Militents attack
-
ఇజ్రాయెల్‌పైకి హెజ్బొల్లా రాకెట్లు
బీరుట్: లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లు శనివారం ఇజ్రాయెల్‌పైకి పదుల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించారు. బీరుట్లో ఉన్న హమాస్ అగ్ర నేత సలెహ్ అరోరీని చంపినందుకు ప్రతీకారం తప్పదంటూ శుక్రవారం హెజ్బొల్లా నేత సయ్యద్ హస్సన్ నస్రల్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే శనివారం 62 రాకెట్లను ఇజ్రాయెల్‌లోని మౌంట్ మెరోన్లో ఉన్న గగనతల నిఘా కేంద్రంపైకి ప్రయోగించినట్లు హెజ్బొల్లా తెలిపింది. ఇవి ఆ కేంద్రాన్ని నేరుగా తాకాయని పేర్కొంది. మెరోన్ వైపు 40 రాకెట్లు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే, నష్టం గురించి ప్రస్తావించలేదు. ఇలా ఉండగా, 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ ఆర్మీ గాజాపై జరిపిన దాడుల్లో 122 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 22,722కు చేరుకుందని పేర్కొంది. మృతుల్లో మూడింట రెండొంతుల మంది చిన్నారులు, మహిళలేనని వెల్లడించింది. మరో 58,166 మంది క్షతగాత్రులుగా మిగిలారని పేర్కొంది. -
మణిపూర్‌లో భద్రతా దళాలపై ముష్కరుల దాడి
ఇంఫాల్: మణిపూర్‌లో వరుసగా రెండోరోజు ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. మోరే పట్టణంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మంగళవారం ఆకస్మికదాడి జరిపారు. ఈ ఘటనలో నలుగులు పోలీసులు ఒక బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. తౌబల్ జిల్లా లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో దుండగులు కాల్పులు జరపగా.. నలుగురు పౌరులు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తౌబల్‌తోపాటు ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. మయన్మార్ సరిహద్దుకు సమీపంలో భద్రతా బలగాలు మంగళవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగా సరిహద్దు పట్టణమైన మోరేకు పోలీసు కమాండోలు వాహనాల్లో వెళుతున్నారు. ఈ క్రమంలో ముష్కరులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఆకస్మికంగా కాల్పులు జరిపారు. నలుగులు పోలీసులు ఒక బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. గాయపడిన భద్రతా సిబ్బందికి అస్సాం రైఫిల్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాల్పుల ఘటనను సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. దోషులను పట్టుకుని, చట్టం ముందు నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్‌లో గత ఏడాది మే 3వ తేదీన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మొయితీలున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకు ఉంటారు. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంక్‌లపై ఎగబడ్డ జనం -
ఇజ్రాయెల్‌లో హమాస్ భీకర దాడులు.. ఈ మిలిటెంట్లు ఎవరంటే?
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ గ్రూప్ మెరుపు దాడితో ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడులతో పదుల సంఖ్యలో సామాన్యపౌరులు మృతిచెందారు. వీరు ఇజ్రాయెల్ వీధుల్లో తిరుగుతూ పౌరులపై కాల్పులు జరుపుతున్నారు. ఇజ్రాయెల్ సైనికులను మిలిటెంట్లు బందీగా చేసుకుని వారిని నేలపై లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. శనివారం ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి 5వేల రాకెట్లు దూసుకొచ్చాయి. అటు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడికి దిగింది. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు అలుముకున్నట్లు సైన్యం ప్రకటించింది. తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్పందించారు. హమాస్ ఘోర తప్పిదం చేసిందని, ఈ యుద్ధంలో తామే గెలుస్తామని అన్నారు. Approximate of 2000 people running from a party where hamas militants attacked #Israel #Palestine pic.twitter.com/BRiOGm7cPK — meh° (@ImMehulOkk) October 7, 2023 మరోవైపు.. ఇజ్రాయెల్‌పై మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మొహమ్మద్ డెయిఫ్ ప్రకటించాడు. ఈ తెల్లవారుజామునే ‘ఆపరేషన్ ఆల్-అక్సా స్ట్రామ్’ ప్రారంభమైందని, ఇప్పటివరకు 5వేల రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్ చెప్పినట్లు ఓ వీడియో సందేశం బయటికొచ్చింది. డెయిఫ్‌పై గతంలో అనేకసార్లు దాడులు జరిగాయి. దీంతో కొంతకాలంగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్న అతడు ఇప్పుడిలా వీడియో విడుదల చేయడం.. యుద్ధ తీవ్రతను అద్దం పడుతోంది. హమాస్ ఏర్పాటు ఇలా.. హమాస్ ఒక మిలిటెంట్ ఉద్యమం. హమాస్, హరకత్ అల్-ముకావామా అల్-ఇస్లామియా (ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్) యొక్క సంక్షిప్త రూపం. ఇది గాజా స్ట్రిప్‌లో రెండు మిలియన్లకు పైగా పాలస్తీనియన్లను పాలిస్తుంది. ఈ హమాస్ గ్రూప్ ఇజ్రాయెల్‌కు సాయుధ ప్రతిఘటనకు ప్రసిద్ధి చెందింది. షేక్ అహ్మద్ యాసిన్ అనే పాలస్తీనా మత గురువు హమాస్‌ను స్థాపించాడు. డిసెంబర్ 1987లో గాజాలో హమాస్‌ను బ్రదర్హుడ్ రాజకీయ విభాగంగా యాసిన్ తయారు చేశారు. More Israelis being taken hostage. #Israel #Hamas #Palestine #Palestinian #IronDome #Gaza #TelAviv pic.twitter.com/v005TC7IC7 — Paul Golding (@GoldingBF) October 7, 2023 ఇజ్రాయెల్ నాశనమే టార్గెట్.. ఆ సమయంలో హమాస్ యొక్క ఉద్దేశ్యం పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ (PIJ), ఇజ్రాయెల్‌ను హింసాత్మకంగా ప్రతిఘటించడమే లక్ష్యం. ఈ మేరకు 1988లో, హమాస్ తన చార్టర్‌ను ప్రచురించింది. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలని, చారిత్రాత్మక పాలస్తీనాలో ఇస్లామిక్ సమాజాన్ని స్థాపించాలని పిలుపునిచ్చింది. PLO నాయకుడు యాసర్ అరాఫత్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి యిట్జాక్ రాబిన్ ఓస్లో ఒప్పందాలపై సంతకం చేయడానికి ఐదు నెలల ముందు ఏప్రిల్ 1993లో హమాస్ మొదటిసారిగా ఆత్మాహుతి బాంబు దాడిని ప్రారంభించింది. హమాస్‌కు ఎలా నిధులు సమకూరుతాయి? డజన్ల కొద్దీ దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నాయి. 1997లో అమెరికా హమాస్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. హమాస్‌కు ఇరాన్ వస్తుపరంగా, ఆర్థికపరంగా సహాయాన్ని అందిస్తోంది. టర్కీ దాని అగ్ర నాయకులలో కొంతమందికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. పర్షియన్ గల్ఫ్‌లోని పాలస్తీనా ప్రవాసులు మరియు ప్రైవేట్ దాతలు నిధులను అందిస్తున్నారు. అదనంగా, పశ్చిమ దేశాలలోని కొన్ని ఇస్లామిక్ స్వచ్ఛంద సంస్థలు హమాస్ మద్దతు ఉన్న సామాజిక సేవా సమూహాలకు డబ్బును పంపిస్తున్నాయి. హమాస్ ద్వారా వందల మిలియన్ల డాలర్ల సహాయాన్ని అందించడానికి ఇజ్రాయెల్ ఖతార్‌కు అనుమతిస్తోంది. ఇతర విదేశీ సహాయం సాధారణంగా PA మరియు UN ఏజెన్సీల ద్వారా గాజాకు చేరుకుంటుంది. 2017 నుంచి దాడులు తీవ్రం.. ఇదిలా ఉండగా.. 2017 తర్వాత జెరూసలెంలో అత్యంత దారుణ హింసాత్మక దాడులు జరుగుతున్నాయి. మిలిటెంట్లు ఇప్పటికే వందలాది రాకెట్లను జెరూసలెం, ఇజ్రాయెల్‌లోని మిగతా ప్రాంతాలపైకి ప్రయోగించారు. జెరూసలెం మీద మొదటిసారి రాకెట్లు ప్రయోగించిన హమాస్ మిలిటెంట్లు హద్దు మీరారు అంటూ అప్పట్లోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పుకొచ్చారు. శాంతి కోరుతున్న అంతర్జాతీయ సమాజం.. ఇజ్రాయెల్, పాలస్తీనాలు శాంతిని పునరుద్ధరించాలని ప్రపంచ దేశాలు విన్నవిస్తూనే ఉన్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా వీలైనంత త్వరగా ఉద్రిక్తతలకు తెరదించాలని అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ కోరాయి. కానీ, దాడులు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వందల మంది సామాన్యపౌరులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. -
అతని బుల్లెట్ గాయం..వికలాంగ విద్యార్థులకు వరం!
జీవితం అందరికీ పూలపాన్పులా ఉండదు. మనం వెళ్లే దారిలో ముళ్లు, రాళ్లు గుచ్చుకుంటాయి. వాటిని తీసేస్తూ..గాయాలు చిత్రవధ చేస్తున్నా ముందుకుసాగాల్సిన గడ్డు పరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి. వీటన్నింటినీ దాటుకుని జీవితాన్ని నిలబెట్టుకునే వారు మన సమాజం లో ఎందరో ఉన్నారు. ఈ కోవకు చెందినవారే కశ్మీర్‌కు చెందిన జావేద్ అహ్మద్ తక్. ఉగ్రదాడి లో తన జీవితాన్నీ కోల్పోయినప్పటికీ నిరాశా నిస్పృహలలో కూరుకుపోకుండా తన జీవితాన్నీ నిలబెట్టుకుని.. తనలాగా అంగవైకల్యంతో బాధపడుతోన్న పిల్లలకు చదువు చెబుతూ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు జావేద్. అది 1997 జావేద్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అనంతనాగ్‌లో తన అంకుల్ ఇంట్లో జావేద్ ఉండగా అర్ధరాత్రి ఆ ఇంటిపై ముష్కరులు దాడిచేశారు. ఆ సమయంలో తన కజిన్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన జావేద్‌కు బుల్లెట్ తగిలింది. బుల్లెట్ వెన్నుపూసకు తగలడంతో మూత్రపిండాలు, క్లోమం, పేగులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆసుపత్రిలో ఒక సంత్సరంపాటు చికిత్స తీసుకున్న తరువాత 1998లో జావేద్ డిశ్చార్జ్ అయ్యాడు. ఆ తరువాత కూడా కదలలేని పరిస్థితుల్లో మరో మూడేళ్లు మంచానికే పరిమితమయ్యాడు. అలా మంచం మీద ఉన్న జావేద్‌కు తన ఇంటిపక్కన పిల్లలు అరుస్తూ ఆడుకుంటున్న శబ్దాలు వినపడేవి. అలా వింటూ 2000 సంవత్సరంలో ఆ పిల్లలందరికి ఉచితంగా చదువు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అప్పటినుంచి తనను తాను మోటివేట్ చేసుకుంటూ..పిల్లలకు ఎలా చదువు చెప్పాలి వంటి అంశాలపై ఆలోచించి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలనుకున్నాడు. జెబాఅపా.. 2006లో అంగవైకల్యంతో బాధపడే పిల్లల కోసం ఒక అద్దె భవనంలో ‘జెబాఅపా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్’ పేరిట స్కూలును ప్రారంభించాడు జావేద్. తన బంధువులు, స్నేహితులు చుట్టపక్కల ఊళ్లలోని అంగవైకల్యం కలిగిన పిల్లలను జెబాఅపాలో చేర్చేవారు. జావేద్ మరికొంతమంది టీచర్లను నియమించుకుని స్కూలును నడపడం ప్రారంభించాడు. స్కూల్‌తోపాటు తనూ.. మధ్యలో ఆపేసిన చదువును కొనసాగించాడు. ఈ క్రమంలోనే 2007లో కశ్మీర్ యూనివర్సిటీలో సోషల్ వర్క్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. మొదట్లో ప్రాథమిక తరగతులకే పరిమితమైన జెబా స్కూలు తరువాత ఎనిమిదో తరగతివరకు పొడిగించారు. 120 మంది వికలాంగ విద్యార్థులు 25 మంది టీచర్లతో స్కూలును విజయవంతంగా నడిపిస్తున్నారు. స్పెషల్లీ ఏబుల్డ్ (వికలాంగులు) విద్యార్థులు కావడం తో వారికి ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా చదువు చెప్పడంతోపాటు, స్పీచ్ థెరపిస్టులతో పాఠాలు నేర్పిస్తున్నారు. సిలబస్‌ను ప్రత్యేకంగా రూపొందించి, పిల్లలకే కాకుండా టీచర్లకు కూడా జావేద్ శిక్షణ ఇస్తున్నాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోయినప్పటికీ దాతలు ఇచ్చిన విరాళాలు, ఎన్జీవోల సాయంతో స్కూల్‌ను నడుపుతున్నట్లు జావేద్ చెప్పాడు. జావేద్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత చదువులు చదవడంతోపాటు, క్రీడల్లోనూ రాణిస్తూ పతకాలను సాధిస్తున్నారు. హ్యుమానిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జావేద్ ఒక్క స్కూలేగాక హ్యుమానిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్‌ను కూడా సంస్థను స్థాపించి వైద్యం కొనుక్కోలేని నిరుపేద మహిళలకు ఉచితంగా వైద్యాన్నీ అందిస్తున్నారు. పుస్తకాలు, యూనిఫామ్, స్టేషనరీ వంటి వాటిని సేకరించి నిరుపేద విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. కరోనా సమయంలోనూ ఈ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సహాయ కార్యక్రమాలను చేపట్టారు. తన జీవితంలో జరిగిన ఒక అతిపెద్ద విషాద ఘటనను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని.. సమాజానికి మేలు చేసేందుకు కృషి చేస్తోన్న జావేద్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. జావేద్ మాట్లాడుతూ...‘‘ప్రారంభంలో మా స్కూలుకు బాలికలను పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడేవారు కాదు. తర్వాత వారితో నేను మాట్లాడి ఒప్పించడంతో ఎంతో ధైర్యంగా అమ్మాయిలను స్కూలుకు పంపిస్తున్నారు. ప్రస్తుతం స్కూల్లో 200 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరికోసం రెండు బస్సులు కొనుగోలు చేశాం. అవి సరిపోవడం లేదు. అందువల్ల కొంతమంది పిల్లలకి స్కూల్ వద్ద వసతి కల్పిస్తున్నాం. అనేక అవరోధాలు ఎదుర్కొంటూ ఒక్కో వసతిని స్కూలుకు సమకూరుస్తున్నాం. హయ్యర్ సెకండరీ లెవల్‌కు స్కూలు ఎదుగుతుంది’’ అని ఆశిస్తున్నట్లు జావేద్ చెప్పాడు. ‘‘బుల్లెట్ గాయం వల్ల నేను జీవితాన్నే కోల్పోయాను. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా కింద కేవలం 75 వేల రూపాయలను ఇచ్చింది. కానీ ఆ సమయంలో నా చికిత్సకు లక్షల్లో ఖర్చయింది. ఆ విషాదం జరగాలని రాసి ఉంటే ఏం చేయగలం. అది జరిగిపోయింది. అక్కడే ఆగిపోతే మిగతా జీవితం కూడా చీకటైపోతుంది. అందుకే నాలాగా ఇబ్బంది పడే వికలాంగులకు చేయూతనిస్తూ ముందుకు సాగుతున్నాను’’ అని జావేద్ చెప్పాడు. -
ఐఎస్ఐ టార్గెట్ గుజరాత్!
అహ్మదాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాకిస్తాన్ ఐఎస్ఐ గుజరాత్లో భారీ విధ్వంసానికి పూనుకోవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాక్ దళాలు ఇటీవల సరిహద్దు తీరంలో నాలుగు భారత ఫిషింగ్ బోట్లను, వాటి సిబ్బంది నుంచి యూఐడీలను స్వాధీనం చేసుకోవడంతో గుజరాత్‌పై 26/11 తరహా దాడులకు పాక్ ప్రేరేపించవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల ర్యాలీలు, జనసమూహాలపై పాక్ ఉగ్రవాదులు దాడులతో తెగబడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తూ అధికారులను అప్రపమత్తం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్టార్ క్యాంపెయినర్లుగా ఉండటంతో ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ లక్ష్యంగా సముద్ర మార్గం నుంచి ఉగ్రవాదులను ఐఎస్ఐ పంపవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. భారత ఫిషింగ్ బోట్స్‌ను, వాటి యూఐడీలను సీజ్ చేసిన పాక్ అధికారులు ఇతర బోట్లపై ఆ యూఐడీలను అమర్చి భారత బోట్స్‌గా అధికారుల కళ్లుగప్పి మిలిటెంట్లను గుజరాత్లో చొప్పించే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోదీ స్వరాష్ట్రం కావడంతో గుజరాత్లో మారుమూల ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేయనుండటం, యూపీ సీఎం ద్వారకా వంటి పలు తీర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ర్యాలీల్లో పాల్గొననుండటంతో పాక్ ఉగ్రవాదులు సముద్ర మార్గం నుంచి చొచ్చుకువచ్చి దాడులకు తెగబడే అవకాశాలు తోసిపుచ్చలేమని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. నవంబర్ 2008లో మత్స్య నౌక ఎంవీ కుబేర్‌ను హైజాక్ చేసి పాక్ మిలిటెంట్లు ముంబయిలో మారణహోమం సృష్టించిన అనంతరం అధికారులు మత్స్యకారులకు బయోమెట్రిక్ కార్డులు, యూనిక్ ఐడెంటిఫికేషన్ డివైజ్‌లు (యూఐడీ) అందచేస్తున్నారు. -
మిలిటెంట్ల దాడిలో 9 మంది మృతి
అప్ఘనిస్థాన్: ట్రాంక్విల్ బల్క్ ప్రావిన్స్‌లో మంగళవారం మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 9 మంది మృతిచెందారు. మిలిటెంట్లు సీజెక్ ఎన్జీవోకు చెందిన అతిథి గృహంపై దాడి చేసినట్టు తెలిసింది. మిలిటెంట్లు జరిపిన భీకర దాడుల్లో మృతిచెందిన వారిలో మహిళ సహా ఆరుగురు ఉద్యోగులు, ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.