన 4 స్పీకర్లు అమర్చారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా బ్రైట్నెస్ను అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ డిస్ప్లే, కీబోర్డులలో అందించారు. రెండు యూఎస్బీ పోర్టులు, ఒక టైప్ సీ పోర్టు, ఒక హెచ్డీఎంఐ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్‌లు ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. జులై 9న ఎంఐ నోట్‌బుక్ ఎక్స్ 15 లాప్‌ట్యాప్ జులై 9 నుంచి అమ్మకానికి సిద్ధంగా ఉంది. 16 జీబీ ర్యామ్ 512 ఇంటర్నల్ మెమోరీ మోడల్ ఇండియన్ మార్కెట్లో రూ. 92,100కు లభించనుండగా 32 జీబీ ర్యామ్, వన్ టెరాబైట్ ఇంటర్నల్ మెమోరీ ఉన్న మోడల్ ధర రూ. 1,15,100గా ఉంది. తొలుత చైనాలో రిలీజ్ చేసి ఆ తర్వాత ఇతర మార్కెట్లకు వస్తామని షియోమీ తెలిపింది. చదవండి : ఆన్లైన్ అంగట్లో లింక్డిన్ యూజర్ల డేటా.. -
షావోమి సూపర్ నోట్‌బుక్
సాక్షి, బీజింగ్: షావోమి వరుస లాంచింగ్ లతోమ దూసుకుపోతోంది. ఎంఐ మిక్స్2, నోట్ బుక్ 3, నోట్ బుక్ ప్రో ల్యాప్‌ట్యాప్‌ను సోమవారం చైనాలో లాంచ్ చేసింది. 15.6 అంగుళాల డిస్ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ , 8వ జనరేషన్ ఇంటెల్‌కోర్ ఐ7 ప్రాసెసర్‌తో నోట్‌బుక్‌ను పరిచయం చేసింది. మూడు వేరియంట్లలో దీన్న విడుదల చేసింది. డ్యూయల్ కూలింగ్ సిస్టం , టచ్‌ప్యాడ్ విత్ ఫింగర్ పింట్ సెన్సర్, మెగ్నీషియం అలోయ్ ఫ్రేమ్ డాల్బీ అట్మోస్ ఇతర ఫీచర్లుగా నిలవనున్నాయి. అలాగే ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో కీబోర్డుతో పోలిస్తే 19 శాతం పెద్దదైన బ్యాక్లిట్ కీబోర్డు దీని సొంతం . అలాగే16జీబీ ర్యామ్, ఫాస్ట్‌చార్జింగ్ ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది. కోర్ ఐ7, 8 జీబీ మోడల్ ధర రూ. 68,700 గాను, ఇంటెల్ కోర్ ఐ5 8 జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.62,800గాను, ఇంటెల్ కోర్ ఐ7 16జీబీ రూ.54,900గాను ఉండనుంది. ఇది త్వరలో చైనాలో విక్రయాలు మొదలుకానున్నాయి. ఇతర మార్కెట్లలో అందుబాటుపై అధికారిక వివరాలకోసం వెయిట్ చేయాల్సిందే.