Mines sector
-
కాలుష్య కాటు
జిల్లాలో ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్ (ఈసీ) లేకుండా పలు ఫ్యాక్టరీలు, మైన్స్, క్వారీల యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వీటిపై అడపాదడపా అధికారులు దాడులు చేస్తున్నా అధికార పార్టీ నాయకులు ఒత్తిడితో యథాప్రకారం నిర్వాహకులు కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. గాలిలో దూళికణాలు గతంలో 66 శాతం ఉండగా ప్రస్తుతం 71 శాతానికి చేరుకున్నట్లు సమాచారం. అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ 80 నుంచి 100 మైక్రోగ్రాముల లోపు ఉండాలి. అయితే 500 మైక్రో గ్రాముల కార్బన్ మోనాక్సైడ్ ఉన్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు. దీంతో జిల్లా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నెల్లూరు(సెంట్రల్): ఏదైనా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా మొదట చూసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రధానంగా ఏర్పాటు చేసే మైన్స్, ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకూడదు. ఏర్పాటు చేసే ఏ చిన్న, పెద్ద పరిశ్రమ అయినా సరే పర్యావరణకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండే విధంగా ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్ (ఈసీ) అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే జిల్లాలో పలు ఫ్యాక్టరీలకు ఈసీలు లేవనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా ఈసీ లేని మైన్స్, ఫ్యాక్టరీలతోపాటు వాహనాలు తిరుగుతున్నందున వచ్చే కాలుష్యంతో జిల్లాలో పర్యావరణం దెబ్బతింటోంది. 25 వేలకు పైగా ఆటోలు, వెయ్యికి పైగా బస్సులు, 15 వేల కార్లు, రెండు లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు తిరుగుతుంటాయి. వీటన్నింటి వల్ల వచ్చే కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఫ్యాక్టరీలదే అదే వరుస జిల్లాలో రైసు మిల్లులు, క్రషర్స్, పవర్ప్లాంటులు, వివిధ రకాల శబ్దకాలుష్య పరిశ్రమలు విచ్చలవిడిగా వెలశాయి. వీటిలో సగానికి పైగా ఈసీ లేదని తెలుస్తోంది. ఒక వేళ ఈ సీ ఉన్నా నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో వీటి నుంచి నిత్యం వెలువడే కాలుష్యంతో స్థానికంగా ఉన్న ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రధానంగా ఈ కాలుష్య ప్రభావం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ పంటలపై కూడా పడుతోంది. దీంతో దిగుబడి చాలా వరకు తగ్గుముఖం పడుతోంది. అంతే కాకాకుండా స్థానికంగా ఉన్న ప్రజలకు వివిధ అనారోగ్య సమస్యల వస్తున్నాయి. దీంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా నెల్లూరు చుట్టుపక్కల వెలసిన రైసు మిల్లులు, వివిధ ఫ్యాక్టరీలు, క్రషర్స్‌తో నెల్లూరు పట్టణంపై కూడా పర్యావరణ ప్రభావం పడుతోంది. అధికార పార్టీ అండతో చాలా వరకు పెద్దపెద్ద పరిశ్రమలు, మైన్స్ నిర్వహణ మొత్తం అధికార పార్టీ నేతల అనుచరులే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని ఒక మంత్రికి చెందిన మైన్స్ కూడా ఉన్నాయి. పలు ఫ్యాక్టరీలు, రైసుమిల్లుల విషయం చెప్పనక్కర్లేదు. అధికార పార్టీలో కీలకంగా ఉన్న ఒక వ్యక్తికి చెందిన రైసు మిల్లులు, ఆయన అసోసియేషన్‌కు కూడా అధ్యక్షుడిగా ఉండటంతో వాటికి అనుమతి లేకున్నా ఉన్నా అధికారులు తనిఖీ చేయలేని పరిస్థితి నెలకొంది. సంబంధిత శాఖ, కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ఏదో మొక్కబడిగా దాడులు చేసి వదిలేస్తున్నారు. అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడులు వస్తుండటంతో తనిఖీలు చేసిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈసీ లేకుండా నిర్వహించే మైన్స్, ఫ్యాక్టరీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. 100 మైన్స్‌కు అనుమతి లేని వైనం ప్రధానంగా జిల్లాలోని సైదాపురం, పొదలకూరు, రాపూరు, గూడూరురూరల్, పెళ్లకూరు మండలాల్లో 170 మైన్స్ ఉన్నాయి. వీటిలో 100 మైన్లకు ఈసీ లేకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఇవి అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు న్యాయ స్థానం దృష్టికి కూడా పోవడంతో వీటి నిర్వహణపై కూడా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈసీ లేకుండా నిర్వహించిన యజమానుల నుంచి చట్టం ప్రకారం అపరాధ రుసుం వసూలు చేసి, అనంతరం సర్టిఫికెట్ తీసుకున్న తరువాత పనులు చేసుకోవాలని కూడా ఆదేశాలు జారి చేసినట్లు సమాచారం. దీంతో ఈసీ లేకుండా నిర్వహిస్తున్న మైన్స్ వివరాల సేకరణలో సంబంధిత శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెలలోనే ఈసీ లేని మైన్స్పై చర్యలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈసీ లేని వాటిపై చర్యలు తీసుకుంటాం జిల్లాలో ఎటువంటి మైన్ లేదా ఫ్యాక్టరీ అయినా స్థానికంగా ఉన్న ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూడాలి. ప్రజలకు పర్యావరణం వల్ల ఇబ్బంది కలిగే విధంగా నడుపుతున్న వాటిపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో పలు మైన్స్‌కు ఈసీ లేదు. కొన్ని యాజమాన్యాలు దరఖాస్తు చేసుకుని ఉన్నాయి. అదే విధంగా ఫ్యాక్టరీలు, రైసుమిల్లులు ఈసీ లేకుండా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. –ప్రమోద్‌కుమార్‌రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ -
మైనింగ్ కోర్సులకు ప్రత్యేకం.. ఐఎస్ఎం
ప్రత్యేకంగా మైన్స్ (ఖనిజాలు, గనులు) రంగంలో నిష్ణాతులైన నిపుణులను దేశానికందించే ఉద్దేశంతో ఏర్పాటైన ప్రత్యేక సంస్థ.. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్ఎం) - ధన్‌బాద్. జార్ఖండ్‌లో కొలువైన ఈ ఇన్స్టిట్యూట్ దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న తిరుపతి కార్తీక్ రాజ్ తన క్యాంపస్ కబుర్లను వివరిస్తున్నాడిలా.. అంతా తెలుగుమయం 400 ఎకరాల్లో క్యాంపస్ ఉంటుంది. ఇక్కడ తెలుగు విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. బీటెక్‌లో అన్ని బ్రాంచ్‌లు కలుపుకుని 450 మంది తెలుగు విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. తర్వాత బెంగాల్, బీహార్ విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. ఇండస్ట్రీ విజిట్స్ సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు క్లాసులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆయా బ్రాంచ్‌లు, షెడ్యూల్‌ను బట్టి తరగతులు ఉంటాయి. వారానికి 30 గంటలు తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. సబ్జెక్టుపరంగా ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేస్తారు. గెస్ట్ లెక్చర్లు ఇవ్వడానికి ఇతర విద్యాసంస్థలు, పరిశ్రమల నుంచి కూడా ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులు వస్తుంటారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి సంబంధిత బ్రాంచ్‌ల విద్యార్థులను ఇండస్ట్రీ విజిట్స్‌కు కూడా తీసుకెళ్తారు. నేను ఫస్టియర్‌లో మేనేజ్మెంట్ ఇంటర్న్‌షిప్ కోసం ఇండోనేషియా వెళ్లాను. అక్కడ 45 రోజులపాటు వివిధ కంపెనీలకు వె ళ్లి బిజినెస్‌కు సంబంధించిన వివిధ అంశాలను తెలుసుకున్నాను. ఆసియాలోనే పెద్ద లైబ్రరీ ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి ఉంటుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ల వారీగా హాస్టల్స్ ఉంటాయి. ర్యాగింగ్‌ను నిరోధించాలనే ఉద్దేశంతో ఫస్టియర్ విద్యార్థులకు మాత్రం ప్రత్యేకంగా హాస్టల్స్ కేటాయించారు. ఇండోర్ గేమ్స్ (బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్) ఆడుకోవడానికి హాస్టల్లో సదుపాయాలున్నాయి. పూర్తిగా ఉత్తర భారతదేశ ఆహారం అందుబాటులో ఉంటుంది. తరగతి గదులు, లేబొరేటరీలు, లైబ్రరీ వంటివి అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. ప్రతిభావంతులకు స్కాలర్షిప్స్ ఇక్కడ ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే ఇంకా ఐఐటీ స్థాయి గుర్తింపు దక్కలే దు. వచ్చే ఏడాది మార్చిలో ఐఎస్‌ఎంకు ఐఐటీల స్థాయి గుర్తిం పు లభించే అవకాశం ఉంది. ప్రతిభావంతులకు మెరిట్ కమ్ మీ న్స్ స్కాలర్షిప్స్ ఉంటాయి. తల్లిదండ్రుల వార్షికాదాయం ఏడాదికి రూ.4.5 లక్షలకు లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రెడిషనల్ సబ్జెక్టులు కూడా సెమిస్టర్‌కు ఐదు సబ్జెక్టులు ఉంటాయి. వీటితోపాటు ఇంగ్లిష్, మేనేజ్మెంట్ ఎకనామిక్స్ వంటివాటిని తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ప్రతి సెమిస్టర్లో మిడ్ సెమిస్టర్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. మిడ్ సెమిస్టర్‌కు 30 శాతం వెయిటేజ్, ఎండ్ సెమిస్టర్‌కు 60 శాతం వెయిటేజ్ ఉంటాయి. మరో 10 శాతం ప్రొఫెసర్ చేతిలో ఉంటుంది. నేను ఇప్పటివరకు 10కి 7.58 సీజీపీఏ సాధించాను. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ మైనింగ్ సంబంధిత కోర్సుల కోసం ప్రత్యేకంగా ఏర్పడింది ఈ ఇన్స్టిట్యూట్. మైనింగ్, పెట్రోలియం, మినరల్ ఇంజనీరింగ్ కంటే సీఎస్ఈ విద్యార్థులే అత్యధిక పే ప్యాకేజీలు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం పెట్రోలియం ఇంజనీరింగ్ విద్యార్థులను కోల్ ఇండియా వంటి కొన్ని ప్రభుత్వ రంగ కంపెనీలు మాత్రమే నియమించుకుంటున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్‌కు సంబంధించిన కంపెనీలు కూడా పెద్దగా రావడం లేదు. పూర్వ విద్యార్థుల సమ్మేళనమే బసంత్ ఏటా క్యాంపస్‌లో టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, స్పోర్ట్స్ ఫెస్ట్ ఉంటాయి. ఒక్కోటి మూడు రోజులపాటు జరుగుతుంది. బసంత్ పేరుతో పూర్వ విద్యార్థుల ఫెస్ట్ కూడా ఏటా ఉంటుంది. దీనికి పూర్వ విద్యార్థులంతా హాజరవుతారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, కెరీర్ గెడైన్స్, స్టార్టప్స్‌కు సంబంధించి విద్యార్థులకు సూచనలు, సలహాలు అందిస్తారు. క్యాంపస్‌లో ఫొటోగ్రఫీ క్లబ్, మ్యూజిక్ క్లబ్, క్రికెట్ క్లబ్ ఇలా ఎన్నో క్లబ్‌లు ఉంటాయి. వీటి ల్లో చేరడం ద్వారా సంబంధిత అంశాలపై పట్టు సాధించవచ్చు. ఈ-సెల్ అందించే సేవలెన్నో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునేవారి కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ ఉంది. దీని ఆధ్వర్యంలో బిజినెస్ ఐడియా కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. విద్యార్థుల ఆలోచనలు నచ్చితే స్టార్టప్ ఏర్పాటుకు కావాల్సిన ఆర్థిక వనరులు అందిస్తారు. ఇంకా స్టార్టప్ విజయవంతం కావడానికి కావాల్సిన సూచనలు, సలహాలు ఇస్తారు. కోర్సు పూర్తయ్యాక రెండేళ్లు జాబ్ చేసి తర్వాత ఎంబీఏ చేస్తా.