Minister Naini narsimha Reddy
-
ప్రాజెక్టులు అక్రమమని తీర్మానం చేస్తారా?
టీటీడీపీ నాయకులకు హోంమంత్రి నాయిని ప్రశ్న సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘తిరుపతి సభలో తెలంగాణ ప్రాజెక్టులు అక్రమం అని తీర్మానం చేసిన టీటీడీపీ నాయకుల్లారా.. మీరు తెలంగాణ ప్రాంతంలో తిరుగుతారా’ అంటూ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్‌రెడ్డి బచ్చగాడు.. ఆయనతోని ఏమైతదని, ఆరు నూరైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి తీరుతారన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన జైలు మ్యూజియాన్ని ఆదివారం ఆయన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. మ్యూజియంలో ప్రదర్శించిన జైలు రికార్డులు, అప్పట్లో ఖైదీలను శిక్షించే పరికరాలను, ఖైదీలు వాడిన వస్తువులను ఆయన పరిశీలించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. శాంతిమార్గంలో ఆనాడు గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తీసుకొస్తే.. అదే మార్గంలో కేసీఆర్ తెలంగాణకు స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టులనే తాము రీ డిజైన్ చేసి కడుతున్నామని మంత్రి నాయిని తెలిపారు. దక్షిణ తెలంగాణలో డిండి, ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులు కొత్తవి కావన్నారు. తెలంగాణ వాదులంతా టీఆర్ఎస్లో చేరుతున్నారని, వాళ్లను కాపాడుకోవడం చేతగాని కాంగ్రెస్ నాయకులకు తమను విమర్శించే హక్కు ఎక్కడిదన్నారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థను దేశంలోనే నెంబర్ వన్‌గా తీర్చి దిద్దితున్నామని చెప్పారు. -
కనీస వేతనం 10 వేల కన్నా ఎక్కువే
♦ హోం, కార్మిక మంత్రి నాయిని ♦ కేంద్రం ప్రకటించిన దానికంటే ఎక్కువ ఉండేలా చూస్తాం ♦ ఘనంగా మేడే వేడుకలు,పలువురికి అవార్డుల ప్రదానం సాక్షి, హైదరాబాద్: ‘‘దేశ వ్యాప్తంగా కనీస వేతనం రూ.10 వేలు ఉండేలా చట్టం చేస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ ప్రకటించారు. కానీ తెలంగాణలో కేంద్రం నిర్దేశించిన దాని కంటే అదనంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ కనీస వేతనం రూ.10 వేల కంటే ఎక్కువగనే ఉంటది. మేడే సందర్భంగానే దీనిని ప్రకటించాలనుకున్నాం. కానీ అధికారుల బదిలీల కారణంగా సాధ్యం కాలేదు. ఈ నెలాఖరులోగా తీపి కబురు వింటరు’’ అని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. మేడే వేడుకలను పురస్కరించుకుని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నాయిని ప్రసంగించారు. దేశంలోకెల్లా తెలంగాణ రాష్ట్రంలోనే కనీస వేతనం మెరుగ్గా ఉండేలా చూస్తున్నామని, ఇప్పటికే కంపెనీ యాజమాన్యాలు, ట్రేడ్ యూనియన్ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, ఈ నెలాఖరు లోగా తుది నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. తమ ప్రభుత్వం కార్మిక పక్షపాతిని, సంక్షేమ రంగం మీదనే రూ.35 వేల కోట్లు ఖర్చుపెడుతోంద న్నారు. కార్మికుల ప్రమాద బీమాను మేడే సందర్భంగా రూ.5 లక్షల నుంచి ఆరు లక్షలకు పెంచినట్లు చెప్పారు. కార్మికుల ఆరోగ్యం, భద్రత, నైపుణ్యం పెంపొందించేందుకు రూ.10 కోట్లతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ సదుపాయం అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్నామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మూతపడిన పేపర్ మిల్లును తెరిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అలాగే వరంగల్‌లో మూతపడిన పేపర్‌మిల్లును కూడా తెరిపిస్తామన్నారు. మేడే సందర్భంగా కార్మికులు దీక్షాదివస్‌కు పూనుకోవాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు కాంట్రాక్టు ఎబాలిషన్ బోర్డును రద్దు చేసి కార్మికుల హక్కులను కాలరాశారని ఎమ్మెల్సీ రాములు నాయక్ దుయ్యబట్టారు. కాంట్రాక్టు ఎబాలిషన్ బోర్డును తీసుకొచ్చి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. కాగా, మేడే వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ మేనేజ్మెంట్, శ్రమశక్తి అవార్డులను అందజేసింది. శ్రమశక్తి అవార్డు గ్రహీతలు.. కె.శ్రీనివాస్(సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూరు), బి.వెంకటేశం(ఎస్సీసీఎల్), మిరియాల రాజు రెడ్డి, ఇ.ఆగయ్య, కనకం శాంసన్, ఎం.శ్రీనివాసరావు, ఎండీ ప్యారేమియా(తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం), ఎం.రాజయ్య(హెచ్ఎంఎస్), ఇ.శ్రీధర్(టీఎస్ఈఈ), జె.జగన్నాథరావు(ఎస్పీపీ ఎంప్లాయిస్), వి.వరప్రసాదరెడ్డి(టీఆర్టీయూసీ), పి.జీవన్‌రావు (తెలంగాణ ఎన్టీపీసీ ఎంప్లాయిస్), వి.దానకర్ణాచారి (భారత్ డైనమిక్ తెలంగాణ ఎంప్లాయిస్), బీజే థామ్సన్(వీఎస్టీ వర్కర్), కె.ఐలయ్య(భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం), ఎస్.పద్మశ్రీ(హెచ్ఎంఎస్), పి.రాములు(ఎంఆర్ఎఫ్ వర్కర్), జి.రాంబాబు, బి.విజయలక్ష్మీ, వేముల మరయ్య(టీఆర్ఎస్ కేవీ), బీఆర్ సుబ్రమణ్యరావు(టీఎన్టీయూసీ), ఎన్.మహేశ్వర్‌రెడ్డి(డా.రెడ్డీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎంప్లాయి), రూప్‌చంద్(తెలంగాణ షాపు ఎంప్లాయిస్ ఫెడరేషన్), ఐ.శ్రీనివాసరావు, కొండా మనోహర్ (హెచ్ఎంఎస్), ఎంఏ వజీర్ (తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయి), వి.శ్రీనివాస్(తెలంగాణ బీడీ వర్కర్స్) జె.అశోక్(తెలంగాణ ఫుడ్స్ అండ్ ఎంప్లాయిస్ స్టాఫ్), సీహెచ్ శంకర్(టీ-ఎలక్ట్రిసిటి ఎంప్లాయి) సింగరేణికి బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 60.04 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 15 శాతం వృద్ధిరేటుతో జాతీయ బొగ్గు రంగ పరిశ్రమలకే తలమానికంగా నిలిచింది. బొగ్గు రవాణాలోనూ అగ్రస్థానంలో నిలిచి రికార్డులను తిరగరాసింది. కార్మికులకు సంక్షేమ కార్యక్రమాల అమలు, పారిశ్రామిక సంబంధాల విషయంలో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ చూపిన చొరవకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డునిచ్చింది. మంత్రి నాయిని చేతుల మీదుగా శ్రీధర్ అవార్డు అందుకున్నారు. సింగరేణీయుల సహకారంవల్లే సంస్థ అభివృద్ధి సాధ్యమైందని ఈ సందర్భంగా ఆయనన్నారు. బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డ్స్.. 1.సింగరేణి కాలరీస్ కో-లిమిటెడ్(ఎన్.శ్రీధర్, ఐఏఎస్), 2. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్(ఎన్.నారాయణరెడ్డి),3.మై హోం ఇండ్రస్ట్రీస్ ప్రై లిమిటెడ్(జె.రంజీత్ రావ్), 4.మిహీంద్రా అండ్ మహీద్రా(వీఎస్ రమణ, కేబీఎన్ రావు), 5.ఎంఆర్ఎఫ్(మైఖేల్ రబేరో), 6.పెన్నార్ (జె.నిరుపేందర్ రావు), 7.వీఎస్టీ ఇండస్ట్రీస్(ఎన్.సాయిశంకర్), 8.కిర్బీ బిల్డింగ్ సిస్టం (బి.సదానంద్, డి.రాజు) 9. టీజీఎన్ ఇండస్ట్రీస్(ఎంకే పటౌడియా), 10.హెచ్‌ఎస్‌ఐఎస్ లిమిటెడ్(డి.అరుణ్ కుమార్), 11.వసుధ ఫార్మా(ఎం.ఆనంద్), 12. ఐటీసీ లిమిటెడ్(ఎం.మురళీధర్) -
విదేశాల్లో ఉద్యోగాల పూచీ ప్రభుత్వానిదే
సాక్షి, హైదరాబాద్: దళారుల ప్రమే యం లేకుండా గల్ఫ్ దేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున క ల్పిస్తున్న ఉపాధి అవకాశాలను యువత ఉపయోగించుకోవాలని హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వమే పూచీకత్తుగా వ్యవహరించి సమస్యను పరిష్కరిస్తుందన్నారు. బుధవారం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీస్ (టామ్‌కామ్) ఆధ్వర్యం లో ఇక్కడ ఏర్పాటు చేసిన ‘విదేశీ ఉద్యోగ మేళా’ను మంత్రి ప్రారంభించారు. దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం తెలంగాణ యువ త దళారులను ఆశ్రయించి మోసపోతున్నారని, ఈ సమస్యను అధిగమించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం తరఫున టామ్‌కామ్ ఏర్పాటు చేసి దుబాయ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నదని వివరించారు. అందులో భాగంగా ఇప్పుడు ఆల్ జజీరా ఎమిరేట్స్ పవర్ కంపెనీ ముందుకొచ్చి, అవసరమైన 250 మందిని మూడు రోజులపాటు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసుకుంటుందన్నారు. త్వరలో మరో రెండు కంపెనీలు 500 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నారు. ఏటా 5 వేల నుంచి 10వేల వరకు విదేశాల్లో ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తున్నామన్నారు. అక్కడ శ్రమ దోపిడీకి గురికాకుండా చట్ట ప్రకారం పని కల్పించేలా ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధిని నియమించామన్నారు. దుబాయ్‌లో డ్రైవర్లకు ప్రారంభ వేతనం రూ.50వేలు, ఎలక్ట్రిషియన్లకు రూ.30వేలు, హెల్పర్లకు రూ.20వేలు ఉంటుందన్నా రు. ఎంపికైన అభ్యర్థులు టామ్కామ్కు రూ.20 వేలు చెల్లిస్తే వీసా, టికెటు తదితర వాటినన్నింటినీ వారే చూసుకుంటారన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, టామ్‌కామ్ డెరైక్టర్ కె.వై.నాయక్, జనరల్ మేనేజర్ భవాని, అల్ జజీరా ఏమిరేట్స్ పవర్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
వారంలో నాచారానికి ఈఎస్ఐ ఆస్పత్రి
♦ సనత్‌నగర్ మెడికల్ కాలేజీకి లైన్ క్లియర్ ♦ దత్తాత్రేయ, నాయిని సమక్షంలో ఎంవోయూ సాక్షి, హైదరాబాద్: వారం రోజుల్లోగా ఈఎస్ఐ సనత్‌నగర్ ఆస్పత్రిని నాచారం తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఈఎస్ఐ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెడికల్ కాలేజీ కోసం రాష్ట్ర కార్మికశాఖ నిర్వహిస్తున్న ఈఎస్ఐ ఆస్పత్రిని కేటాయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని నాచారానికి, అక్కడున్న కార్పొరేషన్ ఆస్పత్రిని సనత్‌నగర్‌కు మార్చుతూ కేంద్ర, రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో అధికారులు శనివారం ఎంవోయూ కుదుర్చుకున్నారు. నాచారం మెడికల్ సూపరింటెండెంట్ దేశ్‌పాండే, రాష్ట్ర ఈఎస్ఐ డెరైక్టర్ సీహెచ్, దేవికారాణి సంతకం చేసిన ఫైళ్లను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... సనత్‌నగర్ మెడికల్ కాలేజీ నిర్వహణకు లైన్‌క్లియర్ అవడం సంతోషంగా ఉందన్నారు. సనత్‌నగర్ ఈఎస్ఐని నాచారానికి తరలిస్తే ప్రస్తుతం 200 బెడ్స్ తగ్గిపోతాయన్నారు. ఈ నష్టం పూడ్చుకునేందుకు త్వరలో కేంద్రం తమ నిధులతో నాచారంలో అదనంగా 250 పడకల ఆస్పత్రిని విస్తరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అలాగే కార్మికులు అధికంగా ఉన్న ప్రాంతంలో స్థలం చూపిస్తే 500 పడకల ఆస్పత్రిని కూడా నిర్మిస్తామని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారన్నారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఈ మెడికల్ కాలేజీ నిర్వహణ వల్ల కార్మికుల పిల్లలకు 40శాతం సీట్లు లభిస్తాయన్నారు. గోషామహల్లో పశుసంవర్ధ్దకశాఖ స్థలాన్ని కేటాయిస్తే 100 పడకల ఆస్పత్రిని నిర్మించి ఇస్తామన్నారు. ఏప్రిల్ 1నుంచి ఆటో రిక్షా కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామన్నారు. అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, మధ్యాహ్నం భోజన నిర్వాహకులకు కూడా ఈఎస్ఐ సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 4.70 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు ఈపీఎఫ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. కార్మికుల సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకొని 10మంది పనిచేసే సంస్థలను పీఎఫ్ కిందకు తీసుకొచ్చేందుకు పార్లమెంటులో చట్టసవరణ చేయనున్నట్లు వివరించారు. కార్మికుల కనీస వేతన సవరణను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. -
దుబాయ్‌లో 750 ఉద్యోగాలు
రెండు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం, రెండు కంపెనీలు దుబాయ్‌లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీంతో రాష్ట్రానికి చెందిన దాదాపు 750 మంది యువకులు ఉద్యోగాలు పొందనున్నారు. దుబాయ్‌లోని అల్ముల్లా గ్రూప్‌లో 500 మందికి, జజీరా ఎమిరేట్స్ పవర్లో 250 మందికి ఉద్యోగాలిచ్చేందుకు ఆయా కంపెనీలు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) చైర్మన్, నాయిని సమక్షంలో ఎంవో యూ చేసుకున్నాయి. అల్ముల్లా గ్రూప్‌కు చెందిన మహ్మద్ సర్వర్, జజీరా ఎమిరేట్స్‌కు చెందిన ఎన్టీ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయిమెంట్ డెరైక్టర్ వైకే నాయక్ వీటిపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాంకేతికంగా నైపుణ్యం పొందిన యువకులు తెలంగాణలో ఎంతోమంది ఉన్నారని, వారికి శిక్షణ ఇచ్చి టామ్‌కామ్ మరింత సమర్థులుగా తయారు చేస్తుందన్నారు. నిరుద్యోగులు దళారుల చేతిలో పడి మోసపోకుండా టామ్కా మ్ ద్వారా ఉద్యోగాలు పొందేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. కార్మిక శాఖ రాష్ట్ర కార్యదర్శి హరిప్రీత్‌సింగ్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది, టామ్‌కామ్ డెరైక్టర్ భవాని, గల్ఫ్‌లో తెలంగాణ సంక్షేమ సంఘం ప్రతినిధులు శ్రీనివాస్‌శర్మ, రాజా శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
నాయిని గారూ.. మమ్మల్ని ఆదుకోండి
హోంమంత్రికి అమరవీరుల కుటుంబాల వేదిక వినతి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ‘అమరవీరుల కుటుం బాల వేదిక’ సోమవారం సచివాలయంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలసి ఒక వినతిపత్రం అందజేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలైన ‘విద్యార్హతల ప్రకారం ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగ అవకాశం, ఒక ఇల్లు, మూడెకరాల భూమి, ప్రత్యేక ఆరోగ్య కార్డు, తల్లిదండ్రులకు పింఛన్, ఆయా కుటుంబాలు నివసించే గ్రామాలలో అమరవీరుల స్తూపం నిర్మాణం’ వంటి వాటిని త్వరితగతిన చేపట్టాలని విన్నవించింది.