మధ్యతరగతికి 2వ అనుకూల నగరంగా హైదరాబాద్‌ | middle class Family To Best In Hyderabad | Sakshi
Sakshi News home page

మధ్యతరగతికి 2వ అనుకూల నగరంగా హైదరాబాద్‌

Published Thu, May 23 2024 7:49 AM | Last Updated on Thu, May 23 2024 7:49 AM

middle class Family To Best In Hyderabad

సగటు నెలవారీ ఆదాయంలో టాప్‌

ఆన్ లైన్ ఆర్థిక  మోసాల బాధితులూ ఎక్కువే..

ఆదాయం మరింత పెరుగుతుందని మధ్యతరగతి ఆశాభావం

వెల్లడించిన గ్రేట్‌ ఇండియన్‌ వాలెట్‌ అధ్యయనం

సాక్షి, హైదరాబాద్‌: మధ్యతరగతి వర్గాలు సౌకర్యవంతంగా జీవించడానికి, తగినంత ఆదాయం పొందడానికి దేశంలోనే ఉత్తమ నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. ఇక్కడ మిడిల్‌ క్లాస్‌..అటు వ్యయంలోనూ ఇటు పొదుపులోనూ తగినన్ని జాగ్రత్తలు పాటిస్తూన్నారని హోమ్‌ క్రెడిట్‌ ఇండియా ‘ది గ్రేట్‌ ఇండియన్‌ వాలెట్‌’ జాతీయస్థాయి అధ్యయనం స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో పలు నగరాల్లో మధ్యతరగతి జీవనం గురించి జరిపిన ఈ అధ్యయనం మన నగరం గురించి వెల్లడించిన ఆసక్తికర అంశాల్లో కొన్ని...


👉దేశంలోని దిగువన ఉండే మధ్య తరగతి ప్రజల కోసం అనుకూల నగరంగా హైదరాబాద్‌ వరుసగా రెండవ సంవత్సరం  తన హోదాను నిలబెట్టుకుని రెండో స్థానంలో నిలిచింది. బెంగళూరు మొదటి స్థానంలో ఉంది.  

👉 అత్యధిక వ్యక్తిగత నెలవారీ ఆదాయంతో (రూ.44 వేలు) దిగువ–మధ్యతరగతి జీవనంలో మన నగరం అగ్రస్థానంలో ఉంది, నగరంలో  69 శాతం మంది 2024లో ఎక్కువ ఆదా చేయగలిగారని అధ్యయనం తేల్చింది.  

👉  నెలవారీ  ఖర్చుల విషయానికి వస్తే, పర్యటనలు/సైట్‌ సీయింగ్‌ల కోసం ఆదాయంలో 35శాతం, బయటి ఆహారం కోసం 28 శాతం, సినిమాల కోసం 19 శాతం, ఫిట్‌నెస్‌ కోసం 6 శాతం, ఓటీటీ యాప్‌ల కోసం 10 శాతం ఖర్చు చేయడానికి ఇష్టపడుతున్నారు.  

👉 ఆన్‌లైన్‌ ఆర్థిక  మోసాలను తాము విన్నామని/చూస్తున్నామని నగరంలో 41 శాతం మంది ధృవీకరించారు.  తామే స్వయంగా ఆన్‌లైన్‌ మోసానికి గురయ్యామని 27 శాతం మంది చెప్పారు. ఆరి్థక మోసం చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చే బూటకపు ఫోన్‌ కాల్స్‌ను/మెసేజ్‌లను అందుకుంటున్నామని 37 శాతం మంది నగరవాసులు తెలిపారు.  

👉 సులభంగా రుణ ఊబిలో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయని 31 శాతం మంది, అధిక వ్యయం గురించి భయపడి 28 శాతం మంది, అధిక వడ్డీ రేట్ల కారణంగా 24 శాతం మంది, అధిక ప్రాసెసింగ్‌ ఇతర అధిక ఛార్జీలు  గురించి 7 శాతం మంది యూపీఐపై రుణ సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి ఇష్టపడడం లేదు.  

👉 యూపీఐ సేవలకు రుసుములు గానీ వసూలు చేస్తే 64 శాతం మంది తాము దానిని ఉపయోగించడం ఆపివేస్తామని అంటున్నారు.  

👉 తమ ఆదాయం గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరంలో పెరిగిందని 52 శాతం మంది చెప్పారు, అలాగే రాబోయే సంవత్సరం నాటికి తమ ఆదాయం ఇంకా పెరుగుతుందని 74 శాతం మంది భావిస్తున్నారు. రాబోయే సంవత్సరంలో తాము మరింత  పొదుపు చేయగలమని 66 శాతం మంది మరింత పెట్టుబడి పెట్టగలమని 66 శాతం మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

👉 నగరంలో సగటు వ్యక్తిగత నెలవారీ ఆదాయం 2023లో రూ.42 వేల నుంచి 44 వేలకు పెరిగింది. అలాగే  స్థిర నెలవారీ ఖర్చులు కూడా రూ.19 వేల నుంచి 24 వేలకు పెరిగాయి.  

👉 గత ఆరు నెలల్లో 57 శాతం మంది దుస్తులు, ఇతర అవసరార్ధ వస్తువుల కొనుగోలులో మునిగిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. ఇంటి ఖర్చుల కోసం 79 శాతం వెచి్చస్తూ, నగరం ఈ విషయంలో ముంబై (75శాతం)ని అధిగమించింది.   

👉 వ్యక్తిగత నెలవారీ ఆదాయం విషయంలో బెంగుళూరు  హైదరాబాద్‌ నగరాలు జాతీయ సగటు కంటే వరుసగా 15 శాతం, 33 శాతం అధిక ఆదాయాలతో ముందున్నాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 

👉 ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌ పూణే వంటి నగరాలలో ఆరి్థక మోసాల బారిన పడిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. 

👉 నగరంతో సహా ఢిల్లీ–ఎన్‌.సి.ఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణే, లక్నో, జైపూర్, భోపాల్, పాట్నా, రాంచీ, చండీగఢ్, డెహ్రాడూన్, లుథియానా, కొచి్చతో సహా 17 నగరాల్లో గ్రేట్‌ ఇండియన్‌ వాలెట్‌ ఈ అధ్యయనం నిర్వహించింది. దీని కోసం 18–55 సంవత్సరాల మధ్య వయసు్కలు, వార్షిక ఆదాయం రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల మధ్య ఉన్నవారిని ఎంచుకున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement