'పీఎం పదవి రేసు నుంచి తప్పుకుంటున్నా'
లండన్: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో లేనని లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ ప్రకటించారు. దేశానికి నాయకత్వం వహించే సమర్థత తనకు లేదని, ఐక్యత దిశగా దేశాన్ని నడిపించలేనని అన్నారు. తాను ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్నానని న్యాయశాఖ మంత్రి, బ్రెగ్జిట్ కు అనుకూలంగా ప్రచారం చేసిన మైఖేల్ గోవ్ ప్రకటించిన తర్వాత బోరిస్ జాన్సన్ రేసు నుంచి తప్పుకోవడం గమనార్హం. హోంమంత్రి థెరెసా మే కూడా ప్రధాని పదవి ఆశిస్తున్నారు.
ఐరోపా సమాఖ్య నుంచి విడిపోవాలన్న నిర్ణయానికి బ్రిటన్ ప్రజలు మద్దతు పలకడంతో ప్రధాని డేవిడ్ కామెరాన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ సెప్టెంబర్ 9న కొత్త కామెరాన్ వారసుడిని ఎంపిక చేయనుంది.