విదేశాల్లో ఉద్యోగాల పూచీ ప్రభుత్వానిదే
సాక్షి, హైదరాబాద్: దళారుల ప్రమే యం లేకుండా గల్ఫ్ దేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున క ల్పిస్తున్న ఉపాధి అవకాశాలను యువత ఉపయోగించుకోవాలని హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వమే పూచీకత్తుగా వ్యవహరించి సమస్యను పరిష్కరిస్తుందన్నారు. బుధవారం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీస్ (టామ్‌కామ్) ఆధ్వర్యం లో ఇక్కడ ఏర్పాటు చేసిన ‘విదేశీ ఉద్యోగ మేళా’ను మంత్రి ప్రారంభించారు.
దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం తెలంగాణ యువ త దళారులను ఆశ్రయించి మోసపోతున్నారని, ఈ సమస్యను అధిగమించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం తరఫున టామ్‌కామ్ ఏర్పాటు చేసి దుబాయ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నదని వివరించారు. అందులో భాగంగా ఇప్పుడు ఆల్ జజీరా ఎమిరేట్స్ పవర్ కంపెనీ ముందుకొచ్చి, అవసరమైన 250 మందిని మూడు రోజులపాటు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసుకుంటుందన్నారు.
త్వరలో మరో రెండు కంపెనీలు 500 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నారు. ఏటా 5 వేల నుంచి 10వేల వరకు విదేశాల్లో ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తున్నామన్నారు. అక్కడ శ్రమ దోపిడీకి గురికాకుండా చట్ట ప్రకారం పని కల్పించేలా ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధిని నియమించామన్నారు. దుబాయ్‌లో డ్రైవర్లకు ప్రారంభ వేతనం రూ.50వేలు, ఎలక్ట్రిషియన్లకు రూ.30వేలు, హెల్పర్లకు రూ.20వేలు ఉంటుందన్నా రు. ఎంపికైన అభ్యర్థులు టామ్‌కామ్‌కు రూ.20 వేలు చెల్లిస్తే వీసా, టికెటు తదితర వాటినన్నింటినీ వారే చూసుకుంటారన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, టామ్‌కామ్ డెరైక్టర్ కె.వై.నాయక్, జనరల్ మేనేజర్ భవాని, అల్ జజీరా ఏమిరేట్స్ పవర్ కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.