middle class familes
-
"ధరలు చూసి కొనకుండానే వెళ్లిపోతున్నా.."
-
మధ్యతరగతికి 2వ అనుకూల నగరంగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: మధ్యతరగతి వర్గాలు సౌకర్యవంతంగా జీవించడానికి, తగినంత ఆదాయం పొందడానికి దేశంలోనే ఉత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఇక్కడ మిడిల్ క్లాస్..అటు వ్యయంలోనూ ఇటు పొదుపులోనూ తగినన్ని జాగ్రత్తలు పాటిస్తూన్నారని హోమ్ క్రెడిట్ ఇండియా ‘ది గ్రేట్ ఇండియన్ వాలెట్’ జాతీయస్థాయి అధ్యయనం స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో పలు నగరాల్లో మధ్యతరగతి జీవనం గురించి జరిపిన ఈ అధ్యయనం మన నగరం గురించి వెల్లడించిన ఆసక్తికర అంశాల్లో కొన్ని...👉దేశంలోని దిగువన ఉండే మధ్య తరగతి ప్రజల కోసం అనుకూల నగరంగా హైదరాబాద్ వరుసగా రెండవ సంవత్సరం తన హోదాను నిలబెట్టుకుని రెండో స్థానంలో నిలిచింది. బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. 👉 అత్యధిక వ్యక్తిగత నెలవారీ ఆదాయంతో (రూ.44 వేలు) దిగువ–మధ్యతరగతి జీవనంలో మన నగరం అగ్రస్థానంలో ఉంది, నగరంలో 69 శాతం మంది 2024లో ఎక్కువ ఆదా చేయగలిగారని అధ్యయనం తేల్చింది. 👉 నెలవారీ ఖర్చుల విషయానికి వస్తే, పర్యటనలు/సైట్ సీయింగ్ల కోసం ఆదాయంలో 35శాతం, బయటి ఆహారం కోసం 28 శాతం, సినిమాల కోసం 19 శాతం, ఫిట్నెస్ కోసం 6 శాతం, ఓటీటీ యాప్‌ల కోసం 10 శాతం ఖర్చు చేయడానికి ఇష్టపడుతున్నారు. 👉 ఆన్లైన్ ఆర్థిక మోసాలను తాము విన్నామని/చూస్తున్నామని నగరంలో 41 శాతం మంది ధృవీకరించారు. తామే స్వయంగా ఆన్లైన్ మోసానికి గురయ్యామని 27 శాతం మంది చెప్పారు. ఆరి్థక మోసం చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చే బూటకపు ఫోన్ కాల్స్‌ను/మెసేజ్‌లను అందుకుంటున్నామని 37 శాతం మంది నగరవాసులు తెలిపారు. 👉 సులభంగా రుణ ఊబిలో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయని 31 శాతం మంది, అధిక వ్యయం గురించి భయపడి 28 శాతం మంది, అధిక వడ్డీ రేట్ల కారణంగా 24 శాతం మంది, అధిక ప్రాసెసింగ్ ఇతర అధిక ఛార్జీలు గురించి 7 శాతం మంది యూపీఐపై రుణ సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి ఇష్టపడడం లేదు. 👉 యూపీఐ సేవలకు రుసుములు గానీ వసూలు చేస్తే 64 శాతం మంది తాము దానిని ఉపయోగించడం ఆపివేస్తామని అంటున్నారు. 👉 తమ ఆదాయం గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరంలో పెరిగిందని 52 శాతం మంది చెప్పారు, అలాగే రాబోయే సంవత్సరం నాటికి తమ ఆదాయం ఇంకా పెరుగుతుందని 74 శాతం మంది భావిస్తున్నారు. రాబోయే సంవత్సరంలో తాము మరింత పొదుపు చేయగలమని 66 శాతం మంది మరింత పెట్టుబడి పెట్టగలమని 66 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 👉 నగరంలో సగటు వ్యక్తిగత నెలవారీ ఆదాయం 2023లో రూ.42 వేల నుంచి 44 వేలకు పెరిగింది. అలాగే స్థిర నెలవారీ ఖర్చులు కూడా రూ.19 వేల నుంచి 24 వేలకు పెరిగాయి. 👉 గత ఆరు నెలల్లో 57 శాతం మంది దుస్తులు, ఇతర అవసరార్ధ వస్తువుల కొనుగోలులో మునిగిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. ఇంటి ఖర్చుల కోసం 79 శాతం వెచి్చస్తూ, నగరం ఈ విషయంలో ముంబై (75శాతం)ని అధిగమించింది. 👉 వ్యక్తిగత నెలవారీ ఆదాయం విషయంలో బెంగుళూరు హైదరాబాద్ నగరాలు జాతీయ సగటు కంటే వరుసగా 15 శాతం, 33 శాతం అధిక ఆదాయాలతో ముందున్నాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 👉 ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్ పూణే వంటి నగరాలలో ఆరి్థక మోసాల బారిన పడిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. 👉 నగరంతో సహా ఢిల్లీ–ఎన్.సి.ఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణే, లక్నో, జైపూర్, భోపాల్, పాట్నా, రాంచీ, చండీగఢ్, డెహ్రాడూన్, లుథియానా, కొచి్చతో సహా 17 నగరాల్లో గ్రేట్ ఇండియన్ వాలెట్ ఈ అధ్యయనం నిర్వహించింది. దీని కోసం 18–55 సంవత్సరాల మధ్య వయసు్కలు, వార్షిక ఆదాయం రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల మధ్య ఉన్నవారిని ఎంచుకున్నారు. -
మధ్యతరగతి మందహాసం!
సాక్షి, అమరావతి: దేశంలో నివసించే ప్రతి ముగ్గురిలో ఒకరు మధ్యతరగతి వర్గానికి చెందిన వారే! వారి సంపాదన, ఖర్చులు, పొదుపు దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్నాయి. మన మార్కెట్లు ప్రధానంగా ఆధారపడేది ఈ వర్గంపైనే. రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వీరంతా ప్రస్తుతం 31 శాతం ఉన్నారు. 2004–05లో దేశ జనాభాలో వీరు 14 శాతం మాత్రమే ఉండగా 2021–22 నాటికి రెట్టింపు దాటింది. 2030 నాటికి మిడిల్ క్లాస్ జనాభా 46 శాతానికి, 2047 నాటికి 63 శాతానికి పెరుగుతుందని అంచనా. పీఆర్‌ఐసీఈ (పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జూమర్ ఎకానమీ) సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 63 నగరాల్లో 10 లక్షల జనాభాను ప్రశ్నించి ఐసీఈ 360 సర్వే నిర్వహించారు. నాలుగు విభాగాలుగా.. రూ.30 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలను రిచ్ కేటగిరీగా పరిగణించారు. రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారిని మధ్యతరగతి కేటగిరీగా, రూ.1.25 లక్షల నుంచి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారిని దిగువ తరగతిగా లెక్కించారు. రూ.1.25 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారిని అల్పాదాయ వర్గాలుగా విభజించారు. ఆయా వర్గాల ఇళ్లలో సౌకర్యాలు, కొనుగోలు శక్తిని బట్టి వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఆదాయం, ఖర్చు, పొదుపులో అగ్రభాగం.. ఆదాయార్జన, డబ్బు ఖర్చు చేయడం నుంచి పొదుపు చేయడం వరకు ఆర్థిక వ్యవస్థ చోదకాంశాల్లో మధ్యతరగతి ప్రజలే కీలకపాత్ర పోషిస్తున్నారు. 31% జనాభా ఉన్న మిడిల్ క్లాస్ ప్రజల ద్వారానే దేశంలోని మొత్తం ఆదాయంలో 50% వస్తోంది. 52% ఉన్న దిగువ తరగతి ప్రజలు 25% ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 4% ఉన్న ధనికులు 23% ఆదాయాన్ని అర్జిస్తున్నారు. 15% ఉన్న అల్పాదాయ వర్గాల ఆర్జన కేవలం 2%. మిడిల్ క్లాస్ ప్రజలు 48% మొత్తాన్ని ఖర్చు చేస్తుండగా దిగువ తరగతి ప్రజలు 32%, ధనికులు 17, పేదలు 3% ఖర్చు చేస్తున్నారు. పొదుపులోనూ మిడిల్‌కా>్లస్‌దే అగ్రభాగం. 52 శాతాన్ని ఈ వర్గం ప్రజలే పొదుపు చేస్తున్నారు. 29 శాతాన్ని ధనికులు, 18 శాతాన్ని దిగువ తరగతి, ఒక శాతాన్ని పేదలు పొదుపు చేస్తున్నారు. మిడిల్ క్లాస్‌లో 97 శాతం మంది సీలింగ్ ఫ్యాన్ వినియోగిస్తుండగా 79% మంది ద్విచక్ర వాహనాన్ని కలిగి ఉన్నారు. 93% మంది కలర్ టీవీని, 71% రిఫ్రిజిరేటర్, 30% కారును కొనుగోలు చేస్తున్నారు రూ.1.25 – రూ.5 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన ప్రతి 10 మందిలో ఐదుగురు తప్పనిసరిగా బైక్ వినియోగిస్తున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయం ఉన్న ప్రతి పది కుటుంబాల్లో మూడు కుటుంబాలు కారు వాడుతున్నాయి. రూ.30 లక్షల ఆదాయం దాటిన ధనిక కుటుంబాలు తప్పనిసరిగా ఒక కారును కొనుగోలు చేస్తున్నాయి. కోటీశ్వరుల కుటుంబాల్లో సగటున మూడు చొప్పున కార్లు ఉంటున్నాయి. సూపర్ రిచ్ కుటుంబాల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది. వార్షిక ఆదాయం రూ.2 కోట్లకుపైగా ఉన్న కుటుంబాలను ఈ కేటగిరీలో చేర్చారు. 1994–95లో ఈ కుటుంబాల సంఖ్య 98 వేలు కాగా 2020–21 నాటికి 18 లక్షలకు పెరిగింది. సూపర్ రిచ్ కుటుంబాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అక్కడ 6.4 లక్షల సూపర్ రిచ్ కుటుంబాలున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ 1.81 లక్షల సూపర్ రిచ్ కుటుంబాలతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో గుజరాత్ (1.41 లక్షల సూపర్ రిచ్ కుటుంబాలు), నాలుగో స్థానంలో తమిళనాడు (1.37 లక్షలు), ఐదో స్థానంలో పంజాబ్ (1.01 లక్షలు) ఉన్నాయి. దేశంలో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే నగరాల్లో సూరత్, నాగపూర్ ముందున్నాయి. అక్కడి ధనిక వర్గాలు 1994–95 నుంచి 2020–21 మధ్య బాగా వృద్ధి చెందాయి. -
బయోమెట్రిక్ పద్ధతిన పింఛన్లు స్వాహా!..లబోదిబోమంటున్న బాధితులు
సాక్షి, వెల్గటూర్(ధర్మపురి): వృద్ధాప్యంలో ఆసరా ఉంటుందని రాష్ట్రప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తోంది. అయితే, కొందరు అక్రమార్కులు వీటిని కాజేస్తున్నారు. జిల్లాలోని పలుచోట్ల కొన్ని ఇలాంటివి వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా వెల్గటూర్ మండలంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియలో చాలా మోసాలు జరుగుతున్నట్లు వృద్ధులు, నిరక్షరాస్యులు ఆవేదన చెందుతున్నారు. బయోమెట్రిక్ పరికరంలో పింఛన్‌దారుల వేలుముద్రలు తీసుకుని తమ బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమచేసుకుంటున్నారు. వేలుముద్రలు రావడం లేదని పింఛన్‌దారులను ఇళ్లకు పంపిస్తున్నారు. కొందరు అనుమానంతో బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయిస్తే.. అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో అక్రమార్కులను నిలదీస్తే.. ఏవేవో మాయమాటలు చెబుతూ.. పింఛన్‌దారుల డబ్బులు తిరిగి చెల్లిస్తున్నారు. మండల కేంద్రంతోపాటు స్తంభంపల్లి అనుబంధ కొత్తపల్లిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. (చదవండి: స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. కూతురి పెళ్లిరోజే రాష్ట్రస్థాయి పదవి) -
కేంద్ర బడ్జెట్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం..!
న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు(ఫిబ్రవరి 1న) లోక్ సభలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. అయితే, ఈ బడ్జెట్లో ఆదాయపు పన్ను ప్రస్తుతం విధానంలో ఏదైనా మారుస్తారని అందరూ ఆశించారు. కానీ, ఈ విషయంలో బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. అలాగే, క్రిప్టో కరెన్సీ లాభాలపై కేంద్రం 30 శాతం పన్ను విధించనున్నట్లు ప్రకటించడంతో నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా మీమ్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ సందర్భంగా #Budget2022, #IncomeTax అనే ట్యాగ్స్ సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయ్యాయో.. మిడిల్ క్లాస్ అనే ట్యాగ్ అంతకంటే ఎక్కువగా ట్రెండ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న మీమ్స్ కూడా మీరు చూసేయండి. ఆదాయపన్ను శ్లాబులో ఎటువంటి మార్పులు లేకుండా యథాతథంగా ఉంచేయడంతో మధ్యతరగతి వర్గాలకు నిరాశ ఎదురైందంటూ బడ్జెట్‌పై సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యంతోకూడిన పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆదాయపన్ను గురించి పోస్టులు ట్విట్టర్లో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇంటర్నెట్లో మొత్తంగా ‘మధ్యతరగతి’వర్గాలు బడ్జెట్‌పై స్పందిస్తున్న పోస్టులు టాప్ ట్రెండింగ్‌గా నిలిచాయి. నవ్వు తెప్పించే విధంగా ఉన్న ఆ పోస్టుల్లో కొన్ని... ► డాక్టర్ ప్రశాంత్ మిశ్రా తన ట్విట్టర్ నుంచి.. మధ్యతరగతి వారికి బడ్జెట్లో ఎటువంటి ప్రయోజనాలు లేకపోయినప్పటికీ ప్రతీఏటా ఆశగా ఎదురుచూడటం తప్పట్లేదు అంటూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఫొటోను షేర్ చేశారు. ► ట్రెండూల్కర్ ట్విట్టర్ నుంచి ఆదాయపన్ను పరిమితి పెంపుపై ఇంటి బయటనుంచి లోపలికి ఆశగా ఎదురు చూస్తున్న ఓ వ్యక్తి ఫొటోను షేర్ చేశారు. ► అమిత్ జూనియర్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో ప్రతిఏటా బడ్జెట్ అనంతరం మధ్యతరగతి ప్రజల స్పందన ఇదేనంటూ నిరాశగా ఉన్న అక్షయ్‌కుమార్ ఫొటోను షేర్ చేశారు ► అరవింద్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో బడ్జెట్ గురించి నిర్మలా సీతారామన్‌కు ఓ వేతనజీవి నేరుగా ఫోన్ చేసి సామాన్యుడంటే విలువలేకుండా పోయిందని వాపోతున్న ఫొటోను షేర్ చేశారు Tax payers waiting for the good news...#Budget2022 #incometax pic.twitter.com/b7Ek3DxEZd — सख्याहरी (@sakhyahari) February 1, 2022 Bring it on, FM! I've suffered enough.#BudgetSession2022 #Budget2022 #Budget22 #Memes #budgetmemes pic.twitter.com/hvygDlAsbw — Prashasti Shandilya (@PrashastiiS) February 1, 2022 View this post on Instagram A post shared by Meme Raja (@meme_raaja) View this post on Instagram A post shared by Chai Bisket (@chaibisket) View this post on Instagram A post shared by Stock Market In Telugu (@stockmarkt_telugu) View this post on Instagram A post shared by Stock Market In Telugu (@stockmarkt_telugu) Middle class meme#Budget2022 #BudgetSession2022 pic.twitter.com/fVY58zn0XD — Black Adam 🔥 (@blackadameveee) February 1, 2022 People discussing about #BudgetSession2022..... Me with zero knowledge of finance : pic.twitter.com/rHtiZcnfnL — UmderTamker (@jhampakjhum) February 1, 2022 (చదవండి: PMAY: కొత్త ఇల్లు కొనేవారికి కేంద్రం శుభవార్త..!) -
AP: మిడిల్‌క్లాస్‌కి జాక్'ప్లాట్'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ గూడు ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో తాజాగా మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రతి నియోజకవర్గంలో మిడిల్ క్లాస్ ఇన్కమ్ (ఎంఐజీ) వర్గాలకు మంచి చేయాలనే ఉద్దేశంతో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా మధ్య తరగతి ఆదాయ వర్గాలకు పారదర్శకంగా, వివాదాలు లేని ఇంటి స్థలాలను సకల సదుపాయాలతో అందచేస్తామని చెప్పారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ వెబ్‌సైట్‌ను సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, వైఎస్సార్ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో లే అవుట్ల నిర్మాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏమన్నారంటే.. సరసమైన ధర.. క్లియర్ టైటిల్ రాష్ట్రంలో ప్రతి పేదకూ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఏకంగా 31 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలను ఇప్పటికే పంపిణీ చేశాం. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. వీటి పనులు చక,చకా జరుగుతున్నాయి. మరోవైపు మధ్య తరగతి కుటుంబాలకు కూడా సరసమైన ధరలకే సొంతింటి కల సాకారం కానుంది. రియల్ ఎస్టేట్ మోసాలకు గురి కాకుండా, లాభాపేక్ష లేకుండా, మార్కెట్ ధర కంటే తక్కువకే వివాద రహిత స్థలాలను క్లియర్ టైటిల్‌తో మధ్య తరగతి కుటుంబాలకు (మిడిల్ ఇన్కమ్ గ్రూపు) అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వమే లేఅవుట్ వేసి ఇంటి స్థలాలను అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవడం ద్వారా మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరుగుతుంది. మూడు కేటగిరీలలో స్ధలాలు ఈ పథకం ద్వారా మూడు కేటగిరీలలో ఇంటి స్ధలాలు అందచేస్తాం. ఎంఐజీ –1 (150 గజాలు), ఎంఐజీ –2 (200 గజాలు), ఎంఐజీ –3 (240 గజాలు) స్థలాలను ప్రతి లేఅవుట్లో అందుబాటులో తెస్తాం. తొలిదశలో ధర్మవరం, నవులూరు, రాయచోటి, కందుకూరు, కావలి, ఏలూరులో లేఅవుట్ల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆన్లైన్లో మొదలైన దరఖాస్తుల స్వీకారం జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పథకానికి మంగళవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తున్నాం. తొలిదశలో లేఅవుట్లు వేసిన 6 జిల్లాల్లోనే కాకుండా మిగిలిన అన్ని జిల్లాలతో పాటు ప్రతి నియోజవర్గంలో ఈ పథకం రాబోయే రోజుల్లో విస్తరిస్తుంది. ప్రతి నియోజకవర్గం కేంద్రంలో మధ్యతరగతి కుటుంబాలకు మంచి జరుగుతుంది. ఇదీ వెబ్సైట్ జగనన్న టౌన్‌షిప్స్‌లో ఇంటి స్థలాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన https://migapdtcp.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రూ.18 లక్షల వరకు వార్షికాదాయం ఉన్నవారంతా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. నాలుగు వాయిదాల్లో ఒక ఏడాదిలో డబ్బులు చెల్లించే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. చెల్లింపు పూర్తైన వెంటనే అభివృద్ధి చేసిన ప్లాటును లబ్ధిదారుడి చేతికి అందిస్తాం. ఆన్లైన్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి బొత్స ముందు 10 శాతం చెల్లించాలి స్మార్ట్ టౌన్స్‌లో ఇంటి స్ధలం కోసం దరఖాస్తు చేసుకునేవారు ప్లాటు నిర్ణీత విలువలో 10 శాతాన్ని ముందుగా చెల్లించాలి. అగ్రిమెంట్ చేసుకున్న నెలలోపు 30 శాతం, 6 నెలల్లోపు మరో 30 శాతం, 12 నెలలు లేదా రిజిస్ట్రేషన్ తేదీ లేదా రెండింటిలో ఏది ముందు అయితే ఆ తేదీలోపు మిగిలిన 30 శాతం డబ్బులు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి లబ్ధిదారులకు ప్లాటు అప్పగిస్తారు. వాయిదాల్లో కాకుండా ఒకేసారి మొత్తం డబ్బులు చెల్లిస్తే ఐదు రాయితీ కల్పిస్తారు. ఉద్యోగులకు మాట ప్రకారం.. మొన్న పీఆర్సీ ప్రకటన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చాం. ఆ ప్రకారం ప్రతి లేఅవుట్లో ప్రభుత్వ ఉద్యోగులకు పది శాతం ప్లాట్లను 20 శాతం రిబేట్‌తో ప్రత్యేకంగా కేటాయిస్తాం. ఆదర్శంగా సమగ్ర లేఅవుట్లు జగనన్న స్మార్ట్ టౌన్స్‌లో పట్టణాభివృద్ధి సంస్ధల ద్వారా పట్టణ ప్రణాళికా విభాగం నియమ, నిబంధనలకు లోబడి ఏడాదిలో సమగ్ర లే అవుట్లను అభివృద్ధి చేస్తాం. నిబంధనలను పక్కాగా పాటిస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఇతర రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇవి ఆదర్శప్రాయంగా, మంచి మోడల్ లే అవుట్‌గా నిలుస్తాయి. పారదర్శకంగా కేటాయింపు దరఖాస్తు చేసుకున్న వారికి పూర్తి పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. ఎక్కడా కులం, మతం, ప్రాంతంతో పాటు ఏ రాజకీయ పార్టీ అని చూడం. అలాంటి వాటికి ఆస్కారం లేకుండా కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు ఉంటుంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు. లే అవుట్ల ప్రత్యేకతలు.. స్మార్ట్ టౌన్స్‌లో ప్రభుత్వమే లే అవుట్లు వేస్తోంది. కుటుంబ అవసరాలను బట్టి 150, 200, 240 చదరపు గజాల స్ధలాలను ఎంచుకునే వెసులుబాటు లబ్ధిదారుడికి ఉంటుంది. పర్యావరణహితంగా లేఅవుట్లలో 50 శాతం స్థలాన్ని ఉమ్మడి అవసరాలైన పార్కులు, ప్లే గ్రౌండ్స్, స్కూళ్లు, బ్యాంకులు, షాపింగ్ రిక్రియేషన్ సదుపాయాల కోసం కేటాయిస్తారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఉంటాయి. మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరదనీటి పారుదలకు ఈ కాలనీల్లో అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి. వీధి దీపాలతో పాటు నాణ్యమైన సదుపాయాలుంటాయి. ఎక్కడా, ఎవరూ వేలెత్తి చూపించలేని తరహాలో లేఅవుట్లను అభివృద్ధి చేస్తాం. నిర్వహణకు కార్పస్ ఫండ్ ఇవాళ మనం అభివృద్ధి చేస్తున్న టౌన్‌షిప్స్ భవిష్యత్తులోనూ బాగుండాలి. వీటి నిర్వహణ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ప్లాట్ల ఓనర్ల అసోసియేషన్‌కు అప్పగిస్తాం. పట్టణాభివృద్ధి సంస్ధలతో కలిసి సంయుక్తంగా నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశాం. ఇలాంటి జాగ్రత్తల ద్వారా మంచి లేఅవుట్లు రావాలని, మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరగాలని కోరుకుంటున్నాం. పోటీతో.. బయ్యర్స్ మార్కెట్ జగనన్న స్టార్ట్ టౌన్‌షిప్స్ ద్వారా సరసమైన ధరలకు ఇంటి స్థలాలు అందుబాటులోకి రావడం ద్వారా మార్కెట్లోనూ అలాంటి వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా మిగిలిన లే అవుట్లు వేసేవారు కూడా పోటీగా ధరలు తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంటుంది. దీనివల్ల ధరలు తగ్గి నాణ్యమైన లే అవుట్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ► ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఎంవీ రామమనోహరరావు, ఎంఐజీ లేఅవుట్ స్పెషల్ ఆఫీసర్ బసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పండుగ వేళ.. ‘‘న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేని, అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన, వివాదరహితమైన ఇంటి స్థలాలను జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ పథకం ద్వారా అందిస్తున్నాం. సంక్రాంతి సమయంలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’’ – సీఎం జగన్ బయట కొంటే ఎన్నో ఇబ్బందులు.. పేదలకే కాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా మేలు చేస్తూ మంచి లొకేషన్లో అతి తక్కువ ధరకే ఇంటి స్థలం ఇవ్వడం మంచి పరిణామం. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే స్థలం వస్తుంది. బయట కొంటే మౌలిక సదుపాయాల నుంచి అనేక ఇబ్బందులుంటాయి. కందుకూరు లే అవుట్ చాలా బాగుంది. సొంతింటి కల సాకారం అవుతోంది. –వెంకటేశ్వర్లు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, ప్రకాశం జిల్లా -
కరోనా వైరస్: పైసలు.. ప్రాణాలు తోడేస్తోంది
కరోనా కల్లోలంతో కుటుంబాలు చితికిపోతున్నాయి. ఇన్నాళ్లూ సంతోషంగా గడిపిన కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇంటికి ఆధారమైన కుటుంబ పెద్దను కోల్పోయిన ఆవేదన ఓ వైపు.. వైద్యం కోసం చేసిన లక్షల రూపాయల అప్పులు మరోవైపు.. మానసికంగా కుంగదీస్తున్నాయి. ఇన్నాళ్లు కూడబెట్టిన డబ్బులు ఆస్పత్రుల బిల్లులతో కర్పూరంలా కరిగిపోతున్నాయి. కుటుంబాన్ని నడిపించే తండ్రి, భర్త, కొడుకు.. ఇలా పెద్ద దిక్కును కోల్పోయిన మహిళలు నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ముందు ముందు తమ బతుకులు నడిచేదెట్లాగని ఆందోళనలో మునిగిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల నుంచి బాధితులు మెరుగైన వైద్యం కోసం వరంగల్, హైదరాబాద్ లాంటి నగరాలకు తరలుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రిలో చేరితే చాలు.. కనీసం ఐదారు లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బిల్లులు కట్టాల్సి వస్తోంది. ఇంత మొత్తంలో ఖర్చు చేసినా బతుకుతారనే నమ్మకం ఎవరూ ఇవ్వడం లేదు. ఎలాగైనా కాపాడుకుందామనే ఆశతో బాధితులు అప్పో సప్పో చేసి లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. అయినా ఫలితం లేకుండా పోతోంది. ఆస్పత్రిలో చేరినవారు సైతం.. డబ్బుల బాధతోనే మరింత ఆరోగ్యం దెబ్బతీసుకుంటున్నారు. ఆ ఆందోళనతోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరోవైపు ఎలాగోలా కరోనా నుంచి కోలుకుని బయటపడ్డవారు కూడా.. చికిత్సకు అయిన ఖర్చు, అప్పులు చూసుకుని ఆవేదనలో మునిగిపోతున్నారు. ఇన్నాళ్లూ సంతోషంగా గడిపిన తమ కుటుంబాలను కరోనా అతలాకుతలం చేసిందంటూ కన్నీళ్లు పెడుతున్నారు. – సాక్షి నెట్వర్క్ భర్త కోసం పుస్తెలతాడు అమ్మి.. ఈ పక్క చిత్రంలో ఉన్నది ఉపేందర్ కుటుంబం. మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన ఉపేందర్ కారు నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య రేణుక, ఇద్దరు పిల్లలున్నారు. ఉన్నదాంట్లో ఆనందంగా గడుపుతున్న ఆ కుటుంబంలో ఉపేందర్‌కు గత నెల 15న కరోనా సోకింది. శ్వాస సమస్య తలెత్తడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రెమిడెసివిర్ ఇంజెక్షన్లు ఇస్తే పరిస్థితి కుదుటపడొచ్చని వైద్యులు చెప్తే.. ఒక్కోటీ రూ.35 వేల చొప్పున రూ.2.10 లక్షలు పెట్టి ఆరు ఇంజెక్షన్లు కొన్నారు. చికిత్సకంతా రూ.5 లక్షల వరకు ఖర్చయింది. ఆస్పత్రి బిల్లు చెల్లించేందుకు ఆధారమైన కారును రూ.1.50 లక్షలకు అమ్మారు. రేణుక తన మెడలో ఉన్న పుస్తెలతాడును కూడా అమ్మినా మరో రూ.3 లక్షల దాకా అప్పులు చేయక తప్పలేదు. ఉపేందర్ ప్రాణాలు దక్కినా.. కరోనా దెబ్బతో చిల్లిగవ్వ లేక రోడ్డునపడ్డారు. ప్రస్తుతం ఇంట్లో బియ్యం, కూరగాయలు కొనేందుకూ దిక్కులేని పరిస్థితి. సంతోషంగా జీవిస్తున్న తమ కుటుంబాన్ని కరోనా అతలాకుతలం చేసిందని ఉపేందర్– రేణుక కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘అమ్మ’ను మింగేసింది.. ఈ చిత్రంలో పసిగుడ్డుతో కనిపిస్తున్న వ్యక్తి పేరు రవి. ఇతనిది నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామం. డిచ్పల్లి మండలం ముల్లంగికి చెందిన సంధ్యకు ఏడాదిన్నర క్రితమే వివాహం జరిగింది. మీసేవ కేంద్రంలో నెలకు రూ.6 వేల జీతానికి రవి పనిచేస్తున్నాడు. 20 రోజుల కింద 9 నెలల గర్భిణి అయిన సంధ్యను నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ర్యాపిడ్ టెస్ట్ చేయగా కరోనా నెగెటివ్‌గా వచ్చింది. ప్రసవానికి ఇంకా సమ యం ఉందని వైద్యులు చెప్పడంతో ఇం టికి తిరిగొచ్చారు. తర్వాతి రోజే సంధ్యకు జ్వరం, ఆయాసం మొదలయ్యాయి. ఊపిరిపీల్చుకోవడంలో ఇబ్బం దిగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సీటీ స్కాన్ చేసిన వైద్యులు.. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. వారి సూచనల మేరకు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు కరోనా పాజిటివ్ అని చెప్పారు. డెలివరీ చేసి.. పుట్టిన పిల్లాడిని కుటుంబ సభ్యులకు అప్పగించి, ఆమెకు ఐసీయూలో చికిత్స అందించారు. వారం తర్వాత ఆమె చనిపోయింది. మొత్తంగా సుమారు రూ.10 లక్షలకుపైగా బిల్లులు వేశారు. లక్షలు ఖర్చు చేసినా సంధ్య దక్కకపోవడంతో రవి కుప్పకూలిపోయాడు. తల్లిలేని పసికందును ఎలా సాకాలో తెలియడం లేదని రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. భర్త పోయి.. అప్పులు మిగిలి.. నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్‌కు చెందిన రామోజీ (40) చికెన్ సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. 15 రోజుల క్రితం కరోనా సోకింది. నాలుగు రోజులు హోం క్వారంటైన్లో ఉన్నాడు. కానీ ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బంధువులు హైదరాబాద్‌కు తరలించారు. వివిధ ఆస్పత్రులు తిరగగా.. చివరికి బేగంపేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో బెడ్ దొరికింది. చికిత్స మొదలుపెట్టిన వైద్యులు రూ.10 లక్షలు కట్టాలన్నారు. అవసరాలకు దాచుకున్న డబ్బుతోపాటు బంధువులు, ఆసాముల వద్ద అప్పు చేసి బిల్లు కట్టారు. కానీ మరుసటి రోజే రామోజీ చనిపోయాడు. కుటుంబాన్ని పోషించాల్సిన వ్యక్తే చనిపోవడం ఓవైపు.. చేసిన అప్పులు మరోవైపు ఆ కుటుంబాన్ని కుంగదీశాయి. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. భార్య, కొడుకు పోయి.. అప్పులు మిగిలి.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచనెల్లికి చెందిన వహీద్ పండ్లు, ఐస్‌క్రీంలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పదిహేను రోజుల క్రితం భార్య కుర్షీద్బీ (60), కుమారుడు ఇస్మాయిల్‌కు కరోనా సోకింది. కర్ణాటకలోని బీదర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. దొరికిన దగ్గరల్లా అప్పు చేసి ఆరు లక్షల దాకా బిల్లులు కట్టి, చికిత్స చేయించాడు. అప్పటికీ వారు కోలుకోలేదు. ఈ నెల 9న భార్య, 11న కుమారుడు చనిపోయారు. కోడలు నసీమా, మనవడు సాజిద్ సైతం కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. వారికోసం రోజుకు రూ.20 వేల దాకా బిల్లులు అవుతున్నాయి. అటు భార్య, కుమారుడి ప్రాణాలు దక్కలేదు. ఇటు కోడలు, మనవడు ఆస్పత్రిలో ఉన్నారు. లక్షలకు లక్షలు అప్పు చేశాడు. ఇప్పుడేం చేయాలో తెలియదంటూ వహీద్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఇంటి పెద్దను కోల్పోయి.. ఇల్లూ మిగలని ఆవేదనలో.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన వెల్డండి సత్యనారాయణ రిటైర్డ్ ఉపాధ్యాయుడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. సత్యనారాయణకు ఫస్ట్‌వేవ్‌లో కరోనా సోకింది. మొదట సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేరినా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. 14 రోజులు ఐసీయూలో ఉన్నాక కాస్త కోలుకోవడంతో ఇంటికి వెళ్లారు. అప్పటికే రూ.10 లక్షలకుపైగా ఖర్చయింది. ఇంటికెళ్లాక పది రోజులకే శ్వాస సమస్య మొదలైంది. తిరిగి హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కిడ్నీలు దెబ్బతిని, ఒళ్లంతా నీరు చేరడంతో ఐసీయూలో చేర్చారు. ఫంగస్‌కు చెందిన వ్యాధి వచ్చిందని, ఖరీదైన చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. 45 రోజులు ఐసీయూలో ఉన్నాక సత్యనారాయణ గత ఏడాది అక్టోబర్‌లో మృతి చెందాడు. కరోనా సోకినప్పటి నుంచి చివరిదాకా రూ.50 లక్షల దాకా అప్పులు చేశామని.. అయినా పెద్దదిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్న ఇల్లు అమ్మినా అప్పుతీరే పరిస్థితి లేదని వాపోతున్నారు. బిడ్డ పెళ్లికి దాచిన డబ్బులు కరోనాకు.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం రాయినిపాలానికి చెందిన సామాన్య రైతు యాతం వెంకట్‌రెడ్డి. కొన్నేళ్లుగా కూతురు పెళ్లి కోసం డబ్బులు కూడబెడుతున్నాడు. త్వరలో పెళ్లి చేద్దామనుకున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 18న కరోనా బారినపడ్డాడు. తొలుత మిర్యాలగూడలోని ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా.. పరిస్థితి విషమిస్తుండటంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స కోసం రూ.10.5 లక్షలు ఖర్చయ్యాయి. బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న డబ్బులన్నీ కరోనా వైద్యానికే సరిపోయాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. వానాకాలం సాగుకూ డబ్బుల్లేని పరిస్థితి. ఇప్పుడు బిడ్డ పెళ్లి చేసే పరిస్థితి లేదని ఆవేదనలో పడ్డాడు. కొడుకు చదువెట్లా.. అప్పులు తీర్చేదెట్లా? మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన మోతె గోవర్ధన్ (45) ఓ వాహనాల షోరూంలో పనిచేసేవాడు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు. కూడబెట్టిన కొంత సొమ్ముకు తోడు అప్పులు చేసి ఏడాది కింద బిడ్డ పెళ్లి చేశాడు. కొడుకు చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల కింద గోవర్ధన్‌కు కరోనా సోకింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఏడెనిమిది రోజుల చికిత్స కోసం రూ.5 లక్షల వరకు ఖర్చయింది. కుటుంబ సభ్యులు అందినకాడ అప్పులు చేసి బిల్లు కట్టారు. కానీ గోవర్ధన్ మృతిచెందాడు. ఇటు కుటుంబ పెద్ద చనిపోయి.. అటు అప్పులు మిగిలి ఆ కుటుంబం చితికిపోయింది. కొడుకు చదువు ఎలా, అప్పులు తీర్చేదెలా అని గోవర్ధన్ భార్య హేమలత కన్నీళ్లు పెట్టుకుంటోంది. రూ.13 లక్షలు ఖర్చయినా ప్రాణం దక్కలేదు నిర్మల్ జిల్లా భైంసా మండలం పేండ్‌పెల్లికి చెందిన గజ్జారాం బీడీ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య, పన్నెండేళ్ల కుమారుడు ఉన్నారు. కొద్దిరోజుల కింద గజ్జారాం కరోనాబారిన పడటంతో భైంసా ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గజ్జారాంను ఎలాగైనా బతికించుకోవాలని ఆయన భార్య లావణ్య దొరికిన కాడ అప్పులు చేసి ఆస్పత్రి బిల్లులు కట్టింది. కానీ ఆయన చికిత్స పొందుతూ చనిపోయాడు. కుటుంబాన్ని పోషించే గజ్జారాం చనిపోవడంతో అప్పులు తీర్చే బాధ్యత లావణ్యపై పడింది. అప్పులెలా కట్టాలి, కుమారుడి భవిష్యత్తు ఏమిటి అన్న ఆందోళనతో ఆమె కుంగిపోతోంది. ఈ కుటుంబానికి దిక్కెవరు? వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన న్యాలం సంతోష్ (28) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబం. ఆయనకు భార్య అర్చన, ఆరేళ్ల కుమార్తె తన్విత, మూడేళ్ల కుమారుడు ఆదర్శ్ ఉన్నారు. గత నెల 28న సంతోష్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న సంతోష్‌కు.. ఈ నెల 2న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలయ్యాయి. వెంటనే వరంగల్‌లోని ఓ ప్రెవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐదు రోజుల చికిత్స తర్వాత తుదిశ్వాస విడిచాడు. ఆస్పత్రి ఖర్చులు, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, మందుల కోసం రూ.5లక్షల దాకా ఖర్చయ్యాయి. సంతోష్ కన్నుమూయడంతో కుటుంబం రోడ్డునపడింది. ఉన్న ఆటో అమ్మేసినా అప్పులు తీరలే. అప్పులెలా కట్టాలి, పిల్లల్ని ఎలా పోషించాలని అర్చన కన్నీళ్లు పెట్టుకుంటోంది. చితికిపోతున్న కుటుంబాలెన్నో? కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచకు చెందిన పొన్నాల పర్శరాములు (33)కు గత నెల 19న జ్వరం రావడంతో కరోనా టెస్టు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. మందులు వాడినా జ్వరం తగ్గకపోవడంతో 24న సీటీ స్కాన్ తీయిస్తే.. కరోనా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తేలింది. తొలుత కామారెడ్డిలో, తర్వాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. రూ.18 లక్షలు ఖర్చుపెట్టినా తమ పర్శరాములు బతకకపోవడంతో తల్లిదండ్రులు, భార్య, ఆరేళ్లలోపు వయసున్న ఇద్దరు చిన్నారులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్‌కు చెందిన కూరాకుల రవికి 15 రోజుల క్రితం కరోనా సోకి.. శ్వాస సమస్యలు తలెత్తాయి. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుూ కోలుకుంటున్నాడు. ఇప్పటివరకు చికిత్స కోసం రూ.9 లక్షలకు పైగానే ఖర్చయింది. కేవలం రెండెకరాల భూమిలోవ్యవసాయం చేసుకుని బతికే రవిపై ఇంత ఆర్థికభారం పడటంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన భోగ గంగాధర్‌కు నెల రోజుల కింద కరోనా సోకి.. ఊపిరితిత్తుల సమస్య వచ్చింది. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. రూ.13 లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదని కుటుంబ సభ్యులు ఆవేదనలో పడ్డారు. -
బంగారం ఉండగా.. చింత ఎందుకు దండగ!
సాక్షి, హైదరాబాద్ : వరుసగా మూడు నెలల లాక్‌డౌన్‌తో అన్ని రంగాలూ ఆర్థిక సంక్షోభంలో పడ్డాయి. ఫలితంగా ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తీవ్రమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు అప్పు పుట్టడం మరింత కష్టమైంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మెజార్టీ కుటుంబాలు బంగారు రుణాలవైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రైవేటు బ్యాంకుల వైపు కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ ఉండటం, నిబంధనలు సైతం సంతృప్తికరంగా ఉండటంతో రుణాలు పొందాలనుకుంటున్న 90 శాతం మంది జాతీయ బ్యాంకులవైపే పరుగులు పెడుతున్నారు. అరగంటలో బంగారు రుణం.. కోవిడ్-19 పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ అత్యధిక రుణాలు ఇచ్చేలా బ్యాంకులను ఆదేశించింది. వాస్తవ ప్రణాళికతో పాటు కోవిడ్-19 ప్రొగ్రామ్ కింద బంగారు రుణాలను ఇబ్బడిముబ్బడిగానే ఇస్తున్నాయి. ఇతర రుణాలతో పోలిస్తే బంగారంపై రుణాల మంజూరీ బ్యాంకులకు లాభాన్ని చేకూర్చేవే.. దీంతో వీటిపై పెద్దగా షరతులు లేకుండా రుణాలు ఇస్తున్నాయి. సగటున ఒక బ్యాంకులో బంగారు రుణం పొందేందుకు అరగంట నుంచి గంట సమయంలో మంజూరవుతోంది. జాతీయ బ్యాంకుల్లో బంగారు రుణంపై వడ్డీ 85 పైసల్లోపే ఉంటుంది. అయితే బంగారు రుణంపై ముందుగా బ్యాంకర్‌కు సమాచారమిస్తే టోకెన్లు జారీ చేస్తూ వాటి ఆధారంగా రుణాలు ఇస్తున్నారు. బ్యాంకుల్లో భౌతిక దూరం పాటించే క్రమంలో టోకెన్లు ఇస్తున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. 38 శాతం పెరుగుదల.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువమంది బంగారు రుణాల తాకట్టు వైపు చూస్తున్నారు. ఇప్పట్లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గేలా లేదు. దీంతో శుభకార్యాలు, పెళ్ళిళ్లు జరిగే అవకాశం తక్కువగా ఉండటం, ఒకవేళ ఈ కార్యక్రమాలు జరిగినప్పటికీ పెద్ద సంఖ్యలో జనాలు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దానికి తోడు ఎక్కువగా నగలు వేసుకుని వెళ్లే వేడుకల హాజరుకు మెజారిటీ జనం జంకుతున్నారు. ఈ సమయంలో బంగారం ఇళ్లలో ఉండటం కంటే బ్యాంకుల్లో ఉంటే భద్రత ఉంటుందనే భావన.. దానికి తోడు ఆర్థిక అవసరాలను సైతం అధిగమించవచ్చనే ఆలోచనతో బంగారు రుణాలవైపు మొగ్గు చూపుతున్నారు. 3 నెలల్లో బంగారు రుణాలు తీసుకునే వారి సంఖ్య 38% పెరిగినట్లు ఓ అధికారి తెలిపారు. గతంలో రోజుకు సగటున ఒక బ్యాంకులో 6-10 మందికి కొత్తగా బ్యాంకు రుణాలిస్తుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 8-12కు పెరిగిందని బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ మేనేజర్ పాతూరి వెంకటేశ్‌గౌడ్ ‘సాక్షి’తో అన్నారు. రెన్యువల్స్ జోరు.. బంగారు ఆభరణాలపై రుణ పరిమితి పెరిగింది. ఇదివరకు గ్రాము బంగారంపై రూ.2,200 వరకు రుణం ఇవ్వగా.. ప్రస్తుతం ఈ పరిమితిని రూ.3,200కు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయించింది. దీంతో ఇదివరకే బ్యాంకు రుణాలు తీసుకున్న వారు.. ఆ ఖాతాను రెన్యువల్ చేసుకుంటూ అదనపు రుణాన్ని పొందుతున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. బంగారు రుణం గడువు గరిష్టంగా 12 నెలల కాల పరిమితి ఉంటుంది, ఈక్రమంలో కాలపరిమితి ముగిసిన వారు సైతం తిరిగి రెన్యువల్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గోల్డ్ లోన్లలో 85 శాతం రెన్యువల్ చేసుకుని తిరిగి అదనపు రుణాన్ని పొందినట్లు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ బీఓబీ మేనేజర్ ఒకరు వ్యాఖ్యానించారు. లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా వేతనం అందలేదు. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపులతో ఉద్యోగంలో చేరినప్పటికీ వచ్చే వేతనంతో ఆర్థిక సమస్యలు తీరేలా లేవు. దీంతో కొత్తగా అప్పులు చేస్తే వడ్డీ భారం తలకు మించినట్లవుతుందని భావించి బంగారు రుణం కోసం బ్యాంకును ఆశ్రయించాడు. గంటసేపట్లో రూ.60 వేల రుణం 72 పైసల వడ్డీకే పొందాడు. ఆర్థిక సమస్యలను అధిగమిస్తూ వాయిదాల పద్ధతిలో బంగారు రుణాన్ని చెల్లించేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాడు. -అనిల్‌కుమార్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి -
వీరినీ ఆదుకోండి
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అల్పాదాయ మధ్య తరగతి కుటుంబాలకు ప్రయోజనం కలగడం లేదు. ముఖ్యంగా ఏడాదికి లక్షా యాభై వేల రూపాయలకు పైబడిన ఆదాయం ఉన్న వారి విషయానికివస్తే, ప్రభుత్వం పేదలకు అం దిస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకం వీరికి వర్తించ దు. మధ్య తరగతి ప్రజలు ఏడాదికి రూ. రెండు, మూడు లక్షలు సంపాదిస్తున్నా నిత్యావసరాల ధరలు, పెరిగిన ఇంటి అద్దెలు, పిల్లల చదువుకు ఫీ జులు కట్టలేక వైద్య ఖర్చులు భ రించలేక ఇబ్బందులు పడుతుం టారు. సమాజంలో నిరుపేదల బతుకు కన్న అటు ఇటు కాని మధ్య తరగతి ప్రజల జీవితం రాను రానూ దుర్భరమైపోతోంది. కాబట్టి ప్రభు త్వాలు మధ్యతరగతి ప్రజల బతుకులపై అధ్య యనం చేయించి వారికి న్యాయం చేయాలని, సంక్షేమ పథకాలను వీరికీ వర్తింపచేయాలని విజ్ఞప్తి. - గర్నెపూడి వెంకట రత్నాకర్‌రావు, వరంగల్