MIM chief Asaduddin Owaisi
-
కొత్త పార్లమెంట్ భవనం పై అసాదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
కొత్త భవనాన్ని శవపేటికతో పోల్చిన ఆర్జేడీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ మండిపాటు
-
ముస్లిం సంప్రదాయాలకు అడ్డుతగలొద్దు
తాండూరు: ముస్లిం మత ఆచారాలపై ప్రభుత్వాలు, కోర్టులు కల్పించుకుంటే సహించేది లేదని ఆవర్గం నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. త్రిబుల్ తలాక్‌పై వెలువడిన కోర్టు తీర్పును నిరసిస్తూ బుధవారం రాత్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముస్లిం పర్సనల్ లాబోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభు త్వం, ఆర్ఎస్ఎస్ ముస్లింలపై తప్పు డు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలకు తమ మతంలో ఇచ్చే గౌరవం.. మరే మతంలోనూ లభించదని తెలిపారు. పలువురు మత పెద్దలు మాట్లాడుతూ.. తాండూరులో 30 వేల మంది ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఉంటే ఇందులో 3 వేల మంది మాత్రమే తమ మతానికి చెందిన పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇత ర పాఠశాలల్లో చేరిన తమ పిల్లలకు మతాచారానికి విరుద్ధంగా వందేమాతరం, సరస్వతీ శ్లోకాలను పఠనం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పిల్లలకు ముస్లిం మతాచారం ప్రకారం విద్యావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశంలో ముస్లింల మనుగడ కష్టంగా మారిం దని ఆవేదన వ్యక్తంచేశారు. పదివేల మందికి పైగా సభకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నేతలు అబుల్ రవూఫ్, జుబేర్‌లాల, ఖలీల్ పాష, జాఫర్ పాష, ముర్తుజా, కమల్ అత్తార్, సాధిక్, అహద్, ఖాజాపాష, జావేద్, జియావొద్దీన్ ఉన్నారు. -
'హైదరాబాద్ పరిస్థితిపై జోక్యం చేసుకోవాలని కోరా'
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఉన్న పరిస్థితిపై జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన శనివారం పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డితో కలిసి హోంమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐఎస్ఐఎస్ సానుభూతిపరులకు న్యాయ సహాయం చేస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై వారు రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒవైసీ వ్యాఖ్యలతో పోలీసుల స్థైర్యం దెబ్బతింటుందన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా అనర్హుడంటూ ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉగ్రవాదులు చనిపోతే శవయాత్రలో పాల్గొంటున్నారని, వారికి ఆర్థిక సాయం, న్యాయ సహాయం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తామని రాజ్‌నాథ్ చెప్పారన్నారు. ఇక టీఆర్ఎస్ కూడా ఉగ్రవాదులపై నోరు మెదపడం లేదని ఆయన మండిపడ్డారు. త్వరలో సేవ్ హైదరాబాద్ క్యాంపెయిన్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా హైదరాబాద్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసిన ఐఎస్ ఐఎస్ సానుభూతిపరులకు అవసరమైతే న్యాయ సహాయం అందిస్తామని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
మీడియాకు అదొక్కటే కనిపించిందా?
హైదరాబాద్: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన ఐఎస్ఐఎస్ సానుభూతిపరులకు అవసరమైతే న్యాయ సహాయం అందిస్తామన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయితే, ఈ వివాదంపై స్పందించిన ఆయన మీడియాపై మండిపడ్డారు. తాను 90 నిమిషాల ప్రసంగిస్తే.. అందులో 20 నిమిషాలపాటు ఐసిస్‌ను తీవ్రస్థాయిలో విమర్శించానని, ఆ అంశాన్ని పక్కనపెట్టి అనవసర విషయాలపై దృష్టి పెట్టడం దారుణమని అసదుద్దీన్ విరుచుకుపడ్డారు. ఐసిస్‌కు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. అయితే అమాయకులకు అన్యాయం జరగకూడదనేదే తమ వాదన అన్నారు. మన ప్రజాస్వామ్య పాలనలో అవసరమైతే కోర్టులే నిందితులకు న్యాయ సహాయం అందిస్తాయని అసద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐసిస్ సానుభూతిపరుల కేసులో సత్యాసత్యాలను వెలికితీయాల్సిన బాధ్యత ఎన్ఐఏదేనని ఆయన స్పష్టం చేశారు. పనిలో పనిగా అసదుద్దీన్ బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశాన్ని హిందు రాష్ట్రంగా మార్చేందుకు యత్నిస్తోందని, ఆర్ఎస్ఎస్ అజెండాలో భాగంగానే ఉమ్మడి పౌరస్మృతిని అమలుచేసేందుకు చూస్తోందని ఆరోపించారు.