Minister Naini Narsimha Reddy
-
ఫిబ్రవరిలో విదేశీ భవన్‌కు శంకుస్థాపన: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి రెండో వారంలో విదేశీ భవన్‌కు శంకుస్థాపన జరగనుందని రాష్ట్ర మంత్రి కే. తారకరామారావు పేర్కొన్నారు. శనివారం హోమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి ఎన్ఆర్ఐ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అక్రమ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఏజెంట్లు నెల రోజుల్లో రిజిస్టర్ చేసుకోవాలని, లేదంటే అక్రమ ఏజెంట్లుగా గుర్తించి కేసులు పెడతామన్నారు. అంతేగాక పదేపదే అక్రమాలకు పాల్పడుతున్న ఏజెంట్లపై పీడీ యాక్ట్ పెడతామని మంత్రి హెచ్చరించారు. కాగా... గల్ఫ్‌కు మహిళల అక్రమ రవాణాపై పోలీస్‌శాఖ మరింత కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. -
రూ.7.12 కోట్లతో యాదాద్రి భవన్
నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి అల్లోల పాల్గొన్న మంత్రులు నాయిని, జగదీశ్‌రెడ్డి హైదరాబాద్: నగరంలోని బర్కత్‌పురలో ఏర్పాటు చేయనున్న యాదాద్రి భవన్ నిర్మాణ పనులకు సోమవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి భూమి పూజ చేశారు. రూ.7.12 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. యాదాద్రి నిధులతో చేపడుతున్న ఈ భవన నిర్మాణ పనులను సిరికో ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించినట్లు మంత్రి చెప్పారు. భవనంలో యాదాద్రి సమాచార కేంద్రంతో పాటు పెళ్లి మండపం, వేడుకలు నిర్వహించుకోవడానికి 500 మంది సరిపోయేలా అన్ని వసతులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ యాదాద్రిని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం(యాదగిరిగుట్ట), నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో రూపొందించిన 2016 సంవత్సరం క్యాలెండర్‌ను నాయిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ ఎన్.శివశంకర్, నల్లగొండ జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, సిరికో ప్రాజెక్ట్సు ప్రైవేట్ లిమిటెడ్ వైస్ చైర్మన్ దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లు పూర్తి: నాయిని
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. పార్కింగ్ కమిటీకి చైర్మన్‌గా ఉన్న ఆయన బుధవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ప్లీనరీ జరిగే ఎల్బీ స్టేడియం వద్దకు ప్రతినిధుల వాహనాలను అనుమతించడం లేదని చెప్పారు. నగరంలో ఎనిమిదిచోట్ల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశామని వివరించారు. కనీసం 50 వేల మందికి సరిపోయేలా నిజాం కాలేజీ మైదానంలో భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.