Mi5
-
షావోమి నుంచి ‘ఎంఐ 5’
న్యూఢిల్లీ: చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ షావోమి తాజాగా ‘ఎంఐ 5’ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.24,999. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.15 అంగుళాల స్క్రీన్ (1080ఁ1920 పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, 16 ఎంపీ రియర్ కెమెరా, 4 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, ఎన్ఎఫ్సీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. నలుపు, బంగారం, తెలుపు రంగుల్లో లభించనున్న ఈ స్మార్ట్‌పోన్స్ ఏప్రిల్ 6 నుంచి ఎంఐ.కామ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. -
ఫింగర్ ప్రింట్ ఫీచర్‌తో ఎంఐ-5!!
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ షియామి త్వరలో తీసుకురానున్న ఎంఐ-5 మోడల్ గురించి ఇప్పుడో ఆసక్తికరమైన వార్త ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఎంఐ-5 మోడల్‌ను షియామి ఫింగర్‌ప్రింట్స్ స్కానర్ ఫీచర్‌తో ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్ మొబైల్ ఫ్రంట్ విభాగంలో ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలను తోసిపుచ్చుతూ చైనా ట్విట్టర్ వీబోలో వెలుగుచూసిన కొన్ని ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల ప్రకారం ఎంఐ-5లో ముందు విభాగంలో కాకుండా వెనుకవిభాగం ఫింగర్ ప్రింట్ ఫీచర్‌ను అమర్చనున్నారని తెలుస్తోంది. తాజాగా వచ్చిన గూగుల్ నెక్సెస్ తరహాలో ఎంఐ-5లో బ్యాక్సైడ్లోనే ఈ ఫీచర్ ఉంటుందని ఈ ఫొటోలు కన్ఫర్మ్ చేస్తున్నాయని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఎంఐ-5 ఫస్ట్‌లుక్‌గా చెప్తున్న ఈ ఫొటోలను బట్టి ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు పూర్తిగా మెటల్ రూపొందించి ఉంటుంది. అయితే ముందువిభాగంలోనే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో ఎంఐ-5 వస్తుందని కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముందువిభాగంలో కాకుండా కేవలం వెనుకవైపు ఈ ఫీచర్ ఉంటుందని తాజా ఫొటోలను బట్టి తెలుస్తుండటం.. ఈ ఫీచర్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ ప్రియులకు చేదువార్తే అంటున్నారు నిపుణులు.