Miami Beach
-
సాగర విలాసం.. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నౌక
అది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద విహార నౌక. పేరు ఐకాన్ ఆఫ్ ద సీస్. పొడవు 365 మీటర్లు. బరువు 2.5 లక్షల టన్నుల పై చిలుకు. 20 డెక్కులు, ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వాటర్ పార్కు, స్విమింగ్ పూల్స్ వంటి లెక్కలేనన్ని ఆకర్షణలు దాని సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే అదో మినీ ప్రపంచం. కళ్లు చెదిరే స్థాయిలో సర్వ సదుపాయాలున్న ఈ లగ్జరీ క్రూయిజ్ ఆదివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 10న అమెరికాలో మియామీ బీచ్‌లో అంగరంగ వైభవంగా జలప్రవేశం చేసింది. ఆదివారం నుంచే వారం రోజుల పాటు తొలి పర్యటనకు బయల్దేరుతోంది. కరీబియన్ దీవుల్ని చుడు తూ ప్రయాణం సాగనుంది. ఈ ట్రిప్‌కు టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడైనట్టు నిర్మాణ సంస్థ రాయల్ కరేబియన్ ప్రకటించింది. ఈ భారీ నౌకలో విశేషాలెన్నో... ► ఈ నౌక నిర్మాణానికి 200 కోట్ల డాలర్లకు పైగా ఖర్చయిందట. ఫిన్లండ్‌లోని మెయర్ తుర్క్ షిప్‌యార్డులో దీని నిర్మాణం జరిగింది. ► ఈ విలాస నౌక టైటానిక్ కంటే ఏకంగా ఐదు రెట్లు పెద్దది. ► ఇందులో ఏకంగా 7,960 మంది హాయిగా ప్రయాణించవచ్చు. 2,350 మంది సిబ్బందితో కలిపి దాదాపు 10 వేల మందికి పైగా పడతారు! ► 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ పార్కు ఈ నౌక సొంతం. ► 16, 17 అంతస్తులను పూర్తిగా వాటర్ పార్కుకే కేటాయించారు. ► వాటిలో లెక్కలేనన్ని వాటర్ గేమ్స్‌ను ఆస్వాదించవచ్చు. ఒళ్లు గగుర్పొడిచే అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నాయట. ఇక ఏడు సువిశాలమైన స్విమ్మింగ్ పూల్స్ అదనపు ఆకర్షణ. ► మరీ గుండెలు తీసిన బంట్లయితే 20వ అంతస్తు నుంచి నేరుగా సముద్రంలోకి డైవింగ్ చేయడం వంటి పలు సాహసాలు కూడా చేయవచ్చు. ► ప్రత్యేకంగా రూపొందించిన ఐస్ ఎరీనాలో స్కేటింగ్ కూడా చేయవచ్చు! మినీ గోల్ఫ్ కోర్సూ ఉంది. ► పలు థీమ్ పార్కులు, సువిశాలమైన 40 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత రుచులన్నింటినీ ఆస్వాదించవచ్చు. వీటిలో 21 కాంప్లిమెంటరీ తరహావి. వాటిలో ఏం తిన్నా, తాగినా అంతా ఉచితమే. ► అత్యాధునిక సినిమా థియేటర్లలో సినిమాలు మొదలుకుని లైవ్ మ్యూజిక్ షోల దాకా అన్నీ అందుబాటులో ఉంటాయి. ► 55 అడుగుల ఎత్తైన ఇండోర్ జలపాతం నౌకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ► ఈ నౌకను పూర్తిగా కలియదిరిగి చూసేందుకే కనీసం 10 రోజులు పడుతుందట! ► ఆదివారం మొదలయ్యే తొలి ప్రయాణం కరేబియన్ దీవుల్లో బహమాస్, హోండురస్ల గుండా ఏడు రాత్రులు, ఆరు పగళ్లు సాగుతుంది. ► ఈ నౌక ప్రధానంగా లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)తో నడుస్తుంది. ► 90 శాతానికి పైగా తాగునీటి అవసరాలను ఆర్వో పద్ధతిలో సముద్ర జలాల ద్వారానే తీర్చుకుంటుంది. ► ఐకాన్ ఆఫ్ ద సీస్లో ప్రయాణానికి ఔత్సాహికులు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. 2022 అక్టోబర్‌లో దీని తొలి ఫొటోలు బయటికి వచి్చనప్పటి నుంచే జనాలు విపరీతంగా ఆసక్తి చూపడం మొదలైంది. టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో పెట్టీ పెట్టడంతోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ► నిజానికిది రెండేళ్ల క్రితమే అందుబాటులోకి రావాల్సిందట. కరోనా కారణంగా ఆలస్యమైంది. ► ఇందులో రకరకాల ప్యాకేజీల్లో 2,805 గదులు, విశాలమైన లగ్జరీ కుపేలు అందుబాటులో ఉంటాయి. ► వాటి ఖరీదు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే! అతి తక్కువ ప్యాకేజీయే 3 వేల డాలర్ల (దాదాపు రూ.2.5 లక్షల) నుంచి మొదలవుతుంది. 2 లక్షల డాలర్లు, అంతకు మించిన ప్యాకేజీలూ ఉన్నాయి! ► ఐకాన్ ఆఫ్ ద సీస్‌ను కూడా తలదన్నే స్థా యిలో స్టార్ ఆఫ్ ద సీస్ పేరుతో మరో అతి విలాసమైన నౌకను నిర్మిస్తామని రా యల్ కరేబియన్ ఇప్పటికే ప్రకటించింది. ► దీనికి ముందు అతి పెద్ద లగ్జరీ నౌకగా రికార్డుకెక్కిన వండర్ ఆఫ్ ద సీస్‌ను కూడా రాయల్ కరేబియనే నిర్మించింది. దాని బరువు 2.35 లక్షల టన్నులు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మియామి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న భారత ఆటగాళ్లు.. ఫోటోలు వైరల్
భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆఖరి రెండు టీ20లు ఫ్లోరిడా వేదికగా జరగనున్నాయి. ఇరు జట్లు మధ్య నాలుగో టీ20 శనివారం జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను వీసా సమస్య వెంటాడుతోంది. వీసా సమస్య కారణంగా గయనా నుంచి కొంత మంది టీమిండియా ఆటగాళ్లు మాత్రమే ప్లోరిడాకు గరువారం చేరుకున్నారు. మరి కొంతమంది శుక్రవారం ఫ్లోరిడాకు చేరుకోనున్నట్లు సమాచారం. అయితే తొలుత యునైటెడ్ స్టేట్స్ చేరుకున్న హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ వంటి భారత ఆటగాళ్లు మియామి బీచ్‌ల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్లోరిడా రాష్ట్రంలో మియామి అతి సుందరమైన నగరం. మియామిలోని ఆహ్లాదాన్ని పంచే అందమైన బీచ్‌లు చాలా ప్రసిద్దిగాంచాయి. కాగా ఇరు జట్లు మధ్య మూడో టీ20 మంగళవారం ముగిసిన తర్వాత శనివారం వరకు మ్యాచ్ లేకపోడవంతో ఆటగాళ్లు అక్కడి బీచ్‌ల్లో సేదతీరుతున్నారు. వీరి ముగ్గురితో పాటు కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ కూడా బీచ్ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆటగాళ్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-1తో లీడ్‌లో ఉంది. మరోవైపు విండీస్‌తో మూడో టీ20లో గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ సాధించాడు. దాంతో అతడు ఆఖరి రెండు టీ20లకు కూడా అందుబాటులో ఉండనున్నాడు. View this post on Instagram A post shared by Shreyas Iyer (@shreyas41) View this post on Instagram A post shared by Ravi Bishnoi (@bishnoi6476) చదవండి: IND vs WI: ఉత్కంఠ రేపుతున్న వీసా సమస్య.. ఫ్లోరిడాకు చేరుకోని భారత ఆటగాళ్లు! -
గుండెలు పగిలేలా రోదనలు.. ఇక సజీవ సమాధిగా మిగిలేనా?
తమవాళ్లు ఏమైపోయారో అని కొందరి రోదనలు. తమవాళ్లు మృత్యుముఖం నుంచి బయటపడతారేమోనని ఆశతో మరికొందరు. ఇంకొందరు సహాయక బృందాలతో కలిసి వెతుకులాట.. మియామీ బిల్డింగ్ కూలిన ఘటనాస్థలంలో కనిపిస్తున్న దృశ్యాలివే. అయితే నిమిషాల వ్యవధిలో జరిగిన దుర్ఘటన వందకు పైగా కుటుంబాల్లో పెనువిషాదం నింపేలా కనిపిస్తోంది. అయితే ఇప్పటిదాకా 150 మందికిదాకా ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన నెలకొంది. మరోపక్క సహాయక చర్యలను నిలిపివేయాలన్న ఆదేశాలతో బాధిత కుటుంబాలు రోదనలు మిన్నంటుతున్నాయి. ఫ్లోరిడా: మియామీ బీచ్ సమీపంలోని ఛాంప్లెయిన్ టవర్స్‌లో మొత్తం 136 అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాటిలో 55 అపార్ట్మెంట్లు గత గురువారం రాత్రి(బుధవారం అర్థరాత్రి దాటాక 1గం.30ని. సమయంలో) కుప్పకూలిపోయాయి. ఆ మరుసటి ఉదయం నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనను 9/11 విషాదంతో పోలుస్తున్నారు కొందరు. కాగా, ఈ ఘటనలో ఇప్పటిదాకా 18 మృతదేహాలను వెలికితీయగా(పిల్లలు కూడా ఉన్నారు).. గాయపడ్డ ఇరవై మందికి పైగా ఆస్పత్రికి తరలించారు. ఇంకా 145 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే శిథిలాల కింద కొందరైనా ప్రాణాలతో ఉండొచ్చేమోనన్న ఆశతో గాలింపు చర్యలు చేపట్టారు. స్నిఫర్ డాగ్స్, రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ సహాయక కార్యక్రమంలో సెలబ్రిటీలు, స్కూల్ పిల్లలు సైతం స్వయంగా వచ్చి పాల్గొనడం విశేషం. మరోపక్క అంతా క్షేమంగా బయటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ తరుణంలో.. శకలాల తొలగింపు నిలిపివేత మియామీ దుర్ఘటనలో శకలాల తొలగింపును నిలిపివేయాలని సర్ప్‌సైడ్ మేయర్ ఛార్లెస్ బర్కెట్ శుక్రవారం ఉదయం ఆదేశించాడు. ఓవైపు తుఫాన్ హెచ్చరికలు.. మరోపక్క శకలాలను తొలగించే క్రమంలో ఒరిగిపోయి ఉన్న మిగిలిన అపార్ట్మెంట్ భాగం కూలిపోయే ప్రమాదం ఉందని ఇంజినీర్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పనులు ఆపేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో బాధిత కుటుంబాల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. వాళ్ల రోదనలతో ఆ ప్రాంతంలో శోక మేఘాలు అలుముకున్నాయి. తమ వాళ్లను శకలాల కిందే చావనివ్వకండని అధికారుల్ని వేడుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బైడెన్ సంఘీభావం కాగా, ఘటనాస్థలాన్ని గురువారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సందర్శించాడు. బాధితుల కుటుంబాలను ఓదార్చడంతో పాటు సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించాడు. కనీసం తమవాళ్ల శవాలైనాన అప్పగించాలని కొందరు బైడెన్‌ను వేడుకోవడం అందరినీ కలిచివేసింది. ఈమేరకు అక్కడి దీనగాథల్ని, పరిస్థితుల్ని వివరిస్తూ.. బైడెన్ ట్విటర్లో పోస్ట్‌లు చేశారు. కారణాలేంటసలు.. ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఉన్న స్థలం ఒకప్పుడు సముద్రపు నీట మునిగి ఉన్న స్థలం అని.. 40 ఏళ్ల క్రితం ఈ బిల్డింగ్‌ను నిబంధనలకు విరుద్ధంగా కట్టారనేది నిపుణుల అభిప్రాయం. అంతేకాదు 2018లో బిల్డింగ్ బేస్మెంట్ బాగా దెబ్బతిందని, ఆ ప్రభావం గోడల మీద కూడా కనిపిస్తోందని ఓ ఇంజినీర్ రిపోర్ట్ ఇచ్చాడు కూడా. అయితే కుట్ర కోణాలను, ఆరోపణలను, అభిప్రాయాలను అధికారులు ఖండిస్తున్నారు. దుర్ఘటన కారణాలపై ఇప్పుడు నిర్ధారణకే రాలేమని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మియామీ దుర్ఘటన.. కుట్ర కోణం?.. ఆయన సూసైడ్‌తో లింక్! -
రూ. 85 లక్షల అరటిపండు అప్పనంగా తినేశాడు
అది మామూలు అరటి పండు. కానీ ఖరీదు మాత్రం సాధారణంగా లేదు. ఇటలీలోని మియామి బీచ్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు పెట్టిన ఓ అరటిపండు ఏకంగా రూ.85 లక్షలు పలికింది. దీన్ని మౌరిజియా కాటెలాన్ అనే కళాకారుడు ప్రదర్శనకు పెట్టగా ఎంతోమంది దాన్ని కొనలేకపోయామని నిరాశ చెందుతూ దానిముందు నిల్చుని ఫొటోలు తీసుకుని సంతృప్తి చెందుతున్నారు. ఎవరు కొన్నారో కానీ అతను సూపర్ హీరో అంటూ నెటిజన్లు ఆయన్ను ఆకాశానికి ఎత్తారు. అయితే అంతలోనే ఈ అరటి పండు కథ అనూహ్య మలుపు తిరిగింది. డేవిడ్ దతున అనే వ్యక్తికి అరటిపండును చూడగానే ఆకలైందో ఏమో గానీ, వెంటనే లటుక్కున నోట్లో వేసుకున్నాడు. అతను చేసిన పనికి అక్కడి జనం నోరెళ్లబెట్టారు. ఓ యువతైతే అతని మీద అరిచినంత పని చేసింది. ‘ఏంటీ, తెలివితక్కువ పని’ అంటూ ఆయనపై ఆగ్రహం వెళ్లగక్కింది. ఊహించని పరిణామానికి అధికారులకు సైతం నోటమాటరాలేదు. ‘ఆకలి గొన్న కళాకారుడు.. అది నేనే’ అంటూ డేవిడ్ తను చేసిన ఘనకార్యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. లక్షలు విలువచేసిన అరటిపండును అప్పనంగా తిన్న డేవిడ్ రియల్ హీరో అంటూ నెటిజన్లు ఆకాశానికెత్తుతున్నారు. ప్రస్తుతం ఆయన విచారణ నిమిత్తం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆ ఒక్క అరటిపండు డేవిడ్‌ను జనాల ముందు హీరోను చేస్తే అధికారుల ముందు దోషిగా నిలబెట్టింది. -
'అరటిపండు' 85 లక్షలకు అమ్ముడైంది..
చిత్రంలో కనిపిస్తున్న ‘గోడకు అంటించిన నిజమైన అరటిపండు’ ఇటలీలోని మియామి బీచ్ ఆర్ట్ గ్యాలరీలో ఏకంగా రూ. 85 లక్షలకు అమ్ముడైంది. ‘కమెడియన్’గా పేరొందిన మౌరిజియో కాటెలాన్ అనే కళాకారుడు ఈ ఆర్ట్‌ను రూపొందించారు. View this post on Instagram 🍌 Maurizio Cattelan's new sculpture 'Comedian' at Art Basel Miami marks the artist's first major debut at an art fair in over 15 years! Comprised of a real banana affixed to the wall with a piece of duct tape, this new work is no different than Cattelan's hyper-realistic sculptures lampooning popular culture and offer a wry commentary on society, power, and authority. In the same vein as Cattelan's America (2016), this piece offers insight into how we assign worth and what kind of objects we value. The idea of this work came to the artist’s mind a year ago. Back then, Cattelan was thinking of a sculpture that was shaped like a banana. Every time he traveled, he brought a banana with him and hung it in his hotel room to find inspiration. He made several models: first in resin, then in bronze and in painted bronze for finally coming back to the initial idea of a real banana. Discover it on our booth D24! — Art Basel Miami Beach 📍 Perrotin Booth D24 📆 December 5 – 9, 2019 — #MaurizioCattelan #ArtBaselMiami #ArtBaselMiamiBeach #ArtBasel #Perrotin — Courtesy Maurizio Cattelan. A post shared by Perrotin Gallery (@galerieperrotin) on Dec 4, 2019 at 5:44am PST -
బీబర్.. నువ్వు మాకొద్దు, వెళ్లిపో..!
అతడి సంగీతపు మత్తులో ఓలలాడిన సంగీత ప్రియులు అతగాడిని మనసుల్లో పెట్టుకొన్నారు. అలాంటిది అతడు డ్రగ్స్ మత్తులో జోగుతున్నాడన్న విషయాన్ని వాళ్లు ఎలా సహించగలరు? బీచ్‌లో డ్రగ్స్తీసుకొంటూ దొరికిపోయాడనే వార్తలను విని వాళ్లు ఎలా తట్టుకోగలరు? ‘‘బీబర్ మేము నీ ఫ్యాన్స్‌మి.. ‘బిలీబర్స్’మి’ అంటూ చెప్పుకుని గొప్పగా మురిసిపోయిన వారంతా... ఇప్పుడు ‘బీబర్ నువ్వు వెళ్లిపో..’ అని అంటున్నారు. ఎందుకంటే... సంగీత ప్రపంచంలో ఆకాశమంత ఎత్తున నిలబడిన జస్టిన్ బీబర్... వ్యక్తిగా విలువలను మరిచి పాతాళానికి పడిపోయాడు! కెనడా వాడైనా అమెరికాలో పాప్‌స్టార్‌గా ఎదిగిన యువకుడు జస్టిన్‌బీబర్. పాప్ మ్యూజిక్‌ను అమృతంగా భావించి, పాప్ సింగర్స్‌ను దేవతలుగా చూసే అమెరికన్లు జస్టిన్ బీబర్‌ను కూడా ఆదరించారు. అభిమానించారు. కానీ ఇటీవల మియామీ బీచ్‌లో డ్రగ్స్ తీసుకొంటూ పోలీసులకు దొరికిపోయిన అతడిని వాళ్లు క్షమించలేకపోతున్నారు. తమ దేశంలో ఉండటానికే వీలు లేదని నినాదాలు చేస్తున్నారు. డ్రగ్స్ మత్తు సంగీతానికి శ్రుతి తప్పించడమే గాక, అతడిని అభిమానించే యువతరాన్ని అపసవ్య మార్గంలో నడిపించే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా అక్కడ బీబర్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకొంటోంది. బీబర్‌ను అమెరికా నుంచి పంపేయమంటూ ఇప్పటి వరకూ దాదాపు రెండు లక్షల మంది పిటిషన్ల మీద సంతకాలు చేశారంటే వారి దృష్టిలో అతడు ఎంతగా దిగజారిపోయి ఉండాలి! కోట్లాది మంది అభిమానులను కలిగిన వ్యక్తిగా తన బాధ్యతను విస్మరించి వ్యవహరించడం వల్లనే ఇలాంటి పరిస్థితి నెలకొందని విశ్లేషకులు చెబుతున్నారు. బీబర్‌కు ఎదురవుతున్న అవమానాలు అతడి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం అని అంటున్నారు. విజయగర్వంతో విలువలకు పాతరేసేవారందరికీ బీబర్ స్థితి ఒక గుణపాఠమని, వెర్రి వేషాలు వేస్తే, అభిమానించేవాళ్ల ఆదరణను కోల్పోక తప్పదని హితబోధ చేస్తున్నారు. బీబర్ ఇప్పటికైనా కళ్లు తెరిస్తే బాగుణ్ను!