క్రెడిట్ కార్డు నిబంధనలు కఠినతరం
ముంబై: నిర్ణీత 90 రోజుల వ్యవధిలో కనీస బకారుుని చెల్లించని క్రెడిట్ కార్డు ఖాతాదారుల రుణాలను మొండి బకారుులుగా పరిగణించాలని ఆర్బీఐ శుక్రవారం బ్యాంకులను ఆదేశించింది. క్రెడిట్ కార్డులపై కొనుగోళ్లకు సంబంధించి బ్యాంకులు ఖాతాదారులకు నెలవారీ స్టేట్మెంట్ పంపడంతో పాటు చెల్లింపులకు నిర్ణీత తేదీని నిర్దేశిస్తారుు. బకారుు మొత్తాన్ని చెల్లించడం లేదా కనీస మొత్తాన్ని చెల్లించి మిగిలిన బకారుుని తర్వాతి నెలకు కొనసాగించడవునే వెసులుబాటును బ్యాంకులు క్రెడిట్ కార్డు ఖాతాదారులకు కల్పిస్తారుు. కనీస మొత్తాన్ని నిర్ణీత తేదీలోగా చెల్లించని క్రెడిట్ కార్డు బకారుుల వర్గీకరణకు సంబంధించి బ్యాంకులు విభిన్న పద్ధతులను అవలంబించడం తవు దృష్టికి వచ్చిందని ఆర్బీఐ పేర్కొంది. ఈ పద్ధతిలో పారదర్శకతను పెంపొందించి, చెల్లింపులను గాడిన పెట్టేందుకు నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేసింది.