Minister Sunita
-
మహేంద్రజాలం!
రాప్తాడు నియోజకవర్గంలో సామంతుల పాలనకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. నియోజవకర్గంలోని ఒక్కో మండలానికి ఒక్కో ఇన్చార్జ్గా తన సొంత బంధువులనే మంత్రి నియమించుకుని, పాలనా వ్యవహారాలను వారి చేతుల్లో పెట్టేశారు. ఇదే వారికి బలమైంది. పంచాయతీల ఆర్థిక వనరులను పక్కదారి పట్టించి, సొంత ఖజానాలను నింపుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇందుకు స్థానిక పంచాయతీ, రెవెన్యూ సిబ్బందిని పావులుగా వాడుకుంటున్నారు. అనంతపురంలోని బళ్లారి బైపాస్ రోడ్డు, పారిశ్రామిక వాడలోని ఎ.నారాయణ పురం పంచాయతీ పరిధిలో రూ.కోట్లు విలువ చేసే 90 సెంట్ల ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమైంది. స్థానిక పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది సహకారంతో మంత్రి సునీత సమీప బంధువు ఈ స్థలాన్ని కబ్జా చేసినట్లు తెలుస్తోంది. ఓ సామాజిక వర్గం బడాబాబులు కొందరికి ఈ అక్రమాల్లో వాటా ఉన్నట్లు సమాచారం. కబ్జా చేసిన స్థలంలో భవన నిర్మానాలకు తాజాగా అనుమతులు కూడా పొంది, నిర్మాణాలను చేపట్టారు. చివరకు ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణాలను కూడా తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనంతపురం జిల్లా పంచాయతీ కార్యాలయం మంత్రి సునీత సామంతుడి కబంద హస్తాల్లో చిక్కుకుంది. ఆ శాఖ ఉన్నతాధికారి సైతం తన ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి శాఖ విలువలను ఆ సామంతుడికి తాకట్టు పెట్టేశాడు. ఫలితంగా అవినీతి పరాకాష్టకు చేరుకుంది. ఓ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తూ ఈ నాలుగున్నరేళ్లలో పలు అక్రమాలకు తెర తీశారు. చివరకు సొంత పార్టీ నేతలే ఈ అక్రమాలపై భగ్గుమనే స్థాయికి పరిస్థితి చేరుకుంది. అనంతపురం రూరల్ మండల పరిధిలోని 25 పంచాయతీల్లో గుత్తాధిపత్యాన్ని చెలా యిస్తున్న మంత్రి బంధువు.. అందిన కాడికి దోచుకో అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ అక్రమార్జనకు తెరలేపాడు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని విలువైన ప్రభుత్వ స్థలాలు, భవనాలు, పంచాయతీల ఆదాయ వనరులు.. చివరకు చెత్తను కూడా అతను వదలడం లేదు. వెంచర్‌కు ఆమోదం పొందాల్సిందే అనంతపురం రూరల్ మండల పరిధిలో ఇటీవల వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చి ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగాయి. ప్లాట్లు విక్రయించిన ప్రతి ఒక్క రియల్టర్.. మంత్రి సామంతుడికి రాయల్టీ చెల్లించుకోవాల్సిందే. తాజాగా అనంతపురం రూరల్ పరిధిలోని ఎస్కేయూ సమీపంలో వెంచర్ వేసిన ఓ కొత్త రియల్టర్‌కు ఈ విషయం తెలియక ఆ సామంతుడిని కలవలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శిని అతను రంగంలో దించాడు. రియల్టర్‌ను పిలిపించుకుని మాట్లాడిన కార్యదర్శి ఈ ప్రాంతంలో సామంతుడి కప్పం కట్టందే ఏ పనీ చేసేందుకు వీలు లేదంటూ తేల్చిచెప్పినట్లు సమాచారం. సామంతుడి అక్రమాలను ఎదురించేందుకు సిద్ధపడిన ఆ రియల్టర్ అన్నింటా చుక్కెదరవుతూ వచ్చింది. దీంతో గత్యంతరం లేక చివరకు సామంతుడికి దాసోహమనక తప్పలేదు. మంత్రి బంధువును కలిసి నజరానా చెల్లించుకోవడంతో అతని వ్యాపారానికి అడ్డు లేకుండా పోయింది. కార్యదర్శుల్లో అధిక శాతం ఆ సామాజిక వర్గమే.. అనంతపురం రూరల్ పరిధిలోని 25 పంచాయతీల్లో కీలకమైన, అధిక రాబడి ఉన్న పంచాయతీలకు కార్యదర్శులుగా తన సామాజిక వర్గానికి చెందిన వారినే నియమించుకుని అక్రమాలకు మంత్రి బంధువు తెరలేపినట్లు తెలుస్తోంది. ఈ నాలుగేళ్లలో రుద్రంపేట, రాచానుపల్లి, ఎ.నారాయణపురం, కురుగుంట, సోములదొడ్డి పంచాయతీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. మంత్రి బంధువు అనుగ్రహం తమకు ఉందనే ధీమాతో పంచాయతీ కార్యదర్శులు అక్రమార్జనకు తెరలేపారు. వీరిలో చాలా మంది ఏసీబీ వలలో చిక్కి, నేటికీ న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నారు. లే అవుట్ అప్రూవల్ చేయాలంటే ముందుగా మంత్రి బంధువుకు నజరానా చెల్లించిన తర్వాతే అనుమతి లభిస్తుంది. కార్యదర్శుల ప్రతి కదలిక అతని కనుసన్నల్లో ఉంది. వారు చేసే ప్రతి సంతకంలో అతడికి వాటా ఉంది. గతంలో ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు తన మాటకు విలువ ఇవ్వలేదనే కారణంగా ఆంక్షలతో వేధించాడు. చివరకు వారు ఉద్యోగాన్ని సైతం వదుకునేందుకు సిద్ధమవడం అప్పట్లో చర్చానీయాంశమైంది. చివరకు జిల్లా పంచాయతీ అధికారిని సైతం అతను ప్రభావితం చేయడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. కక్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులో తుమ్మచెట్లను ఇటీవల నరికి కలపను అమ్ముకున్నారు. ఈ విక్రయం ద్వారా వచ్చిన దాదాపు రూ.14 లక్షల ఆదాయాన్ని పంచాయతీ ఖజానాకు కాకుండా మంత్రి సామంతుడిగా చెలామణి అవుతున్న పెద్దమనిషి స్వాహా చేశాడు. ఈ విషయం కాస్తా బహిర్గతం కావడంతో అధికారిక విచారణ కొనసాగింది. అయితే ‘ఈ ప్రభుత్వం మాది.. మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది’ అంటూ విచారణకు వచ్చిన అధికారులను పక్కదారి పట్టించాడు. సర్దుబాటు చర్యలతో వాస్తవాలను భూస్థాపితం చేయించాడు. దీంతో తప్పుడు నివేదికలతో అధికారులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సోమలదొడ్డి సమీపంలో ఐఎంఎల్ డిపో ఉన్న సమయంలోనూ మంత్రి సామంతుడి అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఐఎంఎల్ డిపో ద్వారా పంచాయతీకి అందుతున్న రాయల్టీ మొత్తాన్ని తన సొంత ఖజానాకు తరలించుకుని సరికొత్త సంప్రదాయానికి తెరతీశాడు. ఈ లెక్కన దాదాపు రూ.30 లక్షలకు పైబడి పంచాయతీకి దక్కాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టినట్లు సమాచారం. -
చంద్రన్న కానుకల గౌడన్లు ఆకస్మిక తనిఖీలు
-
మంత్రిగారూ...మీ హామీలకు ఏడాది
- హంద్రీ-నీవాకు నీరు లేదు... ఒక్కరికీ డ్రిప్, స్ప్రింక్లర్లు ఇవ్వలేదు - ‘అనంత’, ధర్మవరంలో భూగర్భడ్రైనేజీ సంగతేంటి? - రూ.150కోట్లతో స్థాపిస్తామన్న ఎయిమ్స్ ఎక్కడ? - మాటలకే పరిమితం... ఆచరణలో కనిపించని చిత్తశుద్ధి సాక్షిప్రతినిధి, అనంతపురం: ఏడాది పూర్తయింది. నేడు మళ్లీ జాతీయజెండా నీడన మంత్రి సునీత ప్రసంగించనున్నారు. గతేడాది ఆమె చెప్పిన హామీల్లో నేటికీ ఏ ఒక్కటీ నెరవేరలేదు. హంద్రీ-నీవా ద్వారా ఒక్క ఎకరా ఆయకట్టుకు నీరందించలేదు. జిల్లాలో ఏడాదిగా ఏ ఒక్క రైతుకు 90శాతం సబ్సిడీతో డ్రిప్ మంజూరు చేయలేదు. ‘ప్రాజెక్టుఅనంత’ ను టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది. చేసిన బాసలేవీ?: ‘అనంత’ రైతును నాలుగేళ్లుగా కరువు వేధిస్తోంది. ఈ క్రమంలో ‘అనంత’ను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. జిల్లా పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి న్యాయం జరిగేలా చూడాల్సిన గురుతర బాధ్యత ఇద్దరు మంత్రులపై ఉంది. అయితే ఏడాదిగా వీరు జిల్లాకే ఏ ఒక్క మేలు చేయలేకపోయారు. గతేడాది పంద్రాగస్టు వేడుకల నాడు మంత్రి చెప్పిన మాటలు నెరవేరితే కష్టాల్లోని ‘అనంత’ కాసింత కుదుటపడుతుందని అంతా భావించారు. కానీ ఆ హామీల్లో ఏఒక్కటి నెరవేరలేదు. ఇవీ గతేడాది పంద్రాగస్టున చేసిన ప్రకటనల్లో ముఖ్యమైనవి: - వందశాతం కరువు నివాణకు చర్యలు - రూ.150కోట్లతో ఎయిమ్స్ అనుబంధ కేంద్రాన్ని నెలకొల్పుతాం - ‘అనంత’లో రూ.395కోట్లతో...ధర్మవరంలో రూ.305కోట్లతో భూగర్భడ్రైనేజీ ఏర్పాటు సూపర్‌స్పెషాలిటీ మంజూరు జిల్లాను ఐటీహబ్‌గా తీర్చిదిద్దుతాంవీటితో పాటు చాలా అంశాలను ప్రస్తావించారు. అయితే కరువు నివారణకు ఇప్పటిదాకా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా 2013కు సంబంధించి రూ.643కోట్ల ఇన్‌ఫుట్‌సబ్సిడీ రావాల్సి ఉంటే ఇస్తామని చెప్పి... తీరా పాత బకాయిలు ఇవ్వలేమని జిల్లా రైతులకు అన్యాయం చేశారు. హంద్రీ-నీవాకు ఈ ఖరీఫ్‌కే నీరిస్తామని గతేడాది నుంచి చెబుతున్నా ఇప్పటి వరకూ డిస్ట్రిబ్యూటరీపై దృష్టి సారించలేదు. కుప్పంకు నీరు తీసుకెళ్లేదాకా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయొద్దని (జోవో నెంబర్: 22) సీఎం చంద్రబాబు ఆదేశించారు. కనీసం దీనిపై కూడా 12మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు నోరెత్తలేదు. జిల్లాలో 4లక్షలమందికిపైగా కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్లారు. ప్రభుత్వం మాత్రం ఉపాధి కల్పించి వలసలను నివారించలేకపోతోంది. ఇక రుణమాఫీ దెబ్బతో ఇన్సురెన్స్ కోల్పోయి, వడ్డీ భారం పడి తమకు రావాల్సిన వందలకోట్లు రూపాయలను ‘అనంత’ రైతులు కోల్పోయారు. ఇలా ప్రభుత్వ చర్యలతో ‘అనంత’ అభివృద్ధి 20ఏళ్లు వెనక్కి వెళ్లిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈక్రమంలో నేడు ప్రసంగించనున్న మంత్రి మళ్లీ పాత హామీలే వల్లె వే స్తారా? లేదా? చిత్తశుద్ధితో వాస్తవ పరిస్థితులను వివరిస్తారో వేచి చూడాలి. -
రేషన్ డీలర్లకు మంత్రి భరోసా
అనంతపురం అర్బన్ : ఆందోళనలు విరమించి ప్రజ లకు ఇబ్బంది కలగకుండా సకాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, మీకు ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత రేషన్ డీలర్లకు భరోసా ఇచ్చారని రేషన్ డీలర్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. తమ డిమాండ్ల సాధనకు అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శుక్రవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. డీలర్ల ఆందోళనపై స్పందించిన మంత్రి సునీత వారితో చర్చించేందుకు నాయకులు కొందరిని హైదరాబాద్‌కు ఆహ్వానించారు. జిల్లా అధ్యక్షుడు కె. వెంకటరామిరెడ్డి, మరికొందరు నాయకులు హైదరాబాద్‌లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మరోసారి తమ డిమాండ్లను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని, డిమాండ్ల విషయమై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పరిశీలిస్తున్నారని, వచ్చే మంత్రివర్గ సమావేశంలో మీకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చినట్లు ఆయన వివరించారు. క్వింటాళ్లుపై రూ. 87 కమీషన్, 100 శాతం తూకాలతో ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌక డిపో కేంద్రాలకు నిత్యావసర సరుకుల సరఫరా, ఒక్కొక్క డీలర్లకు ప్రతి నెలా రూ. 10 వేలు ఆదాయం కల్పించాలని, తదితర డిమాండ్లపై డీలర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. -
ఫ్యాక్షన్ రూపుమాపేందుకు కృషి
సీఐ, ఎస్ఐల వీఆర్ ఉత్తర్వులు వెనక్కు తీసుకోలేదు నిందితులు అరెస్ట్‌కాగానే వీఆర్‌కు పంపుతాం డీఐజీ బాలకృష్ణ అనంతపురం క్రైం : జిల్లాలో ఫ్యాక్షన్ రూపుమాపడానికి పారదర్శకంగా, జవాబుదారితనంగా పని చేస్తున్నామని డీఐజీ బాలకృష్ణ బాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాప్తాడులో జరిగిన ప్రసాద్‌రెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేసులో 32 మందిని అరెస్ట్ట్ చేశామని తెలిపారు. ఇంకా పలువురిని గుర్తిస్తున్నామని, వారి ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. ప్రసాద్‌రెడ్డి హత్యఘటన స్థలంలో రాప్తాడు ఎస్ఐ నాగేంద్రప్రసాద్ నేమ్‌ప్లేట్ పడి ఉన్న విషయమై ఆరోపణలు వస్తుండడం బాధాకరమన్నారు. అక్కడికి వచ్చిన ప్రజల్ని నియంత్రించడంలో నేమ్‌ప్లేట్ కిందకుపడిపోయి ఉండవచ్చని తెలిపారు. అంతమాత్రాన ఆయన పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రచారం చేస్తున్నారన్నారు. అలాగే డీజీపీపై కూడా ఆరోపణలు చేస్తుండడం సరికాదన్నారు. ఆయన జిల్లా వాస్తవ్యుడు కావడంతో సహజంగానే బంధువులు, మిత్రులు ఉంటారని తెలిపారు. తన సొంత గ్రామం నార్సింపల్లి అభివృద్ధికి డీజీపీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇందులో భాగంగానే ప్రజాప్రతినిధుల సహకారం కోరారన్నారు. ఈ క్రమంలో మంత్రి సునీత ఇంటికి వెళ్లి గ్రామ అభివృద్ధిపై చర్చించారని తెలిపారు. అభివృద్ధి కాంక్షించే వ్యక్తిపై ఆరోపణలు తగదన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పోలీసుల సమక్షంలో ఉన్నా కేసు ఎందుకు నమోదు చేశారని విలేకరులు ప్రశ్నించగా...ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిలో చాలామంది ఆయన అనుచరులే ఉన్నారన్నారు.వారిని నియంత్రించాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. వారిని ఆపకుండా అలానే నిలబడి ఉన్నారని తెలిపారు. ధ్వంసాన్ని ఆపేందుకు అవకాశం ఉన్నా పోలీసులు స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయని ప్రశ్నించగా...దీనిపై ఇదివరకే చెప్పామంటూ డీఐజీ దాటవేశారు. సీఐ, ఎస్ఐల వీఆర్ ఉత్తర్వులు వెనక్కు తీసుకోలేదు స్థానిక పోలీసులు నిఘా ఉంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే ప్రసాద్‌రెడ్డి హత్య జరిగిందని, ఇందుకు బాధ్యులను చేస్తూ ఇటుకలపల్లి సీఐ శ్రీనివాసులు, రాప్తాడు ఎస్ఐ నాగేంద్రప్రసాద్‌ను వీఆర్‌కు పంపారు. మళ్లీ అలానే కొనసాగుతుండడంపై డీఐజీ వివరణ ఇచ్చారు. స్వయంగా పోలీస్‌స్టేషన్ పక్క న ఈ ఘటన చోటు చేసుకుందని, ఈ కారణంగా తక్కిన అధికారులకు మెసేజ్ వెళ్లాలనే ఉద్దేశంతో సీఐ, ఎస్ఐను వీఆర్ కు పంపేలా నిర్ణయించామన్నారు. ఉత్తర్వులు తనవద్దే ఉన్నాయని, ప్రసాద్‌రెడ్డి హత్య కేసులో నిందితులు అరెస్ట్ కాగానే వారిద్దరిని వీఆర్‌కు పంపుతామన్నారు. -
సంప్రదాయాలను భావితరాలకు చాటుదాం
మంత్రి పరిటాల సునీత అనంతపురం ఎడ్యుకేషన్ : తెలుగింటి అభిరుచులు, అలవాట్లు, సంప్రదాయాలు భావితరాలకు చాటుదామని పౌర సరఫరాల శాఖ మంత్రి పల్లె సునీత పేర్కొన్నారు. సాంస్కృతిక వ్యవహార శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్లో సంక్రాతి సంబరాలు-15 జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘సంక్రాంతి వేడుకలు’ నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు రూ. కోటి రూపాయలు నిధులు విడుదల చేశారన్నారు. ఇక్కడ స్టాళ్లు, ముగ్గుల పోటీలు, గురవయ్యలు, కబడ్డీ, సాంస్కృతిక కార్యక్రమాలు పల్లెలను గుర్తు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబమూ సంక్రాంతి పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ‘చంద్రన్న సంక్రాతి కానుక’ అందజేశామన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మాట్లాడుతూ తెలుగు సంస్కృతికి నిలువుటద్దంలా ఉన్న అనంతపురం జిల్లా ఔన్నత్యాన్ని చాటిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జెడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ పల్లె వంటకాలతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. ఇన్చార్జి కలెక్టరు లక్ష్మీకాంతం మాట్లాడుతూ భాషా ప్రయుక్తంగా ఏర్పడిన సంక్రాంతి పండుగను ఆడంబరంగా జరుపుకుంటున్నామన్నారు. అనంతపురం మేయర్ మదమంచి స్వరూప, ఏజేసీ ఖాజామొహిద్దీన్, డీఆర్వో హేమసాగర్, జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.