Michael Atherton
-
ఇంగ్లండ్ ప్లేయర్లకు ఐపీఎల్ సెగ..!
Mike Atherton: యాషెస్ సిరీస్ 2021-22లో దారుణంగా విఫలమవుతున్న ఇంగ్లండ్ జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఆ దేశ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ ఐపీఎల్‌ను కార్నర్ చేసి ఇంగ్లీష్ ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఐపీఎల్లో ఆడడం కోసం కొందరు ఆటగాళ్లు దేశ బాధ్యతలను పణంగా పెడుతున్నారని విరుచుకుపడ్డాడు. క్యాష్ రిచ్ లీగ్ సహా ఇతర లీగ్‌ల్లో ఆడేందుకు ఇంగ్లీష్ ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరం కాకూడదని, ఇలా జరగకుండా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) చర్యలు తీసుకోవాలని ఆయన సూచించాడు. జేసన్ రాయ్, జోఫ్రా ఆర్చర్, బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్‌లు ఐపీఎల్ కారణంగానే గాయాలపాలై జాతీయ జట్టుకు దూరమాయ్యరని ప్రస్తావించాడు. ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వకుండా.. రొటేషన్ విధానంలో ఏదో ఒక టోర్నీలో ఆడే విధంగా ఈసీబీ షెడ్యూల్ ప్రిపేర్ చేయాలని ఓ కాలమ్‌లో రాసుకొచ్చాడు. అలాగే ఇంగ్లండ్ టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి రూట్‌ను తప్పించి బెన్‌స్టోక్స్‌కు అప్పగిస్తే సత్ఫలితాలు రాబట్టొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కోచ్ సిల్వర్‌వుడ్‌ను సైతం సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. తుది జట్టు ఎంపిక నుంచి గేమ్ స్ట్రాటజీ వరకు కెప్టెన్, కోచ్‌లు దారుణంగా విఫలమవుతున్నారని మండిపడ్డాడు. ఇదిలా ఉంటే, 5 టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జట్టు ఘోర పరాజయాల్ని చవిచూసిన సంగతి తెలిసిందే. చదవండి: రెండో టెస్ట్‌కు ముందు నాలుగు రికార్డులపై కన్నేసిన కోహ్లి -
జో రూట్ స్థానంలో కెప్టెన్‌గా అతడే కరెక్ట్: మాజీ సారథి
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభవంతో ఈ ఏడాదిని ముగించింది ఇంగ్లండ్ జట్టు. బాక్సింగ్ డే టెస్టులో ఇన్నింగ్స్ మీద 14 పరుగుల తేడాతో ఓటమి పాలై ట్రోఫీని ఆతిథ్య ఆస్ట్రేలియాకు అప్పగించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మూడు టెస్టుల్లోనూ కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేక చతికిలపడింది. ఈ నేపథ్యంలో జో రూట్ కెప్టెన్సీ, జట్టు ఎంపిక తీరుపై విమర్శల వెల్లువ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ ఆథర్టన్ రూట్ స్థానంలో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జట్టు పగ్గాలు చేపడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు... ‘‘సెలక్షన్ నుంచి... స్ట్రాటజీ వరకు ప్రతి విషయంలోనూ తప్పిదాలే... వీటన్నింటికీ కెప్టెన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ కెప్టెన్‌గా రూట్ మంచి విజయాలు అందించాడు. గొప్ప సారథి అనిపించుకున్నాడు. కానీ.. ఆస్ట్రేలియాలో రెండు ఘోర పరాభవాలు... యాషెస్‌లో వైఫల్యం... రూట్ స్థానంలో మరొకరు ఆగమనం చేయాల్సిన అవసరం ఉంది. బెన్‌స్టోక్స్ అతడికి ప్రత్యామ్నాయం’’ అని టైమ్స్‌కు రాసిన ఆర్టికల్‌లో తన అభిప్రాయాలు వెల్లడించాడు. అదే విధంగా కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ కూడా ఏమాత్రం ఆకట్టులేకపోయాడని పెదవి విరిచాడు. కాగా స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్‌ను రెండో టెస్టు నుంచి తప్పించడం... జాక్ లీచ్‌కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడం వంటి నిర్ణయాలతో అతడు విమర్శల పాలైన సంగతి తెలిసిందే. చదవండి: IND Vs SA: భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
గంగూలీ.. నీ షర్ట్ తీయకు..
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో గురువారం భారత్-శ్రీలంక మ్యాచ్‌లో కామెంటేటర్స్ మధ్య ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్స్‌గా వ్యవహరించిన భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్లు పాత విషయాలను గుర్తుచేస్తూ నవ్వులు పూయించారు. మ్యాచ్ మధ్యలో కెమెరాలు బిగ్ స్క్రీన్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ను చూపించడంతో మైక్ అథేర్టెన్ గంగూలినీ ఉద్దేశించి ‘ఫ్లింటాఫ్ గ్రౌండ్లో ఉన్నాడు. నీవు షర్ట్‌ను తీసి తిప్పకు అని సరదాగా వ్యాఖ్యానించాడు’. దీనికి గంగూలీ ‘నీవు ఎక్కువగా ఆలోచించకు’ అని సమాధానం ఇవ్వడంతో ఒక్కసారిగా గ్రౌండ్ అంతా నవ్వులు పూసాయి. లార్డ్స్ మైదానంలో జరిగిన 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ గెలుపొందడంతో అప్పుడు కెప్టెన్‌గా ఉన్న గంగూలీ బాల్కనీలో చొక్కా విప్పి విజయాన్ని అస్వాదించాడు. ఈ సన్నివేశం భారత క్రికెట్ చరిత్రలో మధుర ఘట్టంగా నిలిచింది. ఇది ఆండ్రూ ఫ్లింటాప్పై రివేంజ్‌గా దాదా అలా చేశాడని అప్పట్లో అందరూ అభిప్రాయపడ్డారు. అంతకు ముందు భారత్‌తో ఒక వన్డే మ్యాచ్‌లో ఫ్లింటాఫ్ చివరి ఓవర్ బౌలింగ్ చేసి భారత్‌కు కావల్సిని పరుగులను కట్టడిచేసి ఇంగ్లండ్‌కు విజయాన్నందించాడు. దీంతో మైదానంలోనే ఫ్లింటాఫ్ చొక్కా విప్పి తిరిగాడు. ఇది అప్పట్లో వివాదం అయింది. ఈ సన్నివేశాలను దృష్టిలో ఉంచుకొని మైక్ అథర్టన్ పై వ్యాఖ్యాలు చేశాడు.