Michael Gove
-
తుది దశకు బ్రిటన్ ప్రధాని రేసు
లండన్: బ్రిటన్ ప్రధానిగా థెరిసా మే స్థానంలో కొత్త కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునే ప్రక్రియ గురువారం తుది దశకు చేరుకుంది. పాకిస్తాన్ సంతతికి చెందిన హోం మంత్రి సాజిద్ జావిద్ పోటీ నుంచి నిష్క్రమించగా ఈ పదవికి రేసులో ఉన్న మాజీ విదేశాంగ శాఖ మంత్రి బోరిస్ జాన్సన్ తిరుగులేని మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. రహస్య బ్యాలెట్ల తుది రౌండ్లో బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి జెరెమై హంట్‌ను పర్యావరణ శాఖ మంత్రి మైఖేల్ గోవ్ వెనక్కినెట్టడంతో ఈ రేసులో రెండో స్థానం కోసం జరుగుతున్న యుద్ధం మలుపు తిరిగింది. తాజా సమాచారం ప్రకారం జాన్సన్ 157 ఓట్లతో మొదటి స్థానంలో ఉండగా గోవ్ (61) హంట్ (59) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బ్రిటన్ సీనియర్ మోస్ట్ మంత్రి అయిన జావిద్‌కు మూడవ దశలో కేవలం 34 ఓట్లే వచ్చాయి. ఈ నేపథ్యంలో జాన్సన్, గోవ్ ప్రధాని పదవికి పోటీ పడనున్నారు. తుది ప్రక్రియలో భాగంగా వారు పలు సమావేశాల్లో ఓటర్లనుద్దేశించి ప్రసంగించాల్సి ఉంటుంది. రెండు టీవీ చర్చల్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. జూలై 22న విజేతను ప్రకటించే అవకాశం ఉంది. -
కొత్త పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం
కొత్త డీజిల్, పెట్రోల్ కార్లు, వ్యాన్లపై బ్రిటన్ నిషేధం విధించింది. ఈ వాహనాల అమ్మకాలను 2040 నుంచి నిషేధిస్తున్నట్టు యూకే పర్యావరణ సెక్రటరీ మైఖేల్ గోవ్ ప్రకటించారు. ఎన్నో రోజుల నుంచి వేచిచూస్తున్న ''ఎయిర్ క్వాలిటీ ప్లాన్'' ను బుధవారం బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక 2040 నుంచి అన్ని వాహనాలు, కార్లు పూర్తిగా ఎలక్ట్రిక్‌తో నడిచేవి ఉండేలా ప్లాన్ చేస్తున్నామని గోవ్ చెప్పారు. హైబ్రిడ్ వెహికిల్స్‌తో సహా అన్ని ఇతర ఇంజిన్లతో నడిచే వాహనాలపై నిషేధం విధించనున్నట్టు పేర్కొన్నారు. 2040 నుంచి జీరో ఎమిషన్స్ కార్లే రోడ్లపై నడిచేలా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఎలక్ట్రిక్ కార్ల వైపుకి మరలుతున్న ఈ ప్రక్రియను ఓ మైలురాయిలాగా గోవ్ అభివర్ణించారు. ప్రస్తుతం బ్రిటన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. గోవ్ ఈ ప్లాన్‌ను ప్రకటించిన వెంటనే లగ్జరీ ఆటో కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ కొత్త ఎలక్ట్రిక్ మినీని బ్రిటన్‌లో అసెంబ్లింగ్ చేసినట్టు తెలిపింది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఉద్గారాలపై పోరాటం చేయడానికి మంత్రులు కూడా 225 మిలియన్ పౌండ్ల(రూ.2140 కోట్లకు పైగా) ఫండ్‌ను ఆవిష్కరించారు. ఒకవేళ పర్యావరణానికి ప్రమాదకరమైన నైట్రోజన్ డయాక్సైడ్ను తగ్గించలేకపోయినప్పుడు, స్థానిక అథారిటీలు ఛార్జర్లను ప్రవేశపెట్టేలా లేదా రోజులో కొంత సమయం ఆ వాహనాలపై నిషేధం విధించేలా ప్లాన్ చేస్తున్నారు. 2040 తర్వాత ఉద్గార రహిత వాహనాలనే అమ్మాలని 2011లోనే ఆ దేశ సంకీర్ణ ప్రభుత్వం కార్బన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీనిలోనే 2050 నుంచి ఎలాంటి పెట్రోల్, డీజిల్ కార్లు రోడ్లపై నడవకుండా చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. -
'పీఎం పదవి రేసు నుంచి తప్పుకుంటున్నా'
లండన్: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో లేనని లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ ప్రకటించారు. దేశానికి నాయకత్వం వహించే సమర్థత తనకు లేదని, ఐక్యత దిశగా దేశాన్ని నడిపించలేనని అన్నారు. తాను ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్నానని న్యాయశాఖ మంత్రి, బ్రెగ్జిట్ కు అనుకూలంగా ప్రచారం చేసిన మైఖేల్ గోవ్ ప్రకటించిన తర్వాత బోరిస్ జాన్సన్ రేసు నుంచి తప్పుకోవడం గమనార్హం. హోంమంత్రి థెరెసా మే కూడా ప్రధాని పదవి ఆశిస్తున్నారు. ఐరోపా సమాఖ్య నుంచి విడిపోవాలన్న నిర్ణయానికి బ్రిటన్ ప్రజలు మద్దతు పలకడంతో ప్రధాని డేవిడ్ కామెరాన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ సెప్టెంబర్ 9న కొత్త కామెరాన్ వారసుడిని ఎంపిక చేయనుంది. -
వైన్ స్పాట్
‘ప్రయాణం ఎందుకు చేస్తారు?’ అనే ఒకే ప్రశ్నకు వందలాది సమాధానాలు విని పించవచ్చు. ఎందుకంటే ఎవరి అవసరాల మీద వాళ్లు ప్రయాణాలు చేస్తుంటారు కాబట్టి. కానీ జపాన్‌లోని యునెసన్ స్పా రిసార్టకి వెళ్లేవారిని అడిగితే మాత్రం... ప్రయాణం అనేది ఆరోగ్యం కోసం అంటారు. అవును మరి. యనెసన్ స్పారిస్టార్ట ప్రత్యేకతే అది! ఈ రిసార్ట్‌లో ఉన్నన్ని స్పాలు ప్రపంచంలో మరెక్కడా ఉండవు. అందుకే సేద తీరడానికి, కొత్త ఉత్తేజాన్ని పొందడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. జపాన్‌లోని అషిగరషిమో జిల్లాలో ఉన్న హకోనే పట్టణంలో జనాభా తక్కువ. ప్రకృతి అందాలు ఎక్కువ. ఇక్కడ ఎన్నో ఆర్ట్ మ్యూజియమ్లు కూడా ఉన్నాయి. చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత ఉన్న ఈ పట్టణానికి పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు. అయితే ఈ పట్టణం అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షించడానికి మరో ముఖ్యమైన కారణం... యునెసన్ స్పా రిసార్ట్! ప్రతి ‘స్పా’ ప్రత్యేకమే... యునెసన్ రిసార్ట్‌కు వెళితే చాలు... అది మనల్ని టైమ్ మిషన్‌లో రోమన్ల కాలానికి తీసుకువెళుతుంది. రోమన్ బాత్ చేయిస్తుంది! ‘సూప్ నూడ్ స్పా’ వారెవా అనిపిస్తుంది. ‘‘మొదటిసారి వచ్చినప్పుడు పర్యాటకులలో పెద్దగా ఆసక్తి కనిపించదు. నూడ్ల్స్బాత్ ఏమిటి? విడ్డూరం కాకపోతేనూ అన్నట్లుగా మాట్లాడతారు. ఒకసారి నూడుల్స్ బాత్ చేసిన తరువాత మాత్రం ఆ అనుభవాన్ని జన్మలో మరిచిపోరు’’ అంటాడు స్థానిక నూడుల్ స్టోర్ యాజమానికి ఇచిరో. స్పా రిసార్టలో ఉండే నూడుల్స్ బాత్‌కి ఈయనే నూడుల్స్ సప్లై చేస్తుంటాడు. ఇది కేవలం సరదా కోసమేనా! ఒకింత భిన్నమైన అనుభవాన్ని చవి చూడడానికేనా! కానే కాదు.. చర్మం కాంతిమంతం కావడానికి, జీవక్రియ వృద్ధి చెందడానికి ఈ బాత్ ఉపయోగపడుతుంది అంటాడు ఇచిరో. గ్రీన్ టీ బాత్ అనేది మరో మంచి అనుభవం. ఒక పెద్ద టీ పాట్ నుంచి గ్రీన్‌టీ పూల్‌లోకి పడుతుంటుంది. టంజ్వా, హకోన్ పర్వతాల నుంచి ప్రత్యే కంగా దీని కోసం టీ ఆకులను తెప్పి స్తారు. గ్రీన్ టీ బాత్ వల్ల సానుకూల ఆలోచనలు పెరుగుతాయని, చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెరుగు తుందని అంటారు నిర్వాహకులు. ఇక మరో పెద్ద ఆకర్షణ... వైన్ స్పా. క్లియోపాత్రా తరచుగా వైన్ బాత్ చేసేదట. దీని గురించి కథలు కథలుగా ఈ రిసార్ట్‌లో చెబుతారు. అమెరికన్ బాస్కెట్ బాల్ స్టార్ ప్లేయర్ స్టౌ డెమైర్ మోకాలికి సర్జరీ జరిగింది. అప్పుడెవరో ఆయనకు వైన్ బాత్ గురించి చెప్పారట. మొదట తేలిగ్గా తీసుకున్నప్పటికీ ఆ తరువాత ఆసక్తి పెరిగి కొన్నిరోజుల పాటు రెడ్‌వైన్ బాత్ చేశాడట. దీనివల్ల శారీరకంగా, మానసికంగా తనకు అద్భుత ఫలితం కనిపించింది అంటాడు ఈ ఆటగాడు. ‘వైన్ థెరపీ’ గురించి ఇలాంటి కథనాలు ఇక్కడ చాలా వినిపిస్తాయి. గ్రీన్ టీ బాత్‌లాగే కాఫీబాత్కు కూడా మంచి ఆదరణ ఉంది, చర్మ రుగ్మతలను నయం చేయడానికి కాఫీబాత్ ఉపయోగపడుతుందని నమ్మకం. అలాగే ప్రేమికుల రోజున ‘చాక్లెట్ బాత్’కు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే కాదని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటారు నిర్వాహకులు. శిరోజాలు, రక్తప్రసరణకు ఈ చాక్లెట్ బాత్ మేలు చేస్తుందట. ఇవి మాత్రమే కాదు... ఫుట్ బాతింగ్ ప్లేస్, లార్జ్ హీటెడ్ స్విమ్మింగ్‌పూల్, వాటర్‌ఫాల్ స్పా, కోల్డ్ వాటర్ స్పా, ఫ్లోటింగ్ బాత్, డ్రాగన్ వాటర్ ఫాల్, హాట్ స్ప్రింగ్ కేవ్, చార్కోల్ స్పా, శాంక్చరీ ఆఫ్ వాటర్.... ఇలా ఎన్నో ఆకర్షణలు ఇక్కడ ఉన్నాయి. యునెసన్ రిసార్ట్‌తో పాటు ‘మోరి నో యు’ రిసార్ట్‌కు కూడా హకోనేలో మంచి పేరుంది. దాని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. ఈ స్పాల కారణంగా హకోనేకు వచ్చేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగు తోందని జపాన్ టూరిజం శాఖ చెబు తోంది. హకోనే పేరు చెబితే సందర్శకులు కూడా ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు.‘‘హకోనేకు వెళ్లి వచ్చిన తరువాత కొత్త ఉత్తేజం ఏదో ఒంట్లో చేరినట్లు అనిపిస్తుంది’’ అంటాడు బ్రిటన్‌కు చెందిన పర్యాటకుడు మైఖేల్ గోవ్. విహారయాత్ర ఆరోగ్యాన్ని తెచ్చి పెడుతుంటే వెళ్లకుండా ఉండగలమా అంటాడు మరో సందర్శకుడు. వాళ్లంతా హకోనేను భూలోక స్వర్గం అంటున్నారు.