ఈపీఎఫ్ఓ ఎస్ఎంఎస్ సేవలు ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తమ సభ్యుల కోసం ప్రవేశపెట్టిన సంక్షిప్త కోడ్ ఎస్ఎంఎస్ సేవలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ సార్వత్రిక ఖాతా నంబరు(యూఎన్ఏ)తో సేవలు పొందుతున్న సభ్యులకు సంక్షిప్త కోడ్ ఎస్ఎంఎస్ సేవ అందుబాటులో ఉంటుందని చెప్పారు. యూఎన్‌ఏలో రిజిష్టర్ అయిన సభ్యుల మొబైల్స్‌కు ఖాతాకు సంబంధించిన వివరాలు సంక్షిప్త సందేశాల రూపంలో అందుతాయన్నారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తమిళం, మళయాలం, బెంగాలీ భాషల్లో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.