ఈ వారం యూట్యూబ్ హిట్స్
ట్రైలర్: స్టీవ్ జాబ్స్
నిడివి: 2 ని. 40 సె.
హిట్స్: 28,70,219
స్టీవ్ జాబ్స్‌పై బయోగ్రఫికల్ డ్రామా ఫిల్మ్ వస్తోంది. అక్టోబర్‌లో విడుదల కానున్న ఈ ‘స్టీవ్ జాబ్స్’ చిత్రానికి ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేం డానీ బోయెల్ దర్శకత్వం వహించారు. జర్మన్-ఐరిష్ నటుడు మైఖేల్ ఫాస్బెండర్ స్టీవ్ జాబ్స్‌గా నటించారు. ‘‘ట్రైలర్లో మైఖేల్‌ను చూస్తే అచ్చంగా స్టీవ్ జాబ్స్‌ను చూస్తున్నట్లుగానే ఉంది’’ అంటున్నారు సినీ విశ్లేషకులు. ట్రైలర్లో వినిపిస్తున్న డైలాగులు ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తి రేపుతున్నాయి.
డ్యాన్స్ వీడియో: చానింగ్ టటమ్
నిడివి: 30 సె.
హిట్స్: 23,52,261
హాలీవుడ్ డ్యాన్స్ ఫిల్మ్ ‘సెట్ అప్’తో నటుడు, నృత్యకారుడు చానింగ్ టటమ్కు వచ్చిన పేరు ఇంతా అంతా కాదు. అతని నృత్యరీతులు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. అభిమానులు అతడిని ‘మెగాస్టార్’ అని, ఈ కాలపు ‘జెన్ కెల్లీ’ అని కూడా అంటున్నారు. చానింగ్ సరికొత్త నృత్యరీతుల వీడియో యూట్యూబ్‌లో ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకుంటోంది. 30 సెకండ్లలో 7 డ్యాన్స్ స్టెప్లు వేసి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు చానింగ్.
ట్రైలర్: ఆల్ ఈజ్ వెల్
నిడివి: 2 ని. 49 సె.
హిట్స్: 15,13,813
‘ఓ మై గాడ్’ ఫేమ్ ఉమేశ్ శుక్లా దర్శకత్వంలో రానున్న ‘ఆల్ ఈజ్ వెల్’ పోస్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆగస్ట్‌లో విడుదల కానున్న ఈ చిత్రంలో రిషి కపూర్, అభిషేక్ బచ్చన్లు తండ్రీ కొడుకులుగా నటించారు. ఉమేశ్ శుక్లా సినిమాలో బోలెడు కామెడీ ఉంటుంది. నవ్విస్తూనే మనల్ని ఆలోచనల్లోకి తీసుకువెళతాడు దర్శకుడు. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘ఆల్ ఈజ్ వెల్’. ఈ డైలాగ్‌లాగే సినిమా హిట్ అవుతుందా? లేదా? అనేది చూద్దాం.
ట్రైలర్: క్యాలెండర్ గర్ల్స్
నిడివి: 1 ని. 31 సె.
హిట్స్: 2,16,837
నిజజీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో మాధుర్ బండార్కర్ దిట్ట. ఈ దర్శకుడు ఇప్పుడు ఫేమస్ క్యాలెండర్లకు పోజులు ఇచ్చే మోడల్స్‌పై ‘క్యాలెండర్ గర్ల్స్’ సినిమా తీశాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో గ్రౌండ్‌వర్క్ చేశాడట. క్యాలెండర్ మోడల్స్ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని సినిమా ప్రతిబింబిస్తుంది. బికినీలతో నిల్చున్న అందాల బొమ్మల పోస్టర్ యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. సినిమా ఆగస్ట్ 7న విడుదల కానుంది.
టీజర్: స్నోడెన్
నిడివి: 1 ని. 27 సె.
హిట్స్: 3,25,687
లూకె హర్డింగ్
‘ది స్నోడెన్ ఫైల్స్’ పుస్తకం ఆధారంగా ఇప్పుడు ‘ది స్నోడెన్’ పేరుతో హాలివుడ్ సినిమా రూపుదిద్దుకుంటోంది.ఆలివర్ స్టోన్ దర్శకత్వం వహించారు. ‘ది స్నోడెన్’కు సంబంధించి తాజా టీజర్లో ఎలాంటి దృశ్యాలూ కనిపించవు. అమెరికా జాతీయ జెండా మాత్రం
కనిపిస్తుంది. జెండాపై ఉన్న తెలుపు భాగంలో ‘నిఘా నీడలో... అందరికీ న్యాయం, స్వేచ్ఛ’ అనే క్యాప్షన్ ఒకటి ఆకర్షణీయంగా మెరుస్తుంటుంది.
ట్రైలర్: మసాన్
నిడివి: 2 ని. 32 సె.
హిట్స్: 12,01,474
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘మసాన్’ చిత్రానికి అనూహ్యమైన స్పందన లభించింది. దర్శకుడు నీరజ్‌కు ఇది తొలి సినిమా. ఒక చిన్న పట్టణంలో నలుగురు సాధారణ వ్యక్తుల జీవితం ఆధారంగా ఈ కథ నడుస్తుంది. రీచా చద్దా అభినయానికి మంచి పేరు వస్తోంది. సామాజిక వాస్తవాల ఆధారంగా మరిన్ని సినిమాలు తీయాలనుకుంటున్నాడు నీరజ్. ‘మసాన్’కు ఇప్పటికే మీడియాలో మంచి ప్రచారం లభించింది. సినిమా జూలై 24న విడుదల కానుంది.